vishnu kumar raju
-
బీజేపీ ఎమ్మెల్యే చిల్లర మాటలు చంద్రబాబు పిచ్చి నవ్వులు..
-
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పార్టీలోనూ, అటు ఇతర పార్టీల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ ఏపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లు అన్నం తినేవాళ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను కించపరిచేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతున్నా..సభా నాయకుడిగా చంద్రబాబు స్పందించకపోగా వెకిలి నవ్వు నవ్వడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'గ్లాస్ గుచ్చుకుంది'..!
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు గ్లాసు గుర్తు గట్టిగానే గుచ్చుకుంటోందట. ఇప్పటికే జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన ఓట్లనే చీల్చుతారని తెగ ఇదైపోతున్నారట. దీనికి గ్లాసు గుర్తు తోడు కావడంతో భయపడ్డ ఆయన, గ్లాస్ గుర్తు దక్కిన స్వతంత్ర అభ్యర్థి ఇంటికెళ్లి మరీ బతిమాలుకున్నారట.తను గెలిచాక అధిక మొత్తం ముట్టజెప్తానని హామీ ఇచ్చారట. అయి తే 2014లో ఆయన తీరు గుర్తుకొచ్చి తక్షణ బేరం మాట్లాడుకున్నారట. కాస్త ‘భారీ’స్థాయిలో బతిమాలుకున్నాకే ఆ అభ్యర్థి వెనక్కి తగ్గినట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి పరువు తప్ప, అధికారం మాత్రం దక్కదన్న నమ్మకానికొచ్చేశారట..!ఇవి చదవండి: 'పులుసు కారుతోంది'..! -
విష్ణుకుమారుడి బెదిరింపులు!
సాక్షి, విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్‌రాజుకు ఓటమి భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఆయన బెదిరింపులకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తన గెలుపు కోసమే పనిచేయాలన్న భావనతో ఆయన ఉన్నారు. అలా ఎవరైనా తన ప్రత్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్టు తెలిస్తే ఆయన సహించలేక పోతున్నారు. ఆయా సంస్థల యజమానులకు ఫోన్లు చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. ‘మీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఫలానా వ్యక్తి నా ప్రత్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది. ఆయన ప్రత్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొనవద్దని చెప్పండి.. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారని తెలిసింది. ఇలా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి యజమానికి ఫోన్ చేసి ఇలానే బెదిరింపులకు దిగడంతో సదరు యజమాని ‘మా ఆస్పత్రి పని వేళలు ముగిశాక ఆయన ఏం చేసుకున్నా ఆయన వ్యక్తిగతం.. ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు..’ అని ఖరాఖండీగా చెప్పారని సమాచారం. దీంతో చేసేది లేక విష్ణుకుమార్‌రాజు అసహనంతో ఫోన్ పెట్టేసినట్టు తెలిసింది. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలో పని చేస్తున్న మరో వ్యక్తి గురించి కూడా సంబంధిత యజమానికి ఫోన్ చేసి ఇదే తరహాలో హెచ్చరించినట్టు చెబుతున్నారు. ఆ యజమాని కూడా గట్టిగానే సమాధానం చెప్పడంతో విష్ణుకుమార్‌రాజు మిన్నకుండి పోయినట్టు భోగట్టా. ఇలా విష్ణుకుమార్‌రాజు పలువురి పట్ల దురుసుగా మాట్లాడుతున్నారని, తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయనతో నిత్యం ప్రచారంలో తిరిగే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి బతిమలాడుకునో, బుజ్జగించుకునో, కాళ్లా వేళ్లాబడో ఓట్లు వేయించుకోవడం పరిపాటి. కానీ విష్ణుకుమార్‌రాజు మాత్రం అందుకు భిన్నంగా బెదిరింపులకు పాల్పడడమేమిటని ఉత్తర నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. ఓటమి భయంతోనే ఆయన ఇలా అసహనానికి గురవుతున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.2019లో పోలైనవి 18,790 ఓట్లే..