varaphalalu
-
ఈ రాశి వారికి వారంలో ఉద్యోగయత్నాలు కలసివస్తాయి
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరపతి మరింతగా పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు నూతన అవకాశాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తొలగి, కొంత ఊరట చెందుతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు ఎదురవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాల యత్నాలలో పురోగతి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక విషయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ ఊహలు నిజం కాగలవు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. మిత్రులతో కలహాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనితీరుతో, మాటనేర్పుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఏపనినైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. తీర్థయాత్రలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగుల బాధ్యతలకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త విషయాలు తెలుస్తాయి. మీ అభిప్రాయాలు బంధువులకు నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అనూహ్యంగా ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత స్థానాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. వారం ప్రారంభంలో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొద్దిపాటి చికాకులు, పనుల్లో జాప్యం క్రమేపీ తొలగుతాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. ఆప్తులు దగ్గరవుతారు. మీ నైపుణ్యాన్ని చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనయోగం. అందర్నీ ఆశ్చర్యపరచే నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పాత బాకీలు వసూలవుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. లేత నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఎటువంటి సమస్యనైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ఖర్చులు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నేరేడు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. సేవాభావంతో అందర్నీ ఆకట్టుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరిగే అవకాశాలు. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. బంధువులతో తగాదాలు. నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా) రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. శుభకార్యాలపై బంధువులతో సంప్రదిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలను విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనుల్లో విజయం సా«ధిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలను విస్తరిస్తారు, లాభాలు తథ్యం. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. రాజకీయ వర్గాలకు సాంఘిక గౌరవం. వారం మధ్యలో ఖర్చులు అధికం. కుటుంబంలో ఒత్తిడులు. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక విషయాలలో చికాకులు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో అకారణంగా విరోధాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సోదరీ సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక హామీలపై తొందరవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల మిత్రులు కొంత సహాయపడతారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తల యత్నాలు నత్తనడకన సాగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో శ్రమ తప్పదు. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. -
వారఫలాలు(నవంబర్ 3 నుంచి 9)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. నూతన విద్యావకాశాలు దక్కే ఛాన్స్. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు మరింత గుర్తింపు, వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలతో కుటుంబసభ్యులు ఏకీభవిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలందుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహంగా గడుస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వేడుకలలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. మీపై కుటుంబసభ్యుల నుంచి సానుకూల వైఖరి కనిపిస్తుంది. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి, కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. శుభకార్యాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలు అంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే, విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసహాయం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో మాటపట్టింపులు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రగతి కనిపిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. రుణదాతలు సైతం ఒత్తిడులు పెంచుతారు. కుటుంబసభ్యులతో మాటపడాల్సిన సమయం. ప్రముఖులతో పరిచయాలు కొంత ఊరటనిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలలో అవరోధాలు. ఉద్యోగాలలో మరింత పనిఒత్తిడులు, ఆకస్మిక మార్పులు. స్వల్ప ధనలబ్ధి. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త వ్యూహాలు, ఆలోచనలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. మీ అభిప్రాయాలను మిత్రులు మన్నిస్తారు. కొన్ని విషయాలలో మీ నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఒక కోర్టు వ్యవహారంలో సానుకూలత కనిపిస్తుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. పసుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి. దీక్ష, పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) విద్యార్థుల శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీపై ఇంతకాలం విమర్శలు చేసిన వారు ప్రశంసలు కురిపించడం విశేషం. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితిలో ఆటుపోట్లు తొలగుతాయి. వాహనయోగం. సోదరులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. కొత్త భాగస్వాములతో వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి, పదోన్నతులు. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. -
వారఫలాలు (అక్టోబర్ 20 నుంచి 26)
మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ సమర్థత నిరూపించుకుంటారు. పారిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ధనవ్యయం. ఆకుపచ్చ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. వృషభం : (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. రుణయత్నాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఇంటాబయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వాహనయోగం. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. మిథునం : (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు జరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం : (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. అనుకోని సంఘటనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. మిత్రులు, బంధువులతో విభేదాలు. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం : (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. బాకీలు వసూలవుతాయి. పోటీ పరీక్షల్లో విజయం. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. వారం మధ్యలో ఆస్తివివాదాలు. అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. కన్య : (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాన్వేణ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించిన ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా శ్రమ తప్పదు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల : (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారాలను విస్తరిస్తారు, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి అవార్డులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనారోగ్య సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గా స్తోత్రాలు పఠించండి. వృశ్చికం : (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు తాము పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ఎరుపు, గులాబీరంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించండి. మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగయత్నాలు మరింత అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహన, గృహయోగాలు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో మరింత ప్రగతి ఉంటుంది. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్య సూచనలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కుంభం : (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మీనం : (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు సమయానికి చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, కొత్త పదవులు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. -
వారఫలాలు(అక్టోబర్ 13 నుంచి 19)
మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఇంటి నిర్మాణం, కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. నూతన ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. ప్రముఖ వ్యక్తులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కోర్టు కేసు ఒకటి పరిష్కారమై ఊరట లభిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న పనులు కొంత నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. చేజారిన కొన్ని వస్తువులు తిరిగి లభ్యమయ్యే సూచనలు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) మొదట్లో కొన్ని వివాదాలతో సతమతమవుతారు. అయితే క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూరపు బం«ధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం రాగలదు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వివాహాది వేడుకలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి సమస్యలు తీరతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు సాధిస్తారు. కొన్ని కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. గృహ నిర్మాణాల్లో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో సమర్థత చాటుకుని ఉత్సాహంగా సాగుతారు. కళారంగం వారికి మరింత కలసివచ్చే సమయం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. విద్యార్థుల శ్రమ ఫలించే సమయం. తరచు తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించకుంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో ఇంట్లో సందడిగా గడుస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక విషయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనయోగం. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఎటువంటి సమస్య ఎదురైనా అధిగమిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మొదట్లో ఇబ్బంది కలిగించినా క్రమేపీ మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. సన్నిహితులతో వివాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) చేపట్టిన పనులు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే పుంజుకుంటాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. కళారంగం వారికి అనుకోని అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు అవాంతరాల వల్ల ముందుకు సాగవు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. నిర్ణయాలలో తొందరపడరాదు. ఆస్తి వివాదాలతో సతమతమవుతారు. ఇంటి నిర్మాణాలలో కొంత ప్రతిష్ఠంభన. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) వీరికి ఇంతకాలం ఎదురైన కష్టాలు తొలగినట్లే. ఆర్థికంగా మరింత బలపడతారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులు ఊరట చెందుతారు. గృహ, వాహనయోగాలు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమర్థతను అందరూ గుర్తిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు( అక్టోబర్ 6 నుంచి 12)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి సాధిస్తారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి చేకూరుతుంది. మీపై కుటుంబసభ్యులు మరింత ఇష్టం చూపుతారు. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) క్రమేపీ కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరాలకు లోటు రాదు. ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేయవద్దు. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న వ్యవహారాలు ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. మీపై బ«ంధువులు మరింత ఆదరణ చూపుతారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు వీడతాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్తగా చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త ఉద్యోగాల అన్వేషణలో విజయం సాధిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని పదోన్నతులు. రాజకీయవర్గాలకు అప్రయత్నంగా అవకాశాలు రాగలవు. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) మొదట్లో కొన్ని సమస్యలు ఎదురైనా దీక్షా, పట్టుదలతో అధిగమిస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) అనుకున్న పనులు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తిపై సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించి ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వివాహ యత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలు అనుకూలించవు. తరచూ అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులతో భూవివాదాలు నెలకొంటాయి. అందర్నీ ఆశ్చర్యపరిచేలా నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కాంట్రాక్టర్లు దక్కుతాయి. నూతన పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. గృహ నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, తెలుపు. ఆంజనేయ దండకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలుసానుకూలం. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వేడుకలకు హాజరవుతారు. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. శారీరక రుగ్మతలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు క్రమేపీ తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. శ్రమ పెరుగుతుంది. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తుల వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవర్గాలకు పదవీయోగం కలిగే సూచనలు. వారం చివరిలో అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి లబ్ధి పొందుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు గతం కంటే మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు చేపట్టే వీలుంది. కళారంగం వారికి నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
వారఫలాలు (సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ముఖ్యమైన పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కార్యసిద్ధి. వారం మధ్యలో ధనవ్యయం. సోదరులతో కలహాలు. పసుపు, గులాబీరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠిచండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) చేపట్టిన పనుల్లో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. కోర్టు వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. తరచూ ప్రయాణాలు సంభవం. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. గృహం, వాహనాల కొనుగోలులో ప్రతిష్ఠంభన. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు కొంత అసంతృప్తి. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఎరుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్య పనులలో అవాంతరాలు తొలగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభించి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో మీ సత్తా నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. కుటుంబసభ్యుల ఆదరణ పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. భూవివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. చాకచక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వాహనయోగం. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులు, సోదరుల సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ఇంట ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో దూరప్రయాణాలు. బ«ంధువులతో వివాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) నిరుద్యోగులకు ఒక ప్రకటన మరింత ఉత్సాహాన్నిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. మిత్రులతో మాటపట్టింపులు. నీలం, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయవర్గాలకు యత్నకార్యసిద్ధి. ప్రారంభంలో కొద్దిపాటి వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని వివాదాలు నెలకొన్నా క్రమేపీ సర్దుకుంటాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. నూతన∙వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు రాగలదు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అప్రయత్న కార్యసిద్ధి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీయానం. వారం చివరిలో అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. ప్రారంభంలో ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులు ప్రారంభిస్తారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిళ్లు. అనారోగ్యం. ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు (సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఆశించిన లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. స్వల్ప అనారోగ్య సూచనలు. దూరపు బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. ఒక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. బంధువిరోధాలు. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక లావాదేవీలు గతంతో పోల్చుకుంటే కొద్దిగా సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొన్ని సమస్యలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పసుపు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొన్ని సమస్యలు, వివాదాలు మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనాలు భూములు కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబసమస్యలు కొంత వేధింపునకు గురిచేస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు చివరి క్షణంలో వాయిదా. వారం మధ్యలో «కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. విద్యార్థుల విదేశీ విద్యాయత్నాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొన్ని చికాకులు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆస్తి వివాదాలు కొంతమేర తీరతాయి. గృహ నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి ప్రారంభంలో కొంత నిరాశ పరుస్తుంది. అయినా అవసరాలకు లోటు రాదు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. పాతమిత్రులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. కళారంగం వారికి విశేష సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు కలిసిరావు. పనుల్లో ఆటంకాలు. సన్నిహితులతో అకారణంగా విరోధాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. కాంట్రాక్టులు చేజారవచ్చు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలలో ప్రతిబంధకాలు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో ధనలాభం. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) బంధువులతో అకారణంగా విభేదాలు. పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు నెలకొని సవాలుగా మారవచ్చు. తరచూ ప్రయాణాలు సంభవం. సోదరుల నుంచి పిలుపు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు చేజారవచ్చు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చేపట్టిన కొత్త పనులు ఆత్మస్థైర్యంతో విజయవంతంగా పూర్తి చేసి, విజయం సాధిస్తారు. ఆత్మీయులు, బం«ధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువులు, కుటుంబసభ్యులకు సంబంధించి శుభవర్తమానాలు అందుతాయి. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి, నిశ్చింతగా మీ పనులు మీరు పూర్తి చేసుకుంటారు. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఎరుపు, పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
టారో వారఫలాలు (సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) త్యాగాలు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగున్నా ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న పంతాలు పట్టింపులు మనస్తాపం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. విధి నిర్వహణ పట్ల పూర్తి స్పష్టతతో ఉంటారు. సకాలంలో లక్ష్యాలను సాధిస్తారు. పట్టుదలతో, అంకితభావంతో అసాధ్యమనుకున్న పనులను కూడా సునాయాసంగా పూర్తిచేసి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రియతములకు తగినంత సమయం కేటాయించలేక, వారిని సముదాయించలేక సతమతమవుతారు. లక్కీ కలర్: ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అంతరాత్మ ప్రబోధాన్ని నమ్ముకుంటారు. కుటుంబంలో ఏర్పడిన ఒక సమస్యను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ప్రతికూలతలను అధిగమిస్తారు. ప్రత్యర్థుల ఆటలను కట్టిస్తారు. చిరకాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఒక ఆకస్మిక సంఘటనతో భావోద్వేగాలకు లోనవుతారు. పని ఒత్తిడి పెరిగి వేళకు భోజనం చేయలేకపోతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) నిజాయతీని నిరూపించుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనంగా కొత్త బాధ్యతలను నెత్తిన వేసుకోకుండా ఉండటమే క్షేమం. పూర్తి చేయాల్సిన పనులు ఒత్తిడికి, ఆందోళనకు గురిచేసినా, సకాలానికి పనులు పూర్తి చేస్తారు. ఇబ్బందిపెడుతూ వచ్చిన అధికారులకు స్థానచలనం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రియతముల మధ్య తలెత్తిన పొరపొచ్చాలు ఎడబాటుకు దారితీసే సూచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) సంక్లిష్టమైన కాలం. అప్రమత్తంగా ఉంటేనే చిక్కుల్లో పడకుండా ఉంటారు. మిత్రుల ముసుగులోని ప్రత్యర్థులను పసిగట్టి, వారికి దూరంగా ఉంటేనే క్షేమం. వృత్తి ఉద్యోగాల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతారు. అలాంటి వారే మిమ్మల్ని అతిగా పొగుడుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు. ప్రేమికుల మధ్య తగవులు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలిక పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. మిత్రుల్లో ఒకరిని ఆర్థికంగా ఆదుకుంటారు. ఆధ్యాత్మిక గురువులను కలుసుకుంటారు. లక్కీ కలర్: ముదురు గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) విసుగెత్తించే రోజువారీ కార్యక్రమాలకు విరామం ప్రకటించి, విహారయాత్రలకు వెళతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత సానుకూలంగా మారుతాయి. ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మీరు వెల్లడించే అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. వాక్చాతుర్యంతో బహిరంగ వేదికలపైనా రాణిస్తారు. కుటుంబంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి వ్యాయామం ప్రారంభిస్తారు. పిల్లల పురోగతి సంతృప్తినిస్తుంది. కండరాల నొప్పులు, తలనొప్పి ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సంక్లిష్టంగా మారే సూచనలు ఉన్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా అలజడికి, అభద్రతాభావానికి లోనవుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం అనివార్యమవుతుంది. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశలు వదులుకోవద్దు. తప్పకుండా ఫలిస్తాయి. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై, అలంకరణలపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: గోధుమ రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: నేరేడు రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) పనులను పూర్తి చేయడంలో అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. చిరకాలంగా కొనసాగుతున్న స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రేమానుబంధాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు (సెప్టెంబర్1 నుంచి 7 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో విశేషంగా గౌరవమర్యాదలు పొందుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. విద్యార్థులకు మరింత అనుకూల సమయం. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగవర్గాలు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. కళారంగం వారు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. గులాబి, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) కొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. భూముల వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. క్రీడాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. రాజకీయరంగం వారికి కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక లావాదేవీలు మొదట్లో మందగించినా క్రమేపీ పుంజుకుంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. బంధువుల సూచనలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న పనులలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని విధంగా హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు నెలకొంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్థిరాస్తి వివాదాలతో సతమతమవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. గృహం కొనుగోలు, నిర్మాణయత్నాలు కొంత మందగిస్తాయి. ఒక సమాచారం కొంత గందరగోళం పెట్టవచ్చు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. నూతన పరిచయాలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) బంధువుల చేయూతతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఎంతటి వారినైనా వాక్పటిమతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది, అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. వాహన, గృహయోగాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం, పైస్థాయి నుంచి ప్రశంసలు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ధనవ్యయం. గులాబీ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులు చేదోడుగా నిలుస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు, పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, పసుపు రంగులు. దూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత మెరుగుపడతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తు, వస్త్రలాభాలు కలుగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో గందరగోళం తొలగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలను స్వశక్తితో పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఇంటి నిర్మాణయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మొదట్లో కొంత మందగించినా క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు జరిగేవీలుంది. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి, ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు, అయితే పట్టుదలతో వాటిని అ«ధిగమిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలించి రుణాలు తీరుస్తారు. పలుకుబడి పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధించి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత మందగించవచ్చు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే ఛాన్స్. కళారంగం వారి యత్నాలు సఫలం. పురస్కారాలు పొందుతారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. సోదరులతో వివాదాలు. పసుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు కొంత వరకూ అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్తిరాస్థి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు సైతం సాయపడి ప్రశంసలు పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం చాలావరకూ తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
టారో వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పరిస్థితుల్లో సానుకూలతలు కొంత లోపించినా ఆశావహ దృక్పథంతోనే ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. అకుంఠిత దీక్ష, చిత్తశుద్ధి, అంకితభావాలే మీ విజయాలకు బాటలు వేస్తాయి. వ్యాపార వర్గాలకు ఇది అనువైన కాలం. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులు తేలికగానే సమకూరుతాయి. ప్రేమ వ్యవహారాల్లో నిజాయతీని నిరూపించుకోవలసిన పరిస్థితులు తలెత్తుతాయి. లక్కీ కలర్: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) జీవితంలోని క్లిష్టమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చిన సావాసాలను బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. నిజమైన మిత్రులెవరో, మిత్రుల్లా నటించే శత్రువులెవరో స్పష్టంగా తేలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఇదీ ఒకందుకు మంచిదే! మిమ్మల్ని మీరు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ పరిస్థితులు ఎంతగానో దోహదపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థులు మీపై తెరవెనుక కుట్రలు సాగించే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) మొండిబాకీలు వసూలవుతాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు ఉన్నాయి. పాత వస్తువులను వదిలించుకుంటారు. ఇల్లు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ఊదా కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అన్ని రంగాల్లోనూ పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో వేతన పెంపు, పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. కొందరికి కోరుకున్న చోటికి బదిలీలు జరగవచ్చు. చిన్న చిన్న సరదాలను అమితంగా ఆస్వాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశాల నుంచి విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసొస్తాయి. సాహితీ కళారంగాల్లోని వారికి సత్కారాలు, గౌరవ పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. ఆత్మబంధువులాంటి వ్యక్తి ఒకరు తారసపడతారు. లక్కీ కలర్: ముదురు గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) సభా వేదికలపై అద్భుతంగా రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సాటివారి ప్రయోజనాలను పోరాడి మరీ సాధిస్తారు. నాయకత్వ పటిమను చాటుకోవడానికి తగిన అవకాశాలు కలసి వస్తాయి. ప్రముఖులతో చర్చల్లో పాల్గొంటారు. రాజకీయరంగంలోని వారికి కీలకమైన పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. తీరిక చిక్కని పరిస్థితుల్లో వ్యాయామానికి దూరం కావడం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు అవసరమవుతాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు సమసిపోతాయి. లక్కీ కలర్: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) అదృష్టం తలుపు తడుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలను కోరుకున్న రీతిలో విస్తరిస్తారు. ప్రచారం కోసం చేసిన ఖర్చు రెట్టింపు ఫలితాలనిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. వస్త్రాలంకరణపైన, సౌందర్యంపైన శ్రద్ధ పెంచుతారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. విదేశాల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఉన్నతమైన ఆశయాలతో ముందుకు సాగుతారు. యోగ ధ్యానాలకు మరింత సమయాన్ని కేటాయిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కొంత ఒత్తిడి ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి లావాదేవీల నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. అవసరాల్లో మీ నుంచి సాయం పొందిన వారే మీకు మొండిచెయ్యి చూపుతారు. లక్కీ కలర్: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కుటుంబ సభ్యులతో కలసి వినోదయాత్రలకు వెళతారు. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రలోభాలకు లోనవకుండా, అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకోవడమే క్షేమం. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. నిజాయతీని నమ్ముకుంటేనే గడ్డు పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. ప్రలోభాల ఉచ్చులో చిక్కుకుంటే మీకే ప్రమాదం. వాగ్వాదాలకు రెచ్చగొట్టేవారికి దూరంగా ఉండటం మేలు. సంయమనం కోల్పోతే వివాదాలు చుట్టుముట్టే సూచనలున్నాయి. లక్కీ కలర్: గోధుమ రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) వృత్తి ఉద్యోగాల్లోని వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయి. కొత్త భాగస్వాముల సహకారంతో వ్యాపారాలు గణనీయంగా పుంజుకుంటాయి. పాత వాహనాన్ని వదుల్చుకుని, కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. విలాసాల కోసం ఖర్చు చేస్తారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొందరికి వారసత్వపు ఆస్తులు కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. పని ఒత్తిడికి దూరంగా విహారయాత్రలకు వెళతారు. పురాతన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: నేరేడు రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) జీవితం మరింత సంతోషభరితంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు జనాదరణ రెట్టింపవుతుంది. వ్యాపారాల విస్తరణకు కావలసిన నిధులు సునాయాసంగా సమకూరుతాయి. పరస్పర భిన్నధ్రువాల్లాంటి ఇద్దరు కీలక వ్యక్తుల భేటీకి మీరు చోదకశక్తిగా పనిచేస్తారు. సమాజంపై ప్రభావం చూపగల ప్రముఖులను కలుసుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. లక్కీ కలర్: నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఎరక్కపోయి తుఫానులో చిక్కుకున్నట్లుగా ఆందోళన చెందుతారు. కార్యాచరణకు కొంత విరామం ప్రకటించడం మంచిది. పరిస్థితులు వాటంతట అవే సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. పనికిమాలిన సావాసాల నుంచి ఎంత త్వరగా బయటపడి అంత త్వరగా పుంజుకోగలుగుతారు. సమస్యల్లో చిక్కుకున్న మిత్రులకు ఆసరాగా నిలుస్తారు. గురువులను కలుసుకుంటారు. గుప్తదానాలు చేస్తారు. లక్కీ కలర్: గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) దీర్ఘకాలంగా కొనసాగిస్తూ వస్తున్న భారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. విజయపథంలో దూసుకుపోతారు. సహచరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. కుటుంబంలో సంతోషభరితమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. పుస్తక పఠనానికి మరింతగా సమయాన్ని కేటాయిస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) ఉత్సాహంగా వ్యవహారాలు కొనసాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలలో లాభాలు దక్కి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కడంతో పాటు, బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి మరింత ప్రోత్సాహం. వారం మధ్యలో వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి లాభం పొందుతారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగి ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. నూతన పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆస్తి వివాదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఎంతటి వారినైన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. గులాబి, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యవహారాలలో విజయం. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు, వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విలువైన సమాచారం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. వివాదాల నుంచి బయటపడతారు. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు అందుకుంటారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పలుకుబడి కలిగిన వారి నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని గుర్తింపు పొందుతారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవార్డులు దక్కే ఛాన్స్. వారం చివరిలో బంధువిరోధాలు. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో చర్చిస్తారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిళ్లు. అనారోగ్యం. గులాబీ,నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రకటన రావచ్చు. ఆలోచనలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. నలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
