vanama venkateswara rao
-
తెలంగాణ: బరిలో కురువృద్ధులు.. ఎవరో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో కురువృద్ధులు తమ సత్తా చాటాలనుకుంటున్నారు. అత్యధిక వయసుతో ఎలక్షన్ బరిలో దిగిన నేతల జాబితాను పరిశీలిస్తే.. 1. వనమా(బీఆర్ఎస్.. కొత్తగూడెం) వనమా వెంకటేశ్వరరావు..(78) కొత్తగూడెం ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి కూడా. ప్రస్తుత అసెంబ్లీలో అందరికంటే వయస్సులో పెద్ద నేత వనమానే కావడం గమనార్హం. వనమా 1989లో మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి.. ఒకసారి మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మళ్ళీ కొత్తగూడెం నుంచే పోటీ చేస్తున్నారు. మొదటిసారి గెలిచిన తర్వాత, రెండుసార్లు 1999లో 2004లోనూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ కి రాజీనామా చేసి, అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరే ముందు కాంగ్రెస్ లో పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఈ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్ రావుపై మెజారిటీ ఓట్లతో గెలుపొందారు. కాని, గెలిచిన అనంతరం ఆయన కాంగ్రెస్‌ను వీడి.. బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018 ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలని.. ఒకసారి అవకాశం కల్పించాలని ప్రజల ముందుకు వచ్చి విజయం సాధించారు. ఆ ఎన్నిక ప్రత్యర్థి అభ్యంతరంతో కోర్టు దాకా చేరి.. చివరకు సుప్రీంలో ఊరటతో గట్టెక్కింది. ఇక ఇప్పుడు తన తనయుడ్ని బరిలోకి దింపాలని చూసినా.. చివరకు వనమాకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. 2. మర్రి శశిధర్ రెడ్డి (బీజేపీ.. సనత్‌నగర్) సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి(74).. తండ్రి అడుజాడల్లో రాజకీయంలోకి వచ్చి నాలుగు సార్లు నెగ్గి.. రెండుసార్లు ఓటమిపాలయ్యారు.ఈయన జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ కూడా. ప్రస్తుతం సనత్‌నగర్ లో బీజేపీ నుంచి పోటీలో నిలిచారు. మొదట్లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా నెగ్గారు. మూడోసారి పోటీలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా రెండుసార్లు గెలుపొందారు. అప్పటివరకు జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థకు చైర్మన్ గా నిలిచిన శశిధర్.. 2014లో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. విజయం దక్కలేదు. ప్రస్తుతం సనత్ నగర్ నుంచే బరిలో నిలిచారాయన. 3. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్.. బోధన్) మరో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి(74).. 2023లో బోధన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. వ్యాపారి అయిన పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి.. 1989లో మొదలుపెట్టిన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (1989) బోధన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాతి ఎలక్షన్స్‌లో గెలిచి.. మరో రెండుసార్లు బోధన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. బోధన్ నుంచి పోటీలో నిలిచారాయన. 4. టీ.జీవన్ రెడ్డి (కాంగ్రెస్, జగిత్యాల) సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి (72). కాంగ్రెస్ తరఫున జగిత్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మొత్తం ఆరుసార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా ఈయన గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1983లో జరిగిన ఎన్నికల్లో నెగ్గి.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు నెగ్గి జీవన్ రెడ్డి.. 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వరుసగా మూడుసార్లు గెలిచి.. హ్యాట్రిక్ రికార్డు సాధించారు. అయితే.. 2006, 2009 కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈయన ఓటమి పాలయ్యారు. తిరిగి, 2014లో తెలంగాణ ఏర్పడ్డాక మరోసారి గెలిచారు.. 2018 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మరోసారి జగిత్యాల నుంచే బరిలో నిలిచారాయన. 5. నడిపెల్లి దివాకర్ రావు (బీఆర్ఎస్.. మంచిర్యాల) కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నడిపెల్లి దివాకర్ రావు..(71) మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా విజయం దక్కించుకున్నారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్‌లోనే వివిధ శాఖల్లో పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చాక.. మంచిర్యాల ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు ఈయనే నెగ్గారు. ప్రస్తుతం మంచిర్యాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. 6. తుమ్మల నాగేశ్వర్రావు (కాంగ్రెస్.. ఖమ్మం) తుమ్మల నాగేశ్వరరావు..(71) సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రారంభించిన ఈయన రాజకీయ జీవితం.. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గానికి చేరింది. తుమ్మల తొలి పోటీలోనే ఓటమి పలకరించింది. ఆ తరువాత 1985లో మధ్యంతర ఎన్నికల్లో విజయం అందుకున్నారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికైయ్యారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక బీఆర్ఎస్కు మారిన అనంతరం.. 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో ఉప ఎన్నికలో పోటీ చేసి నెగ్గారు. తెలంగాణ 2018 ఎన్నికల్లో.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ చేరి ఖమ్మం బరిలో నిలిచారు. 7. బాబూ మోహన్ (బీజేపీ.. ఆందోల్) సినీ నటుడైన బాబూ మోహన్..(71) సీనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడంతో పాటు మంత్రిగానూ అవకాశం అందుకున్నారు. ఆపై 2014లో బీఆర్ఎస్లో చేరారు. అటుపై బీజేపీ కండువా కప్పేసుకుని.. ఆందోల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం, సంగారెడ్డి ఆందోల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలిచారు. 8. రేవూరి ప్రకాష్ రెడ్డి (కాంగ్రెస్.. పరకాల) సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి..(71) టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీడీపీలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రకాష్ రెడ్డిని వరంగల్ రూరల్ నియోజకవర్గం పరకాల అభ్యర్థిగా ప్రకటించింది. 9. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్.. సూర్యాపేట) సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి..(71).. ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ట్రాక్ ఈయనది. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. తుంగతుర్తి, సూర్యాపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సూర్యాపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. 10. ముఠా గోపాల్ (బీఆర్ఎస్.. ముషీరాబాద్) ముఠా గోపాల్..(70) రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 ఎన్నికలో ఓడినా.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 11. మంచి రెడ్డి కిషన్ రెడ్డి (బీఆర్ఎస్.. ఇబ్రహీంపట్నం) మంచి రెడ్డి కిషన్ రెడ్డి..(70) టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసి 2009, 2014 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తరువాత టీడీపీని వీడి బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి 376 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నారాయన. -
ఎమ్మెల్యేగా గెలిచినా..ఓడిపోతారు!