విష్ణుకుమార్‌రాజు 2014 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. ఆ తర్వాత 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 18,790 ఓట్లే పోలై నాలుగో స్థానంలో నిలిచారు. అప్పట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేకే రాజుకు 65,408 ఓట్లు, జనసేన అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్‌కు 19,139 ఓట్లు లభించాయి. ఈ లెక్కన కేకే రాజుకంటే 46,618 ఓట్లు, ఉషాకిరణ్కంటే 349 ఓట్లు తక్కువ వచ్చాయి.వివాదాల రాజువిష్ణుకుమార్రాజుకు వివాదాస్పదుడన్న పేరు సొంత పారీ్టలోనే ఉంది. ఎప్పుడు ఎవరిని పొగడ్తలతో ముంచెత్తుతారో, ఎవరిని విమర్శిస్తారో ఆయనకే తెలియదన్న పేరు గడించారు. గతంలో ఏపీ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లు సరి చేసుకుంటుందని భావిస్తున్నానని, ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేమని ప్రధాని మోదీ చెప్పినట్టు పెనుమత్స పేర్కొనడం అప్పట్లో పెను దుమారాన్ని రేపింది. దీనిపై సీరియస్ అయిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బెదిరింపులకు దిగడాన్ని ఆ పార్టీ శ్రేణులు సైతం తప్పు పడుతున్నారు. తన గెలుపు కోసం విష్ణుకుమార్‌రాజు ఏటికి ఎదురీదే పరిస్థితులున్నందునే ఆయన అసహనానికి కారణమని చెబుతున్నారు. -
విష్ణుకుమార్ వ్యాఖ్యలపై మండిపడుతున్న వైఎస్ఆర్సీపీ మహిళ కార్యకర్తలు
-
వివాదాల విష్ణుకుమార్ రాజు.. మాటలు ఎప్పుడు కోటలు దాటాల్సిందేనా?
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పారీ్టలోనూ, అటు ఇతర పారీ్టల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అంతేకాదు సాక్షాత్తూ సొంత పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఆ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లు సరి చేసుకుంటుందని భావిస్తున్నాను అనడం, ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేమని ప్రధాని మోదీ చెప్పినట్లు పేర్కొనడం వంటివి అధిష్టానం సీరియస్ అవడానికి కారణమయ్యాయి. దీంతో ఆయనకు రాష్ట్ర పార్టీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయింది. ఎందుకు మీపై చర్యలు తీసుకోరాదో చెప్పాలంటూ ఆ నోటీసులో పేర్కొంది. ఇది పారీ్టలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఆ కుతూహలం వల్లే..? : ఇప్పటికే విష్ణుకుమార్‌రాజు టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. టీడీపీకి చేరువ కావడం ద్వారా ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న కుతూహలం ఆయనకు ఎప్పట్నుంచో ఉందని బీజేపీలోనే పలువురు చర్చించుకుంటున్నారు. అదే ఉద్దేశంతో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం కూడా పార్టీ అధిష్టానం దృష్టిలో ఉందని చెబుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ వ్యతిరేకమన్న విషయం తెలిసి కూడా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విష్ణుకుమార్‌రాజు అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా అధిష్టానానికి రుచించలేదని అంటున్నారు. షోకాజ్ నోటీసు జారీ : ఒకపక్క పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడుతుండడం, టీడీపీ అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం, మరోపక్క తాజాగా టీవీ ఇంటర్వ్యూలో పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యాఖ్యలు చేయడం వెరసి అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్‌పై విష్ణుకుమార్‌రాజు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. టీవీ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పటి పరిస్థితులకనుగుణంగా చేసినవి కావని, 2019 ఎన్నికలకు