thunderstorm
-
ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈరోజు(శనివారం) కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 12 నుంచి 16 వరకు 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో అక్టోబర్ 12న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో అస్సాం, మేఘాలయలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల నుండి దాటనున్నాయి. యూపీలోని కొన్ని చోట్ల తేలికపాటి పొగమంచు కమ్ముకుంది. అక్టోబర్ 16 వరకు ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గానూ ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు -
పిడుగొస్తే.. ఏం చేయాలి?
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక మేరకు 2022లో ప్రకృతి విపత్తుల కారణంగా మన దేశంలో 8,060 మరణాలు సంభవిస్తే.. అందులో 2,887 మరణాలకు పిడుగుపాటే కారణం.ప్రతి సెకనుకు భూమిపై 50 నుంచి 100 పిడుగులు పడతాయట.‘వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియవ’న్నది సామెత. కానీ దేశంలో ఏటా వేలాది మందిని బలిగొంటున్న పిడుగు పాటును మాత్రం ముందే గుర్తించేందుకు చాన్స్ ఉంటుంది. ఆకాశం మేఘావృతమై జల్లులు మొదలైతే.. ఉరుములు, మెరుపులు వస్తుంటే.. చాలా మంది ఏ చెట్టు కిందకో పరుగెడుతుంటారు.అంతేకాదు కారులో ఉంటే పిడుగు పడొచ్చనే భయంతో కిందకు దిగి కాస్త దూరంగా నిలబడుతూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో రైతులు, చిన్నారులు సహా పదుల సంఖ్యలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..పిడుగుపాటు బారిన పడకుండా..‘దామిని’ ఉంటే తప్పించుకోవచ్చు! పిడుగులకు సంబంధించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దామిని’అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచి్చంది. మీరు ఉన్న ఏ ప్రాంతంలోనైనా తర్వాతి 15 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటే ఈ యాప్ హెచ్చరిస్తుంది. పుణేకు చెందిన ఐఐటీఎం సంస్థ దీన్ని రూపొందించింది.జీపీఎస్ లొకేషన్ ఆధారంగా.. మీరున్న చోటేకాదు చుట్టుపక్కల ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశముందో చెప్తుంది. అంతేకాదు.. గత 15 నిమిషాల్లో ఎక్కడైనా పిడుగుపడితే ఆ సమాచారం కూడా దీనిలో లభిస్తుంది. పిడుగుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్తుంది. పిడుగుపాటును ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ దగ్గర కూడా ఉంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పిడుగుపాట్లకు 9 మంది మృతి
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం పిడుగుపాట్లకు గురై 9 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. పలుచోట్ల పశువులు సైతం మృత్యువాతపడ్డాయి. మృతుల్లో ఎక్కువ మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలే ఉన్నారు. వర్షం కురుస్తున్న వేళ చెట్ల కింద తలదాచుకుందామని వెళ్లిన వారిపై ఎక్కువగా పిడుగులు పడటంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లి.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గామ్ గ్రామానికి చెందిన దంపతులు అనక సంతోష్ (27), స్వప్న (24) వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం కురవడంతో టేకు చెట్టు కింద ఉన్న గుడిసెలో తలదాచుకున్నారు. చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. » మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్ధయ్య (50), అదే గ్రామానికి చెందిన ఓరుగంటి దుర్గమ్మ, రాజయ్య కుమారుడు నందు (22) గుడిసెపై కప్పేందుకు అవసరమైన పొరుక కోసం గ్రామ సమీపంలోని దుర్గమ్మగుట్టపైకి బుధవారం మధ్యాహ్నం వెళ్లారు. ఉరుములు, మెరుపులు రావడంతో ఓ చెట్టు కింద