Vishwaroopam 2
-
భారీ వసూళ్లు సాధిస్తోన్న ‘విశ్వరూపం 2’
లోక నాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ విశ్వరూపం 2. 2013లో రిలీజ్ అయిన విశ్వరూపం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే డివైడ్ టాక్‌తో మొదలైన విశ్వరూపం 2 కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. తొలి రోజు అన్ని భాషల్లో కలిపి 9 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ గిరీష్ జోహర్ వెల్లడించారు. చాలా రోజులు తరువాత కమల్ లీడ్ రోల్ లో సినిమా రిలీజ్ కావటంతో చెన్నై అభిమానులతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో టాక్‌తో సంబంధం లేకుండా విశ్వరూపం 2 వసూళ్లు సాధిస్తోంది. రెండు రోజుల్లో 19 కోట్లకు పైగా కలెక్షన్లు సాదించి కోలీవుడ్ లో తొలి రెండు రోజేల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. కమల్ రా ఏంజెంట్ గా నటించిన ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, రాహుల్ బోస్‌లు ఇతర కీలక పాత్రలో నటించారు. కమల్ ఆస్థాన సంగీత దర్శకుడు గిబ్రాన్ సంగీతమందించారు. -
‘బాహుబలి’ రికార్డును బద్దలు కొట్టిన ‘విశ్వరూపం2’
లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా విశ్వరూపం2. విశ్వరూపం సినిమా ఘన విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఎప్పుడో ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ చివరకు విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 10న విడుదలైన విశ్వరూపం2 డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. మొదటి పార్ట్ మెప్పించినంతగా విశ్వరూపం2 మెప్పించలేకపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయినా చెన్నైలో మాత్రం మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అంతేకాకుండా చెన్నైలో బాహుబలి2 (92 లక్షలు) ఫస్ట్ డే రికార్డును బద్దలు కొట్టింది. చెన్నై నగరంలో మొదటి రోజు ఈ చిత్రం దాదాపు 93 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. చెన్నైలో ఫస్ట్ డే కలెక్షన్స్‌లో విశ్వరూపం2 ఆరో స్థానంలో ఉంది. కాలా, వివేగం, కబాలి, తేరి లాంటి సినిమాల తరువాత విశ్వరూపం2 ఉంది. -
‘విశ్వరూపం 2’ మూవీ రివ్యూ
టైటిల్ : విశ్వరూపం 2 జానర్ : యాక్షన్ స్పై థ్రిల్లర్ తారాగణం : కమల్ హాసన్, శేఖర్ కపూర్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : కమల్ హాసన్ నిర్మాత : కమల్ హాసన్, చంద్ర హాసన్ లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా స్వయంగా దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా విశ్వరూపం. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌గా విశ్వరూపం 2 ను తెరకెక్కించారు కమల్. వివిధ కారణాలతో ఆలస్యమైన ఈ సినిమాను ఫైనల్ గా ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. వరుస వాయిదాల తరువాత రిలీజ్ అవుతుండటంతో విశ్వరూపం 2పై ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ అవ్వలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వరూపం 2 ప్రేక్షకులను ఏమేరకు అలరించింది.? కమల్ మరోసారి దర్శకుడిగా ఆకట్టుకున్నారా..? కథ ; కమల్ విశ్వరూపం 2 కథను తొలి భాగానికి పూర్తి స్థాయి కొనసాగింపుగా తయారు చేసుకున్నారు. చాలా సన్నివేశాలకు విశ్వరూపం తో లింక్ ఉండటంతో ఆ సినిమా చూసిన వారికే విశ్వరూపం 2 పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. తొలి భాగంలో న్యూయార్క్ మిషన్ పూర్తి చేసిన విసామ్ (కమల్ హాసన్), మరో మిషన్ మీద లండన్ వెళ్తాడు. లండన్‌లో భారీ విధ్వంసాని జరుగుతున్న కుట్రను తన భార్య నిరుపమా (పూజా కుమార్), ఆస్మితా సుబ్రమణ్యం (ఆండ్రియా)లతో కలిసి చేదిస్తాడు. అదే సమయంలో తొలి భాగం చివర్లో విసామ్ నుంచి తప్పించుకున్న అల్ ఖైధా తీవ్రవాది ఒమర్ ఖురేషీ (రాహుల్ బోస్) ఢిల్లీలో సీరియల్ బ్లాస్ట్‌లకు ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న విసామ్, ఒమర్ ప్లాన్‌ను ఎలా అడ్డుకున్నాడు అన్నదే విశ్వరూపం 2 కథ. నటీనటులు : లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి అద్భుతమైన నటనతో సినిమాను నడిపించాడు. ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్‌లో మంచి ఈజ్ కనబరిచారు. ఆయన బాడీ లాంగ్వేంజ్, డైలాగ్ డెలివరీ నిజంగా ఓ ‘రా’ ఏజెంట్‌నే చూస్తున్నామా అన్నంత నేచురల్‌గా ఉన్నాయి. హీరోయిన్లుగా కనిపించిన పూజా కుమార్, ఆండ్రియాలకు రెండు భాగంలోనూ ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయి. ముఖ్యంగా ఆండ్రియా యాక్షన్ సీన్స్‌లోనూ అదరగొట్టారు. (సాక్షి రివ్యూస్) విలన్‌గా రాహుల్ బోస్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో క్రూరమైన తీవ్రవాదిగా మెప్పించాడు. ఇతర పాత్రల్లో శేఖర్ కపూర్, జైదీప్, వాహీదా రెహమాన్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; విశ్వరూపం సినిమాతో హాలీవుడ్ స్థాయి స్పై థ్రిల్లర్‌ను దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేసిన లోక నాయకుడు కమల్ హాసన్ విశ్వరూపం 2తో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. ముఖ్యంగా తొలి భాగం రిలీజ్ అయి చాలా కాలం కావటం.. సీక్వెల్లో చాలా సన్నివేశాలు తొలి భాగంతో లింక్ అయి ఉండటంతో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేరు. అదే సమయంలో తొలి భాగంలో ఉన్న ఇంటెన్సిటీ కూడా ఈ సీక్వెల్లో మిస్ అయ్యింది. ఇంటర్వెల్ బ్లాక్ లాంటి ఒకటి రెండు సీన్స్ వావ్ అనిపించినా ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. ఫస్ట్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌కు సంబంధించిన చాలా సన్నివేశాలు విశ్వరూపం తొలి భాగంలోని సీన్సే కావటం కూడా నిరాశకలిగిస్తుంది. సంగీత దర్శకుడు గిబ్రాన్ ఓ స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన మూడ్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. తొలి భాగానికి ఏమాత్రం తగ్గ కుండా అంతర్జాతీయ స్థాయి సంగీతమందించాడు. సినిమాటోగ్రఫి కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. అయితే అక్కడక్కడ గ్రాఫిక్స్ మాత్రం నాసిరకంగా ఉండి ఇబ్బంది పెడతాయి. విశ్వరూపం 2కు ఓ రూపు తీసుకురావటంతో ఎడిటర్లు మహేష్ నారాయణ్, విజయ్ శంకర్ల కష్టం చాలా ఉంది. ఎక్కవుగా తొలి భాగానికి సంబంధించిన సీన్స్‌ను రిపీట్ చేస్తూ రూపొందించిన స్క్రీన్‌ప్లేకు తగ్గట్టుగా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు ఎడిటర్లు. కమల్ నిర్మాతగానూ తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చారు. ప్లస్ పాయింట్స్ : కమల్ హాసన్ నటన ఇంటర్వెల్‌సీన్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; స్లో నేరేషన్ పెద్దగా థ్రిల్స్ లేకపోవటం క్లైమాక్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
విశ్వరూపం-2 వాయిదా!