ముందు మోదీ చేసినవని అందులో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని ఇతర పార్టీల నాయకులకంటే సొంత బీజేపీ నాయకులే ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. పార్టీ నేతల్లోనూ అసంతృప్తే.. విష్ణుకుమార్‌రాజు వైఖరిపై బీజేపీలోని కొంతమంది ముఖ్య నాయకులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై లోలోన సంతోస్తున్నారు. గతంలో పార్టీని బ్లాక్మెయిల్ చేసే ధోరణిలో తనకు టీడీపీ, మరికొన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నానంటూ ప్రకటనలు చేశారని గుర్తు చేస్తున్నారు. పార్టీలో కీలక పదవిలో ఉంటూ ఇలా తరచూ బహిరంగంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విష్ణుకుమార్‌రాజుపై తాజా టీవీ ఛానల్ ఇంటర్వ్యూ వ్యాఖ్యల నేపథ్యంలోనైనా చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు. విష్ణుకుమార్‌రాజుపై చర్యలుంటాయా? షోకాజ్తోనే సరిపెడతారా? అన్నది వేచి చూడాలి. -
జీఐఎస్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం జగన్ కృషి - విష్ణుకుమార్ రాజు
-
ప్రధాని రోడ్డు షో సక్సెస్: సోము వీర్రాజు
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు షో విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. విశాఖలో శనివారం ప్రధాని బహిరంగ సభ అనంతరం వీర్రాజు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ప్రధాని రోడ్డు షోను విజయవంతం చేసిన ఇన్చార్జిలు, వివిధ విభాగాల బాధ్యులను ఆయన అభినందించారు. ప్రధాని మోదీతో కోర్ కమిటీ సమావేశంలో జరిగిన చర్చ, రాజకీయ అంశాల ఆధారంగా భవిష్యత్తులో పార్టీ ప్రగతిపై నేతలతో ఆయన చర్చించారు. వివిధ అంశాలపై వీర్రాజు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ఏపీ చరిత్రలో ఇలాంటి సభ జరగలేదు: విష్ణుకుమార్ రాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి భారీ బహిరంగ సభ జరగలేదని, ఇకపై జరగబోదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సభని అత్యద్భుతంగా విజయవంతం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ప్రధాని సభ అత్యద్భుతం: జీవీఎల్ నరసింహారావు మురళీనగర్ (విశాఖ ఉత్తర): విశాఖలో ప్రధాని సభ అత్యద్భుతంగా జరిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాని విశాఖ పర్యటన విజయవంతమైందని.. ఊహించిన దానికంటే ప్రజలు అత్యధికంగా హాజరవడంతో ఏయూ గ్రౌండ్ కిక్కిరిసిపోయిందన్నారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ వేలాది మంది సభ బయట ఉండిపోయారని, ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సభాస్థలికి రాలేకపోయారన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన గురించి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. -
చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: విష్ణుకుమార్ రాజు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సభ జరగలేదని.. భవిష్యత్తులోనూ జరగబోదని విశాఖ పట్నం సభను ఉద్దేశించి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు అన్నారు. సభను విజయవంతం చేసిన సీఎం జగన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. సభకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారంటూ ప్రశంసించారు. చదవండి: (పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడన్న సంగతి ప్రధాని మోదీకి తెలిసిపోయిందా?!) -
టీడీపీ నేతలు తినడానికి అలవాటు పడ్దారు
-
విశాఖలో రాజధాని ఏర్పాటుకు మద్దతిస్తున్నా
-
చట్టాల్లో మార్పులు రావాలి:విష్ణుకుమార్ రాజు