నిల్చోగా పిడుగుపడి సిద్ధయ్య, నందు మృతిచెందారు. » నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన రైతు మూడపెల్లి ప్రవీణ్ (28) పొలంలో జీలుగ విత్తనాలు చల్లుతుండగా అతనికి సమీపంలో పిడుగు పడింది. దీంతో కుప్పకూలిన అతన్ని నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. » నిర్మల్ జిల్లాలోని తానూరు మండలం ఎల్వత్ గ్రామంలో మంగీర్‌వాడ్ శ్రీ(10) అనే బాలుడు తన తాతతో కలిసి మేకలను మేపేందుకు అడవికి వెళ్లి తిరిగొస్తుండగా పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు మేకలు మృత్యువాతపడ్డాయి. » సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పీచేర్యాగడి గ్రామానికి చెందిన శివరాంపురం గోపాల్ వ్యవసాయ పనులు చేసేందుకు పొలానికి వెళ్లాడు. వర్షం కురుస్తుండటంతో చెట్టు కిందకు వెళ్లగా పిడుగుపడి ప్రాణాలు కోల్పోయాడు. » నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌కు చెందిన కొమ్మరెక్క జంగమ్మ (40), ఆమె భర్త కృష్ణయ్య, తల్లి ఈదమ్మ పొలంలో పత్తి విత్తనాలు విత్తుతుండగా వర్షం కురుస్తోందని చెట్టు కిందకు వెళ్లారు. పిడుగు పడటంతో జంగమ్మ మృతిచెందగా మిగిలిన ఇద్దరినీ స్థానికులు కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంటున్నారు. » మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పీర్లతండాకు చెందిన డలావత్ గేమ్యనాయక్ (60) పొలాల సమీపంలో గొర్రెలను మేపి ఇంటికి తిరిగొస్తుండగా పిడుగుపాటుకు గురై కన్నుమూశాడు. -
తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత?
పిడుగులు పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని చాలామంది అంటుంటారు. ఆ సమయంలో ఫోన్లను వినియోగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని కూడా చెబుతారు. ఇదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాతావరణంలో ఇంటర్నెట్ వాడకూడదని కూడా అంటుంటారు. దీనివెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు విద్యుత్తును ఆకర్షిస్తాయని, మెరుపు మెరిసినప్పుడు దానిలోని విద్యుత్ శక్తిని ఫోన్ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఫలితంగా ఇంటిపై పిడుగు పడే అవకాశాలుంటాయని చెబుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ గురించి కొందరు ఏమంటారంటే.. మెరుపులోని విద్యుత్ ఫోన్టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటుంటారు. తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్ ఫోన్‌కు చేరుకుని అది పేలవచ్చని, లేదా ఇంటిపై పిడుగులు పడవచ్చని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను స్వీకరిస్తాయి. ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్‌కు ఎప్పటికీ చేరదు. మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమేనని చెప్పవచ్చు. ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్ ఫోన్‌ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు. అయితే వైర్డ్ టెలిఫోన్ విషయంలో కొంతమేరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఓం’పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? -
ఇది యానిమేటెడ్ 3డీ షో కాదు.. ప్రకృతి ఆవిష్కరించిన మెరుపు!
సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలోని కొన్ని వీడియోలను చూస్తే అవి నిజమనే నమ్మకం కలగదు. తాజాగా సోషల్ మీడియాలో వర్షానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వీడియో ఇటీవల ట్విట్టర్లో షేర్ అయ్యింది. మెరుపునకు సంబంధించిన అద్భుతమైన దృశ్యం కెమెరాకు చిక్కింది. దీనిని చూస్తే నమ్మాలని అనిపించదు. ఎందుకంటే ఇది యానిమేటెడ్ 3డీ షో మాదిరిగా కనిపిస్తుంది. ఈ 9-సెకన్ల వీడియో ట్విట్టర్లో మాసిమో అనే పేజీలో షేర్ అయ్యింది. ఈ వీడియోలో రాత్రి వేళ పర్వతంపై మెరుపులు కనిపిస్తాయి. కొన్ని సెకన్ల పాటు ఈ పర్వతంపై మెరుపులతో కూడిన కాంతి కనిపిస్తుంది. ఈ పర్వతంపై ఒక మేఘం కనిపిస్తుంది. ఆ మేఘాల మధ్యలో నుంచి మెరుపులు మెరుస్తుంటాయి. ఈ వీడియోలో ఆ మెరుపు అద్భుతమైన లైటింగ్ షోలా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారి కళ్లు కూడా మిరిమిట్లు గొలుపుతాయి. ఇప్పటివరకు ఈ వీడియోను 54 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వేలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. కొంతమంది వినియోగదారులు ఇది ప్రకృతి అందించిన ప్రత్యేకమైన దృశ్యమని అంటుండగా, మరికొందరు ఈ వీడియో అద్భుతంగా ఉందంటున్నారు. కాగా కొండ ప్రాంతాలలో రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. మెరుపులు, పిడుగులు వంటి సంఘటనలు సాధారణం. కానీ ఈ మెరుపు మెరుస్తున్న విధానం ఎంతో అద్భుతమని అనిపిస్తుంది. ఇది కూడా చదవండి: 2012లో ఇంజినీరింగ్ పూర్తి.. 2023లో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్.. తీరని కల నెరవేరుతోందిలా.. Have you ever seen such stunning upward lightning? Probably one of the most impressive lightning show ever This is Volcan de Agua, Guatemala [📹 bienesinmueblestv: https://t.co/mAnnM9Hcsi]pic.twitter.com/5DAtCEtuRW — Massimo (@Rainmaker1973) August 3, 2023 -
మహాకాల్ లోక్‌లో బీభత్సం.. పిడుగుపడి ముగ్గురి దుర్మరణం
ఉజ్జయిని: హఠాత్తుగా మొదలైన ఈదురు గాలులు, ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో విధ్వంసం సృష్టించింది. అదే సమయంలో.. మహాకాళ్ లోక్ ఆలయ ప్రాంగణంలో పిడుగు పడి ముగ్గురు మరణించారు. మరికొంతమందికి గాయాలు కాగా, అక్కడ ఏర్పాటు చేసిన పలు విగ్రహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి కురిసిన వర్ష బీభత్సానికి ఉజ్జయిని అతలాకుతలం అయ్యింది. భారీ సంఖ్యలో చెట్లు విరిగిపడగా.. చాలాచోట్ల కరెంట్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక వారాంతం కావడంతో.. ఆదివారం పాతిక వేల మందికి పైగా మహాకాళ్ లోక్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. భారీగా సందర్శకులు మహాకాళ్ లోక్కు రాగా.. ఆ సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసున్నారు. బలంగా ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడి ముగ్గురు మరణించారు. మరికొంతమంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాలుల ధాటికి ఆలయ కారిడార్‌లో ఏర్పాటు చేసిన సప్తరుషి విగ్రహాలు పక్కకు జరిగాయి. అందులో రెండు పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ కారిడార్‌లో మొత్తం 155 విగ్రహాలు ఉండగా.. దెబ్బ తిన్న విగ్రహాలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) చెబుతున్నారు.మహాకాల్ లోక్ ఆలయ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కిందటి ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అపూర్వం.. అమోఘం.. మహాకాళ్ లోక్ (ఫొటోలు) -
పిడుగు పడి కాలిపోయిన కొబ్బరి చెట్టు..
-
పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి
-