టారో వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) సమస్యలు ఎదురైనంత మాత్రాన అనవసరంగా ఆందోళన చెందకండి. సమస్యల మూలకారణాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు, వాటిని అధిగమించడం తేలికవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న అవరోధాలు ఎదురైనా, అప్రమత్తంగా ఉంటే వాటిని అవలీలగా అధిగమించడం సాధ్యమవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.. త్వరలోనే భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహిత మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆత్మబంధువులాంటి వ్యక్తి ఒకరు తారసపడతారు. లక్కీ కలర్: లేతగులాబి వృషభం (ఏప్రిల్ 20 – మే 20) నిజాయతీనే నమ్ముకుంటారు. ఇతరుల ప్రవర్తన ఎలా ఉన్నా పట్టించుకోకుండా, మీదైన శైలిలో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అంకితభావంతో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. భవిష్యత్తును మార్చగల అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కొందరి ప్రవర్తన పట్ల విసిగిపోయి, సహనం కోల్పోతారు. స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రకటనలు, ప్రచారం ద్వారా వ్యాపారాభివృద్ధిని సాధిస్తారు. పాత బాకీలను తీర్చేస్తారు. చాలాకాలంగా సాగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) ఇటు ఇంట్లోను, అటు పని ప్రదేశంలోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కొంత గందరగోళానికి లోనవుతారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. విడివడిన బంధాలు మళ్లీ ఒక్కటవుతాయి. సృజనాత్మక రంగాల్లోని వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో బాగా ఉపయోగపడగల కీలకమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. పురాతన పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: ముదురు ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) గతానికి చెందిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడతారు. మానసికంగా కొంత కుదుటపడి, వర్తమానంలో జీవించడానికి అలవాటు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు. వ్యాపార లాభాలు పుంజుకుంటాయి. విదేశాల నుంచి విద్యార్థులకు మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. వైద్య సహాయం అనివార్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలను తలపెడతారు. ఒంటరిగా ఉంటున్నవారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. లక్కీ కలర్: ముదురు గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) సవాళ్లతో కూడుకున్న అవకాశాలు లభిస్తాయి. సవాళ్లకు భయపడకుండా అవకాశాలను అందుకుంటే, సమీప భవిష్యత్తులోనే అద్భుతమైన లాభాలు ఉంటాయి. విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. సాహస క్రీడల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి జ్యోతిషులు, ఆధ్యాత్మిక గురువుల సలహాలు తీసుకుంటారు. ప్రియతములకు విలాస వస్తువులను కానుకగా ఇస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు జటిలంగా మారే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: వెండి రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) చాలాకాలంగా కోరుకున్న మార్పు ఈవారంలో సంభవించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కొందరికి స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. భవిష్యత్తు గురించి అతిగా తాపత్రయపడతారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి, ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. వైద్యచికిత్స తప్పకపోవచ్చు. భవిష్యత్తు గురించిన ఆలోచనలను పక్కన పెట్టి వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం మంచిది. స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తేనే ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించిన లక్ష్యాలను సాధించగలుగుతారు. లక్కీ కలర్: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తులు కలసివచ్చే సూచననలు ఉన్నాయి. వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. ప్రేమ ప్రతిపాదనలపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆర్థికపరంగా పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సకాలంలో భారీమొత్తాల్లో రుణాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొంతకాలంగా ఇబ్బందిపెడుతూ వచ్చిన ఉన్నతాధికారి ఒకరికి స్థానచలనం కలగడం ఊరటనిస్తుంది. పిల్లల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సంప్రదాయాలను పిల్లలు ధిక్కరించడంతో మనస్తాపం చెందుతారు. మానసిక సాంత్వన కోసం ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయిస్తారు. లక్కీ కలర్: ముదురు గులాబి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) లేనిపోని పట్టుదలలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే పరిస్థితులు చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సహచరులతో వాదులాటలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉన్నా, పాత బాకీలు వసూలు కాకపోవడం చిరాకు తెప్పిస్తుంది. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మిత్రుల్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కీళ్లనొప్పులు బాధించవచ్చు. ఇంటి అలంకరణల్లో మార్పులు చేస్తారు. పాత వాహనాన్ని వదుల్చుకుని కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: బూడిద రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) జీవితాన్ని చిక్కుప్రశ్నలా భావించడం వల్ల సమస్యలను జటిలం చేసుకుంటారు. జీవితాన్ని అనుక్షణం ఆస్వాదించడం మొదలుపెడితే, ఏ సమస్యలూ మిమ్మల్ని ఇబ్బందిపెట్టవు. వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న స్తబ్దతకు విసుగు చెందుతారు. అవలీలగా మీరు చేసే పనులే అద్భుతమైన ఫలితాలనిస్తాయి. సాహిత్య కళారంగాల్లోని వారి కృషికి గుర్తింపు, సత్కారాలు ఉంటాయి. వ్యాపారాలకు జనాదరణ పెరుగుతుంది. రాజకీయ రంగంలోని వారికి ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల అనుబంధం పెళ్లికి దారితీస్తుంది. లక్కీ కలర్: ఊదా మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వారమంతా సంతోషభరితంగా సాగుతుంది. మిత్రులతో ఉత్సాహభరితంగా కాలక్షేపం చేస్తారు. అవసరంలో ఉన్న మిత్రులను ఆదుకుంటారు. ప్రియతముల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులతో కూడిన బదిలీలు ఉండవచ్చు. పిల్లలు సాధించిన విజయాలకు గర్విస్తారు. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ఆర్యోగంపై శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు తప్పకపోవచ్చు. కుటుంబసభ్యులతో కలసి అరుదైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: పసుపు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టండి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగప్రాప్తి. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం చివరిలో అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు మరింత ఉత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువులు సహకరిస్తారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై కొంత లాభపడతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వాహనయోగం. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముఖ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి తెస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కొత్తగా రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపిం^è దు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు నెలకొంటాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖుల పరిచయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఆశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేరుకుంటాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ప్రత్యర్థుల నుంచి సైతం సానుకూలత వ్యక్తమవుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. బంధుమిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు నిరుత్సాహం. బంధువులతో స్థిరాస్తి వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం చివరిలో విందువినోదాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారంలో ప్రతిష్ఠంభన. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో వస్తులాభాలు. ఉద్యోగయోగం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తరచూ వివాదాలు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. విద్యార్థులకు ఫలితాలు నిరాశ పరుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. మీ ఆభిప్రాయాలను కుటుంబసభ్యులు తిరస్కరిస్తారు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆకుపచ్చ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) మీ అంచనాలు నిజం చేసుకుంటారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
టారో వారఫలాలు( 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు, 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. దేనికీ లోటుండని పరిస్థిని ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. అన్నివిధాలా సానుకూలమైన కాలం. విద్యార్థులు సత్ఫలితాలను సాధిస్తారు. కొందరికి విదేశీ విద్యావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రియతములతో కలసి విహారయాత్రలకు వెళతారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాయామం, ఆరోగ్య జాగ్రత్తల పట్ల విసుగు చెందుతారు. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. లక్కీ కలర్: గోధుమ రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆందోళనలను అధిగమించే ప్రయత్నం చేయండి. త్వరలోనే మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. భావోద్వేగాలు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. నియంత్రణ పాటించడం మంచిది. కపటం నింపుకొని కబుర్లాడే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. పొగడ్తలతో ముంచెత్తే వారే మీ వెనుక గోతులు తీసే ప్రమాదం ఉంది. ఆలోచనలను పంచుకునేందుకు తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. ప్రేమించిన వారి నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) మారాల్సిన సమయం ఇది. ఇదివరకటి మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదులుకుని మీ ప్రస్తుత వ్యక్తిత్వానికి నిబద్ధులవుతారు. ఆత్మావలోకనానికి తగిన సమయం కేటాయించుకోవడం మంచిది. ఇప్పటి పరిస్థితులు ఇలాగే కొనసాగాలనే అనవసర తాపత్రయాన్ని వదులుకుని, అనివార్యమైన మార్పులకు మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతారు. పిల్లల యోగక్షేమాల కోసం సమయాన్ని కేటాయిస్తారు. వారి ఆసక్తులను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో సుస్థిరత, ఆర్థిక భద్రత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పురోగతి మొదలవుతుంది. పని వాతావరణం మెరుగుపడుతుంది. వ్యాపార రంగంలోని వారు సాహసోపేత నిర్ణయాల ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థికంగా వరుస విజయాలను సాధిస్తారు. స్థిరాస్తులను, సంపదను పెంచుకుంటారు. సౌందర్య పోషణపై శ్రద్ధ పెడతారు. చర్మసంరక్షణ కోసం నిపుణుల సలహాలు తీసుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహితీ, కళా రంగాల్లోని వారు సత్కారాలు పొందుతారు. లక్కీ కలర్: నశ్యం రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) బాధ్యతలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనితర సాధ్యమైన విజయాలను సాధించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఎటువంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొంటారు. అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. కళా సాహితీ రంగాల్లోని వారికి అపురూపమైన సత్కారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను ఆచరణలో పెడతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వెచ్చించిన సమయం సత్ఫలితాలనిస్తుంది. నిరంతర అధ్యయనం ద్వారా సాధించిన విషయ పరిజ్ఞానమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక కీలకమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. అధికారుల ప్రోత్సాహంతో కోరుకున్న విజయాలను సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. ఇందులో భాగంగా ప్రచారానికి ముమ్మరంగా ఖర్చు చేస్తారు. పిల్లలు సాధించిన విజయాలకు గర్విస్తారు. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. లక్కీ కలర్: గులాబి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ప్రణాళికలేవీ వేసుకోనవసరం లేదు. అదృష్టం దానంతట అదే కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. లేనిపోని వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ప్రియతములతో మాట్లాడేటప్పుడు సామాజిక, రాజకీయ చర్చలకు దిగవద్దు. అనవసర వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్న అపరిచితులకు సాయం చేస్తారు. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అరుదైన ఆలయాలను దర్శించుకుంటారు. పెద్దలు, గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: బూడిద రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి సరైన అవకాశాలు కలసి వస్తాయి. ఆర్థికంగా మరింత పుంజుకోవడానికి తగిన అవకాశాలు అప్రయత్నంగానే లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో వేతన పెంపు ఉండవచ్చు. కొందరికి కోరుకున్న చోటికి బదిలీలయ్యే సూచనలు ఉన్నాయి. సృజనాత్మకమైన మీ ఆలోచనలకు తగిన గుర్తింపు, ప్రచారం లభిస్తాయి. మేధాశక్తికి పదును పెట్టుకుంటారు. మీ సలహాల కారణంగా మీరు పనిచేసే సంస్థకు లాభాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నేరేడు రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) గతంలో చేసిన పనుల వల్ల తలెత్తిన ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. న్యాయస్థానాల్లో అనుకూలమైన తీర్పులు వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అభివృద్ధికి దారితీసే అవకాశాలు అందివస్తాయి. ఏకకాలంలో విభిన్న నైపుణ్యాలతో కూడుకున్న పనులు చేయగల సామర్థ్యమే మీకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. పరిమితులు విధించుకోకుండా అందిన అవకాశాలను వినియోగించుకుంటేనే విజయ పథాన ముందుకు సాగగలుగుతారు. లక్కీ కలర్: నారింజ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మనసుకు నచ్చిన రీతిలో ప్రాధాన్యతలను నిర్ధారించుకుంటారు. వాటిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గతానికి చెందిన జ్ఞాపకాలు కొంత కుంగుబాటుకు దారితీస్తాయి. ప్రశాంతతను కోరుకుంటారు. ధ్యానం, యోగ వంటి ఆధ్యాత్మిక మార్గాలపై దృష్టి సారిస్తారు. కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషణ సాగిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధానికి అవరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు అవసరమవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. లక్కీ కలర్: లేత నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో నిక్కచ్చితనం వల్ల సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. తలపెట్టిన కొన్ని పనుల్లో జాప్యం తప్పకపోవచ్చు. ఇదివరకటి సృజనాత్మక ఆలోచనలను తాజాగా ఆచరణలో పెడతారు. సృజనాత్మక కార్యక్రమాల్లో కొత్త భాగస్వాములు ఏర్పడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెంపొందుతాయి. మీ బృందంలో చేర్చుకోదలచిన వ్యక్తులను ఆచి తూచి ఎంపిక చేసుకుంటారు. లక్కీ కలర్: మబ్బు రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. లక్కీ కలర్: నారింజ రంగు ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు (11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు 2019 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే సమయం. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) ఖర్చులు పెరిగి కొత్త రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయినా పట్టుదలతో పరిష్కారానికి కృషి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు నెలకొంటాయి. ముఖ్య వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీ అభిప్రాయాలు, నిర్ణయాలపై కుటుంబసభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆరోగ్యపరమైన చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు వాయిదా వేస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో విందువినోదాలు. ధన, వస్తులాభాలు. గులాబీ, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్ల శుభవార్తలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ప్రముఖులు మరింత సాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) అనుకున్న వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తుల వ్యవహారాలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు. కొన్ని నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. నిరుద్యోగులకు శ్రమ తప్పదు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి కొద్దిపాటి చికాకులు. వారం చివరిలో శుభవార్తలు వింటారు. ధనలాభం చేకూరుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఎంత శ్రమపడినా అనుకున్న లక్ష్యాలు చేరుకోలేక డీలాపడతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై నిరాశ చెందుతారు. అయితే చేపట్టిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు, నిదానం పాటించండి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వస్తులాభాలు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొంత జాప్యంతో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్తితి సామాన్యంగా ఉంటుంది. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తుల వ్యవహారాలలో పరిష్కారానికి చొరవ చూపుతారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. గృహం కొనుగోలు, నిర్మాణాలలో కొన్ని ప్రతిబంధకాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో విందువినోదాలు. భూలాభాలు. దైవదర్శనాలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు సంతోషిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో కదలికలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల పరిచయం. ఆశ్చర్యరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన కొన్ని పనులలో అవాంతరాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు కొంత అసంతృప్తి తప్పదు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. తీర్థయాత్రలు చేస్తారు. మీ నిర్ణయాలపై కొంత వ్యతిరేకత ఉండవచ్చు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. నీలం, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. రుణభారాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) నూతన ఉద్యోగాలు పొందుతారు. ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్స్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
టారో వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) విదేశాల నుంచి శుభవార్తలను వింటారు. వృత్తి ఉద్యోగాల్లో చిరకాలంగా ఆశిస్తున్న పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. అనవసరంగా శ్రమించకుండా, తెలివిగా లక్ష్యాలను సాధిస్తారు. మిమ్మల్నే నమ్ముకున్న బృందానికి న్యాయం జరిగేలా చూస్తారు. సగంలోనే విడిచిపెట్టిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం వినూత్న పథకాలను అమలు చేస్తారు. అసూయాపరులు కొందరు మిమ్మల్ని ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. దూర ప్రాంతాల్లోని మిత్రులను ఆదుకుంటారు. లక్కీ కలర్: నలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వరుస అవకాశాలు వస్తాయి. దేనిని ఎంపిక చేసుకోవాలో అర్థంకాని గందరగోళంలో పడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. ఉన్నతాధికారులతో వాగ్వాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పోరాట పథాన్నే నమ్ముకుంటారు. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: మీగడ రంగు మిథునం (మే 21 – జూన్ 20) రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పనులు చేపడతారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి స్థానచలన సూచనలు ఉన్నాయి. చాలా కీలకమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అకాల భోజనం వల్ల ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బందిపెట్టవచ్చు. ప్రియతములతో అనుబంధం జటిలంగా మారే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇంట్లో మార్పులు ఉంటాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జీవనశైలిని మార్చుకుంటారు. అనవసరమైన భయాలతో ఆందోళన చెందవద్దు. అవన్నీ వేకువకు ముందు చీకటిలాంటివి. త్వరలోనే మీ జీవితంలో ఉజ్వల భవిష్యత్తుకు దారితీసే ఆశాకిరణాలు ప్రసరిస్తాయి. ఆర్థిక పరిస్థితులను అదుపులో ఉంచడానికి తగిన నిధులను సమకూర్చుకుంటారు. రుణాలు తీసుకోవాలనే ఆలోచనను వాయిదా వేసుకోవడమే మంచిది. ఆశ్చర్యకరంగా ప్రత్యర్థులనుకున్న వారే మీకు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఆత్మీయుల్లో ఒకరు దూరమవుతారు. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) వృత్తి ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. పని పట్ల అభిరుచి, అంకితభావమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. స్వయంకృషితోనే సమస్యల నుంచి బయటపడతారు. క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయాల్సిన మిత్రులు కూడా ముఖం చాటేస్తారు. జీవితం నేర్పిన పాఠాలతో మనుషులను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రేమానుబంధాలపై ఇంతవరకు దృష్టి సారించకపోయినా, అనుకోకుండా ప్రేమలో పడతారు. ప్రేమానుభూతిని అనుక్షణం ఆస్వాదిస్తారు. ఆధ్యాత్మికత ద్వారా మానసిక సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: ముదురు గులాబి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) అదృష్టం తలుపు తడుతుంది. ఒక గొప్ప అవకాశం అయాచితంగానే లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనార్జన వ్యామోహాన్ని రేకెత్తించే పన్నాగాలతో కొందరు మిమ్మల్ని బురిడీ కొట్టించే యత్నాలు చేస్తారు. తెలివిగా వాటిని తిప్పికొట్టకుంటే భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. వ్యసనాల నుంచి బయటపడటానికి యోగ, ఆధ్యాత్మిక సాధనలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: తుప్పు రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పనితీరులో దూకుడు పెంచుతారు. అవరోధాలను అవలీలగా అధిగమించి విజయ పరంపర కొనసాగిస్తారు. విమర్శలు సంధించే ప్రత్యర్థులకు మాటలతో కాకుండా మీ విజయాలతోనే సమాధానం చెబుతారు. క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, అంకిత భావాలతో పాటు మీ అంతస్సౌందర్యమే మిమ్మల్ని ఉన్నతులుగా నిలిపినట్లు గ్రహిస్తారు. నిజాయతీపరులను ప్రోత్సహిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు కొంత చికాకు కలిగిస్తాయి. లక్కీ కలర్: నేరేడు రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కలలను సాకారం చేసుకోవడానికి కృషి కొనసాగిస్తారు. కొత్త ఆలోచనలతో వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన సమస్యలు సమసిపోతాయి. పరిస్థితులు పూర్తిగా సానుకూలంగా మారుతాయి. ఒక మహిళా భాగస్వామి ఆలోచనల కారణంగా వ్యాపార లాభాలు రెట్టింపవుతాయి. సౌందర్య సాధనాలను కొనుగోలు చేస్తారు. శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి వ్యాయామంపై దృష్టి సారిస్తారు. ఖరీదైన విలాస వస్తువులను ప్రియతములకు కానుకగా ఇస్తారు. లక్కీ కలర్: ఊదా ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సాదాసీదాగా సాగిపోతున్న జీవితం అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ఒడిదుడుకులు ఎదురైనా, సాఫీగానే లక్ష్యాలను చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అదేపనిగా కొందరు మీపై సాగించే దుష్ప్రచారం తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకంజ వేయవద్దు. భవిష్యత్తులో అవే సత్ఫలితాలనిస్తాయి. పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి తగిన సలహాలు, సూచనల కోసం జ్యోతిషులను సంప్రదిస్తారు. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. లక్కీ కలర్: నీలం మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీదైన రంగంలో మీరు తారలా మెరిసిపోతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అనూహ్యమైన పదోన్నతులు, వేతన వృద్ధి సూచనలు ఉన్నాయి. నాయకత్వ బాధ్యతలను చేపడతారు. వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు కలసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చాలాకాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. అనుకోని వ్యక్తి నుంచి వచ్చే ప్రేమప్రతిపాదన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. స్నేహితులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: ఎరుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) బాధ్యతలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనితర సాధ్యమైన విజయాలను సాధించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఎటువంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొంటారు. అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. కళా సాహితీ రంగాల్లోని వారికి అపురూపమైన సత్కారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను ఆచరణలో పెడతారు. లక్కీ కలర్: ముదురు గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) సానుకూల దృక్పథంతో విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అంకితభావంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి యోగా, వ్యాయామం, ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆశ్రయిస్తారు. స్థిరాస్తులలో పెట్టుబడుల నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. స్వల్పకాలిక పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బహిరంగ వేదికలపై వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. లక్కీ కలర్: నాచురంగు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న పనులు ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు విజయాలు చేకూరతాయి. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉండి రుణాలు తీరతాయి. వ్యతిరేకులు కూడా మీకు సహకరించడం విశేషం. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. గులాబి, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) కొన్ని పనులలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ పుంజుకుంటుంది. సన్నిహితులు, బంధువులతో ముఖ్యమైన విషయాలపై ^è ర్చిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో తగినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశపయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు మన్నిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సానుకూల వాతావరణం. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు మిశ్రమంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు. ఆత్మస్థైర్యం, పట్టుదలతో ముందుకు సాగండి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. నిర్ణయాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు వాయిదా వేస్తారు. కుటుంబబాధ్యతలపై కొంత విముఖత చూపుతారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. చిన్ననాటి మిత్రుల కలయిక. తెలుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఎంతటి పనైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక విషయాలలో గందరగోళాలు తొలగి, ఊరట చెందుతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. మీపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సందేశం అందుతుంది. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ నిర్ణయాలకు సర్వత్రా ప్రశంసలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలు చేపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకర్షిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు పదవులు వరించవచ్చు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అనుకున్న పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనయోగం. మీ మనస్సులోని భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయినా పట్టుదలతో అధిగమిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారంపై చర్చలు జరుపుతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి అనుకోని సన్మానాలు, రివార్డులు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. హనుమాన్ ఛాలీసా పఠనం మంచిది. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు తీరి లాభాలబాటలో పడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు రావచ్చు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారి కలలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. సన్నిహితుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు తిరస్కరిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. కళాకారులు సామాన్యంగానే ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలులో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరిన్ని ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త లైసెన్సులు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనులు సాఫీగా సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉండవచ్చు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక విషయాలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు పోటీని తట్టుకుని దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో అనుకున్న రీతిలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. కళాకారులకు అవార్డులు, పురస్కారాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పట్టింది బంగారమే కాగలదు. కుటుంబసభ్యులు మరింత ఆప్యాయత కనబరుస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పురోగతిలో సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పకపోవచ్చు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కించుచకుంటారు. రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. వారం చివరిలో అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. తెలుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పాతబాకీలు వసూలవుతాయి. పెండింగ్ పనులు సైతం ప్రస్తుతం పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలపై కుటుంబసభ్యులతో సంప్రదింపులు. స్వల్ప అనారోగ్య సూచనలు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు, ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకోని సంఘటన ఆకట్టుకుంటుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వివాహ యత్నాలలో కదలికలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు స్వాగతిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు రాగలదు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి. రుణబాధలు తొలగుతాయి. పనులు సవ్యంగా పూర్తి కాగలవు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో విభేదాలు తొలగుతాయి. బంధువులు మీపై మరింత ఆదరణ చూపుతారు. చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. ఉద్యోగయత్నాలలో కొంత అనుకూలత. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కే ఛాన్స్. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు కొంత నత్తనడకన సాగుతాయి. ఆదాయ వ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆప్తులతో ఉత్తరప్రత్యుత్తరాలు. భూములు, వాహనాలు కొనుగోలులో కొంత జాప్యం. నిరుద్యోగులు, విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కే సమయం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకోని ప్రగతి కనిపిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు సైతం పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో పురోగతి ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకమే. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు రావచ్చు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పాత ధోరణుల నుంచి బయటపడతారు. జీవనయానాన్ని స్వేచ్ఛ దిశగా మళ్లిస్తారు. అంతః ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అర్థంకాని గందరగోళం కొంత ఇబ్బంది పెడుతుంది. అయినా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు సాధించడానికి సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. సన్నిహితంగా మరింత సమయం గడపాలంటే ప్రేమికుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్య జాగ్రత్తలు అవసరమవుతాయి. లక్కీ కలర్: నేరేడు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) విడిపోయిన బంధాల గురించి అతిగా ఆలోచించకండి. వాటినలా వెళ్లనివ్వండి. జీవితంలో మార్పులను ఆస్వాదించండి. మంచి చెడుల కలయికగా ఉండే పరిణామాలను స్థితప్రజ్ఞతో స్వీకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. ఇంటా బయటా తీరిక దొరకని పరిస్థితులు ఉంటాయి. నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి మీ బృందాన్ని ప్రోత్సహించి ముందుకు నడపాల్సి ఉంటుంది. పని ఒత్తిడి, ప్రేమానుబంధాలకు మధ్య సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. లక్కీ కలర్: తుప్పు రంగు మిథునం (మే 21 – జూన్ 20) అనుకున్న పనులు అనుకున్న రీతిలోనే ముందుకు సాగుతాయి. త్వరలోనే ఘన విజయాలు సాధించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు ఉంటాయి. అనవసరమైన పనులపై అతిగా తాపత్రయ పడుతున్న విషయాన్ని గ్రహిస్తారు. పనితీరును ప్రణాళికాబద్ధంగా మార్చుకుంటారు. స్వల్ప కాలిక పెట్టుబడులు లాభాలనిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విదేశీ అవకాశాలు కలసి వస్తాయి. పాత మిత్రుల్లో ఒకరు కలుసుకుంటారు. ప్రేమ ప్రతిపాదనల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. లక్కీ కలర్: ముదురు గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అన్ని రంగాల్లోనూ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. సాధించదలచుకున్న లక్ష్యం నుంచి దృష్టి చెదరనివ్వకుండా ఉంటే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతాయుతమైన పదవులకు చేరుకుంటారు. కఠోర శ్రమకు తగిన ఆర్థిక ఫలితాలనే కాకుండా, ప్రత్యేక గుర్తింపును కూడా సాధిస్తారు. ఆత్మబంధువు ఒకరిని కలుసుకుంటారు. ఎదుగుదలకు దోహదపడే ఉన్నత విద్యాభ్యాసాన్ని, పరిశోధనలను కొనసాగిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఒంటరిగా ఉంటున్నవారికి పెళ్లిళ్లయ్యే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ముదురు గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉద్విగ్నభరితమైన