Thummala Nageshwara Rao
-
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్
-
మాజీ బాస్ సంఘీభావం చెప్పడానికి టీడీపీ ఆఫీస్‌కు తుమ్మల
-
కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు
-
మాజీ మంత్రి తుమ్మలతో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ
-
కాంగ్రెస్‌లోకి తుమ్మల.. తెరపైకి కూకట్పల్లి!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చల అనంతరం కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముహూర్తం కూడా ఆయన ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలోనే ఊహించని ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 6వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో.. కుదరకుంటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు పెడుతున్న తుమ్మల.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో తుమ్మల పోటీ చేసే నియోజకవర్గంపైనా ఆసక్తికర ప్రచారం ఒకటి వినిపిస్తోంది. ఖమ్మం, పాలేరు ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాల నడుమ.. అనూహ్యాంగా కూకట్ పల్లి(హైదరాబాద్) పేరు తెర మీదకు వచ్చింది. కమ్మ ఓటర్లకు గాలం వేసేందుకు తుమ్మలను కూకట్పల్లి నుంచి పోటీ చేయించే యోచన చేస్తోంది కాంగ్రెస్. అయితే ఆ ప్రతిపాదనకు తుమ్మల అంత సుముఖంగా లేనట్లు స్పష్టమవుతోంది. తాను పాలేరు(ఖమ్మం) నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారట. దీంతో ఆయన పోటీచేయబోయే నియోజకవర్గ విషయంలో కాంగ్రెస్ ఇంకా మంతనాలు కొనసాగిస్తున్నట్లు భోగట్టా. బీఆర్ఎస్ తరపున పాలేరు టికెట్ దక్కకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి లోనైన తుమ్మల నాగేశ్వరరావు భారీ అనుచరుగణంతో బలప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రజల కోసమైనా పోటీ చేస్తానని.. తలవంచేది లేదంటూ ప్రకటన సైతం చేశారు. అయితే ఆయన పార్టీ మారతారా?.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే విషయాలపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. పాలేరు నుంచే తుమ్మల పోటీ చేయనున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో, కూకట్పల్లి నుంచి తుమ్మల పోటీ నిలిచే అవకాశం లేనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్కు ఇంకా తుమ్మల రాజీనామా చేయని సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరికలపై తుమ్మలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు,రేఖానాయక్‌లు సైతం పీసీసీతో మంతనాలు చేస్తున్నారు. ఇది చదవండి: సాగర్‌లో కారు లొల్లి -
ఖమ్మం రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట ఉద్రిక్తత
-
పాలేరులో ఢీ అంటే డీ
-
ఆధిపత్య పోరు.. కారు పార్టీలో కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో రాజకీయ పరిణామాలు షర వేగంగా మారుతున్నాయి. ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు జిల్లా టీఆర్ఎస్లోనే కాకుండా రాష్ట వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి. పార్టీ అధిష్టానం సైతం పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమచారం. తన కార్యక్రమాలకు వస్తున్న ప్రజా ప్రతినిధులపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థి వర్గాన్ని ఉద్దేశించి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదని, తాను ప్రజాప్రతినిధి నీ కాదని ఎవరి పర్మిషన్ తీసుకోని రావాల్సిన అవసరం నాకు లేదనీ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. (సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి) ఇలాంటి సమయంలో హడావుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపెట మండలం గండుగుల పల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎంపీ నామ నాగేశ్వర్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హుటాహుటిన భేటీ కావడం పార్టీలో మరో చర్చ కు తెరలేపింది. అసలు ఖమ్మం టీఆర్ఎస్లో ఏం జరుగుతుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. స్థానిక పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు తుమ్మలతో భేటీ అయ్యారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు తొలి నుంచి వివాదంగా మారిన విషయం తెలిసిందే. తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఆ మధ్య తుమ్మల చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. మరోవైపు పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మలపై పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డికి తాను అండగా ఉంటానంటూ మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. పదవులు ఎవరి సొత్తు కాదు.. ‘కొందరు మూడేళ్లు, కొందరు నాలుగేళ్లు.. మరికొందరు ఐదేళ్లు.. మంచిగా పరిపాలిస్తే తిరిగి పదవి దక్కుతుంది. అంతే తప్ప పదవులు ఎవడబ్బ సొత్తు కాదు’అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలే మన సొత్తు అని ప్రజల అభిమానమే నాకు పెద్ద పదవి అని ఆయన వివరించారు. ఆదివారం మండలంలోని జయలక్ష్మిపురం, చిన్నమల్లెల, కుంచపర్తి గ్రామాల్లో పర్యటించి పలు ప్రైవేట్ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. పలు కార్యక్రమాల్లో ఒకే పార్టీలో ఉంటూ కక్ష సాధిస్తున్నారని అభిమానులు పొంగులేటి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలు చేయడం సంస్కారం కాదని, నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని.. కష్టపెట్టిన వాడు ఒక్కడే వడ్డీతో సహా ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. పదవులు వచ్చేటప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగవని, పోయేటప్పుడు ఎక్కడా ఉన్నా పోతాయని, ప్రజాభిమానమే శాశ్వతమని చెప్పారు. అధికారం ఉంది కదా అని పొంగులేటి, దయానంద్, మువ్వా.. కార్యక్రమాలకు వెళ్లొద్దని ఎన్ని ఆంక్షలు పెట్టినా.. అభిమానం ఉన్న దగ్గరికే వస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. -
నన్ను ఓడించి రాక్షసానందం పొందుతున్నారు
సాక్షి, ఖమ్మం: కన్నతల్లికి ద్రోహం చేసేవారు రాజకీయాల్లో రాణించలేరని టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం, మోసం చేసేవారు ఎక్కువకాలం రాజకీయాల్లో మనలేరని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తుమ్మల నాగేశ్వరరావు అనూహ్యంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న ఆయన ఓడిపోవడం టీఆర్ఎస్కు షాక్‌నిచ్చింది. సొంత పార్టీలోని నేతలే తనను ఓడించారని తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌లు, కార్యకర్తల సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ఓడించామని తాత్కాలికంగా రాక్షసానందాన్ని పొందేవారు అధోగతి పాలు అవుతారని శపించారు. రాజకీయాల్లో ప్రజాసేవ కోసం కొనసాగేవారిని గౌరవించుకోవాలని, తాత్కాలిక మెరువుల కోసం ఆశించే వారికి భవిష్యత్ ఉండని అన్నారు. -
‘చక్రం’ తిప్పి చతికిలపడ్డారు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలి ప్రభుత్వంలో ‘చక్రం’తిప్పిన ఆ ముగ్గురు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రోడ్డు, రవాణా, ఆర్టీసీ బాస్‌లుగా పనిచేసిన వారు ఈ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. ఓడిన ఈ ముగ్గురు శాఖల పరంగా పరస్పరం సంబంధం కలిగి ఉండటం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి.. తెలంగాణలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్‌రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందే టీఆర్ఎస్లో చేరిన ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మహేందర్‌రెడ్డి 1994, 1999, 2009లలో టీడీపీ నుంచి, 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు తుమ్మల నాగేశ్వరరావు అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే 2014 డిసెంబర్లో కేబినెట్లో స్థానం కల్పించి రోడ్లు, భవనాల శాఖ మంత్రిని చేశారు. 2016 మార్చిలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోవడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆర్టీసీ బాస్ విజయానికి పంచర్.. సోమారపు సత్యనారాయణ 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి 2009లో స్వతంత్రంగా, 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు సార్లు ఆయనకు రాజకీయ ప్రత్యర్థి కోరుకంటి చందర్ కావడం విశేషం. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు వరకు ఆయన టీఎస్ఆర్టీసీకి చైర్మన్‌గా సేవలందించారు. ఈ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కోరుకంటి చందర్, టీఆర్ఎస్ నుంచి సోమారపు సత్యనారాయణ రామగుండం బరిలో నిలిచారు. కానీ 27 వేల పైచిలుకు ఓట్ల తేడాతో సోమారపు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. -
మంత్రి ఓటమితో టీఆర్ఎస్లో అంతర్మథనం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధాన్ని పెనవేసుకుని అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందడంతోపాటు జిల్లాలో టీడీపీ, టీఆర్ఎస్ హయాంలో రాజకీయ చక్రం తిప్పిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఓటమి చెందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డిపై ఏడువేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం చెందడం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 1983లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తుమ్మల.. గెలుపోటములను అనేకసార్లు చవిచూశారు. సత్తుపల్లి, ఖమ్మం వంటి నియోజకవర్గాల్లో పలుసార్లు గెలిచారు... ఓడారు. 