wife behaviour
-
భార్య మీద అనుమానంతో దుబాయ్ నుంచి వచ్చి...
కరీంనగర్ (మల్లాపూర్): అనుమానం పెనుభూతమై భార్యను గొంతు నొక్కి అతికిరాతకంగా చంపేశాడోభర్త. ఈ దారుణం మండలంలోని వెంకట్రావ్‌పేటలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన వెల్మల రమేశ్‌కు రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సునీతతో 2015లో వివాహం జరిపించారు. వీరికి కూతురు ఆద్య (8), కుమారుడు జయసూర్య(6) సంతానం. కొంతకాలంగా వెంకట్రావ్‌పేటలో ఉంటున్నారు. రమేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. నెలక్రితం దుబాయ్ నుంచి వచ్చిన రమేశ్‌కు సునీత వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం కలిగింది. ఇదే విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో రమేశ్ క్షణికావేశంలో సునీత ముఖంపై బలంగా కొట్టాడు. గొంతు నులిమి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సునీత కుటుంబసభ్యులు ఘటనాస్థలికి వెళ్లి బోరున విలపించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేష్‌బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు తండ్రి మందల గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
భార్య ముందే వేరే యువతులతో భర్త అశ్లీల పనులు..
రాయచూరు రూరల్: ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా చేసుకున్న వైవాహిక బంధం కొందరి వల్ల నవ్వుల పాలవుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు పర వ్యామోహానికి గురై కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఆపై చట్టానికి చిక్కి ఊచలు లెక్కించే ఘటనలు ఎక్కడో ఒకచోట బయటపడుతున్నాయి. బెళగావి నగరంలోనూ అదే జరిగింది.చంపి, కళ్లను దానం చేసివివరాలు.. ఈ నెల 9వ తేదీన బెళగావి మహంతేష్ నగరలో నివాసమున్న పారిశ్రామికవేత్త సంతోష్ పద్మణ్ణవర్ (47) గుండెపోటుతో చనిపోయాడని ఆయన భార్య ఉమ పద్మణ్ణవర్ అందరికీ చెప్పి అంత్యక్రియలు జరిపించింది. పైగా భర్త కళ్లను దానం చేసింది. బెంగళూరులో చదువుకుంటున్న వారి కుమార్తె సంజన ఇంటికి వచ్చాక ఏదో జరిగిందని గ్రహించి 3 రోజుల కిందట స్థానిక మాళమారుతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా నివ్వెరపరిచే సంగతులు వెలుగు చూశాయి. సంతోష్ నిరంతరం యువతులను ఇంటికి తెచ్చుకుని వారితో గడిపేవాడు. ఇంట్లో భార్య ముందే వారితో నగ్నంగా సంచరించేవాడు. ఇంటి సీసీ కెమెరాల 13 హార్డ్ డిస్కులను, రికార్డర్లను తనిఖీ చేయగా అవే దృశ్యాలు కనిపించడంతో కంగుతిన్నారు.విరక్తి పుట్టి..భర్త వైఖరిని చూసి భార్య ఉమకు విరక్తి పుట్టింది. ఫేస్బుక్ స్నేహితులైన ఇద్దరు యువకులు శోభిత్ గౌడ (31), పవన్ (35)కు విషయం తెలిపింది. ప్లాన్ ప్రకారం సంతోష్‌కు నిద్రమాత్రలు మింగించారు. నిద్రలోకి జారుకోగానే దిండుతో ఊపిరాడకుండా హత్యచేశారు. పోలీసులు ఉమ ను విచారించగా భర్త ప్రవర్తనను ఏకరువు పెట్టింది. తమ పిల్లల ముందు కూడా నగ్నంగా తిరిగేవాడని, ఇది తట్టుకోలేక తాను ఫేస్బుక్ మిత్రులతో కలసి భర్తను హత్య చేశామని నేరం అంగీకరించింది. ఆ కుటుంబం కథ విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆమె శోభిత్ గౌడతో సన్నిహితంగా ఉండేదని గుర్తించారు.హార్డ్ డిస్కుల నిండా అవేబనశంకరి: సంతోష్ ఇంటిలో సీజ్ చేసిన హార్డ్ డిస్కుల్లో హతుడు సంతోష్ యువతులు, మహిళలతో ఉన్న ప్రైవేటు వీడియోలు అనేకం ఉన్నాయి. మహిళలతో గడుపుతూ మొబైల్‌తో వీడియోలు తీసుకునేవాడు. తరువాత వాటిని కంప్యూటర్లో భద్రపరిచేవాడు. నిందితులను జైలుకు తరలించారు. -
నీ భర్తను చంపితే సింగరేణి ఉద్యోగం మనదే.. హాయిగా ఉండొచ్చు రమ
సాక్షి, కరీంనగర్: తన భర్తను అడ్డు తొలగిస్తే.. సింగరేణి ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరం హాయిగా ఉండొచ్చని చెప్పి ప్రియుడితో భర్తను హత్య చేయించింది ఓ మహిళ. అంతేకాదు.. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించింది కూడా.. రంగంలోకి దిగిన పోలీసులు.. కూపీ లాగడంతో అసలు విషయం వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసుస్టేషన్ పరిధిలోని మల్యాలపల్లి సబ్‌స్టేషన్ వద్ద రాజీవ్‌రహదారిపై జరిగిన ఈ ఘటన వివరాలను రామగుండం ఏసీపీ తులా శ్రీనివాస్‌రావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ సమీప పోతనకాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి లావుడ్య మధుకర్–రమ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. రమ తనకు తెలిసిన వారికి పెళ్లి సంబంధం కుదిర్చేక్రమంలో ధరావత్ గోవర్ధన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది గోవర్ధన్, రమ మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈక్రమంలో గోవర్ధన్ తరచూ రమ ఇంటికి వస్తూ పోతున్నాడు. కొన్నిసార్లు రెండుమూడ్రోజులు ఇక్కడే ఉండేవాడు. దీంతో మధుకర్‌కు తన భార్యపై అనుమానం వచ్చింది. పద్ధతి మార్చుకోవాలని ఆమెను హెచ్చరించాడు. తన వ్యవహారానికి అడ్డువస్తున్నాడనే ఆగ్రహంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి రమ కుట్ర పన్నింది. మధుకర్‌ను చంపితే సింగరేణి ఉద్యోగం కూడా వస్తుందని, ఇద్దరమూ హాయిగా ఉండొచ్చని చెప్పింది. ఇందుకు అంగీకరించిన గోవర్ధన్.. మరో ఇద్దరు మిత్రుల సాయం తీసుకుని మధుకర్ హత్యకు అక్టోబర్ 29న ప్లాన్ చేశాడు. అదేరోజు మధుకర్ మధ్యాహ్నం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న గోవర్ధన్ తన స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్‌తో కలిసి గోదావరిఖని వచ్చారు. గోవర్ధన్ తన ప్రియురాలు రమకు ఫోన్‌చేశాడు. మధుకర్‌తో మాట్లాడాలని చెప్పాడు. ఈక్రమంలో పల్సర్ బైక్‌పై ఫైవింక్లయిన్ వద్ద గల ఓ వైన్‌షాపులోకి మధుకర్ వచ్చాడు. అక్కడ అందరూ కలుసుకొని మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత మల్యాలపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని చెట్లపొదల్లోకి వచ్చి మద్యం తాగుతూ ఉన్నారు. గోవర్ధన్ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడు పట్టుకుని, తన ఇద్దరు మిత్రులతో కలిసి మధుకర్‌పై దాడిచేశారు. తీవ్రగాయాలతో మధుకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని రోడ్డు పక్క ఉన్న కాలువలో పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బైక్‌ను మృతదేహంపై పడేయాలని యత్నించినా.. అదుపుతప్పి పక్కకు పడింది. ఆ తర్వాత హత్య విషయాన్ని గోవర్ధన్ వాట్సాప్‌కాల్ ద్వారా రమకు తెలిపాడు. అక్కడినుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు. రమ వ్యవహారశైలిపై మృతుడి తండ్రి నాన్యానాయక్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు లావుడియా(నునసవత)రమ, ధరావత్ గోవర్ధన్(నాచారం, మల్హర్ మండలం), కోట లక్ష్మణస్వామి (కొత్తపల్లి, జయశంకర్ జిల్లా), కర్నే నాగరాజు (ఖాసీంపెల్లి, జయశంకర్ జిల్లా)ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. హత్య జరిగిన 48 గంటల్లోనే రామగుండం సీఐ, ఎస్సైలు కేసును ఛేదించడంతో ఏసీపీ అభినందించారు. ఇవి చదవండి: చిన్నారిని కుదిపేసిన కాలం! -
విడిపోవడం పరిష్కారం కాదు..! మరి తగ్గితే..?
నిజామాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట.. పెద్దల సాక్షిగా, సమాజం ఒప్పుకునేలా ఇరువురి బంధువు లు, స్నేహితుల మధ్య జరిగే అద్భుతమైన ఘట్టం. అయితే ఆధునిక కాలంలో ఏడడుగులు నడిచి ఏడాది గడవకముందే మనస్పర్థలతో ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇరువురి తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అహం వల్లే.. జిల్లాలో భార్యాభర్తల గొడవలకు సంబంధించిన కే సులు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నట్లు స్పష్టమవుతోంది. కొన్నింటిలో పోలీసుల కౌన్సెలింగ్‌తో పరిష్కారం కనిపిస్తున్నా.. ఇంకొన్ని ఘటనలలో మొండిగా ప్రవర్తిస్తూ కేసుల వరకు వెళుతున్నారు. చేసేదేమీ లేక పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు. పోలీసు స్టేషన్లో అయినా, కోర్టులో అయినా సరే సర్దుకుందామనే ఆలోచనకు రావడం లేదు. కొందరైతే పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో భార్య, భర్తలే కాకుండా వాళ్ల తల్లిదండ్రుల ఇగో కూడా విడాకులకు కారణమవుతోంది. సర్ది చెప్పాల్సిన పెద్దలే సమస్యను పెద్దదిగా చేసి విడుకులు ఇప్పిస్తున్నారు. సామరస్యంగా మాట్లాడుకుంటే.. దంపతులు మొండి ధోరణి విడనాడి ఏ సమస్య తలెత్తినా సామరస్యంగా కూర్చుని మాట్లాడుకోవాలి. ఎదుటివారిపై ఆధిపత్యానికి ప్రయత్నించవద్దు. జీతాలు, హోదాలు ఎలా ఉన్నా, అన్నీ తమ కుటుంబం కోసమే అన్న భావన పెంచుకోవాలి. తగాదాలు వస్తే సాధ్యమైనంత వరకు మూడో మనిషికి తెలియకుండా వారే పరిష్కరించుకోవాలి. తప్పు ఎవరిదైతే వారు క్షమించమని అడిగితే పోయేదేమీ లేదు. ఒక్క చిన్న మాట ఎంతో మార్పుకు కారణమవుతుంది. భార్యభర్తల మధ్య వివాదాలు, వాటి పర్యవసానాలు పిల్లలపై పడకుండా చూసుకోవాలి. సంపాదన ఎంత అవసరమో సంతోషం కూడా అంతే అవసరమనే విషయాన్ని గుర్తించాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినా.. చిన్నచిన్న విషయాలకే భార్య, భర్తలు గొడవలు పడుతున్నారు. వాటిని పెద్దలు కూడా మరింత పెద్దవి చేస్తున్నారు. దీంతో కుటుంబాలు దెబ్బతింటున్నాయి. పోలీసు స్టేషన్‌కు, కోర్టుకు వెళ్లిన తర్వాత కౌన్సెలింగ్‌లు ఇచ్చినా చాలా మంది విడిపోతామనే చెబుతున్నారు. విడిపోవడమే పరిష్కారమన్న భావన పెరగడం మంచిది కాదు. భార్య, భర్తల మధ్య తలెత్తే చిన్నచిన్న గొడవలను కూర్చుండి పరిష్కరించుకోవచ్చు. ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినా సమస్య అప్పుడే పరిష్కారం అవుతుంది. పంతాలకుపోతే ఇరువురూ నష్టపోతారు. – బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి -
సంతానం లేదని తరచూ వేధిస్తోందని.. భార్యను చంపేశాడు..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తరచూ వేధిస్తోందని ఆమెను హత్య చేసిన సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ నల్లగుట్ట ప్రాంతానికి చెందిన కుమ్మరి లక్ష్మణ్ బీనా (49) 29 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి సంతానం లేరు. లక్ష్మణ్ ప్రస్తుతం ఐడీపీఎల్ సమీపంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయినప్పటి నుంచి బీనా తరచూ లక్ష్మణ్‌తో గొడవపడుతూ ఉండేది. ఇంటి ఓనర్లతో సైతం తరచూ గొడవ పడుతుండటంతో అతను పలు మార్లు ఇళ్లు మారాల్సి వచ్చింది. కొంత కాలం క్రితం ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఫ్రెండ్స్ కాలనీకి మకాం మార్చారు. ఇటీవల వీరి మధ్య గొడవలు జరగడంతో బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్‌కు సైతం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భార్యపై కోపం పెంచుకున్న లక్ష్మణ్ మంగళవారం ఉదయం ఆమె మెడకు ఎలక్ట్రికల్ వైర్ బిగించి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు -
భార్య మరొకరితో వెళ్లిపోతే.. ఈ భర్త ఏం చేశాడంటే..
మడకశిర రూరల్: మాయమాటలతో తన భార్యను లేవదీసుకుపోయిన యువకుని చిత్రపటానికి చెప్పుల హారం వేసి ఓ భర్త వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం క్యాంపురం గ్రామానికి చెందిన నేత్రావతి, అంజి భార్యాభర్తలు. బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే ఓ తోటలో కూలి పనులతో జీవనం సాగించేవారు. ఇదే గ్రామానికి చెందిన దివాకర్ సైతం బెంగళూరులో కూలి పనులు చేస్తుండేవాడు. నేత్రావతిపై కన్నేసిన దివాకర్ ఆమెతో పరిచయం పెంచుకుని పది రోజుల క్రితం తనతో పాటు లేవదీసుకుపోయాడు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన అంజి క్యాంపురానికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించాడు. ఈ క్రమంలోనే కసి తీర్చుకోవాలని అంజి.. శనివారం రాత్రి దివాకర్ చిత్రపటానికి చెప్పులు వేసి సైకిల్‌పై డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలో ఊరేగించాడు. ఇది చూసిన స్థానికులు దివాకర్ చిత్రపటంపై ఉమ్మేసి చెప్పుతో కొట్టారు. దివాకర్ ఇంటి ఎదుట పాదరక్షలు వేసిన చిత్రపటాన్ని ఉంచారు. -
భార్యావియోగాన్ని తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లడమే కాకుండా తనతో సరిగా మాట్లాడడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ... ఫిలింనగర్‌లోని దుర్గాభవనీనగర్ బస్తీకి చెందిన పెద్ద నర్సింహా(29) వివాహం రెండేళ్ల క్రితం శివానీతో జరిగింది. నాలుగు రోజుల క్రితం శివాని పుట్టింటికి వెళ్లింది. అత్త మాట్లాడినా సరిగా స్పందించలేదు. భర్తతో సైతం సరిగా మాట్లాడకపోవడంతో విరక్తి చెందిన నర్సింహా ఆదివారం తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటికి పిలిపించి.. భార్య ప్రియుడిని హత్య చేయించిన భర్త
సాక్షి, బెంగళూరు: సుపారీ ఇచ్చి భార్య ప్రియుడిని హత్య చేయించిన భర్త, అతనికి సహకరించిన మరో ముగ్గురిని యడ్రామి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఇషాపంత్ తెలిపినమేరకు వివరాలు.. యాదగిరి జిల్లా సిద్దాపుర గ్రామానికి చెందిన రెహమాన్ షాబుద్దీన్ కౌతాళ్ భార్యతో సురపురకు చెందిన చాంద్‌పాషా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పలు పర్యాయాలు రెహమాన్ హెచ్చరించినా ఫలితం లేకపోయింది. దీంతో చాంద్‌పాషాను హత్యను చేసేందుకు ప్రభుగౌడ బిరాదార్ (22), హుణసగి తాలూకా దేవత్కల్ గ్రామానికి చెందిన మల్లికార్జున లక్మాపుర్ (21)కు రెహమాన్ రూ.60వేలు చొప్పున సుపారీ ఇచ్చాడు. సెప్టెంబర్ 4న ప్రభుగౌడ.. చాంద్‌పాషాను కరెంటు పనుల కోసం అంటూ తన ఇంటికి పిలిపించి కట్టెలతో దాడి చేశాడు అప్పటికే అక్కడకు చేరుకున్న మరో నిందితుడు సయ్యద్ షాబుద్దీన్ కౌతాళ్‌తో కలిసి చాంద్‌పాషాను కారులో యాదగిరి జిల్లా కుడేకల్ కాలువ వద్దకు తీసుకెళ్లి చేతులు కాళ్లు కట్టివేసి నీటిలో పడేశారు. సెప్టెంబర్ 10న మృతదేహం నీటిపై తేలియాడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. ఆనందానికి అడ్డుగా ఉన్నాడని..) -
భార్య మృతితో ఒంటరి జీవితం.. ఇంట్లో వదినతో మాటలు కలిపి..
చిల్లకూరు: వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారుపాలు చేస్తున్నాయి. క్షణికావేశంలో చేసే తప్పులు దారుణాలకు ఒడిగడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుపతిలో జరిగింది. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తమ్ముడిని అన్న కర్రతో కొట్టి హతమార్చిన సంఘటన చిల్లకూరు మండలం కాకువారిపాళెం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అద్దెపల్లి బాలాజీ, ప్రతాప్(25) అన్నదమ్ములు. ఇద్దరికి వివాహాలు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. 10 నెలల క్రితం ప్రతాప్ భార్య కాన్పు సమయంలో మృతి చెందింది. దీంతో బాలాజీ తన తమ్ముడు ప్రతాప్‌కు తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. అప్పటి నుంచి తన వదినతో చనువుగా ఉంటూ ఆమెతో అక్రమ సంభందం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ప్రతాప్, తన వదిన ఒకే దగ్గర ఉండడం చూసిన అన్న బాలాజీ కోపోద్రిక్తుడై ప్రతాప్‌పై కర్రతో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ గోపాల్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలాజీ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇది కూడా చదవండి: రీల్స్ చేస్తూ నీళ్లలో పడి మృతి.. అమృత బతుకుతుందని ఉప్పుపాతర! -
ఒకరేమో ఏడు ముక్కలు చేయిస్తే.. మరొకరు ప్రియుడి చేతికి తుపాకీ అందించి..
2021 నవంబర్.. ప్రియుడి మోజులో పడి అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్న భర్తను ఏడు ముక్కలు చేయించింది జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన హేమలత. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అక్కసుతో అతిగా మద్యం తాగించి ఆపరేషన్ చేసే సీజర్‌తో ప్రియుడితో ఏడు ముక్కలు చేయించి పలు ప్రాంతాల్లో పడేయించింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇష్టపడి సొంత మేన మరదలిని పెళ్లి చేసుకున్నాడు సింగరేణి కార్మికుడు కోరుకొప్పుల రాజేందర్. ఇద్దరు పిల్లలు సంతానం. అయినా ప్రేమికుడి మోజులో పడిన ఆయన భార్య రవళి.. తాళికట్టిన రాజేందర్‌ను ఈనెల 20న పిస్తోల్‌తో కాల్పులు జరిపించి చంపించింది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. గోదావరిఖని(పెద్దపల్లి): అర్థేచ.. కార్యేచ.. నాతి చరామి అంటూ చేతిలోచేయి వేసి జీవితాంతం తోడుంటామని బాస చేసిన కొందరు కట్టుకున్న భర్తను మట్టుబెట్టుతున్నారు. వివాహేతర సంబంధం మోజులో పడి తాళి కట్టిన వారిని కడతేర్చుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి సంఘటనల రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల ముందు తాళికట్టిన బంధాలు పలుచనైపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచమంతా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం ఇస్తుంటే ఇక్కడ మాత్రం పాశ్చాత్య సంస్కృతివైపు పయనం పెరిగి పోతోంది. సింగరేణి కార్మిక క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. శనివారం హత్యకు గురైన కోరకొప్పుల రాజేందర్‌ను పెళ్లిచేసుకున్న రవళి ఇద్దరు పిల్లలకు తల్లి. భర్త, పిల్లలతో కలిసి హాయిగా కాపురం చేయాల్సిన సమయంలో పెళ్లికి ముందునుంచే ప్రేమికుడితో చెట్టపట్టాలేసుకుని తిరిగి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపించేందుకు సహకరించిందని అంటున్నారు. తాళి కట్టించుకుని ఏడడుగులు నడిచిన భార్య ప్రియుడితో కలిసి పెళ్లి చేసుకున్న ఏడేళ్లకు చంపించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది నవంబర్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఎన్టీపీసీ టీటీఎస్‌లో అగ్నిసాక్షిగా తాళికట్టించుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఏడుముక్కలు చేయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎవరికీ అనుమానం రాకుండా భర్తను చంపించిన భార్య.. అతడి శరీరభాగాలను ఏడు వేర్వేరు ప్రాంతాల్లో పడవేయించింది. ఇలాంటి ఘటనలతో స్థానికులు భయపడుతున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ అగ్నిసాక్షిగా తాళికట్టిన బంధాలను బలోపేతం చేసేలా స మాజం నడుం బిగించాలంటున్నారు. పోలీసుశాఖ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఇంటి యజమానితో భార్య వివాహేతర బంధం..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. వేరే వ్యక్తితో ఉండడాన్ని కళ్లారా చూసి జీర్ణించుకోలేకపోయాడు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కమీషన్ విషయంలో రియల్టర్లు మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య, పిల్లలు దూరం కావడంతో మహిళలపై ద్వేషం పెంచుకుని సైకోలా మారాడు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని కడతేర్చాడు. నగర శివారు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన వరుస హత్యలకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. భార్య వివాహేతర బంధంతో కుమిలిపోయి... చందక రాంబాబు అలియాస్ సందక రాంబాబు (49) కోటవురట్ల మండలం ధర్మసాగరం గ్రామ నివాసి. 2006లో జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అనంతరం 2013లో ఒంటిరిగా విశాఖపట్నం వచ్చి విమాననగర్‌లో ఉండేవాడు. భార్య, పిల్లలు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూ, హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివసించేవారు. 2015లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనికి చేరిన రాంబాబు అప్పుడప్పుడూ హైదరాబాద్ వెళ్లి భార్య, పిల్లలను చూసేవాడు. ఈ క్రమంలో అతని భార్య హైదరాబాద్‌లో వారు నివసిస్తున్న ఇంటి యజమానితో వివాహేతర బంధం ఏర్పరచుకోవడంతో కుమిలిపోయాడు. భార్యతో గొడవ పడి 2018 మే 21న భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి కుమారుడు, కుమార్తె కూడా రాంబాబును విడిచి పెట్టేసి తల్లి వద్దే ఉంటున్నారు. ఒంటరితనం... స్త్రీలపై పగతో... భార్య, పిల్లలకు దూరమైన రాంబాబు ఒంటరిగా మారాడు. 