కాలం కొనసాగుతోంది. సాహసోపేతమైన నిర్ణయాలతో దూకుడు చూపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అసాధారణమైన పురోగతిని సాధిస్తారు. నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. నమ్మకంగా చిత్తశుద్ధితో మీతో కలసి పనిచేసిన బృందానికి తగిన న్యాయం జరిగేలా చూస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురైన అవరోధాలను అధిగమించి, సానుకూల ఫలితాలను సాధిస్తారు. ప్రత్యర్థుల దుష్ప్రచారం కొంత మనస్తాపం కలిగించినా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతారు. కోరుకున్న వ్యక్తితో బంధం ముడిపడుతుంది. లక్కీ కలర్: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వృత్తి ఉద్యోగాల్లో ఉంటున్న వారు చేసే స్వయం ఉపాధి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్తగా చేపట్టే వ్యాపారం మీ భావి అభివృద్ధికి బాటలు వేస్తుంది. అధ్యయనానికి, పరిశోధనకు మరింత సమయం కేటాయిస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. రాజకీయ రంగంలోని వారు ప్రజల్లోకి వెళ్లి ప్రజలనాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సుస్థిరత కోసం సాగించే ప్రయత్నాలు సఫలమవుతాయి. అద్భుతమైన ఒక వ్యక్తితో తొలి చూపులోనే ప్రేమలో పడతారు. పని నుంచి కొంత విరామం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: నారింజ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) పాత ఇంటిని పడగొట్టి కొత్త నిర్మాణం చేపడతారు. దీనివల్ల పనిభారం మరింతగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పోటీని ఎదుర్కొంటారు. ఇదివరకు కొందరు మీ పట్ల చేసిన పొరపాట్లను క్షమిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. అకాల భోజనం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే సూచనలు ఉన్నాయి. కళాకారులకు అభిమానుల ఆదరణ పెరుగుతుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సి వస్తుంది. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: లేతాకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) తలపెట్టిన పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. లక్కీ కలర్: లేత గోధుమరంగు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థికంగా కొంత పురోగతి కనిపించినా రుణాలు సైతం చేస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత శ్రమ తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో శుభవార్తలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అందరిలోనూ గౌరవానికి లోటు ఉండదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త విధుల్లో చేరవచ్చు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. మిత్రులతో వివాదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్డున పడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ అభిప్రాయాలు, మనోగతాన్ని కుటుంబసభ్యులు గౌరవిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. శత్రువులను సైతం ఆదరిస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) నూతనంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వివాహయత్నాలు తుది దశకు చేరుకుంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. వ్యయప్రయాసలు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. నూతనోద్యోగాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు రాదు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి విషయంలో చిక్కులు తొలగి లబ్ధి చేకూరుతుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. చాకచక్యంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో కొద్దిగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నిర్ణయాలలో మార్పులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) అనుకున్న సమయానికి డబ్బు సమకూరక కొంత ఇబ్బందిపడవచ్చు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా కొనసాగుతాయి. కొన్ని వివాదాలు నెలకొన్నా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగేవీలుంది. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి విషయాలలో సోదరుల నుంచి అనుకూల సంకేతాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని పనులలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకతను చాటుకుంటారు. మీ ప్రజ్ఞాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి అవార్డులు దక్కే అవకాశం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. కొన్ని నిర్ణయాలు బంధువులను ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కుటుంబసభ్యులు మీపై మరింత ఆదరణ చూపుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ వ్యూహాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు
15 అక్టోబర్ నుంచి 21 అక్టోబర్ 2017 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పోటీపరీక్షల్లో విజయం. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.) కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. నిర్ణయాలలో ఎటూతేల్చుకోలేరు. కొన్ని సమస్యలు వాటంతట అవే సర్దుబాటు కాగలవు. వ్యాపార లావాదేవీలు కొంత మందగించినా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పనిభారం కొంత పెరుగుతుంది. కళాకారులకు ఒత్తిడులు ఉండవచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. గులాబి, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) రాబడికి మించిన ఖర్చులు ఎదురై అప్పులు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు కొంత మందగిస్తాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తప్పకపోవచ్చు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు మీదపడవచ్చు. పారిశ్రామికవర్గాలకు పర్యటనల్లో ఆటంకాలు. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఎరుపు, తెలుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. పరపతి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వేడుకలకు హాజరవుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూల వాతావరణం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. వారం చివరిలో ఖర్చులు. వివాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమాచారం. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగుల సమర్థత బయటపడుతుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు, పదవులు దక్కే అవకాశం. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అదనపు రాబడి అంది ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువర్గంతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఇంతకాలం ఎదుర్కొంటున్న సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులను కలుసుకుని వ్యవహారాలలో చర్చిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సోదరులు, సోదరీలతో వివాదాలు కాస్త సర్దుబాటు కాగలవు. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. నీలం, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. భూవివాదాల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆదాయం ఆశాజనంగా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువులతో వివాదాలు. పసుపు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. -సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో 15 అక్టోబర్ నుంచి 21 అక్టోబర్, 2017 వరకు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) చేపట్టిన పనులన్నీ కలిసివస్తాయి. చదువులో, ఉద్యోగంలో ఒక గొప్ప విజయాన్ని చూడబోతున్నారు. మిమ్మల్ని మీరు నమ్మి గతంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇవ్వడం చూస్తారు. మంచి పేరు, గౌరవం కూడా దక్కుతుంది. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే ఇప్పుడప్పుడే ఫలితం గురించి ఆలోచించకండి. జీవితంలో ఓ కొత్త అవకాశం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. కలిసివచ్చే రంగు : నారింజ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ ఆలోచనా విధానంలో ఊహించని మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ఈ మార్పును స్వీకరించండి. కొత్త స్నేహాలు, ప్రేమలకు ఇది సరైన సమయం కాదని తెలుసుకుని వ్యవహరించండి. ఇప్పటికే కొన్ని స్నేహాలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బందిపెడుతున్నాయి. మీకోసం ఎక్కువ సమయం కేటాయించుకోండి. భయాలు, ఆందోళనలను పక్కనబెట్టి విజయంపై ధీమాతో పనిచేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : నీలం మిథునం (మే 21 – జూన్ 20) ఈ వారమంతా కొంత గందరగోళంగానే ఉంటుంది. ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏది జరిగినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. మీరు కొత్తగా మొదలుపెట్టిన పనులు అర్ధంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసంతో ఈ పరిస్థితిని ఎదుర్కొండి. ఈ ఒక్క ప్రమాదం నుంచి బయటపడితే ముందు అంతా మంచే జరుగుతుంది. మానసికంగా ధృడంగా ఉండండి. కలిసివచ్చే రంగు : ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఏ పనిమీదా సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్న మీ వ్యవహార శైలే మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుందని తెలుసుకోవాలి. ఏ పని చేయాలనుకున్నా, చిత్తశుద్ధితో పనిచేయడం అలవర్చుకోండి. మీలో వచ్చే ఈ మార్పే మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. జీవితం కొత్త మలుపులు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. దాన్ని మీరూ ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ప్రతికూల ఆలోచనలే అన్నింట్లో మీరు వెనకబడడానికి కారణమని గ్రహించండి. ఆత్మ విశ్వాసంతో, విజయంపై ధీమాతో ముందడుగు వేయండి. పరిస్థితులకు భయపడినా కొద్దీ విజయానికి మీరొక మూడడుగులు వెనక్కి వేస్తున్నట్టే. ఈవారం మీకు అంతా శుభసూచకంగానే కనిపిస్తోంది. కొన్ని కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నట్లైతే అందుకు ఇదే సరైన సమయం. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : వంగ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం మీకు ఎదురయ్యే సవాళ్లు కూడా మీ ధైర్యానికి పరీక్ష పెట్టేవిగానే ఉంటాయి. విజయం మీదేనని నమ్మండి. మంచి గుర్తింపు దక్కుతుంది. మీ జీవితాశయానికి దగ్గరగా వెళ్లే ప్రయత్నాలు ఏవైనా ఉంటే వాటిపై బాగా శ్రద్ధ పెట్టండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, సరికొత్త మార్గాల్లో ఆదాయ అన్వేషణను కొనసాగిస్తూ వెళ్లేందుకు ఇదే సమయం. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. కలిసివచ్చే రంగు : పీచ్ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ శుభవార్త ఈ వారమే వింటారు. మిమ్మల్ని ఎంతోకాలంగా ఇబ్బంది పెడుతోన్న ప్రేమ వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. విహారయాత్రలకు సన్నాహాలు చేసుకోండి. మీరు మునుపటిలా ఉల్లాసంగా పనిచేయడానికి ఈ విహారయాత్ర ఉపయోగపడుతుంది. కొత్త పదవి లేదా ఉద్యోగ మార్పు కనిపిస్తోంది. అందుకు సిద్ధంగా ఉండండి. కలిసివచ్చే రంగు : ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీకు రానున్నదంతా మంచి కాలమే. మీరు కోరుకున్నట్లుగా జీవితం సాఫీగా సాగుతుంది. మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పనులను వాయిదా వేస్తూ పోవడం మిమ్మల్ని అన్నింట్లో వెనుకబడిపోయేలా చేస్తోంది. మీరు కోరుకున్న విజయం త్వరలోనే దక్కుతుంది. కష్టపడకుండా విజయం సాధిస్తామన్న అపోహను దూరం చేసుకోవడం మంచిది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) వృత్తి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రేమ జీవితం కూడా కొత్త మలుపులు తీసుకుంటుంది. అయితే అన్నీ మీ మంచికే జరుగుతాయి. ఉల్లాసంగా ఉంటారు. గతంలో మీరు చేపట్టిన కొన్ని పనులు ఇప్పుడిప్పుడే ఫలితాలిస్తాయి. జీవితాశయం వైపుకు అడుగులు వేసేలా పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. మీ పరిధి దాటిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకపోతేనే మంచిది. మీకు గుర్తింపు దక్కాల్సిన చోట మౌనంగా వ్యవహరించడం మానండి. కలిసివచ్చే రంగు : లేత గులాబి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. కొత్త పని మొదలుపెడతారు. మీ స్థాయికి తగ్గ విజయం ఈ కొత్త పనిలో దక్కుతుంది. చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నీ సద్దుమణుగుతాయి. కష్టపడితేనే విజయం అన్న విషయాన్ని తెలుసుకుంటారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులకు మంచి గుర్తింపు దక్కుతుంది. తూర్పు దిక్కున పచ్చటి మొక్కలు నాటితే అది మీకు బాగా కలిసివస్తుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) అదృష్టం మీ తలుపు తడుతుంది. గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటారు. కొత్త ఉత్సాహంతో మీ జీవితాశయానికి మరింత దగ్గరవుతూ కష్టపడతారు. కొత్త పని మొదలుపెట్టాలని అనుకుంటూ ఉన్నట్లైతే ఇదే సరైన సమయం. వాహనయోగం ఉంది. అవకాశాలు వరుసగా వచ్చిపడతాయి. మీ స్థాయికి తగ్గవాటిని ఎంచుకొని కష్టపడండి. అనవసర భయాలతో మీరు సమర్ధంగా నిర్వహించగల బాధ్యతలను వదులుకోకండి. కలిసివచ్చే రంగు : నలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీకు రానున్నదంతా మంచి కాలమే. జరగాల్సినవి జరగకమానవు అన్న విషయాన్ని బలంగా నమ్మండి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొత్త ఆలోచనలు తడతాయి. కొత్త వ్యాపారాల గురించి ఆలోచిస్తారు. మీపై మీరుంచే నమ్మకమే ఈ కొత్త ఆలోచనల్లో మీకంటూ ఒక గుర్తింపు ఇవ్వగలుగుతాయని గ్రహించండి. వాస్తవానికి దగ్గరగానే మీ ఆలోచనలు ఉండేలా చూసుకోవడం అవసరమన్నది తెలుసుకోండి. కలిసివచ్చే రంగు : ఊదా ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు : 1 మే నుంచి 7మే, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. కార్యజయం. ఆశ్చర్య కరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. నూతన గృహయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) వివాదాల నుంచి గట్టెక్కే సూచనలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రత్యేకతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. భూములు, నగలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. స్వల్ప అనారోగ్య సూచనలు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు మార్పులు. కళాకారులకు ప్రయత్నాలలో పురోగతి. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కార్యోన్ముఖులై అనుకున్నది సాధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వస్తు, వస్త్ర లాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు పదవులు ఊరిస్తాయి. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేస్తారు. ఆలోచనలు కలిసిరావు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలలో స్వల్ప ఆటంకాలు. బంధువర్గంతో వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు. పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహం. తెలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. పెట్టుబడుల్లో జాప్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. గృహ నిర్మాణ యత్నాలలో కదలికలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయ వర్గాలకు పదవులు దగ్గరవుతాయి. గులాబి, ఆకాశనీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమేపీ అనుకూలత ఉంటుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. ప్రముఖులతో పరిచయాలు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. నీలం, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆస్తి వివాదాలు. పనుల్లో అవాంతరాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు నిరాశ. వారం చివరిలో కొంత అనుకూలత ఉంటుంది. గులాబి, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన సామగ్రి, డబ్బు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. రాజకీయ వర్గాలకు పర్యటనలు వాయిదా. ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివ పంచాక్షరి పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. వాహన, గృహయోగాలు. తీర్థయాత్రలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఈవారం ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. అనుకున్న పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధువులు, పాతమిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు వాయిదా. గులాబి, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 24 ఏప్రిల్ నుంచి 30ఏప్రిల్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. స్వల్ప అనారోగ్యం. కాంట్రాక్టులు పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు ఉత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు సన్మానాలు. నీలం, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు పరిష్కారవుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. నేరేడు, లేతఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షా స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి కూడా బాగా కనిపిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. అరుదైన ఆహ్వానాలు రాగలవు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం ఉంది. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వస్తాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఈవారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించవచ్చు. ఇంటా బయటా పని ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. రాజకీయ, కళారంగాల వారికి చికాకులు ఎదురవుతాయి. ఎరుపు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఈవారం పనులు కాస్త మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొంత నిరాశ ఎదురవుతుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు కలిగి కంగారు పెడతాయి. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వార్తలు అందుతాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు సన్మానాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పూర్వపు మిత్రుల కలయిక. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ వర్గాలకు పదవీయోగం, సన్మానాలు. ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పరిచయాలు పెరుగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు పాటిస్తారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త విద్యావకాశాలు దక్కుతాయి. ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. కోర్టు కేసుల నుంచి విముక్తి. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పైస్థాయి ప్రశంసలు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. నీలం, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. అరుదైన సన్మానాలు జరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒక ముఖ్యసమాచారం అందుతుంది. కళాకారులకు పురస్కారాలు, అవార్డులు. నలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆప్తులు సహాయపడతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్వల్ప అనారోగ్యం. పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయ వర్గాలకు సన్మానాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 17 ఏప్రిల్ నుంచి 23ఏప్రిల్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్ర లాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. పసుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగించవచ్చు. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనులలో కొంత జాప్యం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. సోదరులు, మిత్రులతో మాట పట్టింపులు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు నిరుత్సాహం. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. లేత పసుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటా బయటా కూడా మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన బాకీలు సమయానికి అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. దైవదర్శనాలు చేస్తారు. నేరేడు, లేత ఎరుపు రంగులు, ద క్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే సూచనలు ఉన్నాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారు విదేశీ పర్యటనలు చేస్తారు. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఎరుపు, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు. తండ్రి తరఫు వారి నుంచి ధన, వస్తులాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. తెలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులు సకాలంలో పూర్తయి ఊపిరి పీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీపడతారు. చర, స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. సన్మానయోగం. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులు, నిరుద్యోగులు అసంతృప్తి చెందుతారు. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం, తెలుపు రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. నలుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆంజనేయ దండకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఎరుపు, బంగారు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి. సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు : 10 ఏప్రిల్ నుంచి 16ఏప్రిల్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో అవాంతరాలు తప్పక పోవచ్చు. సోదరులు, సోదరీలతో స్వల్ప వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. స్వల్ప అనారోగ్యం. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు శ్రమాధిక్యం. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీనృసింహ స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొత్త పనులకు శ్రీకారం. కొన్ని నిర్ణయాలు కుటుంబసభ్యుల ప్రశంసలు అందుకుంటాయి. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, అదనపు బాధ్యతలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. లేతనీలం, నేరేడు రంగులు, దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమ మరింతగా పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. మిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. కొన్ని నిర్ణయాలపై పునరాలోచన. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. తెలుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థికంగా గతవారం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. సోదరులు, మిత్రులతో అకారణ తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో అవరోధాలు. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యసమస్యలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రం. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు నిరాశాజనకం. పసుపు, లేత గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఊహించని అరుదైన ఆహ్వానాలు రాగలవు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు నూతనోత్సాహం. ఎరుపు, చాక్లెట్ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అనుకోని విధంగా డబ్బు అంది అవసరాలు తీరతాయి. శ్రేయోభిలాషులు సహాయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగానే దక్కుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. పనుల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తప్పవు. నలుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ఛాలీసా పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు. గులాబీ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేయండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు