tukkuguda
-
మంత్రి దృష్టికి తీసుకెళ్తా.. సమస్యను పరిష్కరిస్తా: కేఎల్ఆర్
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని జన్నాయిగూడ గ్రామంలో ఫ్యాబ్ సిటీ, ఫార్మసిటీ వల్ల భూములు కోల్పోయిన స్థానికులతో మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ (కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి), ధరణి కమిటీ చైర్మన్ కోదండ రెడ్డిలు భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కేఎల్ఆర్ మాట్లాడుతూ.. సమస్యను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బోధ మాధవరెడ్డి, పుంటి కూర చంద్రశేఖర్‌రెడ్డి, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్తో పాటు ఆయా గ్రామల రైతులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. -
సెంటిమెంట్.. కొత్త ఉత్తేజం..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇక్కడ్నుంచే ప్రచారభేరి నిర్వహించి, అధికారంలోకి వచ్చిందని.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలసి వస్తుందన్న సెంటిమెంట్ కనిపించింది. ఈ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి సభా ప్రాంగణం కిక్కిరిసింది. ముఖ్య అతిథి రాహుల్, ఇతర కీలక నేతల రాక ఆలస్యమైనా.. మంత్రులు, ఇతర నేతలు ప్రసంగిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ సభా వేదిక వద్దకు చేరుకున్నాక.. సీనియర్ నేతలు వీహెచ్, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పలువురు మహిళా నేతలు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అనంతరం రాహుల్ ర్యాంప్‌పై నడుస్తూ అభివాదం చేశారు. తర్వాత ప్రసంగించారు. ఈ సమయంలో కార్యకర్తల నినాదాలతో సభాస్థలి మార్మోగిపోయింది. రాహుల్ రాక ఆలస్యం..: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 6:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు స్వాగతం పలికారు. రాహుల్ వారితో కలసి నేరుగా నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. కాసేపు వారితో భేటీ అయ్యారు. తర్వాత సాయంత్రం 7:15 గంటల సమయంలో తుక్కుగూడ సభావేదిక వద్దకు చేరుకున్నారు. సభ అనంతరం 8:30 గంటల సమయంలో శంషాబాద్‌కు వెళ్లి, ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. సభ తర్వాత సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సభ జరిగిన తీరు, లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై చర్చించినట్టు సమాచారం. న్యాయపత్రం విడుదల.. ‘ప్రత్యేక హామీలు’ వాయిదా జన జాతర సభ వేదికగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలుగులో ‘న్యాయ పత్రం’పేరిట విడుదల చేశారు. ‘మార్పు కోసం హస్తం’పేరుతో ఐదు గ్యారంటీల పత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే.. ఈ సభలోనే తెలంగాణ కోసం 23 హామీలతో రూపొందించిన ప్రత్యేక హామీలను కూడా ప్రకటించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ హామీలను త్వరలోనే తెలంగాణ ప్రజల ముందుంచుతామని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. తెల్లం వెంకట్రావు రాకపై చర్చ! జన జాతర సభ వేదికపై భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కనిపించడం చర్చకు దారితీసింది. ఆయన ఇంకా కాంగ్రెస్‌లో చేరకపోయినా.. సభా వేదికపై కూర్చోవడం గమనార్హం. ఆయనతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆసీనులయ్యారు. వెంకట్రావు, ప్రసాదరెడ్డిలను పలువురు కాంగ్రెస్ నేతలు కలసి అభినందిస్తూ కనిపించారు. -
అంతిమ విజయం మాదే..: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీటీంగా ఉన్న బీఆర్ఎస్ను ఓడించామని.. లోక్‌సభ ఎన్నికల్లో ఏ టీం బీజేపీని ఓడిస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ దగ్గర ఈడీ, సీబీఐ, సంపద ఉన్నాయని.. తమ దగ్గర నిజాయతీ, ప్రజల ప్రేమ ఉన్నాయని చెప్పారు. అంతిమ విజయం నిజాయతీది, ప్రజల ప్రేమదేనన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని.. న్యాయపత్రం పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు ఐదు గ్యారంటీలు ఆత్మలాంటివని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, ఇప్పటివరకు 20వేల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే మరో 50వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటించారు. తెలంగాణ దేశానికి మోడల్ కావాలని ఆకాంక్షించారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ ఏడాదికి రూ.లక్ష వేతనంతో అప్రెంటిస్‌షిప్ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. నారీ న్యాయ్ పేరుతో ఏటా రూ.లక్షను ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు ఇస్తాం. ఇది విప్లవాత్మక మార్పు. దీనిద్వారా దేశ ముఖచిత్రం మారబోతోంది. కిసాన్ న్యాయ్ పథకం ద్వారా రుణమాఫీ చేస్తాం. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించబోతున్నాం. స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తాం. శ్రామిక్ న్యాయ్ పథకం ద్వారా కార్మికులు, కూలీలకు కనీస వేతనాలు అమలు చేస్తాం. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారితో పాటు ఇతర రంగాల్లోని కారి్మకులకు రోజుకు రూ.400 కనీస వేతనం ఇస్తాం. ఎవరెంతో.. వారికంత.. మేం మరో చరిత్రాత్మకమైన గ్యారంటీ ఇస్తున్నాం. దేశంలో 50శాతం మంది ప్రజలు బలహీనవర్గాలకు చెందినవారే. 15శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, ఆదివాసీలు, 15 శాతం మంది మైనార్టీలు, 5 శాతం మంది పేద అగ్రవర్ణాల ప్రజలున్నారు. 90శాతం వీరే ఉన్నారు. కానీ దేశంలోని ప్రభుత్వ సంస్థలు, పెద్ద కంపెనీల్లో వీరు కనిపించరు. దేశంలోని పెద్ద 200 కంపెనీల యజమానులను చూస్తే ఈ వర్గాలకు చెందిన వారుండరు. దేశాన్ని పాలించే ముఖ్యమైన 90 మంది ఏఐఎస్ అధికారుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు. జనాభా 50శాతం అయితే పాలనలో భాగస్వామ్యం ఐదుగురిదే. ఒక గిరిజనుడు, ముగ్గురు దళితులు ఉన్నారు. ఇక బడ్జెట్ ఖర్చులో వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలకు 6 శాతమే వస్తోంది. మా ప్రభుత్వం వస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్నట్టుగానే.. జనాభా కులగణన చేస్తాం. దేశాన్ని ఎక్స్‌రే చేసి పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తాం. ఆయా వర్గాల ఆర్థిక, వ్యవస్థీకృత సర్వే కూడా చేయించి.. ఎవరి హక్కులు వారికి కల్పిస్తాం. మావి గ్యారంటీలు కాదు.. ప్రజల గొంతుక.. జాతీయ స్థాయి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పుడు ఆవిష్కరించుకున్నాం. మేమిచ్చింది ఐదు గ్యారంటీలు కాదు. అది ప్రజల గొంతుక. తెలంగాణలో అమల్లోకి తెచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి గ్యారంటీలన్నీ ప్రజల గొంతుకలే. తెలంగాణలో హామీలను నిలబెట్టుకున్నాం. దేశంలో భారీగా నిరుద్యోగం ఉన్న సమయంలో తెలంగాణలోని 20వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. 50వేల మందికి త్వరలోనే ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఇక్కడ మాట నిలబెట్టుకున్నట్టుగానే.. జాతీయ స్థాయి మేనిఫెస్టోను అమలు చేస్తాం. కేసీఆర్, మోదీలవి బలవంతపు వసూళ్లు గతంలో తెలంగాణ సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో తెలుసు. వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పోలీసు వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేసి నదిలో పడేశారు. భయపెట్టి, బలవంతం చేసి మీ సంపద దోచుకున్నారు. తెలంగాణలో అదంతా వెలికితీసే పని ప్రారంభమైంది. ఇక్కడ కేసీఆర్ చేసినట్టుగానే ఢిల్లీలోని మోదీ ప్రభుత్వం చేస్తోంది. ఆ పార్టీ పక్షాన ఓ బలవంతపు వసూళ్ల విభాగం (ఎక్స్టార్షన్ డైరెక్టరేట్) పనిచేస్తోంది. దేశంలోని అత్యంత అవినీతిపరులంతా మోదీ వెనుక నిలబడ్డారు. ఎన్నికల కమిషన్‌లో కూడా మోదీ తన మనుషులను పెట్టుకున్నారు. ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఆ బాండ్లను పరిశీలిస్తే వాస్తవాలేంటో తెలుస్తాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం బ్యాంకు ఖాతాలను నిలిపివేశారు. కానీ మేం భయపడేది లేదు. తెలంగాణలో బీజేపీకి బీటీంను ఓడించాం. ఇప్పుడు దేశంలో ఏ టీంను ఓడించబోతున్నాం. మనది కుటుంబ బంధం తెలంగాణ ప్రజలతో నాకున్నది రాజకీయ బంధం కాదు. కుటుంబ బంధం. సోనియాగాంధీ ఎలాగూ మీ వైపే ఉంటారు. ఢిల్లీలో నేను కూడా మీ సిపాయినే. తెలంగాణ ప్రజలు, యువకులు ఎప్పుడు పిలిచినా వస్తాను. చిన్న పిల్లాడు పిలిచినా మీ ముందుంటా. మీ కోసం వస్తా. దేశంలో తెలంగాణ కొత్త రాష్ట్రం. ఈ రాష్ట్రం దేశానికి మార్గం చూపించాలి. మేడిన్ తెలంగాణ.. మేడిన్ చైనాతో తలపడేలా చేద్దాం. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటోంది దేశంలోని పౌరులందరికీ రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ భావిస్తోంది. కానీ మేం ఆ పని చేయనీయం. బీజేపీ హింసను ప్రోత్సహిస్తోంది. మత విద్వేషాలు రేపుతోంది. అదే మా పోరాటం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే. మా విప్లవాత్మక మేనిఫెస్టో దేశ ముఖచిత్రాన్ని మార్చబోతోంది. అది దేశ ఆత్మ. పేదలు, రైతులు, మహిళలు, యువకుల జీవితాలను మార్చగలదు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది. జైహింద్... జై తెలంగాణ’’ అంటూ రాహల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు. -
Tukkuguda: ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్షవేస్తాం: రాహుల్ గాంధీ
తుక్కుగూడ జన జాతర సభ.. రాహుల్ గాంధీ ప్రసంగం ముఖ్యాంశాలు కొన్ని రోజుల కిందటే ఇక్కడే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశా కొన్ని నెలల క్రితం తెలంగాణకు చేసిన వాగ్ధానం గుర్తుంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లు దేశంలోనూ మాట నిలబెట్టుకుంటాం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు న్యాయసూత్రాలు భారతీయుల ఆత్మ యువతకు శిక్షణా కార్యక్రమాలు పెట్టబోతున్నాం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టాం మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలు నిరుపేదలయ్యారు తెలంగాణలో 30 వేల ఉద్యోగాలిచ్చాం మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం రూ.500కు గ్యాస్ ఇచ్చాం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చాం దేశ ప్రజల మనసులోని మాటే మా మేనిఫెస్టో నారీ న్యాయ్ కింద ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష వేస్తాం .. నారీ న్యాయ్‌తో దేశ ముఖ చిత్రం మారబోతోంది ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష నగదు జమ చేస్తాం పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తాం దేశంలో నిత్యం 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేం అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం ధనవంతులకు మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు రైతులకు మాత్రం మోదీ రూపాయి కూడా మాఫీ చేయలేదు స్వామినాథన్ ఫార్ములా ప్రకారం రైతులకు మద్దతు ధర ఇస్తాం దేశంలో 50 శాతం మంది వెనుకబడిన వర్గాలే బడుగుల జానాభా 50 శాతం ఉంటే 5 శాతం ఉన్నవారి దగ్గరే అధికారం ఉంది కార్మికులకు కనీస వేతనాలు కల్పిస్తాం కేసీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించారు... గతంలో ఉన్న సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో మీకు తెలుసు వేల మంది ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించాడు ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశాడు రాత్రి పూట ఫోన్ చేసి డబ్బులు వసూలు చేశారు ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పని మొదలు పెట్టింది.. నిజం మీ ముందుంది కేసీఆర్ ఏం చేశారో మోదీరు అదే చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఏం చేశారో ఢిల్లీలో మోదీ అదే చేస్తున్నారు తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడించాం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్ ఈడీ ఎక్స్టార్షన్ డైరెక్టరేట్‌గా మారింది ఒక రోజు సీబీఐ ఒక కంపెనీకి ఝలక్ ఇస్తుంది అదే కంపెనీ మరుసటి రోజు ఎన్నికల బాండ్లు కొంటుంది బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర ప్రేముంది.. బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర మీ ప్రేముంది బీజేపీ అనే అతిపెద్ద వాషింగ్‌మెషిన్ నడుస్తోంది బీజేపీకి డబ్బు ఇచ్చిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది మేము రాజ్యాంగాన్ని రద్దు చేయం మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం మా మేనిఫెస్టో దేశ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు రైతులు, వెనుకబడిన వారికి మరో 5 హామీలు ఇచ్చాం ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది: సీఎం రేవంత్‌రెడ్డి జాతికి 5 గ్యారెంటీలను రాహుల్ అంకితం చేశారు జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేయడం సంతోషం బీఆర్ఎస్ను ఓడించినట్లే దేశంలో బీజేపీని ఓడించాలి గత ప్రభుత్వం కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు బీఆర్ఎస్ను తుక్కుతక్కుగా ఓడించిన ఉత్సాహం తుక్కుగూడలో కనిపిస్తోంది ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది ఉద్యోగాలివ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం పదేళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసింది పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలి కేసీఆర్‌కు చర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా .. రేవంత్ మాజీ ముఖ్యమంత్రి భాష సరిగా లేదు పదేళ్ల పాలనలో తెలంగాణను పీడించారు కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు లుంగీ లాగి చర్లపల్లిలతో చిప్పకూడు తినిపిస్తా కేసీఆర్‌కు జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలులో ఉండొచ్చు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు నేను జానారెడ్డిని కాదు.. ఊరుకోవడానికి పదేళ్లలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎన్ని పదేళ్లలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత నాది మేం హామీలు నెరవేరిస్తే 14 లోక్‌సభ సీట్లు గెలిపించండి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలంటే 14 మంది ఎంపీలను గెలిపించాలి కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రాహుల్‌గాంధీ తుక్కుగూడ జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆవిష్కరించిన రాహుల్ తెలంగాణకు సంబంధించి మేనిఫెస్టోలో 23 అంశాలు న్యాయపత్రం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో 5 గ్యారెంటీల పత్రం పేరుతో మేనిఫెస్టో విడుదల భట్టి విక్రమార్క కామెంట్స్.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ప్రకటించాం కేసీఆర్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నాం 200 యూనిట్ల విద్యుత్ జీరో బిల్లులిస్తున్నాం జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌గాంధీ తుక్కుగూడ జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌గాంధీ రాహుల్‌గాంధీ వెంట పలువురు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్‌గాంధీ కేసీఆర్ మాట, యాస అదుపులో ఉంచుకుని మాట్లాడాలి : మంత్రి పొన్నం పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఎలా మాట్లాడాలో తెలియడం లేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌గాంధీ కాసేపట్లో తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభ సభ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ ఘనస్వాగతం పలికిన సీఎం రేవంత్, భట్టి, దీపాదాస్ మున్షీ జాతీయ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్‌గాంధీ తెలంగాణకు ఇచ్చే హామీలు వివరించనున్న రాహుల్ మళ్లీ సమర శంఖం కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణకు ప్రత్యేక హామీలు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది. చేరికలపై గోప్యత జన జాతర సభ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్ హోటల్లో రాహుల్ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్‌గౌడ్, మాణిక్‌రావు, డి.సు«దీర్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. శంషాబాద్ నుంచి నోవాటెల్‌కు.. తర్వాత సభకు.. రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. -
తెలంగాణలో నేడు కాంగ్రెస్ జనజాతర.. తుక్కుగూడ నుంచి ఎన్నికల ప్రచార శంఖారావం.. హాజరు కానున్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ .. ఇంకా ఇతర అప్డేట్స్
-
దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని అన్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రిగా ఉండి సికింద్రాబాద్‌కు కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..‘సభకు 10 లక్షల మందిని తరలిస్తాం. ఏప్రిల్ ఎనిమిదో తేదీన నాంపల్లిలో ఫిరోజ్‌ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుంది. బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. భువనగిరి, నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తాం. సికింద్రాబాద్‌లో కూడా దానం నాగేందర్‌ను గెలిపిస్తాం. దానం గెలుపు బాధ్యత మాదే. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఈసారి గెలిచాం. బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన. మాజీ మంత్రి హరీష్‌రావు మాటలకు అర్ధం లేదు. కేసీఆర్ చేసిన పాపాలకు వర్షాలు కూడా పడటం లేదు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నాడు. 40వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్‌ను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం. కేంద్రమంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ను పట్టించుకోలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడు. అది సాధ్యం కాదు. కాంగ్రెస్ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ఇక, దానం నాగేందర్ మాట్లాడుతూ..‘సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నేను గెలవడానికి అందరి సహకారం కావాలి. తుక్కుగూడ సభ విజయవంతం చేయడానికి సమావేశమయ్యాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
T Congress: ఆ లోపం స్పష్టంగా కనిపించింది
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో జరిగిన బహిరంగ సభ సఫలం అయింది. హైదరాబాలో సీడబ్ల్యూసీ సమావేశాలతో పాటు విజయభేరీ పేరుతో తెలంగాణ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. దీనిద్వారా ప్రజలలో ఒక బలమైన ముద్ర వేసుకోవాలన్న వారి ఆకాంక్ష అర్దం అవుతూనే ఉంది. తెలంగాణ సెంటిమెంట్ తో పాటు కొత్తగా పార్టీ చేసిన ఆరు వాగ్దానాలపైనే కాంగ్రెస్ ఎక్కువగా ఆధారపడుతున్నట్లుగా ఉంది. ఈ హామీల ద్వారా కర్నాటకలో మాదిరి హిట్ కొట్టాలన్నది వారి సంకల్పం. వీరి సభ సక్సెస్ అయినా.. బీఆర్ఎస్ మీద ప్రజలలో వారు అనుకున్న స్థాయిలో వ్యతిరేకత ఉందా? అన్నది సందేహమే. ప్రజలలో అంత నెగిటివ్ వాతావరణం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని భారీ హామీలను ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. కర్నాటక మోడల్ అని చెబుతున్నా, అక్కడ ఇచ్చిన విధంగానే తెలంగాణలో కూడా వాగ్దానాలు చేసి అధికారంలోకి రావాలన్నది వారి లక్ష్యం. తప్పు లేదు. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు ఒకరే సలహాదారుగా ఉన్నారు. ఆయనే ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా సలహాదారుగా పనిచేస్తున్నట్లు ఉన్నారు. సరిగ్గా దాదాపు ఇవే హామీలను ఏపీలో కూడా చంద్రబాబు ఇచ్చి ప్రచారం చేస్తుంటారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వంపై ఉన్న మాదిరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంటే ప్రజలు ఆటోమేటిక్‌గా కాంగ్రెస్ వైపు మొగ్గుతారు. బీజేపీ ఇటీవలికాలంలో తెలంగాణలో వెనుకబడిందన్న భావన ఉండడం ఒకరకంగా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశమైనా , మరో రకంగా అది కాంగ్రెస్‌ను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుంది. ✍️విపక్ష ఓట్ల చీలిక బీఆర్ఎస్కు మేలు చేయవచ్చు. అందుకే కాంగ్రెస్ అగ్రనేతలు, మల్లిఖార్జున ఖర్గే బీజెపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలను ఒక గాటన కట్టి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అని నిర్వచించారు. అందుకు కొన్ని ఆధారాలు కూడా ఆయన చూపించారు. రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్దులకు మద్దతు ఇవ్వడం, జీఎస్టీతో సహా వివిధ బిల్లులకు కేంద్రంలో బీజెపీకి సపోర్టు చేయడం వంటివాటిని ఆయన ఉటంకించారు. ఇందులో వాస్తవం ఉండొచ్చు!. కాని దానివల్ల బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా ఉండకపోవచ్చు. ఢిల్లీ రాజకీయాలు వేరు.. తెలంగాణ రాజకీయాలు వేరు అనే భావన ఉంటుంది. ప్రతిపక్షనేతలందరిపైన కేసులు ఉన్నాయని, కానీ కేసీఆర్ పైనే ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. ఇక.. కేసీఆర్‌పై రాహుల్ చేసిన ఆరోపణ ఒకటి మరీ విడ్డూరంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన అన్నారు. మొత్తం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా ఖర్చు చేసింది సుమారు 80 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల స్కామ్ అనడం ఎంతవరకు సమంజసం అవుతుంది?. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి గాని, కేసీఆర్ కుమార్తె కవితకు ఈడీ నోటీసుల గురించి గాని వీళ్లెవరూ ప్రస్తావించలేదు. కావాలని ఆ ఊసెత్తలేదా?లేక మర్చిపోయారా? అనేది తెలియదు. ✍️రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతూ.. 2004లో సోనియాగాంధీ హామీ ఇచ్చారని , ఆ ప్రకారం రాష్ట్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. అదే ప్రకారం ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తదుపరి తొలి క్యాబినెట్లోనే ఈ వాగ్దానాల అమలుకు నిర్ణయాలు తీసుకుంటారని కూడా ఆయన ప్రకటించారు. ఈ హామీలను ప్రకటిస్తున్నప్పుడు సభికులలో మంచి స్పందనే కనిపించింది. సభకు .