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన విశ్వరూపం-2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలె ఆటంకాలన్నీ తొలగిపోవటటంతో ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తమిళనాడు దిగ్గజనేత కరుణానిధి మరణంతో చిత్రాన్ని వాయిదా వేయాలని కమల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరుణానిధి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన కమల్ హాసన్.. ఆ తర్వాత భావోద్వేగమైన సందేశాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని వాయిదా వేసేందుకే కమల్ మొగ్గు చూపుతున్నాడంట. ఆగష్టు 15న చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో కమల్ ఉన్నట్లు సమాచారం. రిలీజ్ వాయిదాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. కమల్ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌తోపాటు, ఆస్కార్ ఫిలింస్ విశ్వరూపం-2 ను సంయుక్తంగా నిర్మించాయి. -
కమల్ కోసం ప్రచారానికి రెడీ!
కమలహాసన్ కోసం ఆయన మక్కళ్ నీది మయ్యం పార్టీ తరపున ప్రచారం చేయడానికి రెడీ అంటున్నారు నటి పూజాకుమార్. విశ్వనటుడు కమలహాసన్‌తో వరుసగా మూడు చిత్రాల్లో నటించిన కథానాయకి పూజాకుమార్. అయితే 2000 సంవత్సరంలోనే కడల్ పూజావే చిత్రంతో కోలీవుడ్‌కు నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కేరాఫ్ అమెరికా. అవును యూఎస్ఏకు చెందిన పూజాకుమార్ హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అదే విధంగా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించేశారు. కమలహాసన్‌తో విశ్వరూపం పార్టు 1, 2ల్లో నటించారు. తెలుగులో రాజశేఖర్‌కు జంటగా నటించిన గరుడవేగ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కమలహాసన్‌తో నటించిన విశ్వరూపం–2 చిత్రం ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈనటి పూజాకుమార్ సాక్షితో ముచ్చటించారు . ఆ వివరాలు చూద్దాం. కమలహాసన్‌తో వరుసగా మూడు చిత్రాల్లో నటించారు. ఆ అనుభవాలను చెప్పండి? కమలహాసన్ ఎంత గొప్ప నటుడని మాటల్లో చెప్పలేం. సినిమా గురించి ఆయనకు తెలియని విషయం ఉండదంటే అతిశయోక్తి కాదు.అలాంటి నటుడితో నటించడం నిజంగా గొప్ప అనుభవమే. కమల్‌తో నటించిన ప్రతి నిమిషం మధురమైన అనుభూతే. విశ్వరూపం–2 త్వరలో తెరపైకి రానుంది. ఆ చిత్రం గురించి? ఇంతకు ముందు తెరపైకి వచ్చిన విశ్వరూపం చిత్రం ఘన విజయాన్ని సాధించింది. విశ్వరూపం–2 అంతకంటే పెద్ద విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది. అంతర్జాతీయ సాంకేతిక విలువలతో కూడిన చిత్రం విశ్వరూపం 2. మొదటి భాగాన్ని విదేశాల్లో చిత్రీకరిస్తే, రెండవ భాగాన్ని పూర్తిగా భారతదేశంలోనే చిత్రీకరించడం విశేషం. ఒకే చిత్రంలో ఐదేళ్ల పాటు నటించడం బోర్ కొట్టలేదా? పాత్రల్లో సత్తా ఉంటే ఎన్ని ఏళ్లు నటించినా బోర్ కొట్టదు. అలాంటి పాత్రనే విశ్వరూపం 1, 2 చిత్రాల్లో నేను చేశాను. ఈ చిత్రంలో స్కూబా డైవ్ లాంటి సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించారట? అవును. ఆ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. బేసిగ్గా నేను స్కూబా డైవింగ్‌లో శిక్షణ పొందాను. కాబట్టి ఆ సన్నివేశాల్లో నటించడం ఏమంత కష్టం అనిపించలేదు. వరుసగా కమలహాసన్‌తోనే నటిస్తున్నారు. ఇతర నటులతో నటించరా? అలాంటిదేమీలేదు. కమలహాసన్‌తో నటించే అవకావాలు వరుసగా రావడంతో మీరు అలా అంటున్నారు. ఇంతకు ముందు ప్రభుకు జంటగా మీన్కుళంబుమ్ మణ పాళైయమ్ చిత్రంలో నటించాను. అదే విధంగా తెలుగులో రాజశేఖర్ సరసన గరుడవేగ చిత్రంలో నటించాను. ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లో నటించడం లేదే? నేను నివసించేది అమెరికాలో. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఒక కారణం కావచ్చు. అదే విధంగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించడంతో దక్షిణాది చిత్రాలకు గ్యాప్ వస్తోంది. తెలుగులో మళ్లీ నటించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆ విషయమై చర్చలు జరుగుతున్నాయి. చిత్ర నిర్మాతగా మారే ఆలోచన ఉందా? ఉంది. తమిళం, తెలుగు భాషలతో పాటు ఆంతర్జాతీయ స్థాయిలో చిత్రం చేసే ఆలోచన ఉంది. కమలహాసన్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆయన రాజకీయ జీవితం గురించి మీ కామెంట్? కమలహాసన్ గొప్ప నటుడే కాదు. అన్ని విధాలుగా పరిణతి చెందిన వ్యక్తి. ప్రజా సమస్యల గురించి తెలిసిన వ్యక్తి కూడా. ప్రజలపై ప్రేమాభిమానాలు ఉన్న వారు విజయ సాధించడం అసాధ్యం కాదు. అయితే నేను అమెరికాకు చెందిన వ్యక్తిని అక్కడి రాజకీయాల గురించి తెలుగు గానీ, ఇండియన్ రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు. కమలహాసన్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా? కమలహాసన్ కోసం ఆయన పార్టీ తరపున ప్రచారం చేయడానికి నేను రెడీ. అయితే అందుకు ప్రణాళికలు చేసుకోవలసి ఉంటుంది. -
విశ్వరూపం2 ప్రీ–రిలీజ్ వేడుక
-
‘యూనివర్సల్ హీరో’పై రానా కామెంట్
లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం ‘విశ్వరూపం2’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. నేడు జరుగనున్న ఆడియో వేడుకలో పాల్గొనేందుకు నగరానికి విచ్చేశారు. కమల్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న విశ్వరూపం2 సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు కమల్ హాసన్. దగ్గుబాటి రానా కమల్‌హాసన్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఏడాదిలో నేర్చుకునేది ఒక్కగంటలోనే నేర్చుకున్నారంటే.. మీరు ఒక గొప్ప వ్యక్తిని కలుసుకున్నట్లేనంటూ.. కమల్నుద్దేశించి రానా ట్వీట్ చేశాడు. కమల్ హాసన్ నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం2 ఆగస్టు 10న విడుదల కానుంది. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిచారు. When you learnt in an hour more than what you’ve learnt in a year. That means you have met with Legend himself @ikamalhaasan pic.twitter.com/Ym65XsaZTH — Rana Daggubati (@RanaDaggubati) August 2, 2018 -
ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించాడు
ఉళగనాయగన్(లోకనాయకుడు) కమల్ హాసన్ తదుపరి చిత్రం విశ్వరూపం-2 చిత్ర విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 10న ఈచిత్రం విడుదల కానున్నట్లు కమల్ ఈ ఉదయం తెలిపారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను నేటి సాయంత్రం ఆవిష్కరించున్నారు. తమిళ్, హిందీలో ఏకకాలంలో చిత్రం రూపొందించగా, తెలుగులో డబ్ కానుంది. సాయంత్రం 5 గంటలకు తెలుగు ట్రైలర్‌ను ఎన్టీఆర్, తమిళ ట్రైలర్‌ను కమల్ తనయ శృతిహాసన్, హిందీ ట్రైలర్‌ను అమీర్ ఖాన్ విడుదల చేస్తారు. వివాదాల నడుమే విడుదలైన మొదటి పార్ట్‌కు మంచి స్పందన కాగా, రెండో భాగం మాత్రం జాప్యం అవుతూ వస్తోంది. కమల్ రాజకీయ ఆరంగ్రేటం నేపథ్యంలో విశ్వరూపం-2 చిత్రం విడుదల అన్ని వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కమల్ హాసన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా కుమార్, ఆండ్రియా హీరోయిన్లు కాగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. Kamal Haasan announces the release date of #Vishwaroopam2: 10 Aug 2018... Trailer today [11 June 2018] at 5 pm... Directed Kamal Haasan, it has been shot in Tamil and Hindi and dubbed in Telugu... Poster announcing the release date: pic.twitter.com/30au9vtAx6 — taran adarsh (@taran_adarsh) 11 June 2018 -
ఎన్టీఆర్ చేతుల మీదుగా విశ్వరూపం2 ట్రైలర్
కమలహాసన్ విశ్వరూపం సినిమా ఎంతటి వివాదాలను సృష్టించిందో అందరికి తెలిసిందే. చివరకు సినిమా విడుదల విషయంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఎప్పుడో రావల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వరూపం 2 సినిమా జూన్ 11 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా సోమవారం సాయంత్రం 5 గంటలకు మూడు భాషల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. హిందీ వెర్షన్‌ను ఆమిర్ ఖాన్, తమిళ వెర్షన్‌ను శృతి హాసన్, తెలుగు వెర్షన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియా, ఆండ్రియా కమలహాసన్‌కు జోడిగా నటించగా, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. The much-awaited #Vishwaroopam2Trailer will be out on June 11 at 5pm!l#Vishwaroopam2TrailerOnJune11 Telugu Trailer will be launched by @tarak9999 @ikamalhaasan @GhibranOfficial @PoojaKumarNY @andrea_jeremiah @shekharkapur @vairamuthu @Aascars pic.twitter.com/L39GgxS2ye — BARaju (@baraju_SuperHit) June 8, 2018 -
‘విశ్వరూపం 2’కు సెన్సార్ సమస్యలు
విశ్వరూపం 2 హిందీ వెర్షన్‌కు భారీగానే సెన్సార్ కత్తెరలు పడ్డట్టు తెలుస్తోంది. తమిళ, తెలుగు వెర్షన్లకు సెన్సార్ కార్యక్రమాలు గతంలోనే పూర్తయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రెండు భాషల్లో విశ్వరూపం 2కు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ హిందీ వర్షన్‌కు మాత్రం సెన్సార్‌సభ్యులు 17 కట్స్ సూచించినట్టుగా తెలుస్తోంది. విశ్వరూపం తొలి భాగం రిలీజ్ కూడా సమస్యలు తలెత్తడంతో కమల్ కన్నీరు పెట్టుకోవల్సి వచ్చింది.ఎన్నో అవాంతరాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వరూపం మంచి విజయం సాధించింది. తాజాగా విశ్వరూపం 2 విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికేట్ ఇవ్వాలని కొందరు, 17 కట్స్‌తో యు/ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని మరికొందరు అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా నిర్మాత ఆర్థిక సమస్యల కారణంగా తప్పుకోవటంతో దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు కమల్ హసన్. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ముందు కమల్.. తరువాతే రజనీ
కోలీవుడ్ ఇండస్ట్రీ సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించటంతో సినిమాల రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. అయితే ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న కన్య్ఫూజన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా, కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన విశ్వరూపం 2 సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. ఇద్దరు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అగ్ర తారలు కావటంతో ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. కోలీవుడ్ సమాచారం మేరకు ముందుగా విశ్వరూపం 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుందట. విశ్వరూపం 2 సెన్సార్ కార్యక్రమాలు ముందుగా పూర్తయినందున ఆ సినిమానే ముందుగా విడుదల అవుతుందని తెలుస్తోంది. మే నెలలో విశ్వరూపం 2ను విడుదల చేసి తరువాత జూన్‌లో రజనీకాంత్ కాలాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం చిత్ర నిర్మాతలు ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. -
ఇద్దరు సూపర్స్టార్లకు పోటీగా..!
స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఏప్రిల్ నెలలో వెండితెరపై సందడి నెలకొననుంది. తెలుగు, తమిళ టాప్ హీరోల సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవుతుండటంతో థియేరట్ల సమస్యకు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే భారీ పోటితో సతమతమవుతుంటే తాజాగా లోకనాయకుడు కమల్ కూడా అదే సీజన్లో బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు ఇబ్బందులు కలగకుండా రెండు వారాల గ్యాప్ ఉండేలా సర్ధుబాటు చేసుకున్నారు. మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఒక ఒప్పందానికి వచ్చిన నిర్మాతలు భరత్ అనే నేనును ఏప్రిల్ 20న, నా పేరు సూర్యను మే 4న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. తమిళ చిత్రాలతో మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. ఏప్రిల్ 27న రజనీకాంత్ కాలా రిలీజ్ అవుతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించేశారు. తాజాగా కమల్ కూడా విశ్వరూపం 2ను ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. అనుకున్నట్టుగా ఏప్రిల్‌లోనే రిలీజ్ చేస్తే కాలా, భరత్ అనే నేను సినిమాలతో పోటి పడాల్సి ఉంటుంది. మరి కమల్ ఆ రిస్క్ చేస్తాడా.. లేదా..? చూడాలి. -
కమల్ పుట్టిన రోజున ట్రైలర్ విడుదల
ఇటీవల కమల్ హాసన్ పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తున్నా.. సినిమాల విషయంలో మాత్రం కాదు. తమిళ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న కమల్, చాలా కాలం తరువాత ఓ సినిమాకు సంబందించిన వార్తతో తెర మీదకు వచ్చారు. చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న కమల్ కొత్త చిత్రం విశ్వరూపం 2 సినిమా ట్రైలర్ ను లోకనాయకుడిగా పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. కమల్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్ధిక సమస్యల కారణంగా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. సినిమాను నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో కమల్ స్వయంగా పూనుకొని విశ్వరూపం 2 రిలీజ్ కు ప్రయత్నిస్తున్నాడు. కమల్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న విశ్వరూపం 2 ట్రైలర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే కమల్ నుంచి మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. -
దేశానికీ..ప్రజలకూ ప్రేమతో...
కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ విడుదలై నాలుగేళ్లయింది. ఆ సినిమా తీస్తున్నప్పుడే సీక్వెల్లో 40 శాతం చిత్రీకరణ పూర్తి చేశానని కమల్ అప్పట్లో పేర్కొన్నారు. కానీ, సీక్వెల్ ఇప్పటివరకూ తెర పైకి రాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతున్నట్లు ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన పనులు పూర్తి కావచ్చాయి. మంగళవారం ‘విశ్వరూపం–2’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ‘దేశానికీ... దేశ ప్రజలకూ ప్రేమతో’ అంటూ కమల్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. సినిమా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటిస్తారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో నటించడంతో పాటు కమల్ దర్శకత్వం వహించారు. Happy to anounce: Today 7pm Vishwaroop 2 Hindi first look poster & Vishwaroopam Tamizh Telugu 1st look posters release Exclusively for you — Kamal Haasan (@ikamalhaasan) 2 May 2017 -
దీపావళికి రెండో విశ్వరూపం
ఒక సినిమా విడుదల కాకముందు ఆ చిత్రం తాలూకు పోస్టర్లు చూసి, ‘ఇలా ఉంటుంది’ అని ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. దాంతో పాటు అందులో వివాదాస్పద అంశాలేమైనా ఉండి ఉంటాయేమోనని అనుమానిస్తారు. ఆ విధంగా కొన్ని సినిమాలు విడుదల కాకముందే వివాదాల్లో ఇరుక్కుంటుంటాయి. కమల్‌హాసన్ నటించి, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వరూపం’ అందుకో ఉదాహరణ. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చివరికి ‘దేశం వదిలి వెళ్లిపోతా’ అని కమల్ బహిరంగంగా బాధను వ్యక్తం చేసిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి తొలి భాగం తీస్తున్నప్పుడే మలి భాగాన్ని కూడా కమల్ ప్లాన్ చేశారు. ఫస్ట్ పార్ట్ చిత్రీకరణ సమయంలోనే ‘విశ్వరూపం-2’కి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను కూడా తీశారు. కానీ, ఇప్పటివరకూ ఈ చిత్రం తెరకు రాలేదు. దాంతో మలి భాగం ఏమైంది? అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ‘విశ్వరూపం’ తర్వాత కమల్ ‘పాపనాశం’, ‘ఉత్తమవిలన్’, ‘చీకటి రాజ్యం’ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ‘శభాష్ నాయుడు’ చిత్రం చేస్తున్నారు. దాంతో ‘విశ్వరూపం-2’ని ఆపేశారేమో అన్నది కొంతమంది ఊహ. కానీ, ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారట. ఒక పాట, కొంత ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా పూర్తయిందట. ‘శభాష్ నాయుడు’ పూర్తి కాగానే, ‘విశ్వరూపం-2’ పనులు మొదలుపెట్టాలని కమల్ అనుకుంటున్నారని సమాచారం. దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారనే టాక్ చెన్నై కోడంబాక్కమ్‌లో ప్రచారమవుతోంది. ఈలోపే ‘శభాష్ నాయుడు’ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. -
కమల్ చిత్ర క్లైమాక్స్ రీ షూట్?