సాక్షి, విశాఖపట్నం: ‘దిశ’ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చట్టాల్లో మార్పులు రావాలని, మహిళలపై దారుణాలకు పాల్పడే వారిని పబ్లిక్‌గ్గా ఉరితీసే చట్టంతో పాటు, పబ్లిక్‌గా షూట్ చేసే చట్టం కూడా రావాలన్నారు. రెండు నెలల్లో ఇలాంటి కేసులను క్లోజ్ చేసేలా చట్టం రూపొందించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, డే టూడే గానో కాలపరిమితి విధించి రెండు నెలల్లో నిందితులను ఉరితీసే విధంగా చట్టం చేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. (చదవండి: నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి: చిరంజీవి) -
సిట్‌ను ఆశ్రయించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్టణం : నగరంలోని మధురవాడలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ గురువారం బీజపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సిట్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీని ఆశ్రయించి కబ్జాదారులు భూములను మింగేస్తున్నారని ఆరోపించారు. సిట్ ద్వారా ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములపై కూడా విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
ల్యాండ్ పూలింగ్ రద్దును స్వాగతించిన బీజేపీ నేత
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హర్షం వ్యక్తం చేశారు. జీవో రద్దు చేయడాన్ని సాహసోపేతమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల విశాఖపట్నంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విష్ణుకుమార్ ఆరోపించారు. ఈ విధానం వల్ల అక్రమార్కులు లాభపడ్డారు కానీ రైతులు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు లేని వారికి ఇంటిని నిర్మించి ఇవ్వడానికి కొత్త విధానం తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయడం అభినందనీయమన్నారు. -
ల్యాండ్ పూలింగ్ రద్దుపై హర్షం వ్యక్తం చేసిన విష్ణుకుమార్ రాజు
-
‘టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలి’
సాక్షి, అమరావతి : బీజేపీ సంఘటనా పర్వ్ 2019 సభ్యత నమోదు కార్యక్రమాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్రాజు ఆదివారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని కొనియాడారు. విశాఖ భూ కుంభకోణంలో సిట్ నివేదిక బహిర్గతం చేయాలని అందులో ఉన్న పచ్చపాములు బండారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. -
బ్యాగ్ లేకుండా బడికి పంపడం అభినందనీయం: బీజేపీ
విశాఖపట్నం: వారంలో ఒక్క రోజు బ్యాగ్ లేకుండా విద్యార్థులను బడికి పంపడం అభినందనీయమని, అలాగే పోలీస్ శాఖలో ఒక్క రోజు సెలవు ఇవ్వడం మంచి విధానమని బీజేపీ మాజీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. ఇసుకపై ప్రభుత్వం జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామన్న కొత్త విధానం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. కానీ విధానం ఇంకా అమల్లోకి రాకముందే ఇసుక రవాణా జరిగితే..పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, కోట్ల రూపాయలు స్వాహా చేశారని విమర్శించారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక మాఫియాపై గత టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని వెల్లడించారు. బీజేపీపై అక్రమంగా బురద జల్లడం వల్లే ఏపీలో టీడీపీ నామరూపాలు లేకుండా పోయిందని తూర్పారబట్టారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం తప్పదని 2019 ఎన్నికల ద్వారా రుజువైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి పర్యటనలో సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరుపై కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు. -
ఢిల్లీ వచ్చి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు వృథా
-
సైకిల్ పంక్చర్.. గంటా స్థానమదే..!
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని.. సైకిల్ పంక్చర్ అయిందని బీజేపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. గంటా శ్రీనివాసరావు కబ్జా దాహానికి నియోజవర్గంలో కొండలు, గుట్టలు మాత్రమే మిగిలాయని చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడ్డానని తనపై వచ్చిన ఆరోపణలకు విష్ణుకుమార్ రాజు ఖండించారు. నియోజకవర్గంలో కొందరు పచ్చనేతలు తనపై బురద జల్లుతున్నారని, దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. విశాఖ నార్త్ బీజేపీ క్యాడర్లో కొంతమందిని లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎన్ని చేసినా ఇక్కడ గంటా మూడో స్థానంలోనే ఉంటారని జోస్యం చెప్పారు. -
మీడియా ముందు పరువు తీస్తారు, రాను: గంటా
సాక్షి, విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం వైజాగ్ జర్నలిస్టు ఫోరమ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం అభ్యర్థుల ముఖాముఖికి డుమ్మా కొట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఉంటే తాను రానని, మీడియా ముందు తన పరువు తీస్తారంటూ మంత్రి గంటా ముఖం చాటేశారు. ఈ మేరకు ఆయన వీజేఎఫ్ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపారు. కాగా విశాఖ నార్త్ నుంచి వైఎస్సార్ సీపీ నుంచి కేకే రాజు, బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు, ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, జనసేన అభ్యర్థిగా పి. ఉషాకిరణ్, కాంగ్రెస్ అభ్యర్థిగా గోవిందరాజు బరిలో ఉన్న విషయం తెలిసిందే. వీజేఎఫ్ ముఖాముఖికి మిగతా వారంతా హాజరు కాగా, ఒక్క గంటా శ్రీనివాసరావు మాత్రం గైర్హజరు కావడం విశేషం. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. గంటా ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కాకపోవడం నియోజకవర్గ ప్రజలను, వీజేఎఫ్ను అవమానపరచడమే అని అన్నారు. ఏపీలో బీజేపీది ఎప్పుడు ప్రతిపక్ష పాత్రేనన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కాగా గంటా శ్రీనివాసరావు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో నెంబర్‌వన్ అని, ఓటును రూ.10వేలకు కొంటున్నారంటూ ....విష్ణుకుమార్ రాజు ఇప్పటికే ఘాటు విమర్శలు చేస్తున్నారు. అవినీతికి మరోపేరు అయిన గంటా పోలింగ్ ఏజెంట్లను కూడా కొనే ప్రమాదకర వ్యక్తి అని, ఆయన గెలుపు కోసం విచ్చలవిడిగా డబ్బులను పంచుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. గంటాను భీమిలి ప్రజలు వెళ్లగొడితే విశాఖపై వచ్చి పడ్డారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల నేపథ్యంలో గంటా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
‘ఆయన పోలింగ్ ఏజెంట్లనే కొనేస్తారు’
సాక్షి, విశాఖపట్నం: పోల్ మేనేజ్మెంట్లో మంత్రి గంటా శ్రీనివాసరావు నెంబర్‌వన్ అని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. ఓటును రూ.10వేలకు కొంటున్నారని గంటా స్నేహితులే తనతో చెపుతున్నట్లు ఆయన ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లను కూడా కొనే ప్రమాదకర వ్యక్తి ఇక్కడ పోటీస్తున్నారని, గంటా శ్రీనివాసరావు విచ్చలవిడిగా డబ్బులను పంచుతున్నారని విమర్శించారు. బూత్ కమిటీల్లో అన్ని రాజకీయల పార్టీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో టీడీపీని ఓడిండమే తన లక్ష్యమని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి గంటా శ్రీనివాసరావు దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాగా గంటాను భీమిలి ప్రజలు వెళ్లగొడితే విశాఖపై వచ్చి పడ్డారని ఇప్పటికే ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. అవినీతికి మరోరూపం గంటా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘మోదీ కోసం.. బాబు జీరో అయ్యారు’