2016 ఉప ఎన్నికల నుంచి పాలేరు నియోజకవర్గంతో ముడిపడిన రాజకీయ అనుబంధం.. అభివృద్ధిపై తన ముద్ర ఉండాలన్న తపన పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగిరపరిచిన పరిస్థితులు దృష్ట్యా ఆయన విజయం సాధిస్తారని పార్టీ వర్గాలు విశ్వసించాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గల సంప్రదాయ ఓటు బ్యాంకు, అభ్యర్థి స్థానికత వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపించాయని, దానికి తోడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ పోరు పార్టీని బలహీనపరిచేలా చేసి ఓటమి అంచుకు చేర్చిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. మంత్రిగా తుమ్మల చేసిన అభివృద్ధిని వేనోళ్ల కీర్తించిన పార్టీ నేతలు, తమ మండలాల్లో ఆ స్థాయిలో ఓట్ల రూపంలో ప్రభావాన్ని చూపలేకపోవడానికి గల కారణాలపై పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. మంత్రి తుమ్మల అత్యంత ప్రీతిపాత్రంగా భావించి వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన తిరుమలాయపాలెం మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆశించిన మెజార్టీ రాకపోవడం సైతం పార్టీ శ్రేణులను నిస్తేజానికి గురిచేసింది. కనీసం పదివేల మెజార్టీ ఈ మండలంలో లభిస్తే.. ప్రతికూల మండలాల్లో కొంత మెజార్టీ తగ్గినా గెలుపునకు ఢోకా ఉండదని రాజకీయ అంచనాలు వేశారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండడాన్ని తుమ్మల సహా పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మంత్రి తుమ్మల కొంత కలుపుగోలుగా, కార్యకర్తలకు సన్నిహితంగా ఉండాలని నియోజకవర్గం కోరుకున్నదని, దాని ప్రభావం సైతం ఈ ఎన్నికలపై పడిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను పాలేరు నియోజకవర్గానికి చేయగలిగిన అభివృద్ధి చేశానని, తిరుమలాయపాలెం వంటి మండలంలో కరువు ఛాయలు రూపుమాపడానికి నిరంతరం శ్రమించానని ఫలితాల అనంతరం సన్నిహితులతో జరిగిన సమీక్షలో తుమ్మల అభిప్రాయపడినట్లు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు 1983లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మొదటి సారి పోటీచేసి ఓటమి చెందారు. 1985లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి, ఎన్టీ రామారావు మంత్రివర్గంలో చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో టీడీపీ అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి ఓడిపోయారు. 1994లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1996 నుంచి 99 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో తిరిగి సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై ఓడిపోయారు. 2009లో నియోజకవర్గ పునర్విభజన కారణంగా సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో ఆయన ఖమ్మం నియోజకవర్గంలో టీడీపీ నుంచి విజయం సాధించారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ఓడిపోయారు. ఆ సమయంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా తుమ్మలకు పేరుండటంతో తుమ్మ ల 2014 సెప్టెంబర్ 5వ తేదీన టీడీపీకి రాజీనా మా చేసి టీఆర్ఎస్లో చేరారు. చేరిన కొద్ది కాలానికే కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం లభించింది. రహదారులు, భవనాలు శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పి.. తుమ్మలకు ఎమ్మెల్సీ అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గాన్ని రాజకీయ సుస్థిర స్థానంగా పెంపొందిం చుకోవడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి దృష్టి సారించవచ్చునని భావించిన తుమ్మల, ప్రధాన సమస్యలపై దృష్టి సారించి భక్త రామదాసు ప్రాజె క్టు వంటి పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయిం చారు. తుమ్మల ఓటమికి కారణాలపై మాత్రం ఎవరి రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. -
గులాబీ ప్రభంజనంలో కీలక మంత్రులకు షాక్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ అంతటా గులాబీ ప్రభంజనం వీస్తున్నప్పటికీ.. పలువురు ఆపద్ధర్మ మంత్రులకు మాత్రం ఎదురుగాలి వీస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సీనియర్ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వర్రావు ఓటమిపాలయ్యారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలవ్వడం గమనార్హం. కొల్లాపూర్‌లో మరో సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. ములుగులో అజ్మీరా చందూలాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డికి ఓటమి తప్పలేదు. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి కూడా చేదు అనుభవం ఎదురయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం భుపాలపల్లిలో మధుసూదనాచారిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి హోరాహోరీ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రౌండ్.. రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారుతోంది. ఇక, ఇతర కీలక మంత్రులు భారీ విజయాల దిశగా సాగుతున్నారు. ఎప్పటిలాగే సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఆయన మెజారిటీ లక్షదాటడం కొత్త రికార్డులు సృష్టించింది. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో 70వేలకుపైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఇద్దరు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు మంచి ఊపుతో ఉన్నారు. సనత్‌నగర్‌లో తలసాని శ్రీనివాస్ 30వేలకుపైగా మెజారిటీతో గెలుపొందగా.. పద్మారావు మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