వచ్చినవారిలో ఎక్కువ మంది శ్రద్దగా కూర్చోవడం, ఆయా సందర్భాలలో హర్షద్వానాలు చేయడం కనిపించింది. కాని నాయకులు ఉర్రూతలూగించే ఉపన్యాసాలు చేయలేకపోయారు. కాస్తో.. కూస్తో అలా హంగామా చేయగల రేవంత్ రెడ్డికి సభ లో పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం రాకపోవడం ఒక లోపంగా కనిపిస్తోంది. రేవంత్ మాట్లాడుతున్న తరుణంలో.. ఖర్గే, రాహుల్ తదితరులు లేచి నిలబడి వెళ్లిపోవడానికి ఉద్యుక్తులవుతుండడంతో ఆయన తన స్పీచ్ ను ఆపివేయవలసి వచ్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రసంగం ఎవరికి పెద్దగా అర్దం కాలేదు. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపు మాట్లాడి కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. రేవంత్, కోమటిరెడ్డిలకే ప్రజలలో అధిక స్పందన కనిపించింది. మరో ఎమ్.పి ఉత్తంకుమార్ రెడ్డికి రాహుల్ ,సోనియాగాందీల ప్రసంగాల అనువాద బాధ్యత అప్పగించారు. ఖర్గే ప్రసంగాన్ని మాజీ ఎంపీ మధుయాష్కి తెలుగులో సంక్షీప్తకరించారు. మల్లు భట్టి కొద్దిసేపు మాట్లాడి ఖర్గేకి స్వాగతం చెప్పారు. ఆయనతో రైతుభరోసా హామీని విడుదల చేయిస్తున్నట్లు ప్రకటించారు. సోనియాగాంధీ కేవలం ఆరు వాగ్దానాలను విడుదల చేసి.. బహుశా ఆరోగ్య కారణాల రీత్యానేమో అతికొద్ది సేపు మాత్రమే ప్రసంగించారు. రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తన కల అని అన్నారు. ఆ సందర్భంలో ఈ వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ హామీల అమలు గ్యారెంటీ కార్డులను ఖర్గే, రాహుల్, రేవంత్ తదితరులు కలిసి విడుదల చేశారు. ఇక వంద రోజులే కేసీఆర్ ప్రభుత్వానికి మిగిలిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. రాహుల్ చెప్పారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణను వాడుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. అయితే కేసీఆర్ ది కుటుంబ పార్టీ అని అనకుండా జాగ్రత్తపడ్డారు. ఎందుకంటే కాంగ్రెస్ పైనా అదే ముద్ర ఉంది కనుక. ✍️తెలంగాణ ఇచ్చినా రాష్ట్రంలో అధికారం రాలేదన్న బాధ వారిలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ విషయాన్ని నేరుగా గుర్తు చేయకపోయినా, తెలంగాణ హామీని నిలబెట్టుకున్న మాదిరే.. తాజా వాగ్దానాలను అమలు చేస్తామని చెప్పడానికే ఆ పాయింట్‌ను వాడుకున్నారు. కాగా కొత్తగా ప్రకటించిన మహాలక్ష్మి, గృహ లక్ష్మి, గృహ జ్యోతి తదితర హామీలకు ఎంత వ్యయం అయ్యేది, అందుకు అవసరమయ్యే వనరులను ఎక్కడ నుంచి తెచ్చేది మాత్రం చెప్పలేదు. కాకపోతే కర్నాటకలో అమలు చేస్తున్నామని చెప్పుకున్నారు. కాంగ్రెస్ సభ పూర్తి కాగానే.. మంత్రి హరీష్ రావు అవన్నీ బూటకపు హామీలని ఎద్దేవ చేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఈ స్తాయిలో సభను ఏర్పాటు చేయడం విశేషమే.కాని దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారా అంటే సంశయమే అని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
TS Election 2023: ప్రతి ఇంటిలోనా సోనియా బొమ్మ! : గాయకుడు నైనాల రమేష్
సాక్షి, రంగారెడ్డి: తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభ విజయవంతమైంది. సభాస్థలితో పాటు ఓఆర్ఆర్, సర్వీసు రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు సీడబ్ల్యూసీ సభ్యులతో కూడిన బృందం సభాస్థలికి చేరుకుంది. ఆ తర్వాత కొద్ది సేపటికే సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేరుకున్నారు. ఈ సమయంలో వేదికపై ఆసీనులైన పార్టీ ముఖ్యులతో పాటు వివిధ గ్యాలరీల్లో కూర్చొన్న కార్యకర్తలు, నాయకులు సీట్లో నుంచి పైకి లేచి నిటారుగా నిలబడి ‘జై సోనియా’ అంటూ అభివాదం చేశారు. నిజానికి సభకు ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని అంతా ఆశించారు. ఆమె గైర్హాజరవడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని సోనియాగాంధీ ప్రకటించగా, రైతు భరోసా పథకాన్ని జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అభయహస్తం, చేయూత వంటి పథకాలను రాహుల్ గాంధీ ప్రకటించారు. ఒక్కోనేత ఒక్కో పథకాన్ని ప్రకటించడం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సభా వేదికపై సోనియా 20 నిమిషాలే ఉన్నారు. ఐదు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి, తెలంగాణకు ఏం చేసిందో వివరించారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే వర్గాలకు.. ఏంఏం చేయబోతోందో స్పష్టం చేశారు. చివరగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ముఖ్య నేతల ప్రసంగాలు కేడర్‌లో జోష్‌ను నింపాయి. జన సమీకరణలో పోటీపడిన నేతలు.. జన సమీకరణ విషయంలో నేతలు పోటీపడ్డారు. సభ నిర్వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేశారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి దేప భాస్కర్‌రెడ్డి భారీగా జనాన్ని తరలించారు. చేవెళ్ల నేతలు సైతం ఈ విషయంలో పోటీ పడ్డారు. మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. సభ కు హాజరైన వారిలో ఎక్కువగా యువతే కన్పించారు. వీరిలో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. ముఖ్య నేతల దృష్టిలో పడేందుకు జిల్లా నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీలు యత్నించారు. ఇందు కోసం తుక్కుగూడ–శ్రీశైలం జాతీయ రహదారి నుంచి సభాస్థలికి చేరుకునే మార్గంలో భారీ స్వాగత ద్వారాలు, ఫెక్సీలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సభకు భారీగా జనం తరలిరావడం, వెనుక ఉన్న బారీకేడ్లలో కుర్చీలు ఖాళీ లేక మీడియా గ్యాలరీలోకి చొచ్చుకు రావడం కొంత గందరగోళానికి దారితీసింది. వీరిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో మీడియా ప్రతినిధులు సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ‘ప్రతి ఇంటిలోనా సోనియా బొమ్మ ఉండాలి.. అదే ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగరాలి’ అంటూ ప్రముఖ గాయకుడు నైనాల రమేష్ కళాకారుల బృందం ప్రదర్శించిన కళారూపాలు సభికులను విశేషంగా అలరించాయి. ఆగదు..ఆగదు.. ఈ ఆకలిపోరు ఆగదు.., మూడు రంగుల జెండాపెట్టి..సింగమోలే కదిలినాడు మన రాహుల్‌గాంధీ.. నిగ్గదీసి అడిగే మొనగాడు పాటకు సభికులంతా ఒక్కసారిగా కుర్చీల్లోనుంచి పైకి లేచి డ్యాన్స్ చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు హన్మంత రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఖర్గే ప్రసంగాన్ని భట్టి తెలుగులోకి అనువదించగా, సోనియా, రాహుల్ గాంధీ ప్రసంగాలను ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనువదించారు. సభకు హాజరైన సామాన్య కార్యకర్తలు సైతం కళాకారులతో కలిసి నృత్యం చేయడం వారిలోమరింత జోష్ నింపినట్లైంది. ఆ నాలుగు గంటలు ట్రా‘ఫికర్’.. తుక్కుగూడకు వచ్చి వెళ్లే ప్రధాన మార్గాలు సహా ఓఆర్ఆర్పై కూడా భారీగా ట్రాఫిక్ జాం అయింది. సభకు వచ్చిన కార్యకర్తలు, నాయకుల వాహనాలతో పాటు సాధారణ ప్రయాణికుల వాహనాలు కూడా ఈ ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు ఇదే పరిస్థితి. ఇటు ఆదిబట్ల మొదలు.. అటు శంషాబాద్ వరకు.. పహడీషరీఫ్ మొదలు.. మహేశ్వరం కమాన్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వచ్చిన వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయకపోవడం, వచ్చిపోయే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించకపోవడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సుమారు నాలుగు గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లోనే గడపాల్సి వచ్చింది. -
తెలంగాణలో సోనియా గాంధీ ప్రకటించే 6 గ్యారెంటీ స్కీమ్ లు ఇవే...
-
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలు ఇవే..
Updates.. 19: 20PM తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ సభ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలు ఇవే.. 1. మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్ పిలిండర్, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 2. రైతుభరోసా కింద రూ. 15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ 3. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 4. గృహ నిర్మాణానికి రూ. 5లక్షల సాయం 5. విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ 6. వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్, రూ. 10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా 18.02 PM ► తుక్కుగూడలో జరుగుతున్న విజయ భేరీ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సభాప్రాంగణానికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే చేరుకున్నారు. ►తాజ్‌కృష్ణలో రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► సోనియా గాంధీ ప్రకటించబోయే 6 గ్యారెంటీ స్కీంలు ఇవే.. 1. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్. 2. ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ. 3. రెండు లక్షల ప్రభుత్వ ఉధ్యోగాల భర్తీ. 4. దలిత, గిరిజనులకు 12 లక్షల ఆర్థిక సహాయం. 5. ఇందిరమ్మ ఇళ్ళకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం. 6. మహిళా సాధికారతకు ప్రత్యేక నిధి. ► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణను పాటించాలి. సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై రివ్యూ. 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల నుంచి నివేదిక. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏఐసీసీ నేతల ప్రచారంపై త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం. ► హోటల్ తాజ్‌కృష్ణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకం. బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీకి పరోక్ష మద్దతుదారులు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాం. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇవాళ జరిగే సమావేశంలో చర్చిస్తాం. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటిస్తారు. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు సభలోనే శంఖుస్థాపన చేస్తారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నాం. సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ► డీకే శివకుమార్ మాట్లాడుతూ.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశం ఎజెండా. విద్వేష రాజకీయాలను దేశం నుంచి పాలద్రోలడమే కాంగ్రెస్ లక్ష్యం. సరైన ఎజెండా చెప్పకుండా పార్లమెంట్ ప్రత్యేక సోషన్ పెడుతున్నారు. ► కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక. ► నగరంలోని తాజ్‌కృష్ణ వేదికగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండో రోజు సమావేశాలు ఆదివారం ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ► ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొననున్నారు. ► తొలిరోజు సమావేశంలో 14 జాతీయ అంశాలపై తీర్మానం. ► ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ప్యాబ్‌సిటీ సమీపంలోని వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ► కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా యువనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీడబ్ల్యూసీ ముఖ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు. రెయిన్ ఫ్రూప్ టెంట్లు.. భారీ వర్షానికి సైతం నేతలు తడవకుండా ఉండేందుకు రెయిన్ ఫ్రూప్ టెంట్లను వేశారు. నేతల ప్రసంగాలు స్పష్టంగా విన్పించేందుకు సభాస్థలికి నాలుగు వైపులా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. ►సభా ప్రాంగణం చుట్టూ పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ►స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటులో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు. ►సీడబ్ల్యూసీ ముఖ్య నేతల కోసం ప్రధాన వేదికను కేటాయించారు. పీసీసీలు, మాజీ మంత్రులు, ఎంపీల కోసం ఒకటి.. డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు, కళాకారుల కోసం మరో స్టేజీని కేటాయించారు. ►ఈ మూడు వేదికలపై సుమారు 250 మంది ఆసీనులు కానున్నారు. సభకు వచ్చే ముఖ్య నేతల వాహనాలను ప్రధాన వేదిక వెనుక భాగంలోనే పార్కింగ్ చేయించనున్నారు. భారీ బందోబస్తు.. తుక్కుగూడకు వచ్చి వెళ్లే నాలుగు ప్రధాన రహదారులపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 61 మంది మంది ఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ► ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాజ్‌కృష్ణ హోటల్ నుంచి బయలుదేరే ముఖ్య నేతల వాహనాలు శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా తుక్కుగూడకు చేరుకుంటాయి. అటు నుంచి ర్యాలీగా ప్రధాన వేదిక వెనుకభాగంలోని ప్యాబ్‌సిటీ నుంచి సభా ప్రాంగణానికి అనుమతించనున్నారు. మిగిలిన వాహనాలను ప్రధాన రహదారి నుంచి అనుమతిస్తారు. -
రాష్ట్రం ఇచ్చాం..ఒక్క ఛాన్స్ ఇవ్వలేరా ?
-
తుక్కుగూడ పిక్కటిల్లేలా..
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ప్యాబ్‌సిటీ సమీపంలోని వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా యువనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీడబ్ల్యూసీ ముఖ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానుండటంతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గాల వారీగా భారీగా జన సమీకరణ చేయాలని నేతలకు టార్గెట్లు ఇచ్చింది. ఇందు కోసం 300 బస్సులను కూడా సిద్ధం చేసింది. రెయిన్ ఫ్రూప్ టెంట్లు.. భారీ వర్షానికి సైతం నేతలు తడవకుండా ఉండేందుకు రెయిన్ ఫ్రూప్ టెంట్లను వేశారు. నేతల ప్రసంగాలు స్పష్టంగా విన్పించేందుకు సభాస్థలికి నాలుగు వైపులా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటులో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు. సీడబ్ల్యూసీ ముఖ్య నేతల కోసం ప్రధాన వేదికను కేటాయించారు. పీసీసీలు, మాజీ మంత్రులు, ఎంపీల కోసం ఒకటి.. డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు, కళాకారుల కోసం మరో స్టేజీని కేటాయించారు. ఈ మూడు వేదికలపై సుమారు 250 మంది ఆసీనులు కానున్నారు. సభకు వచ్చే ముఖ్య నేతల వాహనాలను ప్రధాన వేదిక వెనుక భాగంలోనే పార్కింగ్ చేయించనున్నారు. ఇతర నేతలు, కార్యకర్తల వాహనాల కోసం సర్వీసు రోడ్డుతో పాటు ఆ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలను కేటాయించారు. భారీ బందోబస్తు.. తుక్కుగూడకు వచ్చి వెళ్లే నాలుగు ప్రధాన రహదారులపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 61 మంది మంది ఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాజ్‌కృష్ణ హోటల్ నుంచి బయలుదేరే ముఖ్య నేతల వాహనాలు శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా తుక్కుగూడకు చేరుకుంటాయి. అటు నుంచి ర్యాలీగా ప్రధాన వేదిక వెనుకభాగంలోని ప్యాబ్‌సిటీ నుంచి సభా ప్రాంగణానికి అనుమతించనున్నారు. మిగిలిన వాహనాలను ప్రధాన రహదారి నుంచి అనుమతిస్తారు. -
‘రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా మారిందని ఏఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు ధ్వజమెత్తారు. కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలను ఇరిటేట్ చేస్తున్నారని విమర్శించారు. ఇండియా మొత్తం ఇండియా కూటమివైపు చేస్తోందని తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్నాయకులను కలిసిందని, నిర్ణయం త్వరలో తెలుస్తుందని తెలిపారు. ఈమేరకు 17న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తుక్కుగూడలో విజయభేరి సభాస్థలిని కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఇంఛార్జి మణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశీలించారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ విమర్శించారు. రిజర్వేషన్ బిల్లు తెచ్చింది సోనియా గాంధేనని తెలిపారు. రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామని చెప్పారు. చదవండి: మంత్రి కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారంటే..? కాంగ్రెస్ అగ్రనేతంతా హైదరాబాద్‌కే.. సీడబ్ల్యూసీ, విజయభేరి సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ రానున్నారు. వీరితోపాటు ప్రియాంక గాంధీ, నాలుగు రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, 29 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ముఖ్యనేతలు తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ఆగ్ర నేతలంతా ఈ హోటల్లోనే బస చేస్తుండడంతో కేంద్ర బలగాలు హోటల్ మొత్తాన్ని, పరిసరాలను నియంత్రణలోకి తీసుకున్నాయి. -
తుక్కుగుడ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం..
సాక్షి, రంగారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగుడ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2200 డబుల్ బెడ్రూం ఇళ్లల్లోనూ స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇవ్వడంతో ఆందోళనకు దిగారు స్థానిక ప్రజలు. కాగా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మంకాల, తుక్కుగూడ, రావిరాల్, సర్దార్ నగర్ , ఇమామ్ గూడ గ్రామ ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇళ్లు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తమకు కాకుండా.. పాతబస్తీ మలక్‌పేట్, చార్మినార్, చాంద్రాయణ్‌గుట్ట , యాకత్‌పురకు చెందిన వారికి ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులందరూ కలిసికట్టుగా జేఏసీగా ఏర్పడి మున్సిపాలిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. జేఏసీ పిలుపు మేరకు ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించి మున్సిపాలిటీలోని అన్ని గ్రామాల ప్రజలు భారీ నిరసన ర్యాలీ ప్రారంభించారు... -
Sep 17: అటు సోనియా.. ఇటు అమిత్ షా?
సాక్షి, హైదరాబాద్: ఈసారి సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాజకీయాలు జాతీయస్థాయిలో చర్చకు కేంద్ర బిందువు కానుంది. కాంగ్రెస్-బీజేపీలు పోటాపోటీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ తుక్కుగూడలో.. బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున జనంతో సభలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాయి. తుక్కుగూడ సభకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరవుతారని పార్టీ ప్రకటించగా.. పరేడ్‌గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ వేడుకలకు కిందటి ఏడాదిలాగే అమిత్ షా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పది లక్షల మంది ఈ సభకు హాజరు అవుతారని కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ప్రకటించింది. తుక్కుగూడను అందుకు వేదికగా ఎంచుకుంది. ఆ తేదీ, అంతకు ముందు రోజు నగరంలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగబోతున్నాయి. సోనియా గాంధీ సైతం తుక్కుగూడ సభకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది తెలంగాణ పీసీసీ. అయితే.. కాంగ్రెస్ తుక్కుగూడ సభకు పోటీగా బీజేపీ సైతం నగరంలో సభను ప్లాన్ చేసింది. పరేడ్ గ్రౌండ్‌లోనే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను కిందటి ఏడాది తరహాలోనే కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించాలని.. ఈ క్రమంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. వీలైనంత ఎక్కువ జనసమీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేరోజు.. అదీ తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ దినం రాగానే హైదరాబాద్ నగరంలో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలకు పోటీ పడుతుండడం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇరు పార్టీలు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుంటాయనేది ఊహించిందే అయినప్పటికీ.. పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఇదీ చదవండి: ఎటూ తేలలేదు.. 100 సీట్లలో ఒక్కో పేరే! -
తండ్రి జ్ఞాపకార్థం తుక్కుగూడలో ఫ్రీ అంబులెన్స్ సేవలు
సాక్షి, రంగారెడ్డి: ముప్పిడి నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రజలకు లైఫ్ సపోర్ట్ కలిగిన ప్రత్యేక అంబులెన్స్‌ను అందించారు ట్రస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్. తుక్కుగూడ ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడేందుకు ఈ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి స్వర్గీయ ముప్పిడి నారాయణ గౌడ్.. తుక్కుగూడ బొడ్రాయి, మంకాలమ్మ దేవాలయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మార్కెట్ యార్డ్ సహా గ్రామ అభివృద్ధికి 35 ఏళ్లపాటు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ముప్పిడి నారాయణ గౌడ్ ఆశయాలకు అనుగుణంగా గ్రామ ప్రజలకు ఎమర్జెన్సీలో ఉపయోగపడే విధంగా ఉచిత అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు శ్రీనివాస్ గౌడ్. 24 గంటల పాటు ఈ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏ ఆపద వచ్చినా 7416718585 నెంబర్‌కి కాల్ చేసి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ముదిరాజ్, కౌన్సిలర్లు హేమలత రాజు గౌడ్, రాజమోణి రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ రఘురామరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిరణ్మయి శ్రీధర్ గౌడ్, పూజారులు ప్రవీణ్ శర్మ, ప్రదీప్ శర్మ, ప్రభాకర్ గౌడ్, శంకరయ్య, వెంకటస్వామి గౌడ్, బాలరాజు గౌడ్, హరినాథ్, రమేష్ శ్రీధర్ మాజీ సర్పంచ్ నరసింహ ముదిరాజ్, మల్లేష్ గౌడ్ సహా ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత -
Sakshi Cartoon: ‘బుల్డోజర్’కా డబుల్ ఇంజన్?
‘బుల్డోజర్’కా డబుల్ ఇంజన్? -
కేసీఆర్ కొడుకు, బిడ్డకే అధికారం ఇచ్చుకున్నారు: అమిత్ షా
సాక్షి, రంగారెడ్డి: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బండి సంజయ్ ప్రసంగం చూశాక.. తాను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అనిపించిందని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బండి సంజయ్ ఒక్కరు చాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ప్రజా సంగ్రామ యాత్ర.. ఎవరినో ముఖ్యమంత్రి గద్దె దించడానికో.. ఎవరినో గద్దె దించడానికో కాదు.. బడుగు, బలహీన వర్గాల సహా అందరి సంక్షేమం కోసం చేపట్టిన యాత్ర అని అమిత్ షా స్పష్టం చేశారు. అన్నింటికి మించి రజాకార్ల ప్రతినిధులతో చేసిన వారికి వ్యతిరేకంగానే ఈ యాత్ర.. అవినీతి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకిపారేసేందుకు ఈ యాత్ర అని చాటి చెప్పారు. పటేల్ కారణంగానే ఈరోజు ఈరాష్ట్రం భారత్‌లో భాగమైందని, తెలంగాణ కోసం పోరాడిన ప్రతీ ఒక్క మహనీయుడికి పేరు పేరునా శ్రద్ధాంజలి ఘటించారు అమిత్ షా. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఏ హామీని టీఆర్ఎస్ పూర్తి చేయలేకపోయిందని, బీజేపీ అధికారంలోకి వస్తే అది పూర్తి అవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. దళితులతో పాటు అన్ని వర్గాల వాళ్లను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లులు, రైతులకు రుణమాఫీ అమలు కావడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు యువత సిద్ధంగా ఉందని, హైదరాబాద్ నిజాంని మార్చాల్సిన అవసరం ఉందా? లేదా? అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మరోసారి గట్టిగా ప్రశ్నించారు. సర్పంచ్‌కు కూడా అధికారం ఇవ్వకుండా.. కొడుకు, బిడ్డకు అధికారం కట్టబెట్టారని కేసీఆర్‌పై మండిపడ్డారు. టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది. ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవాన్ని పక్కనపెట్టారు. మజ్లిస్‌కు మీరు భయపడతారేమో.. మేం భయపడం అని టీఆర్ఎస్, కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ అమిత్ షా వ్యాఖ్యానించారు. మన ఊరు-మన బడి నిధులు కేంద్రానివే. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చిత్రీకరించారు. ఆయుష్మాన్‌భవ లాంటి వాటిని తెలంగాణలో నడిపించడం లేదన్నారు అమిత్ షా. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ అది చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని శత్రువుగా భావించకండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అమిత్ షా. అధికారమిస్తే ప్రతీ గింజను కొంటామని, సంక్షేమ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. త్వరలోనే నిధులు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయని అమిత్ షా పేర్కొన్నారు. అవకాశం ఇస్తే.. తెలంగాణలో డబుల్ ఇంజన్‌తో అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇలాంటి ప్రభుత్వం తెలంగాణకు అవసరమా? అని నిలదీశారు అమిత్ షా. సచివాలయానికి వెళ్లలేని కేసీఆర్‌ను ప్రజలే గద్దెదించుతారని షా పేర్కొన్నారు. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు టోకరా..
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో నకిలీ బంగారంతో ఓ వ్యక్తి బ్యాంకునే మోసం చేసే ప్రయత్నం చేశారు. మహేశ్వరం మండలం ఆంధ్ర బ్యాంకులో నకిలీ గోల్డ్‌తో రుణాలు పొందాడు. దీనికి బ్యాంక్ కొలతలు చూసే సిబ్బంది అతడికి సహాయం చేశారు. నకిలీ గోల్డ్ పెట్టుకొని బ్యాంకుకు టోకరా చేసే ప్రయత్నం చేశాడు. అతడి పరిచయస్తుల పేర్ల మీద గోల్డ్ తాకట్టు పెట్టి బ్యాంకు లోన్ తీసుకున్నాడు. రెండున్నర కోట్ల రూపాయల వరకు బ్యాంకు నుంచి రుణాలు పొందాడు. కాగా గత నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి, అతనికి సహకరించిన బ్యాంకు సిబ్బంది మొత్తం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటనపై విచారించేందుకు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ చేరుకున్నారు. నకిలీ గోల్డ్ మోసం నేపథ్యంలో పలువురు బ్యాంకు సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. -
తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్‌గా కాంటేకర్ మధుమోహన్
-
చక్రం తిప్పిన సబితమ్మ : అనూహ్యంగా యువనేతకు పట్టం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ రేపిన తుక్కుగూడ మున్సిపాలిటీని అనూహ్య పరిణామాల నడుమ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మంత్రి సబితారెడ్డి సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలో కీలకమైన తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. ఇక్కడ ఉన్న 15 వార్డుల్లో బీజేపీ 9, టీఆర్ఎస్ 5 గెలుచుకోగా, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీకి మెజారిటీ వచ్చినప్పటికీ తగినంతమంది ఎక్స్ అఫీషియో ఓట్ల మద్దతు లేకపోవడంతో రెండో వార్డులో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి కాంటేకర్ మధుమోహన్ కీలకంగా మారారు. ఈ క్రమంలో తగినంత ఎక్స్ అఫీషియో ఓట్లను కూడగట్టడంతోపాటు యువనేత మధును పార్టీలోకి సబితమ్మ ఆహ్వానించారు. బీసీ వర్గానికి చెందిన మధుకు తుక్కుగూడ మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్మన్ పదవిని అప్పగించారు. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తనకు కీలకమైన తుక్కుగూడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిని వరించిన చైర్మన్ పీఠం స్థానిక యువ నాయకుడు మధు మున్సిపాలిటీలోని రెండోవార్డు నుంచి కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మెజారిటీ వార్డుల్లో గెలుపొందిన బీజేపీ చైర్మన్‌గా పోటీకి తీవ్ర కసరత్తు చేసింది. అయితే, ఎక్స్అఫీషియో సభ్యులతో బీజేపీ ప్రణాళిక తారుమారైంది. టీఆర్ఎస్ లో చేరిన స్వతంత్ర అభ్యర్థి మధు కాంటేకర్ ను చైర్మన్ అభ్యర్థిగా మంత్రి సబితారెడ్డి నిర్ణయించి పావులు కదిపారు. చివరి నిమిషంలో అనూహ్యంగా ఎక్స్అఫీషియో సభ్యుల రంగ ప్రవేశంతో మొత్తం పరిస్థితి తారుమారైంది. టీఆర్ఎస్ నాయకులు చైర్మన్‌గా మధుమోహన్, వైస్ చైర్మన్‌గా భవాని వెంకట్ రెడ్డి విజయం సాధించారు. -
పింఛన్ వస్తుందా బాలయ్య తాత..
తుక్కుగూడ : తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా శ్రీశైలం జాతీయ రహదారిపై చిరు వ్యాపారం చేసుకుంటున్న కర్కాలపాడు గ్రామానికి చెందిన బాలయ్య కనిపించాడు. దీంతో మంత్రి సబితారెడ్డి హలో.. తాత బాగున్నావా అని పలకరించింది. వ్యాపారం ఎలా ఉంది ? కేసీఆర్ సార్ ఇచ్చే పింఛన్ వస్తుందా? అడిగి తెలుసుకున్నారు. దీనితో బాలయ్య అమ్మ నాకు పింఛన్ వస్తుందని మంత్రికి తెలిపాడు. -
ఈ అడ్డాల వద్ద జర భద్రం బిడ్డా..!
శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, కల్వర్టులు, బ్రిడ్జిలు, గోదాములు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. పోకిరీలు, మందుబాబులు, పేకాటరాయుళ్ళు, గంజాయి తీసుకునేవాళ్లకు ఇవి కేరాఫ్ అడ్రస్ అయ్యాయి. రాత్రి పొద్దుపోయేదాక కొందరు ఇక్కడే మకాం వేస్తుండటం గమనార్హం. దీంతో ఈ ప్రాంతాల గుండా వెళ్లేందుకు మహిళలు, యువతులు జంకుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఇలాంటి ‘అడ్డా’లపై సాక్షి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. వణుకు పుట్టిస్తున్న చటాన్‌పల్లి చటాన్‌పల్లి శివారులోని ఈ బ్రిడ్జి కిందే పాశవిక ఘటన చోటుచేసుకుంది బైపాస్ రోడ్డులోని సర్వీస్‌రోడ్డు పక్కన పెరిగిన ముళ్లచెట్లు షాద్‌నగర్‌టౌన్: మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చటాన్‌పల్లి శివారులో 44వ జాతీయ రహదారి కిందే పాశవిక దుర్ఘటన జరిగింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే రహదారి ఇది. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే బైపాస్ కూడలి, హోటళ్లు, దాబాలు ఉన్నాయి. ఈ రహదారి పై పోలీసుల పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. కాని కింద జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు, ఇక్కడ ప్రాంతాలు అత్యంత నిర్మానుష్యంగా ఉంటాయి. ఈ సర్వీసు రోడ్డు ఇరువైపులా మొత్తం ముళ్లు, కంప చెట్లు ఉంటాయి. కొత్తూరు దాటిన తర్వాత జాతీయ రహదారి పై షాద్‌నగర్ వరకు బైపాస్ గుండా సీసీ కెమెరాలు లేక పోవడంతో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి వేళల్లో స్తంభాలకు కనీసం వీధి లైట్లు కూడా లేక పోవడం పలు అనర్థాలకు కారణం అవుతోంది. నిరంతం పెట్రోలింగ్ వ్యవస్ధను కొనసాగించడం, సర్వీసు రోడ్లను అభివృద్ధి చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వార ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంది. ‘జస్టిస్ ఫర్ దిశ’ ఘటన షాద్‌నగర్ ప్రాంతానికి భాగస్వామ్యం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దారుణాలు అనేకం మహిళలను దారుణంగా హతమార్చి షాద్‌నగర్ ప్రాంతంలో పడేసి పోవడం, మహిళలపై అత్యాచారాలు చేసి హత్యలు చేయడం వంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అయితే గతంలో 2007లో షాద్‌నగర్ ప్రాంతంలో 11 మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వరుస హత్య సంఘటనలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పట్లో ఈ సంఘటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. వరుస హత్య కేసుల మిస్టరీని చేజించేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అయితే వివిధ ప్రాంతాల నుండి మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి అత్యాచారం హత్య చేసిన సంఘటనలు షాద్‌నగర్ ప్రాంతం ప్రజల మనస్సుల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. పోలీసులు ఇకనైనా మేలుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడికి వెళ్తే ఇక అంతే..? రావిర్యాల ఆర్సీఐ రోడ్డులో భయానక పరిస్థితులు తుక్కుగూడ: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శ్రీశైలం హైవే రోడ్డు నుంచి ఆర్సీఐ రోడ్డులో ప్రభుత్వ భూములతో పాటు, అటవీ భూములు విస్తరించాయి. ఈ భూములు జనావాసాలకు దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారాయి. నిత్యం హైదరాబాద్ నుంచి యువత ఈ రోడ్డు నుంచి రావిర్యాలలో ఉన్న వండర్లాకు పర్యటన కోసం వస్తూ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది ఇక్కడ ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అత్యచారం చేసి అంతమొందించారు. అప్పటి నుంచి ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రి వెళ్లడమంటే.. సాహసం చేయడమే. ఇటువంటి భయానక పరిస్థితులు ఉన్నా పోలీసులు పెద్దగా నిఘా పెట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వెంచర్లలో తిష్ట.. రాత్రి వేళ మందుబాబులకు నిలయం.. శంషాబాద్: పట్టణం పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూఅదుపూ లేదు. పట్టణం చుట్టూ విస్తరించిన వెంచర్లన్నీ దాదాపుగా మదుబాబులకు కేంద్రాలుగా మారుతున్నాయి. కొన్ని వెంచర్ల చుట్టూ ప్రహరీలు, అందులో ఓ గది నిర్మించి గాలికి వదిలేస్తున్నారు. ఇటువంటి వెంచర్లలో జులాయిలు జల్సాలు చేస్తున్నారు.సింప్లెక్స్ ఉన్న నిర్మానుష ప్రాంతంలో నిత్యం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. రాళ్లగూడ, తొండుపల్లి, ఊట్పల్లి, సిద్ధులగుట్ట మార్గం, కొత్వాల్‌గూడ, హుడా కాలనీల్లో మద్యం తాగిన సందర్భంలో అనేకసార్లు గొడవలు జరిగాయి. శంషాబాద్ పట్టణం నుంచి నర్కూడ వైపు వెళ్లే దారిలో వెంచర్లలో నిత్యం మందుబాబులు తిష్ట వేస్తుంటారు. గగన్‌పహాడ్ ట్రాన్స్జెండర్లకు అడ్డాగా మారింది. చీకటి పడితే ఇక్కడ చాలు పదుల సంఖ్యలో ట్రాన్స్జెండర్లు దారి వెంట రాకపోకలు జరిపేవారిని ఆకర్షిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రహదారి పక్కనే ఓ మూతబడిన మద్యం కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలో అన్ని కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. చీకటి పడితే భయమే.. తుర్కయంజాల్ మాసాబ్ చెరువు వద్ద గల రాతి నిర్మాణం తుర్కయంజాల్: నగర శివారు ప్రాంతమైన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో నాగార్జునసాగర్ రహదారిపై గల మాసాబ్ చెరువు కట్ట మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి పడిందంటే చాలు ఇక్కడ బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. రాత్రి 10 గంటల వరకు ఇదే పరిస్థితి. ముఖ్యంగా వాహనాలను రోడ్డు పక్కన నిలిపి మద్యం తాగడం ఇక్కడ నిత్యం జరిగే తంతు. ఈ చెరువు తూము వద్ద గల రాతి కట్టడంపై పొద్దుపోయేవరకు యువతీ యువకులు అక్కడే కాలక్షేపం చేస్తుంటారు. చెరువుకు రెండు పక్కలా నిర్మానుష ప్రాంతాలు ఉంటాయి. కట్టపై అంతంత మాత్రంగానే పోలీసుల గస్తీ ఉంటుంది. కొన్ని సార్లు అక్కడి నుంచి పెట్రోలింగ్ వాహనాలు వెళ్లినా.. మద్యం సేవిస్తున్న వారిని ఏమనక పోవడం గమనార్హం. నిత్యం మద్యం బాటిళ్లు, పేకాటకార్డులు దర్శనం భయంగొల్పుతున్న ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్ గోదాం ఇబ్రహీంపట్నం: పట్టణంలోని పాత బస్టాండ్ గోదాముల్లో, పాత పోలీస్ స్టేషన్, వినోభానగర్‌లో అసంపూర్తిగా నిర్మాణం నిలిచిన డిగ్రీ కళాశాల భవనాలు ఆసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి. పోకిరీలు, మందుబాబులు, పేకాటరాయుళ్ళు, గంజాయి తీసుకునేవాళ్లు ఇక్కడే తిష్ట వేస్తున్నారు. రాత్రిళ్లు పొద్దు పోయేవారు ఇక్కడే మకాం వేస్తున్నారు. డిగ్రీ కళాశాలలో మద్యం బాటిళ్ళు, పేకాట కార్డులు దర్శనమిస్తున్నాయి. పాత బస్టాండ్ గోదాంల వద్ద ఉదయం నుంచి బైక్‌లు అడ్డంగా పార్క్‌చేసి గంటల తరబడి అక్కడే టైంపాస్ చేస్తున్నారు. మందుబాబులు, పోకిరీలు రాత్రిళ్ళు బైఠాయిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కళాశాల భవనంలోని ఓ గదిలో ఖాళీ మద్యం సీసాలు -
గ్రానైట్ లారీ బోల్తా, ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. గ్రానైట్ రాళ్ల లోడ్‌తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిలై డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రానైట్ రాళ్లు మీదపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబందించి పూర్తివ వివరాలు తెలియాల్సి ఉంది. -
మృతదేహాన్ని పరిశీలిస్తూ మృత్యువాత
- తుక్కుగూడ ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు ఢీకొని యాచకుడి మృతి - మృతదేహాన్ని చూస్తున్న శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టిన మరో కారు మహేశ్వరం: తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై యాచకుడు నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద గోల్కొండ నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించగా, ఆ మృతదేహం రోడ్డుపై పడి ఉంది. అదే సమయంలో కీసరకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి శంషాబాద్ నుంచి స్విఫ్ట్ కారులో అటువైపుగా వస్తున్నాడు. రోడ్డుపై ఉన్న మృతదేహాన్ని చూసి ఆగి పరిశీలిస్తున్నాడు. ఇంతలోనే రోడ్డుపై నుంచి వేగంగా వచ్చిన మరోకారు శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టింది. దీంతో అతడు కూడా ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్‌రింగ్ రోడ్డుపై జరిగింది. శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టింది సైదాబాద్ బోజిరెడ్డి కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారకులను పోలీసులు విచారిస్తున్నారు. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని , మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.