Uttar Pradesh government
-
మహిళా జర్నలిస్ట్‌కు సుప్రీం బాసట
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ నియామకాల్లో రెండు కులాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని, ఇతర కులాల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శలు చేసినందుకు నాలుగు ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్న మహిళా పాత్రికేయురాలు మమతా త్రిపాఠికి సర్వోన్నత న్యాయస్థానం బాసటగా నిలిచింది. ఆమెపై కఠిన చర్యలకు ఉపక్రమించకుండా సుప్రీంకోర్టు ఆమెకు రక్షణగా నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ అంశంలో మమతపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ అంశంలో మీ వైఖరేంటో తెలపాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నోటీసులు జారీచేసింది. రాజకీయ దురుద్దేశంతో, పత్రికా స్వేచ్ఛను కాలరాసేందుకు కుట్రపన్ని మమతపై నేరసంబంధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారని ఈ సందర్భంగా మమత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధా్దర్థ్ దవే వాదించారు. మమత చేసిన వ్యాఖ్యలేంటి? కొన్ని వారాల క్రితం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో మమత పలు పోస్ట్‌లు పెట్టారు. వాటిల్లో ‘యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్(సింగ్)రాజ్’ అంటూ ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు వర్గాలకు మాత్రమే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. అంతకుముందు మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను విమర్శిస్తూ ఒక భారీ కథనాన్ని వెలువరిచారు. ‘‘ అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్ర మీడియా మొత్తం యాదవుల గురించే ప్రత్యేక కథనాలను వండివార్చింది. ఇక యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఠాకూర్ల రాజ్యం గురించిన చర్చ కొనసాగుతోంది’’ అని ఆయన పోస్ట్‌చేశారు. అఖిలేశ్‌యాదవ్ కాలంలో యాదవులకే ప్రభుత్వ నియామకాల్లో అధిక ప్రాధాన్యత దక్కిందని, అలాగే యోగి హయాంలో ఠాకూర్లకు కీలక పదవులు దక్కాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొలువుల్లో కొనసాగుతున్న సంబంధిత ఉన్నతాధికారుల జాబితాలో కొంత భాగాన్ని బహిర్గతంచేశారు. ‘కుల వివక్ష ఉందా? లేదంటే ఠాకూర్ కులస్తులకే కొలువులు కట్టబెడతారా?’ అని ప్రశ్నించారు. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ మమత త్రిపాఠి మరికొన్ని పోస్ట్‌లుచేశారు. దీంతో ప్రభుత్వం వీరిపై కేసులు మోపింది. ప్రభుత్వం నేరుగా కేసులు బనాయించకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పంకజ్ కుమార్ అనే వ్యక్తిమాటున ఫిర్యాదులు ఇప్పించి ఎఫ్ఐఆర్లు నమోదుచేయించిందని ఆరోపణలున్నాయి. ‘‘ ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభమైన పత్రికాస్వేచ్ఛను అణగదొక్కి నిజాలు, వాస్తవాభిప్రాయాలను అణచివేయలేరు. ఎఫ్ఐఆర్లు నమోదుచేసినంత మాత్రాన ప్రభుత్వ తప్పులు ఒప్పులు అయిపోవు. ప్రభుత్వాలపై పాత్రికేయులు చేసే సద్విమర్శలపై ఎఫ్ఐఆర్లు నమోదుచేయలేరని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)‘(భావప్రకటనాస్వేచ్చ) స్పష్టంచేస్తోంది’ అని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇటీవల మరో జర్నలిస్ట్‌కూ రక్షణ ఇదే ఉదంతంలో అక్టోబర్ 4న లక్నోకు చెందిన మరో జర్నలిస్ట్ అభిõÙక్ ఉపాధ్యాయ్ సైతం తనపై మోపిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన విషయాన్ని న్యాయవాది దవే గుర్తుచేశారు. మమతపై నమోదైన ఎఫ్ఐఆర్లలో ఒకదాంట్లో అభిõÙక్ సహనిందితునిగా ఉన్నారని, ఈనెలలో ఆయనకు ఇచి్చనట్లే కఠిన చర్యల నుంచి రక్షణను మమతకు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ‘ఎక్స్’లో పోస్ట్‌లు పెట్టారన్న ఒకే ఒక్క కారణంతో పాత్రికేయులను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన వాదించారు. దీంతో ‘‘ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారని పాత్రికేయులపై కేసులు మోపడం తగదు’ అని ఆనాడు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాత్రికేయుల హక్కులను రాజ్యాంగం రక్షిస్తోంది: సుప్రీం ఇటీవల మరో జర్నలిస్ట్ అభిషేక్‌కు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచి్చన సందర్బంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిందే. పాత్రికేయుల హక్కులకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 19(1) (ఏ) కింద రక్షణ ఉంది. పాత్రికేయుల రచనలు ప్రభుత్వానికి విమర్శలుగా అనిపించినంత మాత్రాన వారిపై ప్రభుత్వం నేర సంబంధకేసులు మోపడం తగదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు 4 వారాలు వాయిదా వేసింది. -
ప్రమాదకర ప్రతిపాదన
విజ్ఞత మరిచినచోట విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేమీ లేదు. కావడ్ యాత్ర సందర్భంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మొన్న జూలైలో ఇచ్చిన తీర్పు అర్థం కాకనో లేక దాన్ని ధిక్కరించే ఉద్దేశమో... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఆహారంలో లేదా పానీయాల్లో ఉమ్మివేయటం లేదా మానవ వ్యర్థాలతో దాన్ని కలుషితపరచటం పదేళ్ల శిక్షకు అర్హమయ్యే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించటం, విక్రయదారుల పూర్తి వివరాలు అందరికీ కనబడేలా చేయటం ఈ ఆర్డినెన్సుల ఉద్దేశం. ఇప్పుడున్న చట్టం ప్రకారం కల్తీ కారణంగా మరణం సంభవిస్తే బాధ్యులైనవారికి మూడేళ్ల కఠిన శిక్ష విధించవచ్చు. తినే ఆహారపదార్థం రుచిగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరు కుంటారు. అలాంటి ఆహారం దొరికేచోటకే వెళ్తారు. హోటళ్లు మొదలుకొని సైకిళ్లపై తిరుగుతూ అమ్ముకునే విక్రయదారుల వరకూ అందరూ కమ్మనైన ఆహారపదార్థాలు వడ్డించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరైనా లాభార్జనకు కక్కుర్తిపడి నాసిరకం పదార్థాలను అంటగడితే అలాంటివారి పనిబట్టడానికి రకరకాల చట్టాలున్నాయి. ఆహారకల్తీని అరికట్ట డానికీ, హానికరమైన, కాలంచెల్లిన పదార్థాల విక్రయాన్ని నిరోధించటానికీ హోటళ్లపై, ఇతర దుకాణాలపై విజిలెన్సు విభాగాలు దాడులు నిర్వహిస్తుంటాయి. కేసులు పెడతాయి. అయితే ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగటం లేదని, ప్రభుత్వాలు మొక్కుబడిగా ఈ పనిచేస్తుంటాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆహారం తిని అస్వస్థతకు గురయి పదుల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలైనప్పుడు ఆదరాబాదరాగా చర్యలు తీసుకోవటం కూడా కనబడుతుంటుంది. హఠాత్తుగా యూపీ సర్కారు ఈ చర్య తీసుకోవటం వెనక ఇలాంటి ఘటన ప్రభావం ఏమైనా ఉందా? పోనీ ఈ మాదిరి ఉదంతాల కారణంగా జనం తరచూ అస్వస్థులవుతున్న లేదా మరణిస్తున్న ఉదంతాలేమైనా గమనించారా? అసలు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకొచ్చాక ఎన్ని హోటళ్లపై, తినుబండారాల విక్రయ సంస్థలపై దాడులు నిర్వహించారు? అక్రమాలకు పాల్పడ్డారని తేలిన ఎంతమందిని శిక్షించారు? ఈ క్రమంలో ప్రస్తుత చట్టాలు నిరుపయోగంగా ఉన్నాయని భావిస్తే తగిన డేటాతో ఆ వివరాలు ప్రజల ముందు ఉంచొచ్చు. అప్పుడు ఒక సమగ్రమైన చట్టం అవసరమేనని అందరూ భావిస్తారు. కానీ యూపీలో జరుగుతున్నది అది కాదు. ఫలానా వర్గంవారు విక్రయించే పండ్లు లేదా ఇతర ఆహారపదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయని, వాటిని కలుషితం చేసి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. దుశ్చర్యలకు పాల్పడేవారికి మతం, కులం ఉండవు. ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను వీడియో తీసి ఫలానా మతం వారంతా ఇలాగే చేస్తున్నారని వదంతులు వ్యాప్తిచేయటం విద్వేషాలు రెచ్చగొట్టడానికే తోడ్పడతాయి. ఇదే యూపీలోని ఘాజియాబాద్‌లో ఒక వ్యాపారి ఇంట్లో ఎనిమి దేళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న రీనా కుమార్ అనే యువతి రోటీల్లో మూత్రాన్ని కలుపుతోందని ఆరోపిస్తూ పోలీసులు బుధవారం ఆరెస్టు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ మధ్య తెలంగాణలో అధికారులు వరస దాడులు నిర్వహించినప్పుడు అనేక హోటళ్లు, తినుబండారాల దుకాణాలు పాచిపోయిన పదార్థాలను అమ్ముతున్నాయని తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో అన్ని మతాలకూ చెందినవారూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరిగే కావడ్ యాత్ర సమయంలో ఆ మార్గంలోని దుకాణాల్లో విక్రయదారులు తమ పేర్లు, ఇతర వివరాలు కనబడే బోర్డులు ప్రదర్శించాలని పోలీసులు మొన్న జూలైలో నోటీసులిచ్చారు. కావడ్ యాత్రికులు ‘స్వచ్ఛమైన శాకాహారులు’ గనుక అపశ్రుతులు చోటుచేసుకోకుండా ఈ పని చేశామని సంజాయిషీ ఇచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దుకాణంలో నచ్చిన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం దొరుకుతున్నదో లేదో వినియోగదారులు చూస్తారు తప్ప, వాటి విక్రయదారు ఎవరన్నది పట్టించుకోరు. అలా పట్టించుకోవాలని యూపీ ప్రభుత్వం తహతహలాడుతున్నదని తాజా నిర్వాకం గమనిస్తే అర్థమవుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పరిరక్షించటమే ఆర్డినెన్సుల ఉద్దేశమన్న ప్రభుత్వ వాదన నమ్మదగ్గదిగా లేదు. ఆ పని విక్రయదారులది! వారిలో అక్రమార్కులుంటే చర్య తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. చెదురుమదురుగా జరిగిన ఉదంతాలను భూతద్దంలో చూపి జనాన్ని కలవరపెట్టడం సబబు కాదు.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనకున్న స్ఫూర్తి అర్థం చేసుకుంటే యూపీ ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్సుల ఆలోచన చేసేది కాదు. యూపీలో గోసంరక్షణ, లవ్ జీహాద్ తదితర ఆరోపణలతో గుంపు దాడులు, గృహదహనాలు, హత్యోదంతాల వంటివి జరిగాయి. నిందితుల ఇళ్లూ, దుకాణాలూ బుల్డోజర్లతో నేలమట్టం చేయటం కూడా రివాజుగా మారింది. ఎన్కౌంటర్లు సరేసరి. ఆర్డినెన్సుల ప్రతిపాదన ఆ క్రమంలో మరో చర్య కావొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కరువైందని యువత... ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మొత్తుకుంటున్నారు. విద్య, వైద్య రంగాలు పడకేశాయని గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమర్థవంతంగా వ్యవహరించి ప్రజల విశ్వా సాన్ని పొందాల్సివుండగా, ప్రజల్లో పరస్పర అవిశ్వాసాన్ని కలిగించే ఇలాంటి పనులకు పూను కోవటం ఏం న్యాయం? అసలు నేరానికి తగ్గ శిక్ష ఉండాలన్న ఇంగితం కరువైతే ఎలా? ఆర్డినెన్సుల ప్రతిపాదనపై యూపీ సర్కారు పునరాలోచన చేయాలి. -
యోగి సర్కార్‌పై సెటైరికల్ సాంగ్.. సింగర్‌కు నోటీసులు
ప్రముఖ భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్‌కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాట పాడినందుకు ఆమెకు ఈ నోటీసులు అందాయి. కాగా ఇటీవల కాన్పూర్ అక్రమ ఇళ్లను తొలగిస్తుండగా తల్లీ కూతుళ్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ నేహా సింగ్ ఓ పాట పాడారు. ‘యూపీ మే కా బా సీజన్-2’ పేరుతో ఈ పాటను యూట్యూబ్, ఫేస్బుక్లో విడుదల చేశారు. ఈ క్రమంలోనే నేహా రాథోడ్ పాడిన పాటపై యోగి సర్కార్ సీరియస్ అయ్యింది. ఆ వెంటనే యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. గాయని తన పాట ద్వారా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. తనకు నోటీసులు రావడంపై గాయని స్పందిస్తూ.. మంగళవారం రాత్రి కాన్పూర్ పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని పేర్కొంది. తన పాటల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికి సమాధానాలు ఇవ్వదని.. కేవలం నోటీసులే జారీ చేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘జానపద గాయకురాలిగా నా బాధ్యతను నిర్వర్తించడానికి ఎప్పుడూ ప్రయతిస్తాను. జానపద పాటల ద్వారా ప్రభుత్వాలపై ప్రశ్నలు లేవనెత్తాను. యూపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడానికి నేను 'కా బా' ఫార్మాట్‌ను ఉపయోగించడం ఇదేం తొలిసారి కాదు. ఎన్నికల సమయంలో కూడా నేను అనేక ప్రశ్నలు సంధించాను. దానిపై వారు ఇప్పటికీ సమాధానాలు చెప్పలేకపోయారు. వారు సమాధానాలు ఇవ్వలేరు.. కానీ నోటీసులు మాత్రమే జారీ చేస్తారు. యూపీలో ప్రస్తుత పరిస్థితిపై సమాజ్‌వాదీ పార్టీని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది.. కరెక్ట్ కాదు కదా. నేను ఏ ఒక్క పార్టీని టార్గెట్ చేయడం లేదు, కేవలం అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడమే నా పని’ అని పేర్కొన్నారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా భయపడేది లేదని, సాధారణ ప్రజల సమస్యల మీద పాటలు పాడటం ఆపనని భోజ్‌పురి సింగర్ స్పష్టం చేశారు. కాగా గుజరాత్ ఎన్నికలకు ముందు మోర్బీ వంతెన కూలిపోవడం గురించి కూడా ఆమె 'గుజరాత్ మే కా బా' అంటూ పాట పాడారు అంతేగాక 2022 యూపీ ఎన్నికల ముందు కూడా నేహా సింగ్ రాథోడ్ ఇలాగే ‘‘యూపీ మే కాబా’’ అంటూ పాట పాడారుది. ప్రస్తుతం దీని రెండో వెర్షన్ ను రిలీజ్ చేశారు. 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 -
Toolika Rani: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ!
సాహసగాథలు వింటే సాహసాలు చేయాలనిపిస్తుంది. సాహసం చేస్తే మరిన్ని సాహసాలు చేయాలనిపిస్తుంది. సాహసం ఏం ఇస్తుంది? ‘అంతులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాదు మనమేమిటో మనకు తెలియజేస్తుంది’ అంటుంది తులికారాణి. ఎన్నో ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించిన ఈ సాహసి సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుంచి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన తొలి మహిళగా, ఇరాన్‌లోని మౌంట్ డమవండ్ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది తులికారాణి. మీరట్‌లో చదువుకున్న రాణికి చిన్నప్పటి నుంచి సాహసగాథలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌పై ఆసక్తి కలిగేలా చేసింది. 2005లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన రాణి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ విభాగంలో, ఔట్‌డోర్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పదిసంవత్సరాల పాటు పనిచేసింది. ఎయిర్‌ఫోర్స్ టీమ్‌లో భాగంగా పర్వతారోహణకు శ్రీకారం చుట్టింది. అప్పుడు మొదలైన ఆసక్తి ఆమెతో ఎన్నో సాహసాలు చేయించింది. భారతదేశం, నేపాల్. భూటాన్, ఇరాన్, రష్యా... మొదలైన దేశాల్లో ఇరవైనాలుగు ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించింది. ఝాన్సీ లక్షీభాయి పురస్కారంతో పాటు పదిహేడు అవార్డ్లు అందుకుంది. వాటిలో ‘గ్లోబల్ ఉమెన్’ అవార్డ్ కూడా ఒకటి. ‘సవాలును స్వీకరించడానికి ధైర్యం మాత్రమే కాదు అంకితభావం, కష్టపడే తత్వం ఉండాలి. ప్రయాణంలో అవహేళనలు ఎదురు కావచ్చు. అయితే ఒక్క విజయం చాలు వాటికి సమాధానం చెప్పడానికి’ అంటుంది రాణి. తొలిసారిగా పర్వతారోహణకు ఉపక్రమించినప్పుడు ప్రోత్సహించే వారి కంటే ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ. కొందరైతే ‘అమ్మాయిలు పర్వతారోహణ చేయడం కష్టం’ అన్నారు. విమర్శలకు, అనుమానాలకు, అవహేళనలకు తన విజయాలతోనే గట్టి సమాధానం చెప్పింది రాణి. పుస్తకాలు చదవడం, తన సాహనయాత్రల గురించి ఆర్టికల్స్ రాయడం, ప్రకృతిని చూస్తూ పరవశిస్తూ భావుకతతో కవిత్వం రాయడం రాణికి ఇష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం అంటే ఇష్టం. తాజా విషయానికి వస్తే... తులికారాణిని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం జీ–20 బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. వారణాసిలో ఆరు, ఆగ్రాలో మూడు, లక్నోలో ఒకటి, గ్రేటర్ నోడియాలో ఒకటి...జీ–20కి సంబంధించిన రకరకాల సమావేశాలు జరుగుతాయి. వీటిలో నలభై దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. కాలేజీ, యూనివర్శిటీలలో జరిగే కార్యక్రమాల్లో అంబాసిడర్ హోదాలో ΄ాల్గొననుంది రాణి. ‘జీ–20 బ్రాండ్ అంబాసిడర్‌గా నన్ను నియమించడం గర్వంగా ఉంది. నా బాధ్యతను మరింత పెంచింది. నిర్మాణాత్మక విషయాల గురించి యువతలో ఆసక్తి, అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది రాణి. రాణిలో మంచి వక్త, లోతైన విశ్లేషకురాలు కూడా ఉన్నారు. అడ్వెంచర్ స్టోర్ట్స్‌లో జెండర్ గ్యాప్, ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఎందుకు ఉంది? ఔట్‌డోర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో స్త్రీలు అడుగు పెట్టడానికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి? వాటికి పరిష్కారం ఏమిటి? పర్వతారోహణకు ఆర్థికబలం అనేది ఎంత ముఖ్యం... మొదలైన విషయాల గురించి రాణి అద్భుతంగా విశ్లేషిస్తుంది. ‘సాహసాలే కాదు సమాజసేవ కూడా’ అంటున్న తులికారాణికి అభినందనలు తెలియజేద్దాం. వృత్తం దాటి బయటికి రావాలి ఎప్పుడూ గిరిగీసుకొని ఉండకూడదు. ఈ విశాల ప్రపంచంలో మనం చేయడానికి ఎంతో ఉంది. చుట్టూ గీసుకున్న వృతాన్ని దాటి బయటి వస్తే అద్భుతప్రపంచం మనకు కనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు ఏం చేయలేదు? ఇకముందు ఏం చేయాలి? అనేది అవగాహనకు వస్తుంది. కొత్త శక్తి మనకు చేరువ అవుతుంది. – తులికారాణి -
సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే!.. సుప్రీంలో యోగి సర్కార్
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ హింసకు కారకుడు, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశిష్ మిశ్రాకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అలహాబాద్ హైకోర్టు ఇదివరకే అశిష్ బెయిల్‌ను తిరస్కరించగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాడతను. అయితే.. గురువారం ఈ పిటిషన్లపై వాదన సందర్భంగా యోగి సర్కార్ తీవ్ర అభ్యంతరాలే బెంచ్ ముందు ఉంచింది. ఇది ఘోరమైన, క్రూరమైన నేరం. ఇలాంటి నేరానికి బెయిల్ ఇవ్వడం అంటే.. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్(అదనపు) గరిమా ప్రసాద్.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అంతకు ముందు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గల కారణాలేంటనే అభ్యంతరాలను వెల్లడించించాలని యూపీ సర్కార్‌ను కోరింది బెంచ్. ‘‘అతను ఈ కేసులో ఉన్నాడని మేం భావిస్తున్నాం. కానీ, ఇంత పెద్ద కేసులో ఆధారాలను నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడా?’’ అని బెంచ్.. యూపీ సర్కార్‌కు ప్రశ్నించింది. ఇప్పటిదాకా అలాంటిదేం జరగలేదని గరిమా ప్రసాద్ తెలపగా, ఆవెంటనే బాధిత కుటుంబాల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే బెంచ్ ముందు తీవ్ర ఆరోపణలే చేశారు. ఇది కుట్రతో ఒక ప్రణాళిక ప్రకారంగా చేసిన హత్య. ఛార్జ్‌షీట్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. సంఘంలో అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. అంతే శక్తివంతమైన లాయర్లను ఈ కేసు కోసం నియమించుకున్నారంటూ దవే వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం ఒక భయంకర సందేశాన్ని పంపినట్లు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఈ తరుణంలో.. మిశ్రా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి.. దవే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఎవరు శక్తివంతమైన వాళ్లు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతీ రోజూ మేం కోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. బెయిల్ నిరాకరించడానికి ఇదొక కారణమేనా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన క్లయింట్ ఏడాది కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉన్నారని, విచారణ ఇలాగే కొనసాగితే ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టవచ్చని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఫిర్యాదుదారు అయిన జగ్జీత్ సింగ్ ప్రత్యక్ష సాక్షి ఏమాత్రం కాదని, కేవలం ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేశాడని ముకుల్ రోహత్గి కోర్టుకు అభ్యంతరాలను వెల్లడించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అక్టోబర్ 3వ తేదీ 2021లో.. టికునియా లఖింపూర్ ఖేరీ వద్ద అప్పటి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ ఎస్యూవీ.. నలుగురు రైతుల మీద నుంచి వెళ్లిందని, ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మరో వాహనం డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను దాడి చేసి చంపారని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ హింసలో ఓ జర్నలిస్ట్ కూడా మృత్యువాత పడ్డాడు. అశిశ్ మిశ్రాతో సహా 13 మందిని నిందితులుగా చేర్చారు యూపీ పోలీసులు. ఇంతకు ముందు అశిష్‌కు బెయిల్ దక్కినట్లే దక్కి.. మళ్లీ రద్దు అయ్యింది. గతేడాది డిసెంబర్ 12వ తేదీన సుప్రీంలో దాఖలైన బెయిల్ పిటిషన్‌పై యూపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. నిరసనలకారుల హింసకు సంబంధించిన అఫిడవిట్‌ను తమ ముందు ఉంచాలని యూపీ సర్కార్‌ను సుప్రీం బెంచ్ ఆదేశించింది. గురువారం జరిగిన వాదనల అనంతరం.. బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది సుప్రీం బెంచ్. -
ఒవైసీ హత్యాయత్నం కేసు.. యూపీ సర్కార్‌కు నోటీసులు
ఢిల్లీ: ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. ఒవైసీ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ అంశాన్ని పునర్విచారణ కోసం అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలా వద్దా అనే అంశంపై మాత్రమే సుప్రీంకోర్టు ఇవాళ నోటీసు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11న చేపట్టనుంది. హాపూర్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన కాన్వాయ్‌పై ఫిబ్రవరి 3వ తేదీన దాడి జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. అయితే దాడి నుంచి ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ హత్యాయత్నానికి సంబంధించి నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అయితే వాళ్లకు బెయిల్ మంజూరు కావడంతో ఇప్పుడు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్విస్ట్ -
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ రిటైర్డ్ జడ్జి కమిటీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సదరు జడ్జి ప్రతిపాదనపై స్పందించాలంటూ కోరింది సుప్రీం కోర్టు. అంతేకాదు ఈ స్పందన కోసం ఏప్రిల్ 4వ తేదీని గడువుగా విధించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన రైతు నిరసనల సందర్భంగా.. రైతుల మీదుగా కారు పనిచ్చి వాళ్ల మరణాలకు కారణం అయ్యాడు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ అశిశ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో 2022, ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది బాధిత కుటుంబం. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వింటోంది. ఈ మేరకు ఇంతకు ముందు(మార్చి 16న) యూపీ ప్రభుత్వంతో పాటు ప్రధాన నిందితుడు అశిశ్ మెహ్రాకు ‘బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ’ నోటీసులు సైతం జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాకేష్ కుమార్ జైన్ ఇప్పటికే నివేదిక సమర్పించారు కూడా. -
అయోధ్య భూకుంభకోణంపై దర్యాప్తు
లక్నో: అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిరం సమీపంలోని భూములను కొంటూ బీజేపీ నేతలు, ఉన్నతాధికారులు భూకుంభకో ణానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అక్రమ కొనుగోళ్లు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సర్కార్ హెచ్చరించింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం కేసులో 2019లో చరిత్రాత్మక తీర్పు వెలువడిన మరు క్షణమే అయోధ్య, పరిసర ప్రాంతాల్లో భూముల బలవంతపు కొనుగోళ్ల పర్వం ఊపందుకుందని మీడియాలో వార్తలొచ్చాయి. బీజేపీ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, కమిషన్ బంధువులు, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, డీఐజీ తదితరులు అయోధ్య సమీప స్థలాలను కొనుగోలు చేశారన్న వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ రెవెన్యూ శాఖను ఆదేశించారని యూపీ అదనపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సమాచార) నవనీత్ సెహగల్ చెప్పారు. మతం ముసుగులో హిందుత్వ వాదులు స్థలాలను దోచుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: ప్రియాంక కుంభకోణంపై యూపీ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించడాన్ని కంటి తుడుపు చర్యగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అభివర్ణించారు. ఆలయం కోసం అధిక ధరలకు భూములు కొంటూ ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రియాంక ఆరోపించారు. సుప్రీంకోర్టు సూమోటోగా కలగజేసుకుని న్యాయం చేయాలన్నారు. ఆలయం కోసం వేల కోట్ల విరాళాలిచ్చిన రామభక్తుల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని బీఎస్పీ చీఫ్ మాయవతి సైతం డిమాండ్‌చేశారు. -
మాజీ జడ్జి ఆధ్వర్యంలోనే దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై నియమించిన సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డు న్యాయమూర్తిని నియమించాలన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘ధర్మాసనం సరైన వ్యక్తిగా భావించి ఎవరిని నియమించినా యూపీ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఈ విషయంలో సదరు అధికారి సమర్థతే తప్ప, రాష్ట్రంతో సంబంధం లేదు’అని హరీశ్ సాల్వే ధర్మాసనానికి నివేదించారు. దీంతో న్యాయమూర్తి పేరును బుధవారం ఖరారు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. సిట్ దర్యాప్తు ప్రగతిని ఈ న్యాయమూర్తి రోజువారీ సమీక్షిస్తారని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందంలో దిగువ స్థాయి..సబ్ ఇన్స్పెక్టర్, డీఎస్పీలు అదికూడా లఖీమ్‌పూర్ ఖేరికి చెందిన అధికారులే ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. సిట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. యూపీ క్యాడర్లో సొంత రాష్ట్రానికి చెందని ఐపీఎస్ అధికారుల జాబితాను మంగళవారం సాయంత్రానికల్లా అందజేయాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా సిట్ చీఫ్‌ను బదిలీ చేశారన్న పిటిషనర్ అభ్యర్థనపైనా పరిశీలన జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. పరిహారం దక్కని వారు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకునేలా చేస్తానని యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు. -
Lakhimpur Kheri: అంతమందిలో 23 మందే ప్రత్యక్ష సాక్షులా?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనకు సంబంధించి సాక్షులకు రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వేలాది మంది రైతులు ఆందోళనలో పాల్గొంటే ఘటనలో కేవలం 23 మంది ప్రత్యక్ష సాక్షులు మాత్రమే ఉన్నారా అని ప్రశ్నించింది. ఈ ఉదంతంలో జర్నలిస్టు హత్యపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ఇద్దరు లాయర్లు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే. ఈనెల 3న లఖింపూర్ ఖేరి హింసాకాండలో రైతులపైకి వాహనం దూసుకెళ్లిన కేసులో నలుగురు అన్నదాతలతో సహా మొత్తం 8 మంది మరణించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతో సహా ఈ కేసులో 10 మందిని అరెస్టు చేశారు. మంగళవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. చదవండి: (పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి) వేల మంది ఎదుట జరిగింది కదా? యూపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక్కరు మినహా మిగతా అందరినీ ఇంకా పోలీసు కస్టడీలో ఎందుకు ఉంచారని ప్రశ్నించగా .. స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ గరిమా ప్రసాద్ తెలిపారు. వేలాది మంది రైతులు ర్యాలీలో ఉంటే 23 మందే ప్రత్యక్ష సాక్షులా అని ధర్మాసనం ప్రశ్నించగా... పత్రికల్లో ప్రకటన ఇచ్చామని, ఘటనను ఓ వ్యక్తి వీడియో తీయగా దాన్ని ల్యాబ్‌కు పంపామని సాల్వే తెలిపారు. సాక్షులకు రక్షణ కల్పించాలని, సీసీటీవీల ఏర్పాటు, ఇంటి వద్ద భద్రత కల్పించడం చేయాలని సీజేఐ ఆదేశించారు. సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ఇతర సాక్షుల వాంగ్మూలాలు కూడా సేకరించాలని ధర్మాసనం పేర్కొంది. ఘటనలో జర్నలిస్టు హత్యపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన భర్త మృతి చెందారని, హంతకులు బహిరంగంగా తిరుగుతూ తనని బెదిరిస్తున్నారని రూబీ దేవి అనే మహిళ ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. దీనిపై ఏం చేశారని సీజేఐ ప్రశ్నించారు. ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని సాల్వే తెలిపారు. జర్నలిస్టు, రూబీ దేవి భర్త హత్యలపై వేర్వేరు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను నవంబరు 8కి వాయిదా వేసింది. -
నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. ఇతర హత్యల కేసుల్లోనూ నిందితుల పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఘాటుగా ప్రశ్నించింది. ఈ ఘటనపై వేరే దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని, అప్పటిదాకా ఆధారాలను భద్రంగా ఉంచాలని డీజీపీకి కోర్టు మాటగా చెప్పాలని యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనను సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రధాన నిందితుడికి సమన్లు జారీ చేశామని చెప్పారు. 8 మంది మృతికి కారణమైన ఘటనలో సాధారణంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. బాధితుల శరీరాల్లో బుల్లెట్ గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు హరీష్ సాల్వే చెప్పగా.. ఇదే కారణంతో అరెస్టు చేయలేదా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామంటూ అక్టోబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా, లఖీపూర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలను జస్టిస్ ఎన్.వి.రమణ కలుస్తారంటూ ఓ ఆంగ్ల పత్రిక ట్వీట్ చేయడంపై సీజేఐ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అదేసమయంలో ఈ రకంగా చేయడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న తాను లక్నోకు ఎలా వెళ్లగలని ప్రశ్నించారు. మిశ్రాను తొలగించకపోతే 18న రైల్ రోకో: కిసాన్‌మోర్చా లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను ఈ నెల 11వ తేదీలోగా పదవి నుంచి తొలగించకపోతే 18న రైల్ రోకో చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితులను వారం రోజుల్లోగా అరెస్టు చేయకపోతే ప్రధాని మోదీ నివాసాన్ని దిగ్బంధిస్తామని దళిత నేత, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు. ఆశిష్‌ను అరెస్టు చేసేదాకా నిరాహార దీక్ష కొనసాగిస్తానని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఆయన శుక్రవారం నిరాహార దీక్ష ప్రారంభించారు. సమన్లకు స్పందించని ఆశిష్ శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ యూపీ పోలీసులు జారీ చేసిన సమన్లకు ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా స్పందించలేదు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసు జారీ చేశారు. ఆశిష్ అనారోగ్యం కారణంగా శుక్రవారం పోలీసుల విచారణకు రాలేకపోయాడని అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. కాగా, లఖీమ్‌పూర్ ఖేరిని ప్రతిపక్ష నేతలు సందర్శిస్తుండడం పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ వ్యంగ్యంగా స్పందించారు. వారిది రాజకీయ పర్యాటక కార్యక్రమం(పొలిటికల్ టూరిజం) అని ఎద్దేవా చేశారు. -
ఎంతమందిని అరెస్టు చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం 8 మంది మృతి చెందడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఉదంతంలో తాజా పరిస్థితులపై నివేదిక అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాకాండకు సంబంధించి ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారు? అనే వివరాలతో నివేదిక వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), జ్యుడీషియల్ కమిషన్ వివరాలను సైతం తమకు తెలియజేయాలని వెల్లడించింది. ఈ సుమోటో కేసుపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఘటనపై విచారణ చేపట్టాలంటూ న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. గురువారం జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. న్యాయవాది త్రిపాఠి వాదనలు వినిపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖ ద్వారా ఏం ఉపశమనం కావాలని కోరుకుంటున్నారో చెప్పాలని లాయర్‌ను సీజేఐ ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని విన్నవించారు. జస్టిస్ హిమాకోహ్లి జోక్యం చేసుకొని ఘటనను సరిగ్గా పరిశీలించలేదని, ఎఫ్ఐఆర్ సరిగ్గా నమోదు చేయలేదని పేర్కొన్నారు. అనంతరం యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ వాదనలు వినిపించారు. ఉదంతంపై ప్రభుత్వం ‘సిట్’ వేసిందని, దర్యాప్తు కోసం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించిందని తెలిపారు. రైతు తల్లికి తగిన వైద్య సేవలందించండి ‘అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిస్థితిని నివేదికలో తెలియజేయండి. శుక్రవారం విచారణ జరుపుతాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘‘హత్యకు గురైన వారిలో రైతులతోపాటు ఇతరులు ఉన్నారు. ఎవరెవరిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది? ఎవరిని అరెస్టు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే తాజా పరిస్థితిపై నివేదిక దాఖలు చేయండి’’ అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. అంతకుముందు.. సుమోటో కేసుపై విచారణ ప్రారంభిస్తూ జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయవాదులు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. వారు కోరుతున్నట్లుగానే లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా కూడా స్క్రీన్ మీద కనిపించేసరికి ఎవరి తరఫున వాదిస్తున్నారని ప్రశ్నించారు. పౌరుల స్వేచ్ఛ కోసం బార్ సభ్యుడిగా వాదనలు వినిపిస్తానని హన్సారియా బదులిచ్చారు. ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు లఖీమ్‌పూర్ ఖేరి: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ప్రశి్నంచేందుకు శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసినట్లు ఐజీ లక్ష్మీసింగ్ చెప్పారు. సమన్లకు స్పందించకపోతే చట్టప్రకారం ముందుకెళ్తామని తెలిపారు. ఈ హింసాకాండతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బన్బీర్పూర్కు చెందిన లవకుశ్, నిఘాసన్ తహసీల్‌కు చెందిన ఆశిష్ పాండేను అరెస్ట్ చేసి ప్రశి్నస్తున్నట్లు చెప్పారు. హింసాకాండలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్‌పై ఎఫ్ఐఆర్ నమోదవడం తెల్సిందే. ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండపై న్యాయ విచారణకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ సభ్యుడిగా జ్యుడీíÙయల్ కమిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు గురువారం ఈ విషయం వెల్లడించారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. లఖీమ్‌పూర్ ఖేరి కేంద్రంగానే ఈ కమిషన్ పని చేస్తుందని, న్యాయ విచారణను పూర్తి చేయడానికి రెండు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. -
లఖీమ్‌పూర్ హింస: సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా
న్యూడిల్లీ: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లఖీమ్‌పూర్ హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా కమిషన్ వేశామని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో శుక్రవారంలోగా ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కాన్వాయ్‌లోని కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: Lakhimpur Kheri Violence: లఖీమ్‌పూర్ ఘటన: యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లఖీమ్‌పూర్ ఘటనను విచారించడానికి రిటైర్డ్ జడ్జీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఈ కమిషన్ తన విచారణను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. చదవండి: ‘రైతులను నాశనం చేసినవాళ్లు .. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలేదు’ మరోవైపు లఖింపుర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలకు గురువారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పరిహారం అందించింది. ఒక్కో కుటుంబానికి రూ. 45 లక్షల విలువైన చెక్కును అందించింది. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌పై హత్య కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అతన్ని అరెస్టు చేయలేదు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కారు తనదేనని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో లేడని చెప్పారు. -
అల్టిమేటం: ‘ఘాజీపూర్’ ఖాళీ చేయండి