ఉరుములు, మెరుపులతో ఢిల్లీలో భారీ వర్షం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఢిల్లీ, నేషనల్ కాపిటల్ ప్రాంతం (గురుగ్రామ్, ఫరీదాబాద్, మనేసర్, బల్లభ్‌గఢ్) కర్నాల్, పానిపట్, గన్నౌర్, సోనిపట్, ఖర్ఖోడా, ఝజ్జర్, సోహనా, పాల్వాల్, నూహ్ (హర్యానా) ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం శనివారం ఉదయం వరకు కురిసింది. ఢిల్లీలో పాటు బాగ్పత్ (ఉత్తరప్రదేశ్), తిజారా (రాజస్థాన్) వర్షం కురిసినట్లు భారత వాతావరణ శాఖ ట్విటర్లో పేర్కొంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు మొత్తం జలమయం అయ్యాయి. శనివారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. #WATCH: Rain lashes Delhi-NCR; visuals from Chanakyapuri area "Thunderstorm with moderate to heavy intensity rain would occur over & adjoining areas of entire Delhi and NCR (Gurugram, Faridabad, Manesar, Ballabhgarh) during the next 2 hours," says India Meteorological Department pic.twitter.com/0ue7HoLvMj — ANI (@ANI) January 7, 2022 -
నవ దంపతుల జీవితంలో ‘పిడుగుపాటు’
సాక్షి, మేడ్చల్: పిడుగుపాటు ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సంఘటన మేడ్చల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. రావల్కోల్ గ్రామానికి చెందిన చీర్ల మహేష్ (25)కు సొంతంగా పశువులు ఉన్నాయి. వాటిని కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం పశువులను మేపడానికి వెళ్లిన మహేష్‌కు సమీపంలో పిడుగు పడింది. దాని ధాటికి మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో విషాధచాయలు మహేష్‌కు ఏడాది క్రితం వివాహం జరిగింది. రెండు నెలల క్రితం మగశిశువు జన్మించాడు. అంతా సాఫీగా సాగుతున్న కుటుంబంలో పిడుగుపాటు ఆ కుటుంబ సభ్యులను కుదిపేసింది. మహేష్ మరణ వార్తతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
చేనుపనులు ముగించుకుని వస్తున్నాడు.. అంతలోనే
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): చేను పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తాడనుకుంటే భర్త పిడుగుపాటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన జైనథ్ మండలం గూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట భగవాండ్లు(49), తన భార్య మల్లమ్మ, జీతగాడు(పాలేరు) దాగిరి సంతోశ్, మరో నలుగురు కూలీలతో కలసి శుక్రవారం తన పత్తి చేనులో కలుపు నివారణ, పురుగుల మందు పిచికారీ పనులకు వెళ్లారు. ఆ తర్వాత కూలీలతో కాలినడకన భార్య మల్లమ్మ ఇంటికి చేరుకుంది. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో పాలేరు సంతోశ్ ఎడ్ల బండి తోలుతుండగా, వెనుకాల నిల్చోని భగవాండ్లు వస్తున్నాడు. ఎడ్లబండిపై ఒకసారిగా పిడుగుపడి భగవాండ్లు అక్కడిక్కడే మృతిచెందాడు. సంతోశ్‌కు కాలి భాగంలో గాయాలయ్యాయి. ఎడ్లకు సైతం స్వల్ప గాయాలు కాగా, ఎటువంటి హాని జరుగలేదు. స్థానికులు సంతోశ్‌ను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: విధుల్లో ఉన్న వలంటీర్‌పై టీడీపీ నేత దాడి -
తల్లీకొడుకులపై పిడుగు
పెందుర్తి: విశాఖపట్నం పెందుర్తి సమీపంలోని పులగానిపాలెం నల్లక్వారీ కాలనీలో మంగళవారం తల్లీకొడుకులపై పిడుగుపడింది. కుమారుడు అక్కడికక్కడే మృతిచెందగా తల్లి తీవ్రంగా గాయపడింది. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి కొట్టే ప్రవీణ్‌కుమార్, పావని దంపతులు గాజువాకలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు రోహిత్ (6) ఉన్నాడు. పావని, రోహిత్ కొద్దిరోజుల కిందట పెందుర్తిలోని ఆమె పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో మేడపై ఆరబెట్టిన దుస్తులు తీసేందుకు పావని వెళ్లింది. ఆమెతో పాటు రోహిత్ కూడా వెళ్లాడు. అదేసమయంలో వీరిపై పిడుగుపడింది. రోహిత్ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. పావని తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు పావనిని 108లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మమ్మ ఇంట్లో సరదాగా గడిపేందుకు వచ్చిన రోహిత్ అకాల మరణంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. -
Thunderstorm: కుటుంబంపై పిడుగు.. తీవ్ర విషాదం
హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలం పెద్దహ్యాట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం పడిన పిడుగు ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పిడుగుపాటుకు భార్యాభర్తలు, కుమార్తె మృతిచెందారు. మరో కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు, బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయ భోగరాజు (36), మల్లమ్మ (30) దంపతులకు నలుగురు కుమార్తెలు. తమకున్న 4 ఎకరాల మెట్ట భూమి సాగుచేసుకుంటూ, మేకలు మేపుతూ, కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం పెద్దకుమార్తె హంసమ్మను ఇంటివద్దే వదిలి భోగరాజు, భార్య మల్లమ్మ, కుమార్తెలు రేవతి (8), మల్లేశ్వరి, వెన్నెలతో కలిసి పొలాన్ని దున్నించడానికి బాడుగ ట్రాక్టరు తీసుకెళ్లారు. మేకలను కూడా తోలుకెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడటంతో అందరూ వేపచెట్టు కిందకు చేరారు. మేకలు కూడా అక్కడికే చేరాయి. అదే సమయంలో భారీ శబ్దంతో పిడుగుపడింది. భోగరాజు, కుమార్తె రేవతి అక్కడికక్కడే మృతిచెందారు. 32 మేకలు కూడా విగతజీవులయ్యాయి. మల్లమ్మ, మరో కుమార్తె మల్లేశ్వరి అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వారిని బంధువులు తొలుత హొళగుంద పీహెచ్‌సీకి, అనంతరం ఆదోనికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లమ్మ మృతిచెందింది. తల్లి మల్లమ్మ ఒడిలో ఉన్న చిన్న కుమార్తె వెన్నెల పిడుగుశబ్దానికి ఎగిరి దూరంగా పడింది. ఎలాంటి గాయాలు కాకుండానే ప్రాణాలతో బయటపడింది. హొళగుంద ఎస్ఐ విజయ్‌కుమార్ గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరుకు తరలించారు. -
ఆ జిల్లాలో పిడుగుపడే అవకాశం
సాక్షి, విజయవాడ: చిత్తూరు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా, సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు. తిరుపతి అర్బన్ , కార్వేటినగరం, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, గంగవరం, పెద్దపంజాణి, పుంగనూరు, సోమల, చౌడేపల్లె, తవణంపల్లి, కుప్పం, రామకుప్పం, వెంకటగిరికోట, శ్రీరంగరాజపురం, బైరెడ్డిపల్లె మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) -
ఏపీ: విద్యుత్ వినియోగం ఢమాల్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గురువారం ఊహించని విధంగా పడిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా 120 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. ఈ పరిణామంపై విద్యుత్ ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించారు. ► రాష్ట్రవ్యాప్తంగా గురువారం వీచిన గాలులు, వర్షానికి పలు జిల్లాల్లో భారీగా విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ► వర్షం కారణంగా రైతులు కూడా వ్యవసాయ విద్యుత్ ఉపయోగించుకోలేదు. ► ఏప్రిల్‌లో సాధారణంగా 210 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని ఈ ఏడాది అంచనా వేశారు. లాక్డౌన్ కారణంగా వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ తగ్గిపోయి రోజుకు 150 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. గాలి దుమ్ము వల్ల ఇది 120 మిలియన్ యూనిట్లకు చేరింది. ► ఇలా విద్యుత్ డిమాండ్ పడిపోవడం, తిరిగి కొన్ని గంటల్లో పుంజుకోవడం వల్ల గ్రిడ్ మేనేజ్మెంట్కు సమస్యగా మారుతోందని లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ఇంజినీర్లు చెబుతున్నారు. ► లాక్డౌన్ ముగిసే వరకూ కచ్చితమైన ప్రణాళికలన్నవి కష్టంగానే ఉన్నాయని.. పరిస్థితిని బట్టి ముందుకెళ్లడం మినహా చేయగలిగిందేమీ లేదని ఓ అధికారి చెప్పారు. ఇది చదవండి: గత నెల ఎంత వస్తే అంతే కట్టండి! -
రాయలసీమ గడగడ!
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమను వాతావరణం గడగడలాడించనుంది. బుధ, గురువారాల్లో పిడుగులు, ఆ తర్వాత రెండు రోజులు వడగాడ్పులతో దడ పుట్టించనుంది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే కర్ణాటక నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఆవర్తనం, ద్రోణిల ప్రభావంతో బుధవారం, గురువారం రాయలసీమలో గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో పిడుగులు కూడా పడతాయని ఐఎండీ మంగళవారం వెల్లడించింది. శుక్ర, శనివారాల్లో రాయలసీమలో ఉష్ణోగ్రతలు మరింతగా విజృంభిస్తాయని, సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా నమోదయి చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. అందువల్ల రాయలసీమ ప్రజలు పిడుగులు, వడగాడ్పుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్రలో మాత్రం బుధ, గురువారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి కర్నూలు జిల్లాలో మంగళవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. హాలహర్వి మండలం చింతకుంట గ్రామానికి చెందిన బారిక శ్రీనివాసులు(50) అనే గొర్రెల కాపరి, ఆస్పరి మండలం మత్తుకూరు గ్రామానికి చెందిన రంగప్ప (39) అనే రైతు, కోవెలకుంట్ల మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన జాఫర్ (30) అనే మేకల కాపరి పిడుగులకు బలయ్యారు. -
కోస్తాకు పిడుగులు.. జల్లులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులతో పోల్చుకుంటే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు మాత్రమే అధికంగా రికార్డవుతున్నాయి. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగుతోంది. శనివారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు రాయలసీమలో ఉష్ణతీవ్రత కొనసాగనుంది. శనివారం అక్కడ సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా తిరుపతితో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న రెండు రోజులు వడగాడ్పుల ప్రభావం ఉండదని ఐఎండీ వివరించింది. గడచిన 24 గంటల్లో వేపాడ, నందిగామల్లో 3 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. -
పిడుగులు పడతాయ్.. జాగ్రత్త!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు తిరోగమనం మొదలయ్యాక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి తేలికపాటి వర్షాలు కురిసేవి. కానీ ఇప్పుడు అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయి. నైరుతి నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య మహారాష్ట్ర వరకు తమిళనాడు, కర్ణాటక మీదుగా ఒక ద్రోణి, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ద్రోణుల వల్ల పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదై క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆకస్మిక వర్షాలతో పాటు మెరుపులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడచిన 24 గంటల్లో చింతలపూడిలో 7 సెం.మీ, సంతమగుళూరులో 5, అచ్చంపేటలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఏపీలో పెనుగాలులు, పిడుగుల వానలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతికూల వాతావరణం ప్రతాపం చూపనుంది. రుతుపవనాల ఆగమనానికి ముందు ఒక్కసారిగా అలజడి రేగనుంది. భారీ గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతం తమిళనాడుకు ఆవల సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈస్ట్‌వెస్ట్ షియర్ జోన్(తూర్పు, పశ్చిమ గాలుల కలయిక) కూడా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి తేమ గాలులు, ఉత్తరాది నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ప్రభావంతో రాష్ట్రంలో క్యుములోనింబస్ మేఘాలేర్పడి పెనుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఈ పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం తెలిపింది. ఈ మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షం, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశానికి ముందు ఇలాంటి వాతావరణ పరిస్థితులు సహజమేనని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. కాగా.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణించాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురంలో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ 39 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. గత 24 గంటల్లో అమరాపురంలో 13, ఆత్మకూరులో 9, తిరువూరు 8, అవుకు 7, చిలమత్తూరు, లేపాక్షి, గజపతినగరంలలో 6, బలిజపేట, రోళ్ల, వెంకటగిరి, పలమనేరుల్లో 5, పాడేరు, చోడవరంలలో 4 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల్లో ప్రమాదం
-
ప్రాజెక్ట్ పనుల్లో పేలుడు.. కూలీల మృతి
సాక్షి, కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనుల్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. సొరంగంలో బ్లాస్టింగ్ చేసేందుకు నిర్దేశించిన స్దలంలో జిలెటిన్ స్టిక్స్ అమర్చారు. అయితే కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో వారంతా గాయపడ్డారు. వారిని నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఆయితే ప్రమాద స్థలంలో ఉరుములు మెరుపులు రావటంతో దాని ప్రభావం వల్ల బ్లాస్టింగ్ జరిగినట్టు భావిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు బిహార్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కూలీలుగా చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐఎండీ వార్నింగ్: మళ్లీ ఇసుక తుపానులు!
సాక్షి, న్యూఢిల్లీ : ఇసుక తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే ఉత్తర భారతదేశాన్ని మరో ఉపద్రవం ముంచెత్తనుందని వాతావరణ విభాగం శనివారం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పెనుగాలులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని ప్రకటించింది. అదేవిధంగా రాజస్థాన్‌లో మరోసారి ఇసుక తుపాన్ సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పశ్చిమతీరంలోని మధ్యదరా సముద్రంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల కారణంగా వాయువ్య భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో.. తూర్పు ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తోడు.. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులు విధ్వంసం సృష్టించనున్నాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దక్షిణాదిలో కూడా.. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, చండీఘఢ్, పంజాబ్, హర్యానాలతో పాటు.. దక్షిణాదిలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. విదర్బ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. అయితే రాజస్థాన్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎమ్‌డీ అధికారి తెలిపారు. కాగా ఇటీవలి కాలంలో, తుపానులు, భారీ వర్షాలు ఉత్తర భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించాయి. వంద మందికి పైగా మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. అలాగే జైపూర్, అజ్మీర్, జోద్పూర్, బికనీర్‌లో దుమ్ము తుపానులు సంభవించిన సంగతి తెలిసిందే. వాతావరణ విభాగం తాజా హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. -
ఏపీలో పిడుగుల వాన,ఆరుగురు మృతి
-
ప్రాణాలు తోడేసిన పిడుగుల వాన
సాక్షి, చిత్తూరు/శ్రీకాకుళం పాతబస్టాండ్/భోగాపురం/తెర్లాం/పూసపాటిరేగ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వడగండ్లు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు గురై విజయనగరం జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లాలో పిడుగుపాటుకు గురై 46 మేకలు మరణించాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవ గ్రామానికి చెందిన దుక్క రామయ్యమ్మ (45), మురపాల శ్రావణి (9) చెరువుగట్టుపై నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించారు. శ్రావణికి పంటి నొప్పి ఎక్కువగా ఉండడంతో అమ్మమ్మ అయిన రామయ్యమ్మ తగరపువలసలో ఉన్న ఆస్పత్రికి బయలుదేరింది. చెరువుగట్టుపై నడిచి వెళ్తుండగా వారికి సమీపంలో పిడుగు పడడంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. తెర్లాం మండలంలోని సుందరాడ గ్రామానికి చెందిన దాకారపు ఆదినారాయణ (35) గ్రామానికి సమీపంలో మొక్కజొన్న గింజలు ఎండబెట్టాడు. మంగళవారం ఉదయం 11గంటల సమయంలో వర్షం రావడంతో గింజలు ఎత్తేందుకు వెళ్లాడు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పిడుగుపడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.రెల్లివలస గ్రామానికి చెందిన రౌతు గౌరినాయుడు (22) సమీపంలోని చంపావతినదిలో గేదెలు కడుగుతుండగా పిడుగుపడి అక్కడకక్కడే మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం పనసనందివాడలో వంట మనిషి దుర్గారావు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. రేగిడి మండలంలో ఉపాధి పనులకు వెళ్లి వస్తున్న కండ్యాం గ్రామానికి చెందిన టి.జయమ్మపై పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయింది. చిత్తూరు జిల్లాలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలమనేరు, రొంపిచెర్ల, బి.కొత్తకోట వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. పెద్దపంజాణి మండలం పెద్దకాప్పల్లి పంచాయతీ తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 46 మేకలు చనిపోయాయి. -
రాజస్తాన్‌లో భారీ వర్షం; 19 మంది మృతి
ధోల్పూర్/భరత్పూర్: ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ధాటికి బుధవారం రాజస్తాన్‌లో ఐదుగురు చిన్నారులుసహా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గోడలు, ఇంటి పైకప్పులు, చెట్లు కూలడంతో ఎక్కువ మంది చనిపోయారు. ధోల్పూర్లో భారీ వర్షం సృష్టించిన బీభత్సం కారణంగా 13 మంది చనిపోయారని, దాదాపు 50 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. సాయ్‌పావ్ ప్రాంతంలో వర్షం ధాటికి గోడ కూలి మీద పడడంతో ఐదేళ్ల చిన్నారి చనిపోయింది. వేర్వేరు ఘటనల్లో గాయపడిన వారిని జిల్లా కలెక్టర్ పరామర్శించారు.