ప్రముఖ నటుడు కమలహాసన్ తన చిత్ర క్లైమాక్స్‌ను రీ షూట్ చేయాలనుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఆయన ప్రస్తుతం మూడు చిత్రాలు చేస్తున్నారు. ఏ చిత్ర క్లైమాక్స్ రీషూట్ అనే సందేహం కలగవచ్చు. కమ ల్ నటిస్తున్న ఉత్తమ విలన్, పాపనాశం, విశ్వరూపం-2 చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఉత్తమ విలన్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం తొలుత తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బహుశా ఫిబ్రవరి చివరిలో విడుదల కావచ్చు. అదే విధంగా పాపనాశం చిత్రం షూటింగ్ పూర్తరుు్యంది. ఉత్తమ విలన్ తరువాత విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం ఇదే. ఇక మూడో చిత్రం విశ్వరూపం-2. కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ ఇది. విశ్వరూపం చిత్రం ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం కంటే విశ్వరూపం-2లో రొమాన్స్, యాక్షన్ సన్నివేశాలు రెట్టింపుగా ఉంటాయని కమలహాసన్ ఇప్పటికే వెల్లడించారు. విశ్వరూపం చిత్రంలో నటించిన నాయికలు పూజా కుమార్, ఆండ్రియలే ఈ చిత్రం లోనూ నటిస్తున్నారు. విశ్వరూపం-2 చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. అయితే చిత్ర తుది ఘట్ట సన్నివేశాల్లో కొన్ని కమల్‌ను సంతృప్తి పరచలేదని సమాచారం. దీంతో వాటిని మళ్లీ చిత్రీకరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. నటీనటులు, సాంకేతిక వర్గం సెట్ అవడానికి కొద్ది రోజులు పడుతుంది కాబట్టి మరో రెండు వారాల్లో చిత్ర క్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలను కమల్ రీ షూట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అదే విధంగా ఉత్తమ విలన్, పాపనాశం చిత్రా లు ఈ ఏడాదిలో తెరపైకి రానున్న విశ్వరూపం-2 చిత్రం మాత్రం వచ్చే ఏడాదే విడుదల అయ్యే అవకాశం ఉంటుందని కోడంబాక్కం వర్గాల మాట. అందుకు ఆస్కార్ రవిచందర్ కూడా ఒక కారణం అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి నిర్మాత ఆయనే. ప్రస్తుతం శంకర్, విక్రమ్‌ల ఐ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. దీంతో విశ్వరూపం-2 చిత్ర విడుదలకు కాస్త సమయం తీసుకుంటారని టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
ఈ ఏడాదిలో కమల్ చిత్రాలు మూడు
విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఆ తరువాత ఏడాది దాటి నా కొత్త చిత్రం ఏదీ ఇంత వరకు తెరపైకి రాలేదు. అయితే ఆయన ఈ ఏడాది మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ మూడు చిత్రాలు రానున్న ఈ ఆరు నెల ల్లోనే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వరూపం తరువాత కమల్ దానికి సీక్వెల్‌గా విశ్వరూపం-2 చిత్రం చేశారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం రమేష్ అరవింద్ దర్శకత్వంలో దర్శక, నిర్మాత, లింగుసామి నిర్మిస్తున్న ఉత్తమ విలన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా పూర్తి అయ్యింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ట్లు కమల్ ఒక ఇంట ర్వ్యూలో తెలిపారు. ఆయన మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన దృశ్యం చిత్రం తమిళ రీమేక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర షూటిం గ్ జూలైలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు జీతు జోసెఫ్ తెలి పారు. మలయాళంలో దృశ్యం చిత్రానికి దర్శకత్వం వహించిన ఈయన తమిళ చిత్రానికి పని చేయనున్నారు. నటి గౌతమి హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాల తారాగణం, సాం కేతిక బృందం ఎంపిక జరుగుతోంది. చిత్రాన్ని జూలై రెండో వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా తమిళంలో పేరు నిర్ణయిం చని ఈ చిత్రం ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నట్లు సమాచారం. మొత్తం మీద ఆరు నెలల్లో కమ ల్ నటించిన మూడు చిత్రాలు తెరపై రానున్నాయన్నమాట. ఇదే గనుక జరిగితే కమల్ హాసన్ నట జీవితంలో ఇది ఒక రికార్డ్‌నే అవుతుంది. -
ఎనిమిదో శతాబ్దంలో ఏం జరుగుతుంది?
కమల్‌హాసన్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. ఆయన కష్టాలకు కారణం ఏంటనుకుంటన్నారా! ఏ నటునికైనా కావాల్సింది శక్తికి తగ్గ పాత్రలు. ప్రస్తుతం ఆయనకు అవే కరువయ్యాయి. దైనందిన జీవితంలో కనిపించే ఎన్నో వ్యక్తిత్వాలను తెరపై ఇప్పటికే ఆవిష్కరించేసి, ‘మహానటుడు’ అనిపించేసుకున్నారు కమల్. చివరకు ప్రయోగాత్మక పాత్రల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందాయనకు. నిజానికి ఆ మహానటుని స్థాయికి తగ్గ పాత్రలను సృష్టించే దర్శకులు ఇప్పుడు కరువయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో ‘విశ్వరూపం-2’ చేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై నిశిత పరిశోధన జరిపి కమల్ ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తొలిభాగం ‘విశ్వరూపం’ వివాదాల్లో చిక్కుకున్న కారణంగా ‘విశ్వరూపం-2’ విషయంలో అది పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు కమల్. ఇదిలావుంటే... ఈ సినిమాకంటే ముందు ‘ఉత్తమ విలన్’గా ఆయన ప్రేక్షకులను పలకరిస్తారు. నేటి కాలానికీ, ఎనిమిదో శతాబ్దానికీ మధ్య సాగే కాల ప్రవాహమే ఈ సినిమా కథ. ఇందులో కమల్ రెండు రకాల పాత్రలు పోషిస్తున్నారు. ఆయన స్థాయికి తగ్గట్టుగా ఈ పాత్రల తీరుతెన్నులు ఉంటాయని సమాచారం. దర్శకుడు రమేశ్ అరవింద్ సవాల్‌గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. చెన్నైలో వేసిన భారీ సెట్లో ఎనిమిదో శతాబ్దానికి చెందిన సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. జూలై నాటికి షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. సెప్టెంబర్ 10న సినిమాను విడుదల చేయడానికి నిర్మాత ఎన్.లింగుస్వామి సన్నాహాలు చేస్తున్నారు. కమల్ గురుతుల్యులు, దర్శక దిగ్గజాలు కె.బాలచందర్, కె.విశ్వనాథ్ ఇందులో కీలక భూమికలు పోషిస్తుండటం విశేషం. ఆండ్రియా, పూజాకుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయరామ్, నాజర్, ఊర్వశి, పార్వతీ నాయర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: కమల్‌హాసన్, క్రేజీ మోహన్, కెమెరా: శ్యామ్‌దత్, సంగీతం: ఎం.గిబ్రన్. -
మరుదనాయగమ్ ఎప్పటికైనా తీస్తా!
