West Zone
-
ఈ కేసులో ఎంతటివారినైనా వదినే ప్రసక్తిలేదు: వెస్ట్ జోన్ డిసిపి విజయ్‌కుమార్
-
శివాలెత్తిన శివమ్ దూబే.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్
దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా నార్త్ జోన్‌తో నిన్న (జులై 30) జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. 78 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం (83) బాది, తన జట్టును గెలిపించాడు. నార్త్ జోన్ నిర్ధేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఓపెనర్ హార్విక్ దేశాయి (56) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆతర్వాత 5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే, కథన్ పటేల్ (63) అజేయ అర్ధశతకాలతో వెస్ట్ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్.. హర్షిత్ రాణా (54), నితీశ్ రాణా (54), రోహిల్లా (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (29), ప్రభ్‌సిమ్రన్ (26)లకు శుభారంభాలు లభించినా, భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. మన్దీప్ (13), నిషాంత్ సింధు (11) నిరాశపర్చగా.. రిషి ధవన్ (12) అజేయంగా నిలిచాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ 3, సర్ఫరాజ్ ఖాన్, హంగార్గేకర్, త్రిపాఠి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన వెస్ట్ జోన్ హార్విక్ దేశాయి, శివమ్ దూబే, కథన్ పటేల్ అర్ధసెంచరీలతో రాణించడంతో 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (14), రాహుల్ త్రిపాఠి (3) నిరాశపర్చగా.. సమర్థ్ వ్యాస్ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. నార్త్ జోన్ బౌలర్లలో నితీశ్ రాణా, రిషి ధవన్, మయాంక్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ప్రియాంక్ పాంచల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సిక్సర్ల మోత, 99 నాటౌట్
దియోదర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇవాళ (జులై 24) జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఓపెనర్, ఆ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (69 బంతుల్లో 99 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి మరో ఓపెనర్, వికెట్‌కీపర్ హార్విక్ దేశాయి (71 బంతుల్లో 85; 14 ఫోర్లు) సహకరించడంతో నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ జోన్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. నార్త్ ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్ జోన్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 149 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంచల్, రాహుల్ త్రిపాఠి (11 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) వెస్ట్ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సగ్వస్వల్లా (3/31), షమ్స్ ములానీ (2/37), శివమ్ దూబే (2/36), చింతన్ గజా (1/25), సేథ్ (1/38), పార్థ్ భట్ (1/34) ధాటికి 47 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. నార్త్ ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్ ఆటగాడు టాప్ స్కోరర్‌గా (38) నిలవడం విశేషం. పాంచల్ సుడిగాలి ఇన్నింగ్స్ తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా ఆడిన ప్రియాంక్ పాంచల్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 69 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. పాంచల్‌కు లిస్ట్-ఏ క్రికెట్లో ఇది 20వ అర్ధశతకం. లిస్ట్-ఏ క్రికెట్లో ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడిన పంచల్.. 40కి పైగా సగటుతో 3378 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫిఫ్టీలు, 7 శతకాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌పై 95 పరుగులు చేసిన పాంచల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. -
ప్రియాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ-2023 విజేతగా సౌత్ జోన్ నిలిచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో వెస్ట్‌జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. ఇది సౌత్‌జోన్‌కు 14వ దులీప్ ట్రోఫీ విజయం కావడం గమనార్హం. 182/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్‌జోన్.. అదనంగా కేవలం 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (95), సర్ఫరాజ్ ఖాన్ (48) పోరాడినా.. ఓటమి తప్పలేదు. సౌత్ జోన్ బౌలర్లు వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57) చెలరేగడంతో వెస్ట్‌జోన్ కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్ట్‌జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే చాపచుట్టేసింది. సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్ జోన్‌ను దెబ్బకొట్టాడు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 230 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ముగించింది. దీంతో వెస్ట్‌జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్‌జోన్ 222 పరుగులకే పరిమితమైంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప సొంతం చేసుకున్నాడు. చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్! -