ఎంతో చేశా..ఇంకా చేస్తా : తుమ్మల
సాక్షి, ఖమ్మంరూరల్:పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి ఇం తకాలం ఎంతో చేశానని, తనను గెలిపిస్తే మిగిలిన పనులను పూర్తిచేసి, కొత్తవి కొనసాగిస్తానని టీఆర్ఎస్ పాలేరు అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం గువ్వలగూడెం, నేలకొండపల్లి ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు. వేలకోట్ల రూపాయల నిధులతో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు కల్పించినట్లు తెలిపారు. జిల్లాలోనే అత్యంత కరవు పీడిత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలానికి భక్తరామదాసు ప్రాజెక్ట్‌తో సాగునీటినందించి బీడు భూములన్నీ సస్యశ్యామలం చేశానన్నారు. ఇప్పుడు ఆ భూముల్లో రైతులు రెండు పంటలు పండించుకున్నారని చెప్పారు. నేలకొండపల్లిలో ఆరులేన్ల రోడ్డుగా మార్చి సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మైసా శంకర్, వంగవీటి గేశ్వరరావు, శాఖమూరి రమేష్, వెన్నపూసల సీతారాములు, కాసాని నాగేశ్వర రావు, తలశిల రాధాకృష్ణ, కోటి సైదిరెడ్డి, నలమల శేఖర్, నాగేశ్వరరావు, నెల్లూరి భద్రయ్య, దాసరి రాములు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘మీకు ఇష్టం లేకపోతే వ్యవసాయం చేసుకుంటా’
సాక్షి, ఖమ్మం : రాష్ట్రంలో ఉండే పార్టీలే ఇక్కడ రాజకీయం చేయాలి.. పక్క రాష్ట్ర పార్టీలు తెలంగాణలో ఎందుకంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తుమ్మల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కేంద్రానికి లేఖలు రాసింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాదా అంటూ ప్రశ్నించారు. టీడీపీని వీడేటప్పుడు చాలా బాధపడ్డానని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అన్నారు. ప్రజలకు ఇష్టం లేకపోతే వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న పార్టీలే రాష్ట్రంలో రాజకీయం చేయాలి.. పక్క రాష్ట్ర పార్టీలు ఇక్కడ ఎందుకంటూ తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి జిల్లా ప్రజలు తనను గెలిపిస్తే సీతరామ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానని చెప్పారు. -
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా..పాలన సాగించాం
సాక్షి, నేలకొండపల్లి: తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి రెండూ ప్రధాన లక్ష్యాలుగా పాలన సాగించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని బోదులబండ, మండ్రాజుపల్లి, పైనంపల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ.. పల్లెలు అభివృద్ధి ఏజెండాగా సీఎం కేసీఆర్ పాలించారని అన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని రెండేళ్లలో తాను చేసి చూపించానని అన్నారు. పాలేరును రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. పాలేరు పాత కాలువను రూ.70 కోట్లతో అభివృద్ధి చేసి రైతుల చివర భూములకు నీరందించినట్లు తెలిపారు. మీరు అడిగినా, అడగకున్నా అభివృద్ధి చేసి శభాష్ అని పించుకుంటామని అన్నారు. పదవుల కోసం, స్వార్థం కోసం, ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఇలా వచ్చి.. ఆలా వెళ్లే వాడిని కాదన్నారు. మీరు ఇచ్చిన గౌరవానికి మరింత గౌరవం పెంచే విధంగా మిగిలిన పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సభలో పాలేరు సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, జెడ్పీటీసీ అనిత, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు సీతారాములు, కోటి సైదారెడ్డి, యడవల్లి సైదులు, నెల్లూరి భద్రయ్య, కట్టేకోల నాగేశ్వరరావు, అనగాని నరసింహారావు, కొడాలి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
5 సార్లు గెలిచారు
దమ్మపేట: నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభతో పాటు, నేటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటివరకు ఐదుసార్లు శాసనసభ్యుడిగా ప్రా తినిధ్యం వహించారు. దమ్మపేట మండ ల పరిధిలోని గండుగులపల్లి ఈయన స్వ గ్రామం. తొలిసారిగా 1985లో సత్తుపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత 1989లో ఓటమి చెందిన ఆయన..అదే నియోజకవర్గం నుంచి 1994, 1999 ఎన్నికల్లో వరుసగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014లో అదే స్థానంలో ఓడారు. 2016లో పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ నుంచి పోటీచేసి తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టారు. 2009–14 మధ్యకాలం మినహా ఆయన గెలిచిన ప్రతిసారీ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషం. తాజాగా పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. -
ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై.. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యతపై సమగ్రంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రాజకీయ లబ్ధి కోసం ప్రజాభివృద్ధి కార్యక్రమాలపై విషం చిమ్మడం కాంగ్రెస్‌కు రివాజుగా మారిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కాదని, ఆయనకు ప్రాజెక్టులపై సరైన సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ రాష్ట్ర నేతలు రాజకీయ లబ్ధి కోసం పాకులాడారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ హయాంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని, గతంలో అడవుల మధ్యలో నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. అటవీ పరిరక్షణ చట్టాలకు లోబడి అడవుల బయటి నుంచి సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని, అందుకే పర్యావరణ, అటవీ అనుమతులు వెంట వెంటనే మంజూరయ్యాయని గుర్తు చేశారు. ప్రాజెక్టు డిజైన్‌ను మార్చారని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం సమంజసం కాదని, డిజైన్ మార్చడం వల్ల ఖమ్మం జిల్లాలోని దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం లభించిందని మంత్రి తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి.. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటుందని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ఎవరేం చేశారో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. ప్రాజెక్టులకు సంబంధించి రాహుల్‌గాంధీకి ఆ పార్టీ నేతలు సమగ్ర సమాచారం ఇవ్వకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేలా వ్యవహరించారని ఆరోపించారు. రాహుల్ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేయడం ఇక్కడి ప్రజలను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. -
తుమ్మలకు వినతిపత్రం అందించిన సాక్షి ఈడీ..
తల్లాడ ఖమ్మం : పేద, స్థానిక విద్యార్థుల సౌలభ్యం కోసం తల్లాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని..ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు గురు వారం మంత్రులకు విన్నవించారు. దశాబ్దాల క్రితం ఇక్కడ చదువుకుని..వివిధ హోదాల్లో, తీరొక్క ప్రాంతాల్లో ఉంటున్న వారంతా..ఈ ప్రాంత విద్యార్థుల బాగు కోసం ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కొండభట్ల రామచంద్రమూర్తితో పాటు..జెడ్పీటీసీ సభ్యుడు మూకర ప్రసాద్, జక్కంపూడి కృష్ణమూర్తి, కొండుభట్ల రాధాకృష్ణమూర్తి, డాక్టర్ వేమిశెట్టి ఉపేందర్‌రావు, బాజోజు శేషభూషణం, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, గుం టుపల్లి వెంకటయ్యలు అంతా కలిసి హైదరాబాద్‌లో ఇద్దరు మంత్రులను కలిశారు. సమస్య తీవ్రతను వివరించారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. -
‘మంత్రి’దండం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం : టీఆర్ఎస్లో అంతర్గత వర్గపోరు ఆ పార్టీ నేతలకు తలనొప్పిలా మారింది. పాత, కొత్త నేతలు పార్టీలో కొనసాగుతుండడం.. వారి మధ్య సఖ్యత లేకపోవడం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించేందుకు అనుసరించే వ్యూహంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధిక శాసనసభ స్థానాలతోపాటు రెండు లోక్‌సభ నియోజకవర్గాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధమవుతున్నా.. పది నియోజకవర్గాల్లో నెలకొన్న వర్గపోరు పార్టీకి పంటికింద రాయిలా మారిందన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది శాసనసభ స్థానాలకు, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన టీఆర్ఎస్.. కేవలం కొత్తగూడెం ఎమ్మెల్యే, మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అప్పటి వరకు జిల్లాలో నామమాత్రంగా ఉన్న టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం.. ఆ తర్వాత జిల్లాలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరడం, ఆయనతోపాటు ఎమ్మెల్సీగా ఉన్న బాలసాని, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొండబాలతోపాటు అనేక మంది ద్వితీయ, మండలస్థాయి నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కమార్, కోరం కనకయ్య, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు ఆయా పార్టీలను వీడి.. టీఆర్ఎస్లో చేరారు. 2014 సెప్టెంబర్‌లో టీఆర్ఎస్లో చేరిన తుమ్మల.. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో కొద్ది కాలానికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో మాజీ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడం.. అదే ఏడాది మే నెలలో జరిగిన పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ‘తుమ్మల’ వ్యూహంపైనే ఆసక్తి.. జిల్లాలో పార్టీకి దిశానిర్దేశం చేసే నేతగా తుమ్మల ఎదగడంతోపాటు.. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించినట్లు పేరొందారు. తానొవ్వక.. నొప్పించని రీతిలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న తుమ్మల.. జిల్లాలో పార్టీని గెలిపించేందుకు ఎటువంటి మంత్రదండం ప్రదర్శిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకు, అధికారం చేపట్టిన తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తల మధ్య నెలకొన్న అంతరం రోజురోజుకు పెరుగుతుందే తప్ప.. తగ్గని పరిస్థితి నెలకొంది. అలాగే పలు పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ప్రజాప్రతినిధులు, ఉద్యమ కాలంలో పనిచేసిన కార్యకర్తలకు మధ్య పొసగని పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం టీఆర్ఎస్కు సవాల్‌గానే మారింది. రాజకీయాలపై పూర్తి పట్టున్న మంత్రి తుమ్మల.. పార్టీలో అంతర్గత పోరును చల్లార్చేందుకు రాజకీయ చతురతను ఎలా ప్రదర్శిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని వివిధ సందర్భాల్లో చుట్టొచ్చిన తుమ్మల.. పార్టీ కార్యకర్తలకు భవిష్యత్‌పై భరోసా ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న అంతరాలపై దృష్టి సారించాలని, సాధ్యమైనంత వరకు మండల, నియోజకవర్గస్థాయి నేతలు వాటిని పరిష్కరించి ఎన్నికలకు సమాయత్తం చేయాలని ప్రజాప్రతినిధులకు, జిల్లాస్థాయి నేతలకు మంత్రి చేస్తున్న ఉద్భోద ఇందులో భాగమేనన్న భావన రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. లోతు అధ్యయనానికే పర్యటన.. రైతుబంధు పథకం ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు రోజూ జిల్లాలోని మూడు నుంచి ఐదు మండలాల వరకు మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఆయా మండలాల్లో పార్టీ పరిస్థితిని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని ప్రచారం జరుగుతోంది. గ్రామ, మండల స్థాయిలో వర్గ పోరుకు అనేకచోట్ల వ్యక్తిగత ప్రతిష్టలే కారణమన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ పటిష్టానికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించి కాయకల్ప చికిత్స చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం, మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరుతోపాటు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలైన వైరా, అశ్వారావుపేట, పినపాక, ఖమ్మం, ఇల్లెందు నియోజకవర్గాలతోపాటు ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలపై టీఆర్ఎస్ జెండా ఎగుర వేయాల్సిన బాధ్యత మంత్రిగా తుమ్మలపై పడింది. ఇవేకాక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి, సీపీఎం ఎమ్మెల్యే ఉన్న భద్రాచలం ని యోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ విజయం సాధించాల్సిన ఆవశ్యకతపై ఆయా నియోజకవర్గాల నేతలతో మంత్రి తుమ్మలతోపాటు ఆయా నియోజకవర్గాల ఎంపీలు తరచూ సమావేశం అవుతూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే జిల్లా, మం డలస్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేక కారణాలతో ఏళ్లతరబడి వాయిదా పడుతుండటం, ఖ మ్మం జిల్లాలో అనేక మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలు లేని పరిస్థితి. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉమ్మడి జిల్లాకు నాలుగు లభించినా.. పదుల సంఖ్యలో ఉండే డైరెక్టర్ పదవులు మాత్రం ఏ ఒక్క ద్వితీయశ్రేణి నేతను వరించకపోవడంతో పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా.. సరైన గుర్తింపు లభించడం లేదన్న కారణంతో పలువురు సీనియర్ నేతలు టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితిలో చేరారు. మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గానికి చెందిన వారు సైతం టీజేఎస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న నేతలకు భరోసా కల్పించేందుకు పార్టీ నేతలు తీసుకునే చొరవ సైతం పార్టీ విజయావకాశాలను పెంచుతుందన్న భావన ఉద్యమకారుల్లో నెలకొంది. -
తలసాని, తుమ్మల ఉద్యమకారులా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదవుల్లో ఉన్నవారే తెలంగాణ ఏర్పాటు కోసం త్యాగాలు చేశారా అని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ బుధవారం ఓ లేఖలో ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రమే ఉండాలంటూ ఉద్యమకారులను తరిమి కొట్టి, దాడులకు తెగబడిన మంత్రులు మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కడియం శ్రీహరి వంటివారే నిజమైన ఉద్యమకారులా అని ప్రశ్నించారు. అధికార దాహం, పదవీవ్యామోహంతో తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల ఆత్మలను సీఎం అవమానిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ఉద్యమకారులను వేధిస్తున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో కూడా లేని నిర్బంధాన్ని, అప్రజాస్వామిక విధానాలను సీఎం అమలు చేస్తున్నారని శ్రవణ్ విమర్శించారు. -
రహదారులకు ‘బంగారు రింగులు’!
రాష్ట్రంలో కొత్తగా మరో రెండు రింగు రోడ్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తాన్ని రహదా రులతో అనుసంధానించే బృహత్తర ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఏ రోడ్డు నుంచి ఏ రోడ్డుకైనా సులభంగా, వీలైనంత తొందరగా చేరుకునేలా చేయడమే ఈ ప్రణాళిక ఉద్దేశం. జాతీయ రహదారుల స్థాయిలో ఈ అనుసంధానం ఉండనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా 4 వరుసల రోడ్డు అందుబాటులోకి రానుంది. ఇందుకు తాజాగా ప్రతిపాదించిన రీజనల్ రింగు రోడ్డు ఆవల మరో రెండు రింగు రోడ్లు నిర్మించనున్నారు. చివరిది రాష్ట్ర సరిహద్దుకు చేరువలో ఉంటుంది. ఈ రెండు రింగు రోడ్లతోపాటు కొత్తగా జాతీయ రహదారిగా రూపొందే రీజినల్ రింగు రోడ్డు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డు మొత్తం 4 రింగురోడ్లను 4 దిక్కులా అనుసంధానిస్తూ రెండు కారిడార్లు నిర్మిస్తారు. ఈ మొత్తం రహదారులు దాదాపు 5 వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉండనున్నాయి. ఇందులో దాదాపు 900 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుండటంతో ఈ వ్యయాన్ని కేంద్రమే భరించనున్నందున, మిగిలిన 4,100 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఆర్డీసీ) ద్వారా ఈ పనులు జరుగుతాయి. ఇందుకు దాదాపు రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. ఇందులో దాదాపు రూ.5 వేల కోట్లు భూసేకరణకు ఖర్చు అవుతాయి. ఈ మొత్తాన్ని హడ్కో నుంచి రుణం రూపంలో టీఎస్ఆర్డీసీ సమకూర్చుకుంటుంది. అంతర్జాతీయ కన్సల్టెంట్ నివేదికతో.. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రస్తుతం చేపడుతున్న రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించే పనిని ప్రభుత్వం కెనడాకు చెందిన ఎల్ఈఏ అసోసియేట్స్‌కు అప్పగించింది. ఆ కంపెనీయే ఈ రింగురోడ్ల సూచన ఇచ్చింది. దీన్ని ‘తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (టీఆర్ఏకే)గా రోడ్లు భవనాల శాఖ అధికారులు నామకరణం చేశారు. శనివారం ఈ ప్రణాళికను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు అధికారులు వివరించారు. ప్రాథమిక దశలో ఉన్న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదించాల్సి ఉంది. భారీ వ్యయంతో కూడుకున్న పథకం కావడంతో ఇది పూర్తయ్యేందుకు కనీసం 10 సంవత్సరాలు పడుతుందని అంచనా. సీఎం అనుమతి వచ్చాక ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తారు. ప్రస్తుతం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానితో అనుసంధానించే రోడ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అనుకున్నంత వేగంలో పూర్తి చేయటం అంత సులభం కాదు. ఇప్పటికిప్పుడుకాకున్నా భవిష్యత్తులో పూర్తి చేస్తే బాగుంటుందన్న కోణంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశం ఉత్తరదక్షిణాలు, తూర్పుపడమరలను అనుసంధానించేలా రెండు భారీ కారిడార్ల నిర్మాణం చేపట్టిన తరహాలో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. బంగారు తెలంగాణ వలయం.. నెహ్రూ ఔటర్ రింగురోడ్డు అవతల దాదాపు 300 కి.మీ. మేర విస్తరించేలా జాతీయ రహదారుల విభాగం రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానికి అవతల కొత్తగా ఇప్పుడు 886 కి.మీ. మేర విస్తరించే కొత్త వలయాన్ని ప్రతిపాదించారు. దానికి ‘బంగారు తెలంగాణ రింగ్‌రోడ్డు’అని పేరు పెట్టారు. దానికి అవతల రాష్ట్ర సరిహద్దును ఆనుకొని 1,534 కి.మీ. మేర ‘బంగారు మాల కారిడార్’పేరుతో రిండురోడ్డును నిర్మిస్తారు. ఈ 4 రింగురోడ్లను అనుసంధానిస్తూ ఉత్తర–దక్షిణ కారిడార్ 558 కి.మీ. మేర విస్తరించి ఉంటుంది. తూర్పు–పశ్చిమ కారిడార్ 511 కి.మీ. మేర నిర్మిస్తారు. మళ్లీ వీటిని ఇతర రోడ్లకు అనుసంధానిస్తూ 1,618 కి.మీ. రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తారు. 30 జిల్లాలతో ఈ రోడ్లు అనుసంధానమవుతాయి. ముఖ్యంగా పారిశ్రామిక మండళ్లు, ప్రధాన వ్యవసాయ మార్కెట్లు, కీలక పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తారు. -
కొత్త జిల్లాల్లో చైల్డ్ కేర్ సెంటర్లు
♦ తుమ్మల నాగేశ్వరరావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలోనూ చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) సలహా కమిటీ చైర్మన్ రాంచందర్‌రెడ్డి, సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రైవేటు చైల్డ్ కేర్ సెంటర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని అధికారులు పేర్కొనగా మంత్రి పైవిధంగా స్పందించారు. కొత్త జిల్లాల్లో చైల్డ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి సమర్పించినట్లు వివరించారు. ఒకట్రెండు రోజుల్లో వీటికి ఆమోదం లభిస్తుందన్నారు. నవజాత శిశువుల దత్తత విషయంలో ప్రైవేటు చైల్డ్ కేర్ సెంటర్లు అక్రమాలకు పాల్పడుతున్నాయని, దత్తత ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని కారా చైర్మన్ రాంచందర్‌రెడ్డి సూచించగా మంత్రి స్పందిస్తూ పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు తీసుకుని అర్హులకు మాత్రమే దత్తత ఇస్తున్నామని అన్నారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ సలహా కమిటీ తరహాలోనే స్టేట్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీని(సారా) ఏర్పాటు చేస్తామన్నారు. -
కలెక్టర్ల ద్వారా భూసేకరణ పరిహారం
నిబంధనల్లో మార్పు చేస్తాం: మంత్రి తుమ్మల సాక్షి, హైదరాబాద్: రహదారులు, భవనాల కోసం సేకరించే భూమికి సంబంధించిన పరిహారాన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేసేలా నిబంధనల్లో మార్పు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రెజరీ ద్వారా పరిహారం చెల్లింపులో నిబంధనల వల్ల జాప్యం జరిగి పనులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. జాప్యాన్ని నివారించేందుకు అవసరమైతే భూసేకణ చట్టానికి సరవణ చేయనున్నట్లు వెల్లడించారు. పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం మంత్రి హరీశ్ రావుతో కలసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల్లో పురోగతి లేకపోవటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చిన పనుల్లో ఈ ఆగస్టు నాటికి మొదలవని కాంట్రాక్టులను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. రద్దు చేయటంతోపాటు సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర నూతన భూసేకరణ విధానంపై అవగాహనతో భూసేకరణ జరపాల్సి ఉన్నా అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆయా జిల్లాల కలెక్టర్లు, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన భూసేకరణ చట్టానికి అవసరమైన సవరణ ప్రతిపాదన పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు. పూర్వపు మెదక్ జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న రోడ్లు, భవనాల నిర్మాణంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం జరుగుతోందని, మరిన్ని నిధులు విడుదల చేయాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. -
త్వరలో ‘ఆర్ అండ్ బీ’లో ఖాళీల భర్తీ
► మంత్రి తుమ్మల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రభుత్వ పరంగా చేపట్టే పలు భారీ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకే అప్పగించినందున సిబ్బంది అవసరం ఉందని, ఇప్పటికే 106 ఏఈ పోస్టుల భర్తీకి సీఎం అనుమతించారన్నారు. శనివారం రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, సీఈ చంద్రశేఖర్‌రెడ్డితో సమీక్షించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు, ఆడిటోరియం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉన్నందున అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. -
వీణా–వాణీల బాగోగులు ప్రభుత్వ బాధ్యతే
స్టేట్‌హోంలో వీణా–వాణీలను కలసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షి, హైదరాబాద్: స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న అవిభక్త కవలలు వీణా– వాణీలను శుక్రవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వీణా–వాణీల బాధ్యత ప్రభుత్వానిదే అని, వారికి అవసరమై న నిధులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. స్టేట్‌హోంకు వచ్చి ఆర్నెల్లు కావస్తోందని.. వారి బాగోగుల నిమిత్తం ఇప్పటివరకు రూ. 6.46 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఇందులో వారిని చూసుకునే ఆయాలకు రూ.4.32 లక్షలు, రూ.1.14 లక్షలు చదువుల కోసం, మరో రూ.లక్ష ప్రత్యేక కోటాలో అత్యవసర ఖర్చుల నిమిత్తం విడుదల చేశామన్నారు. వీణా–వాణీ గతేడాది ఐదో తరగతి చదివారని, వారి ఐక్యూ బాగుండ డంతో ఏడో తరగతికి ప్రమోట్ చేశామన్నారు.