ఘజియాబాద్: ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఉన్న నిరసన కేంద్రం నుంచి వెళ్లిపోవాలని ఘజియాబాద్ అధికారులు రైతులను ఆదేశించారు. గురువారం అర్ధరాత్రిలోగా ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. దీనిపై అక్కడ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆత్మాహుతి అయినా చేసుకుంటా. కానీ ఇక్కడి నుంచి కదలను. నిరసనను ఆపను’ అని అన్నారు. తన ప్రాణాలకు ముప్పుందని, కొందరు సాయుధ గూండాలు ఇక్కడికి వచ్చారని ఆందోళన వెలిబుచ్చారు. దాంతో ఘాజీపూర్ యూపీ గేట్ వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా బలగాలను తరలించింది.వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఘాజీపూర్ సరిహద్దు వద్ద తికాయత్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ నవంబర్ 28 నుంచి నిరసన తెలుపుతోంది. ‘ఖాళీ చేయాలని ఘజియాబాద్ కలెక్టర్ అజయ్ రైతులను ఆదేశించారు’ అని అధికారులు చెప్పారు. ‘శాంతియుత నిరసనలు చట్టబద్దమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా, రైతు నిరసనకారులను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. యూపీ ప్రభుత్వం అణచివేతకు ప్రయత్నిస్తోంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. ఏదేమైనా మా నిరసన కొనసాగిస్తాం’ అని తికాయత్ స్పష్టం చేశారు. నోటీసులకు భయపడం ఢిల్లీ పోలీసులు పంపిస్తున్న నోటీసులకు భయపడబోమని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు స్పష్టం చేశారు. జనవరి 26 నాటి అల్లర్లను కారణంగా చూపి రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడం. వాటికి జవాబిస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరసన కేంద్రాల నుంచి రైతులను వెనక్కు పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలైన నేరస్తులపై చర్యలు తీసుకోకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అరెస్ట్ చేస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొట్టి, పాల్వాల్ నిరసన కేంద్రం నుంచి రైతులను పంపించివేసేందుకు కుట్ర చేశారు’ అని సంయుక్త కిసాన్ మోర్చా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఘాజీపూర్ సహా నిరసన కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలను నిలిపేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. సింఘు సరిహద్దు వద్ద రైతులు సద్భావన యాత్ర నిర్వహించారు. ట్రాక్టర్లు, బైక్‌లతో దాదాపు 16 కిలో మీటర్లు ఈ ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘాల జెండాలకు బదులుగా కేవలం త్రివర్ణ పతాకాలు పట్టుకుని రైతులు ఈ యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రాలు, మతాలకు అతీతంగా రైతులంతా ఒక్కటేనన్న భావనను ప్రచారం చేసేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని రైతు నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్పాల్, గుర్నామ్ సింగ్.. తదితరులు తెలిపారు. జాతీయ పతాకాన్ని అవమానించారని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణకు ఇది తమ జవాబని పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని తాము గౌరవించినట్లుగా మరెవరూ గౌరవించరని స్పష్టం చేశారు. సింఘు, టిక్రీ సరిహద్దుల వద్ద నిరసన తెలుపుతున్న రైతుల సంఖ్య భారీగా తగ్గినట్లు కనిపించింది. అయితే, జనవరి 26 నాటి ట్రాక్టర్ పరేడ్ కోసం వచ్చిన రైతులు వెనక్కు వెళ్లిపోవడం వల్ల అలా కనిపిస్తోందని రైతు నేతలు తెలిపారు. ‘మాలో స్ఫూర్తి దెబ్బతినలేదు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగుతుంది’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి బల్దేవ్ సింగ్ స్పష్టం చేశారు. ఉద్యమం తొలిరోజు నుంచి ఉన్నవారిలో కొందరు వెనక్కు వెళ్లారని, వారి కుటుంబసభ్యుల్లో నుంచి కొందరు త్వరలో ఇక్కడకు వస్తారని తెలిపారు. ఫిబ్రవరి 1న తలపెట్టిన పార్లమెంటుకు పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేశామని రైతు నేతలు వెల్లడించారు. జనవరి 26నాటి అల్లర్లు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రేనని రైతు నేత గుర్జీత్ సింగ్ ఆరోపించారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీగా భద్రతబలగాలు మోహరించాయి. యూపీలోని బాఘ్పట్ నిరసన కేంద్రంలో ఆందోళనలు ముగిశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరం డిసెంబర్ 19 నుంచి ఇక్కడ నిరసనలు సాగుతున్నాయి. పోలీసులకు అమిత్ షా పరామర్శ జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పరామర్శించారు. శుశ్రుత్ ట్రామా సెంటర్, తీరత్ రామ్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న పోలీసులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవలతో కలిసి హోం మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ అల్లర్లలో సుమారు 400 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. రైతు నేతలపై లుక్ఔట్ నోటీసులు గణతంత్ర దినోత్సవం రోజు రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసుల విచారణకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు 9 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అల్లర్ల వెనుక కుట్ర, నేరపూరిత ప్రణాళిక ఉన్నాయని, పరేడ్ మార్గంపై కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించాలని ముందే నిర్ణయించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. యోగేంద్ర యాదవ్, బల్బీర్ సింగ్ రాజేవాల్ సహా 20 మంది రైతు నేతలకు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లకు గానూ వారిపై చట్టబద్ధ చర్యలు ఎందుకు తీసుకోకూడదో 3 రోజుల్లోగా వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు, ఢిల్లీ హింసాకాండపై నమోదైన ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న రైతు నేతలపై పోలీసులు ‘లుక్ ఔట్’ నోటీసులు జారీ చేశారు. ఆ నాయకులు తమ పాస్‌పోర్ట్‌లను కూడా సరెండర్ చేయాల్సి ఉంటుందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజధానిలో జరిగిన హింసాకాండ దేశ పరువు ప్రతిష్టలను దెబ్బతీసిందని భావిస్తున్న పోలీసులు.. ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో బాధ్యులపై దేశద్రోహం ఆరోపణలను కూడా నమోదు చేయాలని నిర్ణయించారు. వారిపై ఐపీసీలోని 124ఏ(దేశద్రోహం) సెక్షన్ కింద కూడా ఆరోపణలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎర్రకోట ఘటనలపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ, మాజీ గ్యాంగ్‌స్టర్ లఖా సిధానియాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ల్లో రాకేశ్ తికాయత్, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్, గుర్నామ్ చాందునీ, కుల్వంత్ సింగ్ సంధూ, జోగిందర్ సింగ్ ఉగ్రహ, మేథా పాట్కర్ తదితర 37 మంది నాయకుల పేర్లు ఉన్నాయి. రాజ్యాంగ బద్ధతపై సుప్రీం నోటీస్‌లు వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రతాపన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. కొత్త సాగు చట్టాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించే 14, 15, 21 అధికరణలను ఉల్లంఘిస్తున్నాయని ప్రతాపన్ తన పిటిషన్లో ఆరోపించారు. అందువల్ల ఆ చట్టాలను అక్రమమైనవి, రాజ్యాంగ విరుద్ధమై నవిగా ప్రకటించి రద్దు చేయాలని కోర్టును కోరారు. తప్పుడు ప్రచారం: దీప్ సిద్ధూ ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు రైతు నేతలు తనను బాధ్యుడిని చేయడంపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మండిపడ్డారు. ఎర్రకోటపై సిక్కు మత జెండాను ఎగరేసిన ఆందోళనకారుల్లో దీప్ సిద్దూ ఉన్నారు. ఎర్రకోట వైపు వెళ్లాలని యువ రైతులు వారికి వారే నిర్ణయించుకున్నారని వివరించారు. పోలీసులు, రైతు నేతలు అంగీకరించిన మార్గాన్ని చాలా మంది అనుసరించలేదన్నారు. ఢిల్లీ లోపల ట్రాక్టర్ పరేడ్ ఉంటుందని చెప్పి రైతు నేతలు తమను పిలిపించారని అక్కడి వారు తనకు చెప్పారన్నారు. రైతు నేతలు తనను బీజేపీ, ఆరెస్సెస్ వ్యక్తి అని విమర్శించడంపై స్పందిస్తూ.. ‘బీజేపీ వ్యక్తి కానీ, ఆరెస్సెస్ వ్యక్తి కానీ ఎర్రకోటపై సిక్కు మత ‘నిషాన్సాహిబ్’ జెండా ఎగరేస్తాడా?’ అని ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ప్రశ్నించారు. తాను చేరుకునేటప్పటికే ఎర్రకోట గేట్ విరిగిపోయి ఉందన్నారు. -
‘హాథ్రస్ కుటుంబాని’కి మూడంచెల భద్రత
న్యూఢిల్లీ: హాథ్రస్ బాధిత యువతి కుటుంబ సభ్యులకు, సాక్షులకు మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బుధవారం తెలియజేసింది. హాథ్రస్ దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై సీబీఐ నిర్దిష్ట కాల పరిమితితో విచారణ నిర్వహించేలా, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విచారణ జరుగుతున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ నివేదికను ఉత్తర ప్రదేశ్ డీజీపీ సుప్రీంకోర్టుకి సమర్పిస్తారని ప్రభుత్వం తెలిపింది. బాధిత యువతి ఇంటి చుట్టూ 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, కుటుంబ సభ్యులకు, సాక్షులకు.. 16 మంది పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాపలాగా ఉన్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు, సాక్షుల వ్యక్తిగత గోప్యతలో జోక్యం చేసుకో రాదని పోలీసులకు ఆదేశాలిచ్చామని, తమకు నచ్చిన వ్యక్తులను కలవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి బాధిత కుటుంబానికి, సాక్షులకు అనుమతిచ్చినట్లు యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
నేను ఇందిరా గాంధీ మనువరాలిని..
లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకున్నా జరుగుతున్న వాస్తవాలను ధైర్యంగా ప్రజల ముందు ఉంచుతానని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్వీటర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘ఉత్తర ప్రదేశ్ ప్రజల బాధ్యత ప్రజా సేవకురాలిగా నా కర్తవ్యం. వాస్తవాలను వారి ముందు ఉంచడం నా విధి. ప్రభుత్వం గురించి ప్రచారం చేయడం నా పనికాదు. నన్ను బెదిరించే ప్రయత్నంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సమయం వృథా చేస్తోంది. నాపై ఎన్ని చర్యలు తీసుకున్నా నేను నిజాలను ప్రచారం చేస్తూనే ఉంటాను. నేను కొంతమంది నాయకుల మాదిరి బీజేపీ చెప్పుకోలేని ప్రతినిధిని కాదు. ఇందిరాగాంధీ మనవరాలిని’ అంటూ ట్వీట్ చేశారు. (ప్రియాంకాకు కొత్తపేరు పెట్టిన బీజేపీ నేత) రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తితోపాటు పలు అంశాలపై యోగి ప్రభుత్వంపై ప్రియాంక ధ్వజమెత్తారు. కాన్పూర్‌లోని ప్రభుత్వ శిశు ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆదివారం ప్రియాంక ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు, వీరిలో ఇద్దరు బాలికలు గర్భవతులు కాగా, ఒకరు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు ఆమె తెలిపారు. అయితే రాష్ట్ర బాలల హక్కుల మండలి గురువారం ప్రియాంకు నోటీసులు జారీ చేసింది. ఆశ్రమ గృహంపై తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారని, దీనికి మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. (కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా పాజిటివ్ ) కరోనాతో ఆగ్రా ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోనే 28 మంది మరణించినట్లు ఓ వార్త క్లిప్‌ను జతచేస్తూ జూన్ 22న ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్‌పై స్పందించిన ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు నరైన్ సింగ్ మంగళవారం ట్వీట్ ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని కోరారు. అయితే దీనిని పట్టించుకోని ప్రియాంక ఆగ్రాలో కోవిడ్ -19 మరణాల రేటు 6.8 శాతంగా ఉందని, ఇది ఢిల్లీ, ముంబై కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. (28 కోవిడ్ మరణాలు.. విచారణకు సీఎం ఆదేశం) -
అది ముస్లిం సంస్థల పనే
న్యూఢిల్లీ/లక్నో/మంగళూరు/జైపూర్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో బయటివారి ప్రమేయం ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ అల్లర్లలో పాలుపంచుకున్న ఇస్లామిక్ సంస్థలకు చెందిన ఆరుగురు పశ్చిమబెంగాల్ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ‘పౌర’ చట్టాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజులపాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రాజధాని లక్నోతోపాటు గొడవలు ఎక్కువగా చోటుచేసుకున్న మీరట్, ఫిరోజాబాద్, కాన్పూర్, బిజ్నోర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం ప్రశాంతత నెలకొంది. కాగా, అల్లర్ల బాధిత కుటుంబాలను కలిసేందుకు వచ్చిన బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలను లక్నో విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. బిజ్నోర్ జిల్లాలో అల్లర్ల బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పరామర్శించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ‘పౌర’ చట్టానికి అనుకూలంగా జరిగిన ర్యాలీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. అల్లర్ల కారకులను అరెస్ట్ చేశాం రాష్ట్రంలో అల్లర్లకు కారకులైన వారిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఆదివారం డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ మీడియాకు తెలిపారు. హింసాత్మక ఘటనల వెనుక పశ్చిమబెంగాల్‌కు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) కార్యకర్తల హస్తం ఉందన్నారు. వీరు అక్రమ ఆయుధాలను వాడారని తెలిపారు. బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన ఆరుగురు పీఎఫ్ఐకు చెందిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. జైపూర్‌లో భారీ ర్యాలీ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆధ్వర్యంలో జైపూర్‌లో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో 3 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. ఆదివారం ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, బిహార్, రాజస్తాన్, తమిళనాడు ల్లోనూ ఆందోళనలు ప్రశాంతంగా కొన సాగాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు ఆదివారం దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపారు. తమ ప్రాంత స్థానిక ప్రజల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని మరుగున పరిచేలా, ‘పౌర’ ఆందోళన లకు మతం రంగు పులిమారని వారు ఆరోపించారు. ‘మా అజెండాను వేరొకరు హైజాక్ చేయనివ్వం. మా ప్రజల తరపున మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాం’అని త్రిపుర రాచ కుటుంబ వారసుడు ప్రద్యోత్ దేవ్ వర్మన్ పేర్కొన్నారు. నాగపూర్‌లో అనుకూల ర్యాలీ నాగపూర్: పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ చట్టానికి అనుకూలంగా ఆదివారం నాగపూర్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూల సంస్థ చేపట్టిన ర్యాలీలో గడ్కరీ ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు ఎటువంటి అన్యాయం తలపెట్టదన్నారు. పొరుగు దేశాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపబోదన్నారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్న విషయం ముస్లింలు గ్రహించాలన్నారు. -
త్వరలో నిర్భయ దోషులకు ఉరి అమలు ?
లక్నో: నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో నిర్భయ దోషుల్ని ఉంచిన తీహార్ జైలు అధికారులు ఇద్దరు తలారుల్ని పంపవలసిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు) ఆనంద్ కుమార్ తాము తలారుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని గురువారం విలేకరులకు వెల్లడించారు. తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయడానికి తలారులు లేరు. అందుకే అవసరమైతే అతి తక్కువ కాల వ్యవధిలో చెప్పినా తలారుల్ని పంపాలంటూ ఢిల్లీ జైళ్ల శాఖ నుంచి తమకు డిసెంబర్ 9న ఫ్యాక్స్ ద్వారా ఒక లేఖ అందిందని ఆనంద్ కుమార్ వెల్లడించారు. అయితే ఆ లేఖలో నిర్భయ దోషుల ఉరి ప్రస్తావన లేదు. తలారుల అవసరం ఉందని మాత్రమే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, లక్నో జైళ్లలో మాత్రమే తలారులు ఉన్నారు. 17న అక్షయ్ రివ్యూ పిటిషన్‌పై విచారణ నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ మరణ శిక్షను సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు 17న విచారణ జరపనుంది. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో అందరి ఆయుష్షు తగ్గిపోతోందని, ఇక ఉరి తియ్యడమెందుకని అక్షయ్ ఆ పిటిషన్లో ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 17, మధ్యాహ్నం ఓపెన్ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే మిగిలిన దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్‌లను ఉరి తియ్యడానికి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 2012 డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీ బస్సులో నిర్భయను పాశవికంగా హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ‘ఉన్నావ్’ కన్నా ఘోరంగా చంపుతా! బాగ్పత్: ‘నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబితే.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కన్నా దారుణంగా చంపేస్తా’అని ఓ అత్యాచారం కేసులో నిందితుడు ఏకంగా బాధితురాలి ఇంటి గోడపై పోస్టర్ అతికించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భయానికి గురైన బాధితురాలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి, లేఖపై దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు ఎస్పీ ప్రతాప్ గోపేంద్ర తెలిపారు. తన గ్రామానికే చెందిన నిందితుడు సోహ్రాన్ సింగ్ తన ఇంటి గోడపై బెదిరింపు లేఖ అతికించినట్లు బాధితురాలు పేర్కొన్నట్లు వివరించారు. గతేడాది ముఖర్జీనగర్‌లో బాధితురాలిని సోహ్రాన్ ఓ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని, పైగా వీడియో తీసి బెదిరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసు ఢిల్లీ కోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. ఈ కేసులో సోహ్రాన్ బుధవారమే బెయిల్‌పై బయటకు వచ్చాడు. -
పేరు జబ్బు
తెలుగునాట తరచుగా విని పించే మాట ఒకటుంది: ‘ఆ పనిని నేను సాధించలేక పోతే నా పేరు మార్చు కుంటాను’ అని. ఇది నిజంగా పేరున్నవాడికి చెల్లే మాట. పేరు మార్చుకో వడం నామోషీ, చిన్నతనం. ఓటమి. పరువు తక్కువ– అని నానుడి. మరొక్కరే ‘పేరు’తో కసరత్తు చేయగలరు– రాజకీయ నాయకులు. ‘మమ్మల్ని పదవిలో నిల పండి. పేరు మార్చకపోతే...’ ఇది రాజకీయం. వాళ్ల పేర్లు ఎలాగూ వచ్చే ఎన్నికలదాకా నిలవవు కనుక. ఇప్పుడు పదవిలో ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి ఒకాయన ఎడాపెడా పేర్లు మార్చే స్తున్నారు. ఆయన చెప్పే కారణం– అలనాడు మొగ లాయీ పాలకులు, ముస్లిం పాలకులు వాళ్లకి లాయకీ అయిన పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం మనకి ఇష్టమయిన పేర్లు పెట్టుకుంటున్నాం– అని. మొదట గురుగాం మీద పడ్డారు. అది ‘గురుగ్రామం’ అయింది. ఇంతకీ ఈ గురువు ఎవరు? ద్రోణాచా ర్యులట! 62 సంవత్సరాల కిందట ‘వారణాశి’ అయినా ఇంకా ‘బెనారస్’ అనేవారూ, ‘కాశీ’ అనే వారూ ఉన్నారు. అలనాడు మేడమ్ మాయావతిగారు వారి హయాంలో కాన్షీరామ్ నగర్. మహామాయా నగర్ వెలిశాయి. మొగల్సరాయ్ని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ నగర్ చేశారు. ఇప్పుడు వరసపెట్టి ఆగ్రాని ‘ఆగ్రా వన్’గా, ముజాఫర్ నగర్‌ని ‘లక్ష్మీనగర్’గా, సిమ్లాని ‘శ్యామల’గా, అహమ్మదాబాద్‌ని ‘కర్ణావతి’గా, ఔరం గాబాద్ని ‘శంభాజీ నగర్’గా మార్చేస్తున్నారు. ఈ లెక్కన ఫైజాబాద్ ‘అయోధ్య’ అవుతుందట. బిజ్నోర్ మహాత్మా విదుర్ నగర్ అవుతుందట. ఈ మధ్య పేపర్లలో ఈ పేర్ల మార్పు గురించి కోకొల్లలుగా వ్యాసాలు వచ్చాయి. ఇలాంటి మార్పులు ఈ దేశం మీద ‘హిందూమతం’ పులమడమేనని చాలామంది వాపోయారు. దానికి వారందరూ వారి వారి కార ణాలు చెప్పారు. వారి మతాతీత దృక్పథానికి జోహార్లు. అయితే నాకు అర్థం కాని విషయం ఒకటుంది. గత 60 సంవత్సరాల పైచిలుకు– మన అభిమాన కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉండగా కేవలం 450 సంస్థలకు మాత్రమే మన ‘అభిమాన’ కుటుంబం– నెహ్రూ కుటుంబం– వారి పేర్లను పెట్టారు. ఇందులో 12 కేంద్ర, రాష్ట్ర పథకాలు, 28 క్రీడా టోర్నమెంట్లు, 19 స్టేడియంలూ, 5 ఎయిర్‌పోర్టులూ, పోర్టులూ, 98 విద్యా సంస్థలు, 51 అవార్డులూ, 15 ఫెలోషిప్‌లూ, 15 జంతు పరిరక్షణ శాలలూ, 39 ఆసుపత్రులూ, వైద్య సంస్థలూ, పరిశోధనా సంస్థలూ, 37 ఇతర రకాల సంస్థలూ, విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పీఠాలూ, ఉత్సవాలూ, 74 రోడ్లూ, భవంతులూ ఉన్నాయి. మన అదృష్టం బాగుండి కొద్దిలో తప్పిపోయిం దిగానీ అచిర కాలంలో మనకి ‘మౌరీన్ నగర్’ ‘మౌరీన్ శిశు సంక్షేమ కేంద్రం’ వెలిసేది. ఏమంటారు? మౌరీన్ ఎవరా? తమరికి కారాగార శిక్ష విధించాలి. మేడమ్ మౌరీన్ సోనియా గాంధీగారికి స్వయానా వియ్యపు రాలు. రాబర్ట్ వాద్రాకి జన్మ నిచ్చిన తల్లి. ప్రియతమ ప్రియాంకా గాంధీ అత్తగారు. మరి నాటి నుంచి మేధావులు, రాజకీయ విశ్లేష కులూ నోరెత్తలేదేం? నెహ్రూ కుటుంబం మీద భక్తా Perhaps they have the sycophancy of giv- ing in to the vageries of one family to the collective ethos of one political thinking. ఈ దేశంలో చెలరేగిన విమర్శల్లో పాక్షికమైన ‘అస హిష్ణుత’ ‘ఆత్మవంచన’ 'Intellectual hypocra- cy' స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో ‘తైతక్కలు’ ఇంకా హాస్యా స్పదం. బోగ్ రోడ్‌కి పద్మభూషణ్ బి.ఎన్.రెడ్డిగారి పేరు పెట్టారు. భేష్! ఆ మధ్య రోడ్ల పేర్లలో కులాల ప్రసక్తి రాకూడదని ఓ ద్రవిడ నాయకుడు భావిం చినట్టుంది. కనుక ‘డాక్టర్ బి.ఎన్.రెడ్డి వీధి’ కేవలం ‘డాక్టర్ బీఎన్ వీధి’ అయింది. ఈ కత్తిరింపులో తలలేదని ఎవరో ముక్కుమీద వేలేసుకుని ఉంటారు. కనుక ‘బీఎన్ వీధి’ ఏకంగా ‘నరసింహన్ వీధి’ అయింది. ఎవరీ నరసింహన్. ఇది ఎవరిని గౌరవిం చడానికి. ఈ లెక్కన ‘మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ’ పేరు కేవలం ‘కరమ్‌చంద్’ అయి కూచుం టుంది కదా? మరి ఇప్పుడే అన్నాశాలై పక్కనే ‘ముత్తు రామలింగ తేవర్ నగర్’ ఉన్నదే. ‘తేవర్’ వర్గం నోరు పెద్దదా? టీనగర్లో వ్యాసారావు స్ట్రీట్ ఉండేది. అది న్యాయంగా ‘వ్యాసా స్ట్రీట్’ కావాలి కదా? కానీ ‘వ్యాసార్ స్ట్రీట్’ అయింది. ‘వ్యాసార్’ ఎవరు? అజ్ఞానానికి పరాకాష్ట. బోర్డుమీద ‘వియా సార్ స్ట్రీట్’ అని రాశారు. మరో టర్మ్ ఉంటే రాయ పేట ‘ఎడ్డిపాడి పేట’ అయితే ఆశ్చర్యం లేదు... ఏమి ఈ సంకరం? మహానుభావుల స్మరణకి కావలసింది ఊరి పేర్లుకావు. నిశ్శబ్దంగా వెలుగునిచ్చే ఆల్వా ఎడిసన్, లూయీ పాశ్చర్, భారతీయ సంస్కృతికి ప్రాణం పోసిన ఆదిశంకరులు, కరుణకి శాశ్వతత్వాన్ని కల్పిం చిన జీసస్ వీరి పేర వీధులు, సందులూ, గొందులూ అక్కరలేదు. మహానుభావుల చిరంజీవత్వానికి లౌకి కమయిన గుర్తులు ఆయా పార్టీల ‘ప్రాథమిక’ స్థాయిని తెలుపుతాయి. మహానుభావుడు జీవించేది సైనుబోర్డుల్లో కాదు. జాతి జీవన సరళిని ఉద్బుద్ధం చేయడంలో. -గొల్లపూడి మారుతీరావు -
ఉద్ధవ్ పర్యటనకు యూపీ బ్రేక్?