‘‘గత ఇరవయ్యేళ్లలో జరగనిది ఈ ఏడాది జరగనుంది. నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఈ 20 ఏళ్లల్లో ఇలా జరగలేదు’’ అని కమల్‌హాసన్ చెప్పారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. అలాగే, రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ చిత్రం కూడా పూర్తి కావచ్చిందట. ఈ సినిమాల గురించే కమల్ ఈ విధంగా పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక తన పాఠకులకు కమల్‌ను ప్రశ్నించే అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ఓ పాఠకుడు ‘మరుదనాయగమ్’ని మధ్యలో ఆపేశారు.. మళ్లీ మొదలుపెడతారా? అని అడిగాడు... దానికి కమల్ సమాధానం చెబుతూ -‘‘అది నాక్కూడా తెలియదు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించాల్సిన సినిమా. నాకు తెలిసి లోకల్ నిర్మాతల నుంచి భారీ బడ్జెట్ పొందే అవకాశం లేదు. ఎందుకంటే, ఇది లోకల్ మూవీ కాదు. తమిళ్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించాల్సిన సినిమా. ఈ చిత్రాన్ని ఆపేయలేదు. ఎప్పుడు ఆరంభమైనా ఆశ్చర్యపోవడానికి లేదు’’ అన్నారు. ఈ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో ప్రారంభించారు కమల్. దాదాపు 25 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా అర్ధంతరంగా ఆపేశారు. మరి.. ‘మరుదనాయగమ్’ మళ్లీ ఎప్పుడు షూటింగ్ పట్టాలెక్కుతాడో వేచి చూడాల్సిందే. -
ఇక నటనకు వీడ్కోలు!
అందం, అభినయానికి చిరునామా అనిపించుకున్నారు వహీదా రెహ్మాన్. ఒకప్పుడు నాయికగా ఆమె ఓ స్థాయిలో రాణించారు. జయసింహా, రోజులు మారాయి, బంగారు కలలు తదితర తెలుగు చిత్రాల్లో నటించిన వహీదా ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్‌కి పరిమితమయ్యారు. ‘రోజులు మారాయి’లో ‘ఏరువాకా సాగారో..’ పాటలో ఆమె అభినయం సులువుగా మర్చిపోలేరు. ఇక, త్వరలో విడుదల కానున్న కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’లో అతిథి పాత్ర చేశారామె. నటిగా వహీదాకి ఇదే చివరి సినిమా అవుతుందని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న వహీదా మాట్లాడుతూ - ‘‘1950 నుంచి నటిస్తూనే ఉన్నా. ఇంకెంత కాలం చేయమంటారు? కథానాయికగా, తల్లిగా, అమ్మమ్మగా.. ఇలా పలు పాత్రలు చేశాను. నాలా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లు యాక్ట్ చేస్తారు. ఇక నేను సినిమాలకు వీడ్కోలు చెప్పాలనుకుంటున్నా. ‘విశ్వరూపం 2’లో చేశాను. కమల్‌హాసన్ చాలా ప్రతిభ గలవాడు’’ అన్నారు. పాత రోజులు గుర్తు చేసుకుంటూ.. అప్పట్లో తను సినిమాల్లోకొచ్చినప్పుడు, పేరు మార్చుకోమని ఒత్తిడి చేశారని, తన తల్లీతండ్రీ ఇచ్చిన పేరుని మార్చుకోనని కరాఖండిగా చెప్పేశానని వహీదా పేర్కొన్నారు. సినిమాల్లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ స్లీవ్‌లెస్ బ్లౌజు వేసుకోలేదని, ఇక బికినీ వేసుకోమన్నా వేసుకో నని తెలిసి ఎవరూ అడగలేదని వహీదా తెలిపారు. ఇటీవలే ఆమె వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో ‘కాన్వర్జేషన్స్ విత్ వహీదా’ అనే పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకం బాలీవుడ్లో సంచలనమైంది. -
విశ్వరూపం-2తో రీఎంట్రీ
విశ్వరూపం - 2 చిత్రం ద్వారా నటి అభిరామి మళ్లీ సినిమాకు రీ ఎంట్రీ అవుతున్నారు. అందం, అభినయం మెండుగా ఉన్న నటీమణుల్లో అభిరామి ఒకరు. 2001లో వానవిల్ చిత్రం ద్వారా అర్జున్ సరసన హీరోయిన్గా పరిచయమైన నటి అభిరామి. ఆ తరువాత సముద్రం చార్లిచాప్లిన్, విరుమాండి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ అమెరికాలో పనిచేసే రాహుల్ భావనన్ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. అలాంటిది దశాబ్దం తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. మలయాళంలో అపోద్కేరి అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తమిళంలోనూ కొన్ని చిత్రాలకు అవకాశాలు వస్తున్నాయన్న అభిరామి, విశ్వరూపం-2 చిత్రంలో హీరోయిన్ పూజాకుమార్ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఆహ్వానించారని చెప్పారు. దీని గురించి అభిరామి మాట్లాడుతూ వివాహం తరువాత సినిమాకు దూరం అయ్యానన్నారు. పదేళ్లపాటు అమెరికాలో నివసిస్తున్న తనకు నటుడు కమల్‌హాసన్ తన చిత్రానికి డబ్బింగ్ చెప్పాలని ఆహ్వానించారని తెలిపారు. మలయాళంలోనూ మంచి కథా పాత్ర కావడంతో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. -
ఊహకు అందని అంశాలతో విశ్వరూపం-2
‘విశ్వరూపం’ విషయంలో కమల్‌హాసన్ అనుభవించిన స్ట్రగుల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆ సినిమా నిజంగా వివాదాల విశ్వరూపమే. అంత జరిగినా... వెనకంజ వేయకుండా ‘విశ్వరూపం-2’ని పూర్తి చేసే పనిలో ఉన్నారు కమల్. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. నిజానికి ‘విశ్వరూపం’ తీస్తున్నప్పుడే... ‘విశ్వరూపం-2’ చిత్రాన్ని కూడా 40 శాతం పూర్తి చేసేశారు కమల్. మిగిలిన 60 శాతాన్ని ఇటీవలే పూర్తి చేసేశారు. గిబ్రన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల్ని ఈ నెలలోనే విడుదల చేసి, మార్చిలో సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. మరో విషయం ఏంటంటే... ‘విశ్వరూపం’ చిత్రం నిడివి 2 గంటల 20 నిమిషాలు కాగా, ‘విశ్వరూపం-2’ చిత్రం నిడివి మూడు గంటల పైనే ఉంటుందట. తొలిభాగంలోని కొన్ని సన్నివేశాలు వివాదాలకు కారణమవడాన్ని దృష్టిలోపెట్టుకొని రెండో భాగం విషయంలో కమల్ జాగ్రత్త వహించినట్లు వినికిడి. ‘విశ్వరూపం-2’లో కూడా వివాదాస్పద అంశాలున్నప్పటికీ అవి ఎవరినీ నొప్పించేలా ఉండవని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ‘విశ్వరూపం’ చిత్రం మొత్తం దాదాపు విదేశాల్లోనే చిత్రీకరించిన విషయం తెలిసిందే. అయితే... ‘విశ్వరూపం-2’ని మాత్రం పూర్తిగా మనదేశంలోనే తీశారు కమల్. ఊహకందని అంశాలెన్నో ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. -
పాతిక లక్షలకు ఆటా పాట
నటి ఆండ్రియా ఆటా పాట కావాలంటే పాతిక లక్షలు చెల్లించాల్సిందే. సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరు. ఆ మధ్య యువ సంగీత దర్శకుడితో రొమాన్స్ చేసిన దృశ్యాలు ఇంటర్నెట్లో కలకలం సృష్టిం చాయి. అయితే ఈ వ్యవహారంలో నా జీవితం నా ఇష్టం అంటూ ఖరాఖండిగా ప్రకటించి తన ప్రవర్తనను సమర్థించుకున్న ఈ బ్యూటీ విశ్వరూపం చిత్రంలో కమలహాసన్‌తో జత కట్టింది. ఆ చిత్రం విజయంతో మరిన్ని అవకాశాలు వస్తాయని పారితోషికం కూడా పెంచేయవచ్చునని ఆండ్రియా ఆశించింది. అయితే ఈ అమ్మడి ఆశలు అడి ఆశలయ్యాయి. ఒక్క అవకాశం కూడా రాలేదు. మళ్లీ కమలహాసన్ విశ్వరూపం-2లో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తోంది. విశ్వరూపం-2లో తన పాత్రకే అధిక ప్రాధాన్యత వుంటుందని, కమలహాసన్‌తో డ్యూయెట్ కూడా పాడినట్లు చెప్పింది. విశ్వరూపం-2 విడుదలానంతరం అయినా పారితోషికం పెంచడానికి తహతహలాడుతున్న ఆండ్రియాకు శశికుమార్ హీరోగా నటిస్తున్న బ్రహ్మన్ చిత్రంలో ఒక పాటకు ఆడే అవకాశం వచ్చింది. అయితే అందుకామె డిమాండ్ చేసిన పారితోషికం రూ.25లక్షలు. అంత పారితోషికం నిర్మాత ససేమిరా అంటే దర్శకుడు మాత్రం ఆ పాటకు ఆండ్రియా నటిస్తేనే బాగుంటుందని పట్టుపట్టారట. దీంతో చేసేదేమిలేక బ్రహ్మన్ చిత్ర నిర్మాత రూ.25 లక్షలు ఇచ్చి ఆండ్రియాతోనే పాట పాడించి ఆడించారట. దీంతో సింగిల్ సాంగ్ అయినా ఓకే అంటుందట ఈ భామ. -
సినిమాల జాతర
ఎప్పుడైనా సినిమా ఒక కాలక్షేప మాధ్యమమే. కాలానుగుణంగా వచ్చే మార్పులతో దాని రూపం మారుతుండవచ్చుగానీ సినిమా జీవితం కాదు. జీవితాల్లోని కొన్ని సంఘటనలు దీనికి ముడి పదార్థం అయినా కల్పితం లేకుండా అది కథ కాలేదు. అలాంటి కథలకు ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి వెండితెరపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. ఒకప్పుడు కథ, కథనాలను నమ్ముకున్న సినిమా రూపకర్తలు ఇప్పుడు కంప్యూటర్ వంటి ఆధునిక పరిజ్ఞానం వెంట పరుగెడుతున్నారు. అలాంటి సిత్రాల జోరును ఈ ఏడాది ఎక్కువగానే చూడవచ్చు. అదే విధంగా భారీ చిత్రాల బజానా కూడా 2014లో అధికంగానే ఉంది. 2012 కంటే 2013లో అధిక చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయమే అయినా, విజయాల శాతం 15 దాట లేదు. అరుుతే ఈ ఏడాది ప్రథమార్థంలో రెండు చిత్రాల గురించే సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవి కోచ్చడయాన్, విశ్వరూపం-2. విశ్వరూపం కంటే ఎక్కువగా విశ్వనాయకుడు కమల్ హాసన్ విశ్వరూపం-2పై భారీ అంచనాలున్నాయి. సెల్యులాయిడ్‌పై సంచలనాలు సృష్టించిన విశ్వరూపానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ కమల్ హాసన్. విశ్వరూపంలో అలరించిన పూజా కుమార్, ఆండ్రియాలే ఈ చిత్రంలోను తమ అందం, అభినయాలతో అభిమానుల్ని ఓలలాడించనున్నారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో నిపుణులయిన సాంకేతిక పరివా రం పని చేస్తున్నారు. కమల్ సాంకేతిక దాహానికి ఈ విశ్వరూపం-2 నిదర్శనంగా నిలవనుంది. విశ్వరూపంను మించి ఈ చిత్రం ఉంటుందని స్వయంగా కమల్‌నే వెల్లడించారు. ఈ చిత్రం జనవరిలోనే విడుదలవుతుందని ప్రచారం జరిగింది. ఇది ఫిబ్రవరిలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కోచ్చడయాన్‌లో ప్రత్యేకతలు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అత్యంత భారీ చిత్రం కోచ్చడయాన్. ఇందులో ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. రజనీ ద్విపాత్రాభినయం, హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో మోషన్ కాప్సరింగ్ ఫార్మెట్‌తో పాటు 3డీలో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్, జాకీష్రాఫ్, శరత్ కుమార్, ఆది, శోభన, నాజర్ వంటి నట దిగ్గజాలు నటిస్తున్న చిత్రం. సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కథ, కథనాలు అందించారు. చిత్ర గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌ను ఆస్ట్రేలియా, లాస్ ఏంజిల్స్‌లోని సాంకేతిక నిపుణులతో రూపొందిస్తున్న చిత్రం. రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య, అశ్విన్ అద్భుత సృష్టి కోచ్చడయాన్. పాటలను గత ఏడాది డిసెంబర్ 12న, చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయమన్నట్లు ప్రకటించారు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో చిత్ర ఆడియోను ఫిబ్రవరి 15న, చిత్రాన్ని ఏప్రిల్‌లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామీణ ‘వీరం’ ఈ ఏడాది ఆదిలో శుభారంభాన్ని పలుకుతున్న రెండు చిత్రాలపై భారీ అంచనాలున్నాయి. వాటిలో ఒకటి అజిత్ నటించిన వీరం. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్ పతాకంపై బి.నాగిరెడ్డి ఆశీస్సులతో బి.వెంకట్రామిరెడి, భారతీ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ సరసన తమన్నా హీరోయిన్గా నటించారు. చిరుత్తైఫేమ్ శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విదార్థ్, బాలా వంటి యువ హీరోలు నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో అజిత్ గెటప్, స్టైల్స్, యాక్టింగ్ డిఫరెంట్‌గా ఉంటాయంటున్నారు చిత్ర వర్గాలు. పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపొందిన వీరం భారీ స్థాయిలో శుక్రవారం తెరపైకి రానుంది. భారీ అంచనాలతో ‘జిల్లా’ విజయ్ నటించిన జిల్లా చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బి చౌదరి నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఉన్నారు. తుపాకి తరువాత విజయ్, కాజల్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి నేశన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ముఖ్యపాత్రను పోషించడం విశేషం. చాలాకాలం తరువాత సమకాలిక నటుడు అజిత్, విజయ్ నటించిన చిత్రాలు ఒకే రోజున తెరపైకి రావడం మరో విశేషం. వీటితోపాటు విశాల్ నటిస్తున్న నాన్ శివప్పు మనిదన్, జయం రవి నటించిన నిమిర్న్ందునిల్ వంటి మరికొన్ని కమర్షియల్ చిత్రాలు ఈ ఏడాది ప్రథమార్థంలోనే తెరపైకి రానున్నాయి. మరో బ్రహ్మాండం బ్రహ్మాండాలకు మారు పేరు శంకర్ చిత్రాలు. తన తొలి చిత్రం జెంటిల్మన్ నుంచి దీన్ని నిరూపించుకుంటున్న శంకర్ గత చిత్రం ఎందిరన్తో దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. ఆ తరువాత చిత్రం నన్బన్ కాస్త నిరాశపరిచినా తాజాగా ఐ చిత్రంతో తన బ్రహ్మాండాల యాత్రను కొనసాగించనున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారనే చెప్పాలి. ఇందులో ఈయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎమిజాక్సన్ హీరోయిన్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్ నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం ఐ. పై చిత్రాల స్థాయిలో ఉండే మరో గొప్ప విజువల్ ట్రిట్ ఇది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఈ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. -
అదే జరిగితే...విదేశాల్లో స్థిరపడతాను!
‘‘ఏ దేశం వెళ్లినా నా మాతృదేశాన్ని మర్చిపోను. ఈ దేశం పట్ల నాకున్న సెంటిమెంట్స్, నా భాష, నా సంస్కృతీ సంప్రదాయాల్లో మార్పు రాదు’’ అంటున్నారు కమల్‌హాసన్. ప్రయోగాలకు చిరునామా అనే విధంగా ఎన్నో విభిన్న పాత్రలు చేసి, భారతీయ నటుల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారాయన. అలాంటి కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ విడుదల అప్పుడు, ‘నన్ను ఇంకా ఇబ్బందులపాలు చేస్తే, వేరే రాష్ట్రానికి వెళ్లిపోతా.. లేకపోతే వేరే దేశానికే వెళ్లిపోతా’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘విశ్వరూపం 2’ చేస్తున్నారు. దర్శకత్వం, నటన.. ఇలా ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తూ కమల్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఒకవేళ తొలి భాగానికి వచ్చినట్లే, ఈ మలి భాగానికీ సమస్యలు ఎదురైతే అప్పుడేం చేస్తారు? అనే ప్రశ్న కమల్ ముందుంచితే -‘‘అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నానో ఇప్పుడూ ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నా. స్వదేశం వదిలి విదేశాల్లో స్థిరపడతా. నేను కళాకారుణ్ణి. ఎమ్ఎఫ్ హుస్సేన్ చేసినట్లుగా వేరే ప్రాంతానికో, రాష్ట్రానికో, దేశానికో వెళ్లిపోతా. ఇది బెదిరింపు కాదు.. రాజీనామా’’ అన్నారు ఉద్వేగంగా.