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. పోలవరం, అమరావతి సందర్శన యాత్రల పేరుతో కోట్లు ఖర్చుపెడుతూ చంద్రబాబు మతి, గతీ లేనట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీని ఎలాగైనా దెబ్బకొట్టాలని బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆ క్రమంలోనే జీరోగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత బీజేపీదేనని అన్నారు. విద్యా, వ్యవసాయం, సంక్షేమం, బెల్ట్‌షాప్‌లు తొలగించడం వంటి మేనిఫెస్టోతో బీజేపీ ప్రచారంలోకి రాబోతోందని వివరించారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోవడం గంటాకు అలవాటని చురకలంటించారు. ఏ పార్టీ మారతారో చూడాలి.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న విష్ణుకుమార్‌రాజు మంత్రి గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యధిక కుంభకోణాలు, దోపిడీలు చేసింది శ్రీనివాసరావేనని ఆరోపించారు. గంటా చరిత్ర చూస్తే.. అధికారం మారినప్పుడల్లా పార్టీ మారే వ్యక్తి అని విమర్శించారు. ‘25వ తేదీ వరకు సమయం ఉంది. గంటా మళ్లీ ఏ పార్టీ మారతారో చూడాలి. విశాఖ నార్త్‌లో పోటీ రెండు పార్టీల మధ్య కాదు. నీతి, నిజాయితీకి, అవినీతి పరుడైన గంటా శ్రీనివాసరావు మధ్య జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాష్ట్రంలో పరిపాలనపై కంట్రోల్ పోయిందని విమర్శించారు. -
అవినీతి ‘గంటా’ను ఓడించడమే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం : మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి అవినీతి చక్రవర్తి రాష్ట్రంలో మరొకరు ఉండరని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక్క హుదూద్ ఇళ్ల స్కాంలోనే సుమారు ఏడున్నర కోట్ల అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. మంగళవారం ఎన్నికల ప్రచారం భాగంగా పలు ప్రాంతాలు పర్యటించిన విష్ణుకుమార్ రాజు.. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాస్‌పై విరుచుకపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ నియోజకవర్గంలోనూ అక్రమాలు, దోపిడీలు చేయడం గంటాకు అలవాటని విమర్శించారు. దీంతో భీమిలి ప్రజలు వెళ్లగొడితే.. విశాఖపై పడ్డారని మండిపడ్డారు. ఆయనకు ఇదే ఆఖరి నియోజకవర్గం అవుతుందని జోస్యం చెప్పారు. (ఇక ‘ఉత్త’ర గంట) గంటా అవినీతిపై సిట్ రిపోర్టు బయటపెట్టి ఉంటే పోటీ చేయడానికి అర్హత లేకుండా పోయేదని పేర్కొన్నాడు. పేదలను దోచుకునే స్థాయికి మంత్రి దిగజారడం సిగ్గుచేటన్నారు. అన్ని పార్టీలు గంటాకు టికెట్ నిరాకరించాయని.. దీంతో గత్యంతరం లేకే టీడీపీని పట్టుకొని వేలాడుతన్నారన్నారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద శాతం అతడిని ఓడించడానికే ఇక్కడి నుంచి పోటీ చేస్తునాన్నని విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్రానికి పట్టిన అవినీతి చీడ పురుగును ఓడిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపాడు. -
రైల్వే జోన్‌తో టీడీపీ గుండెల్లో రైళ్లు: విష్ణు
విశాఖపట్నం: రైల్వే జోన్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుళ్లు, కుతంత్రంతో మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. బీజేపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాచైతన్య సభలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..బీజేపీపై బురదజల్లే కార్యక్రమం విశాఖ కేంద్రంగా టీడీపీ చేపట్టిందని ఆరోపించారు. రైల్వేజోన్‌తో టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. టీడీపీకి ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉందని అన్నారు. ప్రజలు టీడీపీ నాయకులను అధికారం నుంచి బయటకు పంపే సమయం కోసం వేచిచూస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు, అధికారులను మేనేజ్ చేసి నకిలీ పత్రాలు తయారు చేసి భూములు కాజేశారని ఆరోపించారు. విశాఖ భూ కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్ కమిటీ నివేదిక ఇంకా బయటపెట్టలేదని, ఆ నివేదిక బయటపెడితే పసుపు పచ్చ పాములు బయటకు వస్తాయని చంద్రబాబు భయపడుతున్నారని దుయ్యబట్టారు. బాబుకు మోదీ జ్వరం: సోము చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ జ్వరం పట్టుకుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. మోదీని ఏపీకి రావద్దనే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. పవన్ కల్యాణ్, మోదీ ఇద్దరూ కలిసి కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తేనే చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు డబ్బు జబ్బు పట్టుకుందని తీవ్రంగా విమర్శించారు. ఈ రాష్ట్రానికి రూ.50 వేల కోట్లు ఎన్‌ఆర్‌జీఎస్‌కు నిధులొస్తే, అందులో రూ.16 వేల కోట్లు మట్టి తవ్వి.. 30 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. -
కుంభకోణలపై మాట్లాడారా?