వనమా వెంకటేశ్వరరావు.. 2018లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల అఫిడవిట్లో వనమా తప్పుడు సమాచారం ఇచ్చారని, కొన్నిచోట్ల ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారని జలగం వెంకట్రావు హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపినన్యాయస్థానం.. వనమా ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రూ.5 లక్షల జరిమానా విధించింది. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఈసీని ఆదేశించింది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. 2018లో గద్వాల్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో కృష్ణమోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రూ.2.5 లక్షల జరిమానా కూడా విధించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆదేశించింది ఆ అభ్యర్థులిద్దరూ శాసనసభ్యులుగా విజయం సాధించిన వారే. ప్రజాఓటుతో గెలిచిన వారే. వారికి వచ్చిన ఓట్లను కోర్టు ఎక్కడా తప్పుబట్టలేదు. కానీ, అఫిడవిట్లో అన్ని అంశాలూ పేర్కొనలేదని, కొన్ని తప్పులుగా పేర్కొన్నారన్న కారణంగా వారిపై వేటు వేసింది. వారి తర్వాత రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులకు విజయం కట్టబెడుతూ కోర్టు తీర్పునిచ్చింది. ఇలా ఈ రెండు పిటిషన్లే కాదు.. దాదాపు 30 వరకు పిటిషన్లు హైకోర్టులో నమోదయ్యాయి. వనమా, బండ్ల, శ్రీనివాస్‌గౌడ్ కేసుల్లో విచారణ పూర్తయి తీర్పు వచ్చింది. ఇతర పిటిషన్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ♦ ఒకసారి కంటే ఎక్కువసార్లు పోటీ చేస్తున్న అభ్యర్థులైతే గతంలో వేసిన అఫిడవిట్‌తో ఈసారిఅఫిడవిట్ను సరిచూసుకోవాలి. ♦ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కేసులున్నాయో.. లేదో..తెలుసుకోవాలి. ♦ సొంత ఆస్తులేకాదు.. కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఇది స్థిర, చర ఆస్తులకు కూడా వర్తిస్తుంది. ♦ కంపెనీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు తదితర వివరాలను పొందుపర్చాలి ♦ ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, రుణాలు, వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం వివరాలను స్పష్టంగా పేర్కొనాలి ♦ మోటారు వాహనాలు, నగలు, బులియన్, ఇతర విలువైన వస్తువులు తూకంతో సహా వెల్లడించాలి 2018 ఎన్నికల తర్వాత 30కిపైగా పిటిషన్లు.. తప్పుడు అఫిడవిట్ల కారణంగా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇలా ఒకటి రెండేళ్లు కాదు.. ఏళ్ల కొద్దీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఏ మాత్రం తప్పని తేలినా వేటు పడక తప్పదు. తీర్పు వచ్చే వరకు మనశ్శాంతి ఉండదు. 2018 ఎన్నికలే కాదు... గతంలోనూ ఇలా కులం, ఆస్తుల విషయంలో కోర్టు చుట్టూ తిరిగిన వారున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైకోర్టులో 30కుపైగా పిటిషన్లు దాఖలు కాగా.. అందులో 25కుపైగా పిటిషన్లు ఒకే పార్టీకి చెందిన నేతలపై దాఖలయ్యాయి. పలువురు మంత్రులపై కూడా ఎన్నికల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్‌పై తీర్పు రాగా.. కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఎన్నికపై వివాదం నడుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తర్వాత వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించి.. స్టే తెచ్చుకున్నారు. ఇక చెన్నమనేని రమేశ్, మర్రి జనార్దన్, ముత్తిరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొందరిపై హైకోర్టులో పిటిషన్లు నడుస్తున్నాయి. అన్నీ సరిచూసుకుని వివరాలివ్వాలి రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 3న వెలువడనుంది. అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే వివిధ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించనున్నారు. వారి స్థిర, చర ఆస్తులు, అప్పుల అఫిడవిట్లు అందజేస్తారు. ఈ అఫిడవిట్ల సమర్పించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ తెలిపింది. కేసులు, తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు.. ఇలా అన్ని అంశాలను సరి చూసుకుని అఫిడవిట్ అందజేయాలి. లేదంటే తర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తోంది. గత 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారంటూ పదుల సంఖ్యలో కేసులు హైకోర్టులో దాఖలయ్యాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే దాఖలు చేసిన ఈ కేసులు ఇప్పటికి కొన్ని పూర్తవ్వగా, ఇంకా కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని అంశాలను పరిశీలించి అఫిడవిట్ వేయకుంటే శాసనసభ్యుడిగా గెలిచినా.. వేటు పడే అవకాశం ఉంది. - గండ్రాతి అరవింద్‌రెడ్డి -
BRS List: వివాదాలున్నా... వాళ్లకే టికెట్లు
సాక్షి, హైదరాబాద్: విజయంపై పూర్తి ధీమాతో ఉన్నామని, అందుకే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. అలాగే తమది క్రమశిక్షణ ఉన్న పార్టీ అని, పూర్తి స్థాయి వడపోత తర్వాత అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారాయన. అందుకే కేవలం.. ఏడు మార్పులు మాత్రమే చేసినట్లు హైలెట్ చేశారు. అయితే.. చెన్నమనేని లాంటి ఉత్తముడికి పౌరసత్వ వివాదం కారణంగా సీటు కేటాయించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు మాత్రం గట్టి షాకే ఇచ్చారు. ఒకవైపు మహిళా సర్పంచ్ ఆరోపణలు, మరోవైపు కడియంతో పొసగక పోవడం.. చివరకు పిలిపించుకుని అధిష్టానం మందలించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. దీంతో.. ఆయన స్థానంలో అంతే దూకుడుగా ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్న కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది. అయితే.. ఏకంగా లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. శేజల్ అనే బాధితురాలు వరుసగా చిన్నయ్యపై ఆరోపణలు చేయడం, ఏకంగా ఆత్మహత్యకు యత్నించడం, ఢిల్లీకి చేరి చిన్నయ్యపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ అధినేతకు సైతం విజ్ఞప్తి చేస్తూ రకరకాల రూపాల్లో నిరసనలు కొనసాగించింది. అయినా కూడా దుర్గయ్యకే మరో అవకాశం ఇచ్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా విషయంలోనూ అలాగే జరిగింది. పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు ఏకంగా అరెస్ట్ అయ్యాడు. ఈ వివాదం ఆధారంగా ప్రతిపక్షాలు ఎమ్మెల్యేపై పలు ఆరోపణలతో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి కూడా. మరోవైపు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు ఏకంగా హైకోర్టు ఆయన ఎమ్మెల్యే ఎన్నికపై అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది కూడా. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం వనమాకే మళ్లీ టికెట్ కేటాయించడం గమనార్హం. వీళ్లతో పాటు చిన్న చిన్న వివాదల్లో నిలిచిన మరికొందరికి.. పెద్ద కంప్లయింట్లాగా పరిగణించకుండానే అసెంబ్లీ టికెట్ తిరిగి కేటాయించడం గమనార్హం. మరోవైపు జనగాంలో కిరికిరి జరుగుతున్న నేపథ్యంలో ఆ టికెట్‌ను జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇవ్వకుండా.. పెండింగ్‌లో ఉంచినట్లు బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. ముత్తిరెడ్డి చుట్టూ వివాదాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: కల్వకుంట్ల కవితకు టికెట్ అందుకే ఇవ్వలేదా? బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా.. 1. శ్రీ. కోనేరు కోనప్ప, సిర్పూర్ 2. శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ (SC) 3. శ్రీ దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC) 4. శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల 5. శ్రీమతి కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ) 6. శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST) 7. శ్రీ జోగు రామన్న, ఆదిలాబాద్ 8. శ్రీ అనిల్ జాదవ్, బోత్ (ST) 9. శ్రీ. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ 10. శ్రీ గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే 11. శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ 12. శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్ 13. శ్రీ హన్మంత్ షిండే, జుక్కల్ (SC) 14. శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ 15. శ్రీ జాజాల సురేందర్, ఎల్లారెడ్డి 16. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి 17. శ్రీ బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ 18. శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్ 19. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ 20. శ్రీ డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల 21. శ్రీ డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల 22. శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC) 23. శ్రీ కోరుకంటి చందర్, రామగుండం 24. శ్రీ పుట్ట మధు, మంథని 25. శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి 26. శ్రీ గంగుల కమలాకర్, కరీంనగర్ 27. శ్రీ సుంకే రవిశంకర్, చొప్పదండి (SC) 28. శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ 29. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల 30. శ్రీ ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC) 31. శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ 32. శ్రీ వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్ 33. శ్రీ తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట 34. శ్రీమతి ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ 35. శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్ 36. శ్రీ చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC) 37. -------------------- నర్సాపూర్ (పెండింగ్) 38. శ్రీ కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC) 39. శ్రీ చింతా ప్రభాకర్, సంగారెడ్డి 40. శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు 41. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక 42. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్ 43. శ్రీ చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్ 44. శ్రీ మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి 45. శ్రీ కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్ 46. శ్రీ మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి 47. శ్రీ బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్ 48. శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం 49. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్ 50. శ్రీ పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం 51. శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ 52. శ్రీ అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి 53. శ్రీ కాలె యాదయ్య, చేవెళ్ల (SC) 54. శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి 55. శ్రీ డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC) 56. శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు 57. శ్రీ ముటా గోపాల్, ముషీరాబాద్ 58. శ్రీ తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట 59. శ్రీ కాలేరు వెంకటేష్, అంబర్పేట్ 60. శ్రీ దానం నాగేందర్, ఖైరతాబాద్ 61. శ్రీ మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్ 62. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్‌నగర్ 63. -------------నాంపల్లి (పెండింగ్) 64. శ్రీ ఐందాల కృష్ణయ్య, కార్వాన్ 65. ---------------- గోషామహల్(పెండింగ్) 66. శ్రీ ఇబ్రహీం లోడి, చార్మినార్ 67. శ్రీ ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట 68. శ్రీ సామ సుందర్ రెడ్డి, యాకుత్‌పురా 69. శ్రీ అలీ బక్రి, బహదూర్‌పురా 70. శ్రీ టి పద్మారావు, సికింద్రాబాద్ 71. జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC) 72. శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ 73. శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట 74. శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్ 75. శ్రీ చర్లకోల లక్ష్మ ర్‌రెడ్డి, జడ్చర్ల 76. శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర 77. శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్ 78. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి 79. శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ 80. శ్రీ వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC) 81. శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ 82. శ్రీ గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC) 83. శ్రీ గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి 84. శ్రీ అంజయ్య యెలగానమోని, షాద్‌నగర్ 85. శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ 86. శ్రీ రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ) 87. శ్రీ నోముల భగత్, నాగార్జున సాగర్ 88. శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ 89. శ్రీ శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ 90. శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ 91. శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట 92. శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ 93. శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు 94. శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి 95. శ్రీ చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC) 96. శ్రీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC) 97. శ్రీమతి గొంగిడి సునీత, అలైర్ 98. ------------- జనగాం(పెండింగ్) 99. శ్రీ కడియం శ్రీహరి, ఘన్పూర్ స్టేషన్ (SC) 100. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి 101. శ్రీ D.S. రెడ్యా నాయక్, డోర్నకల్ 102. శ్రీ బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST) 103. శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట 104. శ్రీ చల్లా ధర్మారెడ్డి, పర్కల్ 105. శ్రీ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్ 106. శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు 107. శ్రీ అరూరి రమేష్, వర్ధన్నపేట (SC) 108. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి 109. శ్రీమతి బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ) 110. శ్రీ రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ) 111. శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ) 112. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం 113. శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు 114. శ్రీ లింగాల కమల్ రాజు, మధిర (SC) 115. శ్రీ బానోత్ మదన్‌లాల్, వైరా (ST) 116. శ్రీ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC) 117. శ్రీ వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం 118. శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ) 119. శ్రీ డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ) -
కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!
కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంలో నాలుగోసారి విజయం సాదించారు. గతంలో ఆయన 1989, 1999, 2004లలో గెలుపొందారు. ఈసారి ఆయన టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావుపై 4139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాని ఆ తర్వాత వనమా కూడా టిఆర్ఎస్ లోకి మారిపోయారు. వనమాకు 81118 ఓట్లు రాగా, జలగం వెంకటరావుకు 76979 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎల్ ఎఫ్ అభ్యర్దిగా పోటీచేసిన యడవల్లి కృష్ణకు 5400 ఓట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 2014లో టిఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక నేతగా జలగం వెంకట్రావు ఉన్నారు. కొత్తగూడెం నుంచి ఆయన ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి 26521 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. సత్తుపల్లిలో ఒకసారి గెలుపొందిన ఆయన తర్వాత పరిణామాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అనతరం టిఆర్ఎస్లో చేరి విజయం సాధించారు. ఇక్కడ టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన కోనేరు సత్యనారాయణకు 28363 ఓట్లు, సిపిఐ పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు 20,994 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన అడవల్లి కృష్ణకు 22989 ఓట్లు వచ్చాయి. వెంకటరావు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును ఓడిరచారు. 2018లో వనమా కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి జలగం వెంకటరావును ఓడిరచారు. తదుపరి టిఆర్ఎస్లోకి వనమా కూడా మారిపోయారు. వనమా నాలుగు సార్లు కొత్తగూడెంకు ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల నాటికి వై.ఎస్ క్యాబినెట్లో మంత్రిగా వనమా ఉన్నారు. ఆయన 1989, 1999, 2004లలో గెలుపొంది, 2009, 2014లలో ఓడిపోయారు. 2018లో గెలిచారు. కొత్తగూడెం నియోజకవర్గానికి కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, జనతా ఒకసారి, టిడిపి మూడుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి గెలు పొందింది. గతంలో ఉన్న పాల్వంచ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మూడుసార్లు గెలిస్తే, అవిభక్త సిపిఐ ఒకసారి గెలిచాయి. వనమా కొత్తగూడెంలో నాలుగుసార్లు గెలిస్తే, టిడిపి నేత కోనేరు నాగేశ్వరరావు మూడుసార్లు గెలిచారు. 2009లో సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు ఒకసారి గెలిచారు. ప్రముఖనేత చేకూరి కాశయ్య కొత్తగూడెంలో ఒకసారి, పాల్వంచలో ఒకసారి గెలిచారు. ఈయన జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. టిడిపి నేత కోనేరు నాగేశ్వరరావు కొంతకాలం ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో ఉన్నారు. కొత్తగూడెంలో ఎనిమిదిసార్లు కమ్మ సామాజికవర్గంం,నాలుగుసార్లు మున్నూరు కాపు, ఒకసారి వెలమ, ఒకసారి బ్రాహ్మణ సామాజికవర్గం గెలుపొందింది. వనమా వెంకటేశ్వరరావు మున్నూరు కాపువర్గానికి చెందినవారు. జలగం వెంకటరావు వెలమ సామాజికవర్గానికి చెందినవారు. కొత్తగూడెం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. అనర్హత వేటుపై స్టే