పుజారా, సూర్య విఫలం.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ప్రియాంక్.. ఇంకా..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: సౌత్ జోన్‌తో నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతున్న దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచాడు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించాడు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్ (4) విఫలమైన వేళ తానున్నానంటూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరు వేదికగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంక్ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సౌత్ జోన్‌ను ఓడించి టైటిల్ గెలవాలంటే వెస్ట్ జోన్ 116 పరుగులు చేయాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండటం, చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో వెస్ట్ జోన్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, ప్రియాంక్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే మాత్రం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ పైచేయి సాధించే అవకాశం ఉంది. వెస్ట్ జోన్ కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరడం ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం. కాగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ బుధవారం ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక వెస్ట్ జోన్ తరఫున ఓపెనర్ పృథ్వీ షా(65) ఒక్కడే రాణించడం.. పుజారా(9), సూర్య(8) సహా ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మెరుగైన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్ 230 పరుగులకు కథ ముగించింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాప్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 92 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఆఖరి రోజు 116 పరుగులు సాధిస్తేనే టైటిల్ గెలుస్తుంది. లేదంటే సౌత్ జోన్ ఈసారి చాంపియన్‌గా అవతరిస్తుంది. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు 𝐒𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟒 The match is nicely poised 👍 Priyank Panchal's fighting 92* has taken West Zone to 182/5 💪. They need 116 more to win. South Zone need 5 wickets.#WZvSZ | #DuleepTrophy | #Final 💻 Ball by ball updates - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/eGRmdrpQVh — BCCI Domestic (@BCCIdomestic) July 15, 2023 -
HYD: వ్యవభిచార కూపాలుగా స్పా సెంటర్లు!
క్రైమ్: వ్యభిచార కూపాలుగా మారిన స్పా సెంటర్ల గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వెస్ట్ జోన్ పరిధిలో జరిగిన టాస్క్ ఫోర్స్ దాడుల్లో పలు మసాజ్ సెంటర్లు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండా నడుస్తున్న స్పా సెంటర్లనే కాకుండా.. వాటిల్లో వ్యభిచారం కోసం ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు. దాదాపు 10 మసాజ్ పార్లర్ల మీద దాడులు చేసి.. 34 మంది నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ స్టేషన్ల పరిధిలో లైసెన్లు లేకుండా నిర్వహిస్తున్నారని సమాచారం మీద దాడులు చేశారు. జీహెచ్ఎంసీ లైసెన్స్‌లతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్లు, ప్రొఫెషనల్ థెరపిస్ట్‌లు లేకపోవడం, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రర్ సైతం లేవని తేలింది. అలాగే.. మార్గదర్శకాలు ఫాలో కాకుండా మహిళలతో క్రాస్ మసాజ్ చేస్తూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు గుర్తించారు. -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 67 పరుగుల లీడ్‌తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్‌కుమార్ వైశాఖ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్‌లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్‌కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్‌ను దెబ్బకొట్టారు. -
Test Match: విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. 8 పరుగులకే అవుట్..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ బ్యాటర్ పృథ్వీ షా అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 101 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులతో రాణించాడు ఈ ఓపెనర్. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి పృథ్వీ షాకు సహకారం లభించలేదు. 8 పరుగులకే అవుట్ మరో ఓపెనర్, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్ 21 పరుగులు చేయగలిగాడు. ఇక నాలుగో స్థానంలో దిగిన టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా పోరాడుతుండగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన మరో భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొన్న ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. సౌత్ జోన్ బౌలర్ విధ్వత్ కవెరప్ప బౌలింగ్‌లో కెప్టెన్ హనుమ విహారికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్‌ను కవెరప్ప వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. తిలక్, విహారి ఇన్నింగ్స్‌తో ఇలా కీలక బ్యాటర్లు విఫలం కావడంతో వెస్ట్ జోన్ 119 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ రెండో రోజు ఆటను వెలుతురులేమి కారణంగా నిలిపివేసే సమయానికి పుజారా 7, అతిత్ సేత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో సౌత్ జోన్ 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వెస్ట్ జోన్ ప్రస్తుతం 94 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాగైతే.. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో విఫలమైన కారణంగా పుజారా టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇక వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించిన సూర్యకుమార్ యాదవ్‌కు కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పుజారా, సూర్య దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించడం గమనార్హం. ఇక దులిప్ ట్రోఫీ ముగిసిన తర్వాత సూర్య కరేబియన్ దీవికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్‌వుడ్ మాదిరే: మాజీ క్రికెటర్ -
మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి! ఫైనల్లో జట్టును..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023లో భాగంగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ మధ్య బుధవారం ఫైనల్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ రవికుమార్ సమర్త్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 28 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో తెలుగు తేజాలు తిలక్ వర్మ, హనుమ విహారి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి వన్‌డౌన్‌లో వచ్చిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ 87 బంతుల్లో 40 పరుగులు సాధించగా.. విహారి 63 పరుగుల(130 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 79 పరుగులు జతచేశారు. ఇక నగ్వాస్వల్లా బౌలింగ్‌లో వికెట్ కీపర్ హర్విక్ దేశాయ్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ పెవిలియన్ చేరగా.. షామ్స్ ములాని విహారి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెలుతురు లేమి కారణంగా వీరిద్దరు అవుటైన తర్వాత సౌత్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ 9, సచిన్ బేబి 7, సాయి కిషోర్ 5 పరుగులు మాత్రమే చేశారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది సౌత్ జోన్ జట్టు. వాషింగ్టన్ సుందర్(9), విజయ్‌కుమార్ వైశాక్(5) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జాన్ నగ్వాస్వల్లా, చింతన్ గజా, షామ్స్ ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్ సేత్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు 25 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. విహారి 46వ ఫిఫ్టీ వెస్ట్ జోన్‌తో దులిప్ ట్రోఫీ సందర్భంగా సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి అర్ధ శతకంతో మెరిశాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అతడికి ఇది 46వ ఫిఫ్టీ. ఇక ఈ మ్యాచ్‌లో 63 పరుగులు సాధించడం ద్వారా విహారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 8706 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 23 సెంచరీలు, 46 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి! -
''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!'
కెరీర్ ఆరంభంలో ఒక మెరుపులా వచ్చి భవిష్యత్తు స్టార్ క్రికెటర్‌గా తయారవుతాడనుకున్న పృథ్వీ షా పాతాళానికి పడిపోయాడు. అగ్రెసివ్ ఆటతీరుతో ఆకట్టుకున్న పృథ్వీ ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఇటవలే ముగిసిన ఐపీఎల్‌లోనూ పృథ్వీ షా పెద్దగా రాణించింది లేదు. దీనికి తోడు వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి. ఇక 2021లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ పుజారాకు ఆఖరిది. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. తాజాగా దులీప్ ట్రోపీలో వెస్ట్‌జోన్ తరపున పాల్గొంటున్న పృథ్వీ షా ఆ తర్వాత దేవదర్ ట్రోపీలోనూ ఆడాలనుకుంటున్నాడు. అటుపై ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్లో తొలిసారి నార్తంప్టన్‌షైర్ తరపున బరిలోకి దిగనున్నాడు. కౌంటీల్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి రావాలని పృథ్వీ షా నిశ్చయించుకున్నాడు. జూలై 12 నుంచి వెస్ట్‌జోన్, సౌత్‌జోన్ల మధ్య దులీప్ ట్రోపీ ఫైనల్ జరగనుంది. ఇక సెంట్రల్ జోన్‌తో సెమీఫైనల్ ముగిశాకా విజయంపై స్పందించిన పృథ్వీ షా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను నా ఆటను మార్చుకోవాలనుకోవడం లేదు. కాకపోతే నా గేమ్‌కు కాస్త స్మార్ట్‌నెస్‌ను యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తా. నేను పుజారా సార్లా బ్యాటింగ్ చేయలేను.. ఆయన నాలా బ్యాటింగ్ చేయలేడు. ఈ విషయంలో ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారికి ఉంటుంది. ఇన్నేళ్లుగా నాకున్న అగ్రెసివ్నెస్ బ్యాటింగ్‌ను వదులుకోలేను.. కానీ స్మార్ట్‌గా ఆడడానికి ప్రయత్నిస్తా. ఇక వెస్ట్‌జోన్ దులీప్ ట్రోపీలో ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. నేను ముంబైకి ఆడొచ్చు.. లేదంటే వెస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు.. కానీ ఆట అనేది చాలా ముఖ్యం. ఒక రకంగా నా కెరీర్‌కు ఈ ఫైనల్ ఉపయోగపడుతుందంటే బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ఇక గత ఏడాదిగా రెడ్‌బాల్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా. ఒక మ్యాచ్‌లో త్రిబుల్ సెంచరీ(370 పరుగులు Vs అస్సాం) మరిచిపోలేని ఇన్నింగ్స్. కానీ వైట్‌బాల్‌లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయా. కానీ రెడ్‌బాల్ క్రికెట్లో నా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నా.. త్వరలోనే మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: #DuleepTrophy: 5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా? -
మయాంక్ అగర్వాల్ సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్లో సౌత్‌జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ విజయలక్ష్యం 215 పరుగులు...మూడో రోజు 21 పరుగులు చేయగా, చివరి రోజు శనివారం చేతిలో 10 వికెట్లతో మరో 194 పరుగులు సాధించాలి. అయితే రెండు సార్లు మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. చివర్లో కూడా వర్షసూచన కనిపించింది. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరి రోజు సౌత్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెపె్టన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. విహారి వెనుదిరిగే సమయానికి సౌత్ మరో 74 పరుగులు చేయాలి. ఈ దశలో భుయ్, తిలక్ 33 బంతుల్లోనే 50 పరుగులు జోడించి మళ్లీ గెలుపు బాట వేశారు. సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెపె్టన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. అయితే చివరకు జయంత్ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. ఫైనల్లో వెస్ట్‌జోన్... సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ మధ్య జరిగిన మరో సెమీస్ ‘డ్రా’గా ముగిసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగుల ఆధిక్యం సాధించిన వెస్ట్‌జోన్ ఫైనల్ చేరింది. 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ 4 వికెట్లకు 128 పరుగులే చేసింది. రింకూ సింగ్ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. -
టీమిండియా నుంచి ఉద్వాసన.. కసితో శతక్కొట్టిన పుజారా
దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురయ్యానన్న కసితో ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన పుజారా.. తన అనుభవాన్నంత రంగరించి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన 60వ శతకాన్ని నమోదు చేశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. 13 బౌండరీల సహకారంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పుజారాకు మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ.. ఒంటిపోరాటం చేసి, తన జట్టుకు 300 పరుగులకు పైగా లీడ్‌ను అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో నోటెడ్ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్ (6), పృథ్వీ షా (25) విఫలం కాగా.. టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్ టూర్ కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో పుజారాకు చోటు దక్కని విషయం తెలిసిందే. -
రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా
సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్ పుజారా (50), సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. జట్టులో చోటు కొట్టేశాడు!
దులీప్ ట్రోఫీ-2023లో భాగంగా సెంట్రల్ జోన్‌తో సెమీఫైనల్‌కు ముందు వెస్ట్‌జోన్‌కు బిగ్ షాక్ తగిలింది. వెస్ట్‌జోన్ ఫాస్ట్ బౌలర్, సౌరాష్ట్ర పేసర్ చేతన్ సకారియా గాయం కారణంగా సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సకారియాకు నెట్‌ప్రాక్టీస్‌లో చేతికి గాయమైంది. అతడు కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అతడు సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. ఇక గాయం కారణంగా సెమీఫైనల్‌కు దూరమైన సకారియా స్ధానాన్ని ముంబై పేసర్ తుషార్ దేశ్‌పాండేతో భర్తీ చేశారు. 28 ఏళ్ల దేశ్‌పాండే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన దేశ్‌పాండే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 21 వికెట్లు పడగొట్టాడు. దేశ్‌పాండేకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 3.16 ఎకానమీతో 80 వికెట్లు సాధించాడు. ఇక వెస్ట్‌జోన్, సెంట్రల్ జోన్ మధ్య దులీప్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ జూలై 5నుంచి ప్రారంభం కానుంది. చదవండి: WC 2023: వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్‌కు ఇంకా ఛాన్స్.. అది ఎలా అంటే? -
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్స్పెక్టర్ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో నగర కొత్వాల్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్: ప్రస్తుతం సుల్తాన్‌బజార్, కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు.. సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్‌పేట, సైదాబాద్, అంబర్పేట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు మాయమై అంబర్‌పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్లోకి వస్తున్నాయి. నార్త్‌జోన్: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్ ఏర్పడుతోంది. తాడ్‌బన్‌లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్‌గోపాల్‌పేట ఈ జోన్లోకే వస్తోంది. సౌత్ జోన్: ప్రస్తుతం చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ డివిజన్లు, చార్మినార్, బహదూర్‌పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్‌చౌక్, డబీర్‌పుర, మొఘల్‌పుర, రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్‌బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్‌నగర్ ఠాణాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్లో ఉండే ఫలక్‌నుమా డివిజన్ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్‌పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి. వెస్ట్ జోన్: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, లంగర్‌హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్‌గంజ్, హబీబ్‌నగర్, కుల్సుంపుర, మంగళ్‌హాట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్‌నగర్ డివిజన్ ఈ జోన్ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్‌ట్యాంక్, రెహ్మత్‌నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్ ఠాణాలు మాత్రమే ఉంటాయి సౌత్ ఈస్ట్ జోన్: కమిషనరేట్‌లో ఆరో జోన్‌గా సౌత్ ఈస్ట్ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్ సబ్–డివిజన్లతో పాటు ఈస్ట్ నుంచి వచ్చే మలక్‌పేట, సౌత్ నుంచి వచ్చే సంతోష్‌నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్‌బజార్, భవానీనగర్, సంతోష్నగర్లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్ సదన్ ఠాణాలు ఈ కొత్త జోన్లో ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్: ఏడో జోన్‌గా పరిగణించే సౌత్ వెస్ట్ మరో కొత్త జోన్‌గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్‌నగర్, బేగంబజార్‌తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, బేగంబజార్, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్, గోల్కొండ, లంగర్‌హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్లు రానున్నాయి. సెంట్రల్ జోన్: ప్రస్తుతం ఈ జోన్లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట, సైఫాబాద్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్ డివిజన్‌గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్ పోలీసు, ఖైరతాబాద్‌ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట్ ఠాణాలు ఈ జోన్లో ఉండవు. -
294 పరుగులతో సౌత్‌జోన్ ఓటమి.. దులీప్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్
దులీప్ ట్రోఫీ 2022 విజేతగా వెస్ట్‌జోన్ నిలిచింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్జోన్రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో 294 పరుగులతో వెస్ట్‌జోన్ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగుల క్రితం రోజు స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన సౌత్‌జోన్ మరో 80 పరుగులు చేసి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. సౌత్‌జోన్ బ్యాటింగ్‌లో రోహన్ కన్నుమ్మల్ 93 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హైదరాబాద్‌కు చెందిన రవితేజ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన రవితేజ 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వెస్ట్‌జోన్ బౌలర్లలో షామ్స్ ములాని 4, జైదేవ్ ఉనాద్కట్, అతిత్ సేత్ తలా రెండు వికెట్లు తీయగా.. తనుస్ కొటేన్, చింతన్ గజా చెరొక వికెట్ తీశారు. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. జైదేవ్ ఉనాద్కట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్‌జోన్ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (265; 30 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో చెలరేగగా... హెట్ పటేల్ (51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్ 327 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'అండర్సన్ రిటైర్ అయితే ఇలానే ఏడుస్తానేమో!' BGT in 2021, Duleep Trophy in 2022 - Rahane continues to dominate as a captain in red ball format. pic.twitter.com/s3V6bxsUEE — Johns. (@CricCrazyJohns) September 25, 2022 -
ఓటమి దిశగా సౌత్‌జోన్
కోయంబత్తూర్: వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్ ఓటమి దిశగా సాగుతోంది. 529 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన సౌత్‌జోన్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. నేడు చివరిరోజు సౌత్‌జోన్ గెలవాలంటే మరో 375 పరుగులు చేయాలి. వెస్ట్‌జోన్ నెగ్గాలంటే మరో నాలుగు వికెట్లు తీయాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్‌జోన్ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (265; 30 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో చెలరేగగా... హెట్ పటేల్ (51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. -
శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్.. సౌత్‌జోన్ విజయలక్ష్యం 529
దులీప్ ట్రోఫీ ఫైనల్ 2022లో భాగంగా వెస్ట్‌జోన్.. సౌత్‌జోన్ ముందు 529 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 3 వికెట్ల నష్టానికి 376 పరుగుల క్రితంరోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా వెస్ట్‌జోన్‌కు 528 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ 265 పరుగులు చేసి ఔటవ్వగా.. శ్రేయాస్ అయ్యర్ 71 పరుగులు స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ శతకంతో చెలరేగాడు. సౌత్‌జోన్ బౌలర్లను ఉతికారేసిన సర్ఫరాజ్ 178 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సర్ఫరాజ్‌కు తోడుగా హేల్ పటేల్ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 318/7తో ఆట కొనసాగించిన సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఫెదరర్ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్..
కోయంబత్తూర్ వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతోన్న దులీప్ ట్రోపీ ఫైనల్లో వెస్ట్‌జోన్ భారీ అధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత యువ ఆటగాడు.. వెస్ట్‌జోన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్ 235 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా వెస్ఠ్జోన్ మూడో రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 376 పరుగులు సాధించింది. ప్రస్తుతం వెస్ట్‌జోన్ ఓవరాల్‌గా 319 పరుగుల అధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్(209), సర్ఫరాజ్ ఖాన్(30) పరుగులతో క్రీజులో ఉన్నారు. అదే విధంగా వెస్ట్‌జోన్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో రాణించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్ 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో కేవలం 57 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. సౌత్ జోన్ బాబా ఇంద్రజిత్ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో మెరిశాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్ జోన్ 270 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. Yashasvi Jaiswal. Duleep Trophy final. 209* 🔥💗pic.twitter.com/liHFLoalL2 — Rajasthan Royals (@rajasthanroyals) September 23, 2022 చదవండి: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు -
యశస్వి జైశ్వాల్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్‌జోన్
సౌత్ జోన్, వెస్ట్‌జోన్ మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతుంది. టీమిండియా యువ క్రికెటర్.. వెస్ట్‌జోన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 119 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న యశస్వి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం 140 పరుగుల లీడ్‌లో ఉన్న వెస్ట్ జోన్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. కాగా శ్రేయాస్ అయ్యర్.. యశస్వి జైశ్వాల్‌కు సహకరిస్తూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అంతకముందు సౌత్‌జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 7 వికెట్ల నష్టానికి 318 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన సౌత్‌జోన్ జట్టు మరో 9 పరుగులు మాత్రమే జత చేసి 327 పరుగులకు ఆలౌట్ అయింది.బాబా ఇంద్రజిత్ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. మనీశ్ పాండే (48), కృష్ణప్ప గౌతమ్ (43), రోహిన్ కున్నుమ్మల్ (31) రాణించారు. వెస్ట్‌జోన్ బౌలర్లో ఉనాద్కట్ 4 వికెట్లు తీయగా.. సేత్ 3, చింతన్ గజా రెండు వికెట్లు తీశారు. అంతకు ముందు వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
రవితేజ మెరుపు శతకం, పదేసిన సాయికిషోర్.. ఫైనల్లో సౌత్ జోన్, వెస్ట్ జోన్
హైదరాబాద్ ఆటగాడు తెలుకపల్లి రవితేజ (120 బంతుల్లో 104 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తమిళనాడు యువ కిషోరం రవి శ్రీనివాసన్ సాయికిషోర్ (10/98) రెచ్చిపోవడంతో నార్త్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో సౌత్ జోన్ 645 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు షమ్స్ ములానీ (5/72), చింతన్ గజా (3/49) చెలరేగడంతో కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో వెస్ట్ జోన్ 279 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ రెండు జట్లు (సౌత్ జోన్, వెస్ట్ జోన్) ఈనెల 21 నుంచి 25 వరకు కొయంబత్తూర్ వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్ నష్టానికి 157 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ జోన్.. మరో 159 పరుగులు జోడించి 316/4 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 11 పరుగులు జోడించి 64 పరుగుల వద్ద ఔటవగా.. రవితేజ సూపర్ ఫాస్ట్‌గా సెంచరీ సాధించి ప్రత్యర్ధికి 740 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించారు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్త్ జోన్ కృష్ణప్ప గౌతమ్ (3/50), సాయికిషోర్ (3/28), తనయ్ త్యాగరాజన్ (3/12) దెబ్బకు కేవలం 94 పరుగులు మాత్రమే చేసి ఆలౌటై ఓటమిపాలైంది. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యష్ దుల్ (59), మనన్ వోహ్రా (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 630/8 డిక్లేర్ (కున్నుమ్మల్ 143, హనుమ విహారి 134, రికీ భుయ్ 103) నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్: 207 ఆలౌట్ (నిషాంత్ సింధు 40, సాయికిషోర్ 7/70) సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 316/4 డిక్లేర్ (రవితేజ 104, కున్నుమ్మల్ 77) నార్త్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 94 ఆలౌట్ (యశ్ ధుల్ 59, సాయికిషోర్ 3/28) ఇక వెస్ట్ జోన్-సెంట్రల్ జోన్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. వెస్ట్ జోన్ నిర్ధేశించిన 500 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగుల స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సెంట్రల్ జోన్ మరో 199 పరుగులు జోడించి మిగిలిన 8 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. రింకూ సింగ్ (65) ఒక్కడే హాఫ్ సెంచరీతో ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ (5/72), చింతన్ గజా (3/49), ఉనద్కత్ (1/44), అతిత్ సేథ్ (1/20) వికెట్లు పడగొట్టారు. వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్: 257 ఆలౌట్ (పృథ్వీ షా 60, రాహుల్ త్రిపాఠి 67, కుమార్ కార్తీకేయ 5/66) సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: 128 ఆలౌట్ (కరణ్ శర్మ 34 , ఉనద్కత్ 3/24, తరుష్ కోటియన్ 3/17) వెస్ట్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 371 ఆలౌట్ (పృథ్వీ షా 142, హెథ్ పటేల్ 67, కుమార్ కార్తీకేయ 3/105) సెంట్రల్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 221 ఆలౌట్ (రింకూ సింగ్ 65, షమ్ ములానీ 5/72) -
మ్యాజిక్ చేసిన హార్ధిక్ పాండ్యా బౌలర్.. భారీ ఆధిక్యంలో సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 580 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (72 బంతుల్లో 77; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో అలరించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు స్పిన్నర్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు (7/70) నమోదు చేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే చాపచుట్టేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో నిశాంత్ సింధు (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత జోన్.. రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (255 బంతుల్లో 134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌కీపర్ రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 630 పరుగుల వద్ద (8 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. పృథ్వీ షా మెరుపు శతకం.. ఓటమి దిశగా సెంట్రల్ జోన్ కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు పట్టుబిగించింది. పృథ్వీ షా మెరుపు శతకంతో మెరవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 371 పరుగుల వద్ద ముగించి, ప్రత్యర్ధి ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. మరో రెండు రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ గెలవాలంటే మరో 468 పరుగులు చేయాలి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసి ఆలౌటైంది. పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (67) అర్ధశతకాలతో రాణించారు. కుమార్ కార్తీకేయ (5/66) వెస్ట్ జోన్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం వెస్ట్ జోన్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉనద్కత్, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
హనుమ విహారి అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 15) సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్ (37 బంతుల్లో 20; ఫోర్) క్రీజ్‌లో ఉన్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ, నిశాంత్ సింధుకు తలో వికెట్ దక్కింది. మరోవైపు, కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్ జోన్ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (64 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షమ్స్ ములానీ (41), తనుష్ కోటియన్ (36) పర్వాలేదనిపించారు. వెస్ట్ జోన్‌ను సెంట్రల్ జోన్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరీ, గౌరవ్ యాదవ్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ త్రిపాఠికి జతగా చింతన్ గజా (5) క్రీజ్‌లో ఉన్నాడు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన అజింక్య రహానే...
చెన్నై: భారత టెస్టు జట్టులో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ సాధించాలని పట్టుదలగా ఉన్న అజింక్య రహానే దేశవాళీ సీజన్‌ను ఘనంగా ప్రారంభించాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో వెస్ట్‌జోన్ బ్యాటర్ రహానే (264 బంతుల్లో 207 బ్యాటింగ్; 18 ఫోర్లు, 6 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అతనికి తోడు యశస్వి జైస్వాల్ (321 బంతుల్లో 228; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ద్విశతకం బాదడం విశేషం. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి వెస్ట్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 590 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (121 బంతుల్లో 113; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకం సాధించాడు. బలమైన వెస్ట్‌జోన్ బ్యాటింగ్ లైనప్ ముందు అనామక జట్టుగా నార్త్ ఈస్ట్ తేలిపోయింది. చదవండి: Asia Cup 2022: పాక్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం -
ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక వ్యూహం
సాక్షి,గచ్చిబౌలి: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లలో శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ సింహ భాగంలో నిలుస్తోంది. వెస్ట్‌జోన్‌లో ముఖ్యంగా శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల నుంచి అధిక ఆదాయం వస్తోంది. జోన్ పరిధిలో రూ.509.76 కోట్ల ఆస్తి పన్ను వసూలు టార్గెట్ కాగా, ఇప్పటికే రూ.256.68 కోట్లు వసూలు చేశారు. రూ.253.08 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోజు వారీ టార్గెట్లు నిర్ధేశిస్తూ ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచారు. మొండి బకాయిదారులు, కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక వ్యూహంతో వసూళ్లు చేయాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దిశానిర్ధేశం చేస్తున్నారు. మొండా బకాయిదారులకు ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేశారు. 2,22,174 అసెస్మెంట్లు శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్ల పరిధిలో 2,22,174 అసెస్మెంట్లు ఉన్నాయి. యూసూఫ్‌గూడ సర్కిల్లో 32,131 అసెస్మెంట్లు, శేరిలింగంపల్లిలో 84,712 అసెస్మెంట్లు, చందానగర్‌లో 83,875 అసెస్మెంట్లు, పటాన్చెరు సర్కిల్ పరిధిలో ఉన్న 21,456 అసెస్మెంట్ల ద్వారా మొత్తం రూ.509.76 కోట్లు వసూలు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించారు. రెడ్ నోటీసులు జారీ జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో దాదాపు రూ.200 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశారు. 16688 అసెస్మెంట్లకు రెడ్ నోటీసులు జారీ చేయాల్సి ఉంది. యూసూఫ్‌గూడ 5380, శేరిలింగంపల్లి 1800, చందానగర్ 8251, పటాన్చెరు 1257 అసెస్మెంట్లకు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు దాదాపు పదివేల మందికి రెడ్ నోటీసులు జారీ చేశారు. బకాయిల వసూళ్లపై సిబ్బందికి అధికారులు సూచనలు, సలహాలు ఇస్తారు. ట్యాక్స్ కలెక్షన్‌కు వెళ్లినప్పుడు వడ్డీ రాయితీపై అవగాహన కలి్పస్తారు. ఇలా వసూలు ... ► మొదట డిమాండ్ నోటీసు అందజేత ► స్పందించకుంటే రెడ్ నోటీస్‌తో పాటు వారెంట్‌ను ఉప కమిషనర్లు జారీ చేస్తారు. ► వాణిజ్య సముదాయాలకు అక్యుపై నోటీస్ జారీ చేస్తారు. అయిన స్పందించకుంటే భవనం జప్తు చేస్తారు. ► గత ఫిబ్రవరి నుంచి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఎంటమాలజీ విభాగాల సిబ్బంది, అధికారులు ఆస్తి పన్ను వసూళ్లలో పాల్గొంటున్నారు. ► ఆయా డాకెట్లలో మొదట బిల్ కలెక్టర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఆస్తి పన్ను వసూలకు వెళ్తారు. ► అయిన స్పందించకుంటే డాకెట్లోని 9 మంది సభ్యుల బృందం వెళ్లి సంప్రదిస్తుంది. ► పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను రావాల్సిన చోటుకు ఉప కమిషనర్లు కూడా వెళ్తారు. ► మార్చి 31 లోపు ఆస్తి పన్ను చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కలి్పస్తారు. ► కోవిడ్ కారణంగా వర్కింగ్ హా స్టళ్లు మూసివేయడంతో ఆస్తి వసూలులో జాప్యం జరుగుతోంది. ► వెస్ట్‌జోన్ పరిధిలోని గచి్చ»ౌలి, కొండాపూర్, మాదాపూర్, గౌలిదొడ్డి, ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీల్లో వందలాది వర్కింగ్ హాస్టళ్లు ఉన్నాయి. వంద శాతం వసూలు చేస్తాం ఆస్తి పన్ను వసూలు వంద శాతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కోవిడ్ కారణంగా కొన్ని వ్యాపార సంస్థలు, హాస్టళ్లు మూతపడటంతో పన్ను వసూళ్లు కొంత మేరకు తగ్గాయి. వెస్ట్ జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో ఆస్తి వసూలుపై రోజు వారీ టార్గెట్లు ఇస్తున్నాం. మొండి బకాయిల వసూలుపై సమీక్షలు నిర్వహిస్తున్నాం. బకాయిల వసూలుపై ఎలాంటి వ్యూహంతో ముందుకెవెళ్లాలో అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నాం. మార్చి 31లోపు ఆస్తి పన్ను చెల్లించి వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: ఎన్.రవి కిరణ్, వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్