సాక్షి, ముంబై : శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఈనెల 25న తలపెట్టిన అయోధ్య పర్యటనకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బ్రేక్ వేసినట్లే కనిపిస్తోంది. పర్యటనకు అనుమతివ్వాలని చాలారోజుల క్రితమే యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ను శివసేన పార్టీ నాయకులు కలసి విన్నవించినా ఇప్పటిదాకా అనుమతి ఇవ్వకపోవడం పలు చర్చలకు దారితీస్తోంది. దీంతో ఉద్ధవ్ అయోధ్య పర్యటన వివాదాస్పదమయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శివసేన పార్టీ శ్రేణులు పూర్తిచేశాయి. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా అనుమతివ్వలేదనే విషయం వెలుగులోకి రావడంతో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, పదాధికారులు ఆందోళనకు గురవుతున్నారు. దసరా రోజునే ప్రకటన.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తికావస్తోంది. ఆయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై వాద ప్రతివాదనలు సుప్రీంలో కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు ఉద్ధవ్ జోక్యం చేసుకుని ఈ నెల 25న అయోధ్య పర్యటనకు వెళ్లనున్నట్లు శివాజీపార్క్ మైదానంలో విజయదశమి రోజున జరిగిన దసరా మేళావాలో ప్రకటించారు. రామ మందిరం నిర్మాణానికి ఇటుక పేరుస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రకారం ఈ నెల 24న మధ్యాహ్నం ముంబై నుంచి బయలుదేరడానికి అవసరమైన ఏర్పట్లన్నీ దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పర్యటనను విజయంవంతం చేయడానికి పార్టీ శ్రేణులు శక్తినంత కూడగడుతున్నాయి. శివసేన నాయకులు కూడా తమ ప్రతిష్టను ఫణంగా పెట్టి ఉద్ధవ్ ఠాక్రే అయోధ్య పర్యటనను విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కావాలనే చేస్తోంది.. ఉద్ధవ్ తలపెట్టిన అయోధ్య పర్యటన ఒకవేళ విజయవంతమైతే వచ్చే ఎన్నికల్లో శివసేనకు మంచి ఫలితాలు వస్తాయని, ఇది బీజేపీకి మింగుడు పడటం లేదని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఒకట్రెండు రోజుల్లో యూపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతి లభించే అవకాశాలున్నాయనే దీమాతో శివసేన నాయకులున్నారు. ఇప్పటికే శివసేన సీనియర్ నాయకుడు అనీల్ దేశాయ్ అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు ఆయనే చూసుకుంటున్నారు. 24వ తేదీ సాయంత్రం ఉద్ధవ్ అయోధ్య చేరుకున్న తరువాత ఆయన చేతుల మీదుగా సరయూ నదీ తీరం వద్ద పూజలు చేయనున్నారు. అక్కడే మహా హారతీ నిర్వహిస్తారు. ఈ తంతు సుప్రీం కోర్టు నిఘాలో ఉంటుంది. 25న రామ జన్మభూమి స్థలాన్ని సందర్శిస్తారు. తరువాత బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్రం బయట ఉద్ధవ్ ఠాక్రే భారీ సభ జరగడం ఇదే ప్రథమం. ఒకవైపు అయోధ్య రామమందిరం విషయం బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం, మరోవైపు రామమందిరం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో ఉద్ధవ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీం అనుమతిచ్చినా.. ఉద్ధవ్ పర్యటనలో ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్ధేశంతో శివసేన ఎంపీ, పార్టీ ప్రతినిధి సంజయ్ రావుత్ రెండు వారాల కిందటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ పర్యటనకు సంబంధించిన అన్ని అనుమతులు జారీ చేస్తామని ఈ భేటీలో యోగి హామీ ఇచ్చారని శివసేన చెబుతోంది. కానీ, ఇప్పుడు కావాలనే కాలాయాపన చేస్తున్నట్లు తెలుస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సరయూ నదీ తీరంలో జరిగే కార్యక్రమాలన్నింటికీ సుప్రీం కోర్టు అనుమితులిచ్చింది. కానీ, అయోధ్య నగర నిగం, జిల్లాధికారుల నుంచి ఆ పత్రాలు లభించలేదు. దీనిపై గత బుధవారమే నలుగురు ఎస్టాబ్లిష్మెంట్ కమిషనర్లతో సమావేశం జరగాల్సి ఉంది. కానీ, ఆ సమావేశం ఇంతవరకు జరగకపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే అయోధ్య పర్యటనకు అధికారికంగా అనుమతి లభిస్తుందా..? లేదా..? అనే అంశం ఉత్కంఠగా మారింది. -
అలహాబాద్.. ఇకపై ప్రయాగ్‌రాజ్!
అలహాబాద్: చారిత్రక నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడారు. విస్తృత ఏకాభిప్రాయం తర్వాతే అలహాబాద్ పేరును మారుస్తాం. ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలన్నది ఎక్కువ మంది ప్రజల ఆకాంక్ష. అందరూ అంగీకరిస్తే ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తాం’ అని తెలిపారు. ఈ మేరకు సీఎం పంపించిన ప్రతిపాదనలకు గవర్నర్‌తో పాటు కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఇక్కడ జరగనున్న కుంభమేళాకు ముందుగానే కొత్తపేరు ప్రయాగ్‌రాజ్‌ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా–యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. -
తాజ్‌మహల్ పరిరక్షణపై సుప్రీంకోర్టు సీరియస్
-
తాజ్‌మహల్‌ను రక్షించండి లేదా కూల్చండి
న్యూఢిల్లీ: ‘ప్రపంచ వారసత్వ చిహ్నమైన చారిత్రక తాజ్‌మహల్‌ను పరిరక్షించండి లేదా కూల్చేయండి’ అని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విపరీతమైన కాలుష్యం కారణంగా తాజ్‌మహల్ రంగు మారిపోతోందని, దాన్ని సంరక్షించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. తాజ్‌మహల్ నిర్వహణ పట్ల యూపీ సర్కారు బాధ్యతాయుతంగా లేదని, సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తాజ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. దీని పరిరక్షణకు ఇప్పటివరకు కనీసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదంది. తాజ్ పరిధిలోని పారిశ్రామిక వాడల విస్తరణను నిషేధించాలన్న సుప్రీం ఆదేశాన్ని ధిక్కరించిన తాజ్ ట్రెపీజియం జోన్ చైర్మన్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈఫిల్ టవర్ కంటే అందమైంది తాజ్ టీవీ టవర్లా ఉండే ఈఫిల్ టవర్ కంటే తాజ్ అందమైందని, విదేశీ మారక ద్రవ్య సమస్యను తాజ్ తీర్చగలదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘పారిస్‌లో ఈఫిల్ టవర్ ఉంది. ఏటా ఎనిమిది కోట్ల మంది ఆ టవర్‌ను చూడటానికి వస్తారు. దానితో పోలిస్తే తాజ్ చాలా అందంగా ఉంటుంది. ఈఫిల్ టవర్ కంటే ఎనిమిది రెట్ల ప్రాధాన్యం కలిగిన తాజ్‌మహల్‌ను ధ్వంసం చేస్తున్నారు. తాజ్ వద్ద భద్రత సమస్య అధికంగా ఉంది. ఇక్కడున్న పరిస్థితుల రీత్యా అనేకమంది టూరిస్టులను, విదేశీమారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్ మహల్‌పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం కనీస చర్యలు తీసుకోలేదంది. ఈ నెల 31 నుంచి తాజ్ మహల్ అంశంపై రోజువారీ విచారణ చేపడతామని పేర్కొంది. రక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలి తాజ్ రంగు మారిపోతోందంటూ.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ దీనిపై తీసుకున్న చర్యలేంటో 2 వారాల్లో నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. తాజ్‌పై పరిశోధించడానికి, వాయు కాలుష్యంతో నష్ట శాతాన్ని అంచనా వేయడానికి కాన్పూర్ ఐఐటీ నేతృత్వంలో బృందాన్ని నియమించామన్నారు. తాజ్ మహల్ లోపల, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి గల కారణాలను గుర్తించేందుకు ఈ బృందం కృషి చేస్తోందన్నారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని ధర్మాసనానికి తెలిపారు. -
స్క్రిప్ట్‌ను పక్కాగా అమలు చేశారు : మాజీ సీఎం
లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఖాళీ చేసిన బంగ్లాలోని విలువైన వస్తువులు మాయమయ్యాయని ప్రభుత్వ అధికారులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆరోపణలపై ఆయన స్పందించారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తన పరువు తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. మీడియాను తీసుకురావడానికి ముందే ముఖ్యమంత్రి ప్రత్యేక పరిరక్షణ విధుల అధికారి అభిషేక్ ఫోన్‌తో సహా తన బంగ్లాకు వెళ్లారన్నారు. మీడియా వచ్చిన తర్వాత ఇంటిలోని వస్తువులు మాయమయ్యాయంటూ ఫొటోలు తీయించడం ఆయన స్క్రిప్ట్‌లో భాగమేనన్నారు. మీడియా కూడా ఈ కుట్రలో ప్రభుత్వానికి సహకరించిందని ఆరోపించారు. తన సొంత డబ్బుతో కొన్న, తనకు సంబంధించిన వస్తువులను మాత్రమే ఇంటి నుంచి తీసుకెళ్లానని అఖిలేశ్ తెలిపారు. కాగా అఖిలేశ్ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా గవర్నర్ రామ్ నాయక్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ విషయంపై స్పందించిన అఖిలేశ్.. రామ్‌నాయక్ స్వతహాగా మంచి వ్యక్తి అని.. కాకపోతే అప్పుడప్పుడూ ఆరెస్సెస్ ఆత్మ ఆయనలో ప్రవేశించి ఇటువంటి చిన్న చిన్న విషయాల పట్ల ఆయన వైఖరిని మారుస్తుందని వ్యాఖ్యానించారు. -
ఓట్ల కోసం అంబేడ్కర్‌ని ఏదైనా అంటారు..!!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరులో మార్పులు చేయడంపై ఆయన మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ మండిపడ్డారు. 2019 సాధారణ ఎన్నికల్లో హిందువులు, దళితుల ఓట్లకు ఎర వేయడానికి బీజేపీ అవసరమనుకుంటే అంబేడ్కర్ రాముని భక్తుడని కూడా చెప్తుందని విమర్శించారు. ‘మా తాత భీంరావ్ రామ్‌జీ అంబేడ్కర్ అని సంతకం చేసేవాడని, అయితే ఎప్పుడు అలా పూర్తి పేరుతో వ్యవహరించేవారు కాద’ని ప్రకాశ్ తెలిపారు. మహారాష్ట్రలో మిడిల్ నేమ్‌గా తండ్రి పేరును వాడుకోవడం సంప్రదాయమని అన్నారు. కానీ ఇన్నేళ్ల తర్వాత అంబేడ్కర్ పేరులో మార్పులు తేవాల్సిన అవసరమేముందని బీజీపీని ప్రశ్నించారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా చేస్తున్నదేనని ఆరోపించారు. ఆయన పేరులో మార్పుకు సంబంధించి తమ కుటుంబాన్ని సంప్రదించకపోవడం విచారకరమన్నారు.