-
బీఆర్ఎస్లో బిగ్ ట్విస్ట్.. వనమా సంచలన కామెంట్స్
సూపర్‌బజార్ (కొత్తగూడెం): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలోనూ తానే పోటీ చేస్తానని, ఇక్కడి ప్రజల నుంచి తనను ఎవరూ విడదీయలేరని వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కాగా, ఆయన పదవి విషయంలో సుప్రీంకోర్టు నుంచి స్టే లభించిన అనంతరం తొలిసారి గురువారం ఆయన కొత్తగూడెంకు రాగా, జూలూరుపాడు వద్ద ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్తగూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ, దేవుడి ఆశీర్వాదం, సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో పాటు కార్యకర్తలు, ప్రజల అండతో తనకు అంతా మంచే జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల కోసం నేటి నుంచే కార్యాచరణకు దిగుతానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారని, జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటానని అన్నారు. ర్యాలీగా సందడి.. ఇక, కొత్తగూడెం వచ్చిన వనామా.. మొదట జూలూరుపాడు సాయిబాబా ఆలయంలో, ఆ తర్వాత సుజాతనగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి ప్రధాన సెంటర్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యానగర్ కాలనీ, పోస్టాఫీస్ సెంటర్లో వనమాకు క్రేన్‌తో భారీ గజమాల వేశారు. ప్రదర్శనకు ముందు గిిరిజన సంప్రదాయనృత్యాలు, కోలాటాలు అలరించాయి. వనమాకు స్వాగతం పలుకుతూ పలు సెంటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా చాలా చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గణేష్ టెంపుల్ ఏరియాలో అంబులెన్స్ ర్యాలీ మధ్యలో ఇరుక్కోగా పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి ఆ వాహనాన్ని పంపించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి జేవీఎస్ చౌదరి, వనమా తనయులు రాఘవేందర్రావు, రామకృష్ణతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నిజామాబాద్ ఎంపీగా గెలుస్తా -
వివాదాలు వద్దు.. ఎన్నికలపై దృష్టి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యేగా అనర్హత కేసులో సుప్రీంకోర్టులో ఊరట పొందిన బీఆర్ఎస్ శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు బుధవారం సీఎం, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావును కలుసుకున్నారు. తొలుత మంగళవారం సాయంత్రమే ప్రగతిభవన్‌లో చ్చింను తన కుమారుడు రామకృష్ణతో పాటు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎం సూచన మేరకు తిరిగి బుధవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వెళ్లిన వనమా వెంకటేశ్వరరావు చ్చింతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రాజకీయ స్థితిగతులను వనమా వివరించినట్లు సమాచారం. ఇటీవల వనమాను హైకోర్టు ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. కేసు విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలు వాయిదా వేయడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రతి వాదులకు రెండు వారాలు గడువిచ్చింది. చ్చింతో జరిగిన భేటీలో హైకోర్టు, సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను, నియోజకవర్గ విషయాలను వనమా వివరించినట్లు సమాచారం. నేడు కొత్తగూడెంకు రానున్న వనమా..భారీ స్వాగతానికి సన్నాహాలు వనమాకు ఊరటనిస్తూ సుప్రీం తీర్పు నేపథ్యంలో బుధవారం కొత్తగూడెం నియోజకవర్గంలో ఆయన అనుచరులు సంబురాలు చేసుకున్నారు. హైకోర్టు తీర్పు, ఇతర అంశాల నేపథ్యంలో నియోజకవర్గాని కి కొంతకాలంగా దూరంగా ఉన్న వనమా గురువా రం కొత్తగూడెం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ నాయకు లు కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. సుజాతనగర్ మండలం నాయకులు గూడెం వద్ద భారీ ఊరేగింపుతో వనమాకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటు వనమా, అటు జలగం.. అధినేత ఎటో? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొంది ఆ తరువాత బీఆర్ఎస్లో చేరారు. ఆయనపై ఓటమి పొందిన బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు వనమాపై 2019లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు వనమాను 2018 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ జలగం వెంకట్రావు అటు ఎన్నికల సంఘాన్ని, ఇటు అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కలిశారు. అయితే వనమా సుప్రీంకోర్టు నుంచి నాలుగు వారాల పాటు స్టే పొందడంతో కొత్తగూడెం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటు ఎమ్మెల్యే వనమా, అటు జలగం వెంకట్రావు ఇద్దరూ బీఆర్ఎస్లోనే కొనసాగుతూ ఉండడంతో అధినేత చ్చిం అనుసరించే వైఖరిపై ఉత్కంఠ నెలకొంది. సర్వేలు, పనితీరు ఆధారంగానే టికెట్లు సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. టికెట్ల కేటాయింపు అంశం పూర్తిగా సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. నియోజకవర్గంలో వివాదాల జోలికి వెళ్లకుండా ఎన్నికలపై దృష్టి పెట్టి కేడర్‌ను సన్నద్ధం చేసుకోవాల్సిందిగా చ్చిం ఆదేశించినట్టు చెబుతున్నారు. -
సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా
-
వనమాకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వనమా వెంకటేశ్వరావుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వనమా పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదంటూ కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై వనమా మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులకు అప్పీల్‌కు వెళ్లే వరకు స్టే విధించాని వనమా.. కోర్టును కోరారు. దీంతో, వనమా పిటిషన్‌కు హైకోర్టు కొట్టివేసింది. వనమా పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదిలా ఉండగా.. కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు జలగం వెంకట్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్‌తో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు -
‘కొత్తగూడెం’ తీర్పుపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వా లని కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నామని, దీని కోసం స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘జలగం వెంకట్రావు ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు నాకు అనుకూలంగా తీర్పునిస్తే.. అప్పుడు నాకు అన్యాయం జరిగినట్లు అవుతుంది. ఎన్నికైన నాటి నుంచి శాసనసభ్యుడిగా సేవలందిస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తీర్పును సవాల్ చేసే వరకు అమలుపై స్టే ఇవ్వాలి. ఈ ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ కోర్టు ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ ఇంకా అందలేదు.. దీంతో అప్పీల్‌కు సమయం పట్టే అవకాశం ఉంది.అప్పీల్ చేసే వరకు చట్టప్రకారం 30 రోజుల పాటు తీర్పును నిలిపివేయాలి. సర్టిఫైడ్ కాపీ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి బుధవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయనున్నామని, అప్పటివరకు స్టే ఇవ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. స్టే ఇవ్వడంతో మీకు వచ్చే ఇబ్బంది ఏమిటని జలగం తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దాదాపు మరో 4 నెలల కాలం మాత్రమే ఉందని, ఇప్పుడు బాధ్యతలు చేపట్టకపోతే ఆ కొద్ది నెలల కాలం కాస్త పూర్తయ్యే అవకాశం ఉందని న్యాయవాది బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని.. 2018, డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వనమా.. హైకోర్టు ఆర్డర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన జలగం వెంకట్రావ్ మరోవైపు, సీఈవో వికాస్‌రాజ్‌ను జలగం వెంకట్రావు కలిశారు. సీఈవోకు హైకోర్టు తీర్పు కాపీని అందజేశారు. వనమాపై అనర్హత వేటుతో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలి జలగం కోరారు. కాగా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతవేటు వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. వనమా గెలుపుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు జలగం. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆస్తులు సక్రమంగా చూపించలేదనే అభియోగాలు ఉన్నాయి. వీటిని నిజమని తేల్చిన న్యాయస్థానం ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: కలసిరాని మంత్రి పదవి... ఎమ్మెల్యేగా గెలిచినా తప్పని తలనొప్పులు అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకుగానూ రూ. 5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇక డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావ్‌ను ఎమ్మెల్యేగా డిక్టేర్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఇప్పుడు ఏం చేద్దాం?
-
కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు జరిగిన నాలుగున్నరేండ్ల తర్వాత ఎట్టకేలకు జలగం వెంకట్రావ్ గెలిచారు. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు, జలగం వెంకట్రావ్నే ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావ్ బుధవారం ఉదయం అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఈ సందర్బంగా కోర్టు తీర్పు కాపీని అసెంబ్లీ సెక్రటరీకి జలగం అందించారు. ఈ క్రమంలో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరారు. ఈ సందర్బంగా జలగం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు నన్ను ఎమ్మెల్యేగా గుర్తించింది. ఈ క్రమంలోనే కోర్టు తీర్పు ప్రకారం.. నన్ను ఎమ్మెల్యేగా గుర్తించాలని స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీని కలిసి కోరాను. 2014లో నేను ఏ ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ పార్టీలో చేరానో అదే విధంగా ఇప్పుడు కూడా పార్టీ కోసం శ్రమిస్తాను అని స్పష్టం చేశారు. నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. నేను పార్టీలోనే ఉన్నాను. కేసీఆర్.. నన్ను పిలిచిన ప్రతీసారి నేను కలవడం జరిగిందన్నారు. నేను బీఆర్ఎస్ బీ ఫామ్ మీదనే గెలిచాను అని వెల్లడించారు. ఇదే సమయంలో ఈరోజు సాయంత్రం సీఈవో వికాస్ రాజ్‌ను కలవనున్నట్టు వెంకట్రావ్ కలవనున్నారు. ఇదిలా ఉండగా.. 2018లో వనమా వెంకటేశ్వర్రావు ఈసీకి సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్లో తప్పులను దొరకబట్టిన జలగం, నాలుగేండ్లుగా న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ వార్తలు.. స్పందించిన ఎంపీ ఉత్తమ్ -
కలసిరాని మంత్రి పదవి... ఎమ్మెల్యేగా గెలిచినా తప్పని తలనొప్పులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వనమా వెంకటేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. ఆయన జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే మంత్రి పదవి రాక ముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా స్పష్టమైన విభజన రేఖ గీయొచ్చు. ప్రజల మధ్యే ఉంటూ.. పాల్వంచ పారిశ్రామికంగా ఎదుగుతున్న తరుణంలో వార్డు సభ్యుడిగా వనమా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రజల్లోనే ఉండేవారు. ప్రతిరోజూ ద్విచక్ర వాహనంపై పంచాయతీ పరిధిలో అన్ని వార్డులు, గ్రామాలకు వెళ్లి వచ్చేవారు. ఆ తర్వాత సర్పంచ్‌గా ఎన్నికై న వనమా చేస్తున్న కృషిని అప్పటి కలెక్టర్లు ఈమని పార్థసారధి, పీవీఆర్కే ప్రసాద్ మెచ్చుకున్నారు. ఆ రోజుల్లోనే మూడుసార్లు ఉత్తమ సర్పంచ్‌గా నాటి గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పరకాల శేషాచలం చే తులమీదుగా బంగారుపతకాలను అందుకున్నారు. ఆ తర్వాత అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రో త్సాహంతో చిన్న వయసులోనే భూ తనఖా (ల్యాండ్ మార్టిగేజ్) బ్యాంక్‌కు చైర్మన్‌గా ఎన్నికై ప్రతిభ చూపారు. 1989లో కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. రికార్డుస్థాయిలో ఇళ్ల మంజూరు.. పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు రికార్డు స్థాయిలో కొత్తగూడెం నియోజకవర్గానికే 18 వేల ఇళ్లు మంజూరు చేయించి రికార్డు సృష్టించారు. ఇది చూసి అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైతం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ మంత్రి వర్గంలో వైద్య విధాన పరిషత్ మంత్రిగా పని చేశారు. పాల్వంచ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశారు. నియోజకవర్గ ప్రజల తలలో నాలుకగా ఉంటూ వచ్చారు. మంత్రిగా పోటీ చేసి ఓటమి.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హోదాలో పోటీ చేసిన వనమా ఓడిపోయారు. ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా పోటీ చేయగా సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చేతిలో వనమా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వనమాకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. వరుసగా రెండు ఓటముల తర్వాత చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో 2018లో ఇవే తనకు చివరి ఎన్నికలంటటూ హస్తం గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికే కరోనా కారణంగా ప్రజల్లో ఎక్కువగా తిరగలేకపోయారు. ఆ వెంటనే వనమా కుమారుడు రాఘవపై పోలీస్ కేసులు నమోదు కావడం ఆయనకు ఇబ్బందులు తెచ్చింది. ఇటీవల కాలంలో కొత్తగూడెం టికెట్ కోసం గులాబీ పార్టీలోనే ఆశావహుల నుంచి పోటీ ఎక్కువైంది. తీవ్రమైన పోటీని తట్టుకుంటూ మరోసారి కొత్తగూడెం నుంచి కారు గుర్తుపై పోటీ చేసేది తానేనంటూ వనమా ధీమా ప్రకటించారు. ఈ తరుణంలో అనూహ్యంగా అనర్హత వేటుకు గురయ్యారు. -
సంచలనం.. కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు జోక్యంతో.. రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతవేటు వేస్తున్నట్లు ప్రకటించింది ఉన్నత న్యాయస్థానం. ఈ క్రమంలో సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. వనమా గెలుపును ఆశ్రయిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు జలగం. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆస్తులు సక్రమంగా చూపించలేదనే అభియోగాలు ఉన్నాయి. వీటిని నిజమని తేల్చిన న్యాయస్థానం ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకుగానూ రూ. 5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇక డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావ్‌ను ఎమ్మెల్యేగా డిక్టేర్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నుంచి 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999,2004లోనూ ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన .. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పని చేశారు. ఇక 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా.. ఆపై బీఆర్ఎస్లో చేరారు. 4,120 ఓట్ల తేడాతో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్‌పై నెగ్గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు తనయుడే జలగం వెంకట్రావ్. ఈయన సోదరుడు జలగం ప్రసాద రావు సైతం మాజీ మంత్రి. కాంగ్రెస్ తరపున 2004లో తొలిసారి ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు వెంకట్రావ్. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీ(బీ)ఆర్ఎస్ తరపున పోటీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ టైంలో ఖమ్మం(ఉమ్మడి) నుంచి టీఆర్ఎస్(బీఆర్ఎస్) తరపున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. -
‘ఎమ్మెల్యే వనమాకు ఇంకా రాజకీయాలెందుకు?’
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మరోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి వనమా వెంకటేశ్వర రావును టార్గెట్ చేసి శ్రీనివాస రావు పొలిటికల్ కామెంట్స్ చేశారు. కాగా, శ్రీనివాస్ రావు ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వనమా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి. వనమాకు ఇంకా రాజకీయాలు ఎందుకు? అని సంచలన కామెంట్స్ చేశారు. గత ఎన్నికలే నాకు లాస్ట్ ప్లీజ్ అని అప్పుడు వనమా అన్నారు. 80ఏళ్ళు వచ్చాయి ఇక రిటైర్మెంట్ తీసుకోవాలి అని సూచించారు. ఇదే క్రమంలో వనమాకు కౌంటర్ ఇచ్చారు. మంచి చేయడానికి వస్తే అడ్డుకుంటారా. మంచి చేయాలనుకునే వారిని అనుసరించాలనుకునే వారిని అడ్డు కోవడం ఏం నీతి? అని ప్రశ్నించారు. అందరినీ ఫోన్లో బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు.. నేను ఉల్వనూరులో ఇల్లు కట్టుకుంటాను. నా శరీరం ఇక్కడి మట్టిలో కలిపోతుందని ఉద్వేగంతో కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కొత్త కొత్తగూడెంను నిర్మించుకుందామని అన్నారు. మీరంతా నాతో కలిసి నడవడానికి సిద్దంగా ఉన్నారా? అన్ని ప్రశ్నించారు. నాతో మద్దతు తెలిపే వారు చేతులెత్తండి అని.. ఆ వెంటనే అందరూ చేతులెత్తాలని సూచించారు. ఇక, శ్రీనివాస రావు కామెంట్స్‌తో కొత్తగూడెంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇది కూడా చదవండి: కిషన్‌రెడ్డి సంచలన కామెంట్స్ -
నిత్యం ప్రజల్లోనే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : సుఖసంతోషాల్లోనే కాదు.. కష్టనష్టాల్లోనూ ప్రజల మధ్య మెదిలే నాయకుడిగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు పేరుంది. ప్రజస్వామ్యంలో వార్డు సభ్యుడి నుంచి మంత్రి వరకు అనేక పదవులు ఆయన సొంతం చేసుకున్నారు. వార్డు సభ్యుడిగా చిన్న స్థాయిలో ఉన్నా, మంత్రిగా ఉన్నత పదవులు అలంకరించినా గర్వం లేని ప్రజాప్రతినిధిగా ఆయన గురించి చెప్పుకుంటారు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో అతి పెద్ద వయస్కుడైన ఎమ్మెల్యేగా వనమా కొనసాగుతున్నారు. 50 ఏళ్ల ఆయన రాజకీయ ప్రస్థానం, గుర్తింపు తెచ్చిన ఘటనలు తదిరత అంశాలను ఈ ఆదివారం ప్రత్యేకంగా సాక్షి పాఠకుల కోసం ఆయన మాటల్లోనే.. నలుగురిలో ఒకడిగా నా తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, నాగభూషణం. పాత పాల్వంచలో మాకు పెద్ద ఎత్తున సాగు భూమి ఉండేది. ఇల్లు, పొలంలో కలిపి పద్దెనిమిది మంది పాలేర్లు పని చేసేవారు. పాత పాల్వంచలో ఎకరం విస్తీర్ణంలో ఇల్లు ఉండేది. చుట్టు పక్కల ఉన్న ఊళ్లకు మా నాన్న పెద్ద మనిషిగా వ్యవహరించేవారు. ఎవ రి ఇళ్లలో శుభకార్యం జరిగినా ఇంటికి వచ్చి పిలిచేవారు. ఫంక్షన్ ఖర్చులకు అమ్మానాన్న సాయం చేసేవారు. ఎవరిళ్లలో ఏదైనా కీడు జరిగితే మా అమ్మే అన్నం వండి కావళ్లలో వారి ఇంటికి పంపేది. అలా మా ఇల్లు ఎప్పుడూ కోలాహలంగా ఉండేది. గద్దెల మీద జనాలు ఎప్పుడూ కూర్చుని ఉండేవా ళ్లు. వాళ్లతో కలిసిపోయి, వాళ్ల కష్టాలు విని నాన్నకు చెప్పేవాడిని. అలా ప్రజలతో మమేకం అవడం నాకు చిన్నతనం నుంచే అబ్బింది. విద్యార్థి దశలో ఉండగా నేలకొండపల్లిలో మా మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు శ్రీశ్రీ, దాశరథి వంటి మహామహులు హాజరయ్యారు. అభివృద్ధికి కేరాఫ్‌గా పాల్వంచ పాల్వంచ పంచాయతీ ప్రెసిడెంట్‌గా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ రాష్ట్రంలోనే నంబర్ వన్ పంచాయతీగా పాల్వంచకు గుర్తింపు తీసుకొచ్చాను. గ్రామాల్లో సమస్యలు ఎలా పరిష్కరించాలి, ఎలా అభివృద్ధి చేయాలనే అంశాలను పరిశీలించేందుకు ఇతర పంచాయతీల సర్పంచ్‌లను పాల్వంచకు వెళ్లి చూడమంటూ అప్పటి కలెక్టర్ ఈమని పార్థసారధి సూచించేవారు. ఆ తర్వాత కలెక్టర్‌గా వచ్చిన పీవీఆర్కే ప్రసాద్ సైతం నాపై ప్రత్యేక అభిమానం చూపించేవారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్లేప్పుడు పాల్వంచలో కచ్చితంగా ఆగేవారు. నేను అందించే ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేసేవారు. అప్పటి కొత్తగూడెం ఎమ్మెల్యే పానుగంటి పిచ్చయ్య సైతం ప్రజాకార్యక్రమాల్లో తన వెంట తిప్పుకుంటూ అవసరమైన మేరకు రాజకీయ శిక్షణ ఇచ్చేవారు. పాల్వంచను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఉత్తమ పంచాయతీ ప్రెసిడెంట్‌గా అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పరకాల శేషాచలం చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాను. సంజయ్‌గాంధీ పర్యటనతో.. ప్రెసిడెంట్‌గా వచ్చిన గుర్తింపుతో చిన్న వయసులోనే భూ తనఖా (ల్యాండ్ మార్టిగేజ్) బ్యాంక్‌కు చైర్మన్‌గా నియమించారు. అప్పుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా జలగం ప్రసాదరావు, జనరల్ సెక్రటరీగా నేను ఉండేవాళ్లం. ఆ రోజుల్లో ముఖ్య మంత్రిగా జలగం వెంగళరావు పని చేస్తున్నారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ పాల్వంచ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి కిన్నెరసాని వరకు భారీ మోటార్ వెహికిల్ ర్యాలీని యూత్ కాంగ్రెస్ ఆ«ధ్వర్యంలో చేపట్టాను. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో సంజయ్‌గాంధీ హవా కొనసాగుతుండేది. కిన్నెరసాని పర్యటనతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో నా గురించి చర్చ మొదలైంది. మంచి గుర్తింపు దక్కింది. హత్యాప్రయత్నమూ చేశారు.. పాల్వంచ పంచాయతీ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న రోజుల్లో నా ఎదుగుదల స్థానికంగా కొంతమందికి కంటగింపుగా మారింది. తమ రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగా మారుతున్నాననే దుగ్ధతో నా ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారు. 1980వ దశకంలో ఐదుగురు వ్యక్తులు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో నేను పొలానికి వెళ్లాను. నేను ఇంట్లో లేకపోవడంతో పద్మావతిపై దాడి చేశారు. ఆమె చేతికి గాయమైంది. పొలం నుంచి అనుచరులతో నేను రావడం గమనించి ఇంటి నుంచి పారిపోయారు. ప్రజాసేవకే అంకితం ఇప్పటి వరకు 1989, 1999, 2004, 2018 సంవత్సరాల్లో అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. వైఎస్సార్ హయాంలో వైద్యవిధాన పరిషత్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే జిల్లాకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చాను. ప్రకాశం స్టేడియంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్డు సభ్యుడి నుంచి మంత్రి వరకు అన్ని రకాల పదవులూ చేపట్టాను. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కుటుంబ సభ్యుడిలా వ్యవహరించాను. యాభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగినా ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాట్లను దరి చేరనీయలేదు. 80 ఏళ్ల వయసులో ఉన్నా ఇప్పటికీ ఎవరి సాయం లేకుండా రాయగలను, చదవగలను, నడవగలను. చుట్టూ ఉన్న పది మందికి సాయపడటమనే అలవాటు తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఊపిరి ఉన్నంతవరకూ ప్రజాసేవలోనే ఉంటా. రాజ్‌దూత్ బండిపై.. 1970వ దశకంలో పాల్వంచ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నన్ను వార్డు మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే సమయంలో భద్రాచలంలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన పద్మావతితో నా వివాహం జరిగింది. ఆ మరుసటి ఎన్నికల్లో ఏకంగా పాల్వంచ పంచాయతీకి ప్రెసిడెంట్ అయ్యాను. అప్పట్లో నాకు రాజ్‌దూత్ ద్విచక్ర వాహనం ఉండేది. ఉదయాన్నే పాల్వంచ గ్రామపంచాయతీ ఈఓను వెంటబెట్టుకుని రాజ్‌దూత్‌పై పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు వెళ్లే వాడిని. ఎక్కడైనా ఏదైనా సమస్య కనిపిస్తే వెంటనే నోట్ చేసుకునే వాడిని. మధ్యాహ్నం అంతా పంచాయతీ ఆఫీసులో ఉంటూ అక్కడికి వచ్చే ప్రజల కష్టనష్టాలు వినేవాడిని. చీకటి పడే సమయంలో మళ్లీ బండి మీద ఫీల్డ్ విజిట్‌కు వెళ్లి వీధి దీపాలు వెలుగుతున్నాయా ? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పరిశీలించేవాడిని. పీఎం వరాలు.. షాకైన సీఎం.. 1989 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేసిన కోనేరు నాగేశ్వరరావుతో తలపడాల్సి వచ్చింది. అయితే ప్రెసిడెంట్‌గా, ఇతర సంస్థల చైర్మన్‌గా నా పనితీరు, ప్రజల్లో కలిసిపోయే గుణం మెచ్చిన ప్రజలు విజయం కట్టబెట్టారు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా తెలుగువారైన పీవీ నర్సింహారావు వచ్చారు. ఖమ్మం కలెక్టర్‌గా పని చేసిన పీవీఆర్కే ప్రసాద్ అప్పుడు పీవీ దగ్గర ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారిగా ఉన్నారు. నన్ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకుని, ప్రధానితో మాట్లాడి రికార్డు స్థాయిలో ఒక్క కొత్తగూడెం నియోజకవర్గానికే 18 వేల ఇళ్లు మంజూరు చేశారు. ఒక నియోజకవర్గానికి ఈ స్థాయిలో ఇళ్లు మంజూరు కావడం చూసి అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైతం ఆశ్చర్యపోయారు. -
అధికార టీఆర్ఎస్ పార్టీలోనే ముసలం.. కొత్తగూడెం నాదా? నీదా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ కూడా బలం పుంజుకుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి గులాబీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టిక్కెట్ లభిస్తుందనే ధీమాతో వనమా ఉన్నారు. అయితే ఈసారి సీటు తనకే ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రచారం చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలోనే ఇద్దరు నేతలు సీటు కోసం పోటీ పడుతుంటే..తాజాగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో గూడెం సీటు నాదే అంటున్నారట. దీంతో అధికార పార్టీలోని సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. కారులో కమ్యూనిస్టులు గత ఎన్నికల్లో తెలంగాణలో రకరకాల పొత్తులు నడిచాయి. అయితే ఈసారి ఏడాది ముందే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తో పొత్తు కొనసాగుతుందని సీపీఐ నాయకులు అంటున్నారు. అలా పొత్తు కుదిరితే సీపీఐ వారు కోరుకునే సీట్లలో కొత్తగూడెంకు అగ్రప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి నాయకుడు, రాష్ట్ర సీపీఐ కార్యదర్శి సాంబశివరావు తానే కొత్తగూడెంలో పోటీ చేసేది అంటూ టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ నాయకుడి ఆర్భాటం, ప్రచారంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్ళు పరుగులు తీస్తున్నాయి. కర్చీఫ్ వేసేది నేనే.! ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసేది తానే అంటున్నారు సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ మేరకు ఆయన శపథం కూడా చేశారు. టిక్కెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తుల్లో తెచ్చుకుంటామని ఆశపడినా... అంతిమంగా పోటీ చేసేది తానేనని ఘంటా పథంగా చెబుతున్నారు వనమా. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదంటూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు వనమా వెంకటేశ్వరరావు. మరో వైపు మాజీ ఎమ్మేల్యే జలగం వెంకట్రావు సైతం టిక్కెట్ మీద ఆశపలు పెట్టుకున్నారు. వనమా ఎంత చెప్పుకున్నా...సీపీఐ ఎంత డిమాండ్ చేసినా...చివరి నిమిషంలో తనకే ఇస్తారని జలగం గట్టిగా చెబుతున్నారు. పోటీకి మాత్రమే ఆశ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న జలగం వెంకట్రావు... నియోజకవర్గంలో జరిగే పార్టీ, ప్రభుత్వ కార్యక్రామాలకు మాత్రం హాజరు కావడంలేదు. పైగా సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొనే కార్యక్రమాలవైపేతే కన్నెత్తి కూడా చూడటంలేదు. గత ఎన్నికల్లో సీటు తనకు రాకుండా తన్నకుపోయిన వనమా అంటే జలగంకు కోపం. అందుకే ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది. సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొట్టుకుంటుంటే..ఈ ఏపిసోడ్ లోకి సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 25సీట్లు అడగాలని భావిస్తోంది. అందులో టాప్ త్రీలో కొత్తగూడెం ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గులాబీ ముట్టుకుంటే ముళ్లేనా? ఇంకా మునుగోడు ఉప ఎన్నిక జరగలేదు. టీఆర్ఎస్తో పొత్తు ఖరారు కాలేదు. అప్పుడే సీపీఐ అభ్యర్థిగా ప్రకటించుకున్న కూనంనేని సాంబశివరావు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గులాబీ నేతలేమో సీటు కోసం పోటీ పడుతూ శపథాలు చేస్తుంటే.. నేనూ ఉన్నానంటూ సీపీఐ ఎంట్రీ ఇవ్వడంతో కొత్తగూడెం రాజకీయాలు అప్పుడే హీటెక్కాయి. -
గుండెల్లో రైళ్లు.. ఎవరికి వాళ్లు ఫిక్స్ అయిపోయారు..!
కొత్తగూడెం రాజకీయాల్లో మునుగోడు ఎఫెక్ట్ కనిపిస్తోందా? ఈ ఉపఎన్నిక తెలంగాణలో పొత్తు రాజకీయాల్ని సమూలంగా మార్చబోతోందా? జరుగుతున్న పరిణామాలు కొత్తగూడెం గులాబీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అయితే అక్కడి పాలిటిక్స్ ఎందుకు అంతలా హీటెక్కాయో పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యునిస్టులకు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ కూడా బలం పుంజుకుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్ లభిస్తుందనే ధీమాతో వనమా ఉన్నారు. అయితే ఈసారి టికెట్ తనకే ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంగళరావు ప్రచారం చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలోనే ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడుతుంటే.. తాజాగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో గూడెం సీటు నాదే అంటున్నారట. దీంతో అధికార పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. గత ఎన్నికల్లో తెలంగాణలో రకరకాల పొత్తులు నడిచాయి. అయితే ఈ సారి ఏడాదిముందే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తో పొత్తు కొనసాగుతుందని సీపీఐ నాయకులు అంటున్నారు. అలా కుదిరితే సీపీఐ వాళ్లు కోరుకునే సీట్లలో కొత్తగూడెంకు అగ్రప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తానే కొత్తగూడెంలో పోటీ చేసేదని టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ నాయకుడి ఆర్భాటం, ప్రచారంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. చదవండి: (అది సక్సెస్ చేస్తే.. వారిరువురికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌కు గ్రీన్‌సిగ్నల్!) ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా. ఈమేరకు ఆయన శపథం కూడా చేశారు. టికెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తుల్లో తెచ్చుకుంటామని కథలు చెప్పినా అంతిమంగా పోటీచేసేది తానేనని ఘంటాపథంగా చెబుతున్నారు వనమా. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదంటూ కొందరు సోషల్ మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు జలగం వెంగళరావు సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వనమా ఎంత చెబుతున్నా, సీపీఐ ఎంత డిమాండ్ చేసినా చివరి నిమిషంలో టికెట్ తనకే ఇస్తారని జలగం గట్టిగా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న జలగం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరుకావడం లేదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా పాల్గొనే కార్యక్రమాలవైపు అయితే కన్నెత్తి కూడా చూడటం లేదు. గత ఎన్నికల్లో సీటు తనకు రాకుండా తన్నుకుపోయిన వనమా అంటే జలగంకు కోపం. అందుకే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొట్టుకుంటుంటే ఈ ఎపిసోడ్‌లోకి సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 25సీట్లు అడగాలని భావిస్తోంది. అందులో టాప్-3లో కొత్తగూడెం ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇంకా మునుగోడు ఉప ఎన్నిక జరగలేదు. టీఆర్ఎస్తో పొత్తు ఖరారు కాలేదు. అప్పుడు సీపీఐ అభ్యర్థిగా ప్రకటించుకున్న కూనంనేని సాంబశివరావు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గులాబీ నేతలేమో సీటు కోసం పోటీపడుతూ శపథాలు చేస్తుంటే.. నేనున్నానంటూ సీపీఐ ఎంట్రీ ఇవ్వడంతో కొత్తగూడెం రాజకీయాలు అప్పుడు హీటెక్కాయి. -
రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించాం: ఏఎస్పీ రోహిత్ రాజ్
-
వనమా రాఘవపై 12 కేసులున్నాయి: ఏఎస్పీ
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుపై ఇప్పటివరకూ 12 కేసులున్నట్లు కొత్త గూడెం జిల్లా ఏఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. నిన్న(శుక్రవారం) దమ్మపేట వద్ద రాఘవను అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ.. అతని డ్రైవర్ మురళీ, అనుచరుడు గిరీష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ఈరోజు రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు రోహిత్‌రాజ్ స్పష్టం చేశారు. రాఘవ డబ్బులే కాకుండా రామకృష్ణ భార్యను కూడా ఆశించినట్లు సెల్ఫీ వీడియోలో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. -
మ్యాగజైన్ స్టోరీ 8th January 2022
-
అతన్ని వదలొద్దు.. నాకు కడుపుకోత మిగిల్చాడు
-
వనమా రాఘవేంద్ర అరెస్ట్
-
‘నాలుగో సింహం’ బోనులో.. ‘వనమా’లు జనంలో
సాక్షి, హైదరాబాద్: అది శాంతిభద్రతలను రక్షించే కీలకమైన పోలీసు విభాగం.. కానీ మంచి పోస్టింగ్ కావాలంటే ‘సిఫార్సు’ కావాల్సిందే, లేదంటే లూప్లైన్లో కాలం వెళ్లదీయాల్సిందేనన్నది ఆ శాఖలో అనధికార నినాదం! కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి నుంచి ఎస్సై దాకా నేతల సిఫార్సు లేనిదే పోస్టింగ్ దక్కలేని పరిస్థితి ఉందన్నది బహిరంగంగా మాట్లాడుకునే రహస్యం! ఇలా మంచి పోస్టింగ్ కోసం రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్న కొందరు పోలీసు అధికారులు.. సంబంధిత నేతకుగానీ, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకుగానీ వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలరా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు రాఘవేంద్రరావు ఘటనతో ఈ ‘సిఫార్సు’ల వ్యవహారం పోలీసుశాఖలో తీవ్ర కలవరం రేపుతోంది. వనమా రాఘవేంద్రరావుపై ఎన్నో ఏళ్లుగా ఫిర్యాదులున్నా పోలీసు అధికారులు పెద్దగా స్పందించకపోవడానికి కారణమూ ఇదేనన్న చర్చ జరుగుతోంది. ఇంటెలిజెన్స్ వర్గాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండటం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. చెప్పినట్టు వినాల్సిందే.. కొత్తగూడెం పాల్వంచలో జరిగిన వ్యవహారంలో పోలీసుశాఖ ముందే స్పందించి ఉంటే.. ఈ స్థాయిలో వ్యవహారాలు జరిగేవి కాదన్న వాదన వినిపిస్తోంది. 2017 నుంచే వనమా రాఘవేంద్రరావుపై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులు ఉన్నా యి. 2018లో ఒక క్రిమినల్ కేసు, 2019లో మరొకటి, 2020లో ఇంకొకటి.. ఇలా నాలుగుకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అయితే రామ కృష్ణ కుటుంబం ఆత్మహత్యతో పాటు మరికొన్ని కేసుల్లోనూ బాధితులు పోలీసులపైనా ఆరోపణలు చేస్తున్నారు. తాము స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు. దీనికి కారణం రాఘవ తన తండ్రి సిఫార్సు లేఖలతో ఇప్పించిన పోస్టింగ్‌లే అనడంలో ఏమాత్రం సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది. రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడం వివాదాస్పదంగా మారిందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం, సదరు సెల్ఫీ వీడియో సోషల్‌మీడియాలో సంచలనం కావడంతో.. ఇప్పుడు తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. పోస్టింగ్కో రేటు పెట్టి.. రాష్ట్ర పోలీసుశాఖలో కొన్నిచోట్ల ఎస్పీ స్థాయి అధికారులకు పోస్టింగ్ దక్కాలంటే భారీ రేటు ఉందని.. డీఎస్పీ, ఇన్స్పెక్టర్, ఎస్సై పోస్టింగులకు ఒక్కో రేటు ఉందని ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు పోస్టింగ్ సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులకు లక్షల రూపాయలు ఇస్తున్నారని పోలీసు వర్గాలే చెప్తున్నాయి. ఎస్సై పోస్టింగ్ సిఫార్సు కోసం రూ.5లక్షలు, సీఐ స్థాయిలో రూ.10 లక్షలదాకా.. డీఎస్పీ/ఏసీపీ పోస్టింగ్ కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలవుతున్నట్టు పేర్కొంటున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఎస్పీ బదిలీ వివాదాస్పదంగా మారుతోంది. ఏకంగా రూ.45 లక్షలు ఇచ్చి సంబంధిత అధికారి ఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా.. బెదిరింపులు, కబ్జాలు.. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సహకరించకపోతే ఏకంగా ఏసీబీ దాడులు చేయిస్తామని పోలీస్, రెవెన్యూ సిబ్బందిని బెదిరించే స్థాయికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే కుమారుడు ఇసుక రవాణాలో తమకు పూర్తిగా సహకరించే అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే తరఫున ఆయన సోదరుడు పోలీసు అధికారులతో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే భార్య, ఇద్దరు అల్లుళ్ల పెత్తనం మరీ మితిమీరినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. బెదిరింపులు, కబ్జాలు సహా సదరు నియోజకవర్గంలో వారు ఎలా చెప్తే పోలీసు అధికారులు అలా వినాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే కుమారుడు అన్నీ తానై డీఎస్పీ నుంచి ఎస్సై దాకా పోస్టింగ్‌లకు సిఫార్సులు చేయిస్తున్నట్టు చెప్తున్నారు. ►నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఓ కీలక ఎమ్మెల్యే సోదరుడు నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ నడిపిస్తున్నాడన్న ఫిర్యాదులు వస్తే.. సదరు బాధితులపైనే ఉల్టా కేసులు పెట్టించి హింసించారన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు తన ఇసుక దందాకు అడ్డొస్తున్న వారిపై పోలీసుల సాయంతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఓ సీనియర్ ఎమ్మెల్యే తనయులపైనా భూకబ్జా, ఇసుక దందా ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. భూకబ్జాదారులతో చేతులు కలిపి విలువైన భూములను కాజేసినట్టు నిఘా విభాగం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది. ►ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని ఫిర్యాదులున్నా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే జిల్లాలో ఓ ఎమ్మెల్యేకన్నా ఆయన కుటుంబ సభ్యులదే ఎక్కువ పెత్తనమన్న విమర్శలున్నాయి. వారు ఏకంగా రూ.2 వేల కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేశారని.. దానిపై ఫిర్యాదు చేసిన వారిపై అక్రమంగా కేసులు పెట్టించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ►ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తానే ఎమ్మెల్యే అయినట్టుగా వ్యవహరించడం, భూకబ్జా వ్యవహారాలు మానవ హక్కుల సంఘం దాకా వచ్చాయి. సదరు ఎమ్మెల్యే సోదరుడు బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ మూడు ఫిర్యాదులు అందాయి. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే భార్య పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా వసూలు చేస్తున్న కమిషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఉల్టా వారిపైనే కేసులు నమోదుచేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ►ఖమ్మంలో వనమా రాఘవ వ్యవహారం ఇటీవలే బయటపడింది. మరో ఎమ్మెల్యే భర్త కూడా ప్రతీదందాలో తన వాటా అంటూ వసూలు చేస్తున్నారని.. ఇవ్వకపోతే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా ఓ ఎమ్మెల్సీకి వరుసకు సోదరుడయ్యే వ్యక్తి చేస్తున్న పనులు ఎస్పీస్థాయి అధికారులకు కూడా చికాకు తెప్పించాయని, వారు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లిందని సమాచారం. ►వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓ సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు ప్రభుత్వ పోస్టింగ్‌లలో జోక్యం చేసుకుంటున్నారని.. పోలీసు, రెవెన్యూ అధికారుల ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లలో వాటాలు వసూలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే చీకటి వ్యవహారాలకు పోలీసులు సెక్యూరిటీ కల్పించడం ఇటీవల వివాదాస్పదమైంది. ►మెదక్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తప్పుడు కేసులు నమోదు చేయిస్తానంటూ కొందరిపై బెదిరింపులకు దిగినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సిఫార్సులతో చేతులు కట్టేస్తున్నారు! ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలుంటే తప్ప పోస్టింగులు ఇవ్వద్దొన్న మౌఖిక ఆదేశాలుండటంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం చేతులు కట్టేసుకోవాల్సి వస్తోందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 80శాతం పోస్టింగులు సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయని.. ప్రతిభ, అంకితభావ సేవలను దృష్టిలో పెట్టుకొని మిగతా వారికి అవకాశం కల్పిస్తున్నా నాలుగు రోజుల ముచ్చటగానే మిగిలిపోతోందని ఉన్నతాధికారవర్గాలు చెప్తున్నాయి. సమర్థవంతమైన అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తున్న అధికారులపై ఎప్పటిప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలిస్తున్నా మార్పు రావడం లేదని వాపోతున్నాయి. వ్యవస్థలో మార్పు రాకపోతే మరింత విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సిఫార్సు లేఖలతో కాకుండా.. సమర్థత ఆధారంగా పోస్టింగులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.