2021 అక్టోబర్‌లో పెందుర్తి సమీప ప్రశాంతినగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకుని నివసించేవాడు. అయితే ఏ పనికీ వెళ్లకపోవడంతో అద్దె చెల్లించలేక ఇల్లు విడిచి బస్టాప్‌లో ఆశ్రయం పొందాడు. సమీపంలోని ఫంక్షన్ హాల్స్, దేవాలయాల వద్ద భోజనం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో భార్య ప్రవర్తన కారణంగా రాంబాబు స్త్రీలపై పగ, ద్వేషం పెంచుకున్నాడు. మహిళలను కొట్టి, దారుణంగా చంపి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక స్క్రాప్ దుకాణం నుంచి ఇనుప రాడ్డు దొంగలించాడు. ముందుగా గత నెల 9న పెందుర్తి బృందావన్ గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో పనిచేస్తున్న 50 ఏళ్ల తోట నల్లమ్మ, ఆమె కుమారుడు నిద్రపోతుండగా దాడి చేసి గాయపరిచాడు. అనంతరం ఈ నెల 6న రాత్రి పెందుర్తి చినముషిడివాడ సప్తగిరినగర్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుతారి అప్పారావు, సుతారి లక్షి్మపై ఇనుప రాడ్డుతో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. తర్వాత ఈ నెల 14న రాత్రి పెందుర్తి సుజాతనగర్ నాగమల్లి లే అవుట్, లాలం రెసిడెన్సీ సెల్లార్లో అపార్టుమెంట్ వాచ్‌మెన్‌గా ఉంటున్న అప్పికొండ లక్ష్మిని దారుణంగా హత్య చేశాడు. నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే... రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేసినప్పుడు కమీషన్ విషయంలో బిల్డర్లు తనను మోసం చేయడంతో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే దాడులు, హత్యలకు పాల్పడాలని చందక రాంబాబు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే జన సంచారం తక్కువగా ఉండడం, సరైన భద్రత లేని అపార్టుమెంట్ల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లి హత్యాంకాండకు పాల్పడ్డాడు. దీంతో వరుస హత్యలపై పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు కోసం పలు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ పుటేజ్, సాంకేతిక ఆధారాలు క్షుణంగా పరిశీలించారు. అన్ని కోణాల నుంచి ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
క్షణికావేశంలో తప్పు చేసిన భార్య.. భర్త ఏం చేశాడంటే..?
దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు సహజం. గొడవలున్నా సర్దుకుపోయి జీవించాలని పెద్దలు చెబుతుంటారు. కాగా, క్షణికావేశంలో భార్య చేసిన చిన్న తప్పు వివాహ బంధాన్ని నాశనం చేసింది. ఆమెను జీవితాంతం బాధపడేలా చేసి.. చివరకు విడాకులకు దారి తీసింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన దంపతులు పదేళ్లకుపైగా విదేశంలో నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కారణంగా వారు నివసిస్తున్న దేశంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారు తిరిగి స్వదేశానికి రావాల్సి వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, వారు విదేశాల్లోనే చదువుతున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భర్త.. ఓ వ్యాపారం ప్రారంభించగా.. భార్య ఓ కాలేజీలో ఉద్యోగం చేస్తోంది. అయితే, వారు భోపాల్‌కు రావడం భార్యకు ఎంతమాత్రం ఇష్టం లేకపోవడంతో భర్తతో ఆమె తరచూ గొడవపడేది. ఈ క్రమంలోనే వీరిద్దరూ గొడవ పడుతుండగా ఆవేశంతో రగిలిపోయిన భార్య.. భర్తను చెప్పుతో కొట్టింది. దీంతో ఒక్కసారిగా షాకైన భర్త.. తేరుకొని దీన్ని అవమానంగా ఫీలయ్యాడు. అనంతరం ఆమెతో విడిపోయేందుకు సిద్ధపడి విడాకులకు దరఖాస్తు చేశాడు. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించడానికి ప్రయత్నించారు. కౌన్సిలింగ్ సమయంలో భార్య తన తప్పును ఒప్పుకుంది. భర్త మాత్రం జరిగిన ఘటనను అవమానంగా భావించి.. ఆమెతో జీవించలేనని తెగెసిచెప్పాడు. విడాకులు కావాలని పట్టుబట్టాడు. అనంతరం భర్తను భార్య ఎంత బ్రతిమిలాడిన అతను మససు మాత్రం మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక కోర్టు వారికి విడాకులు మంజూరుచేసింది. ఇది కూడా చదవండి: వివాహమైన మూడు నెలలకే దారుణం -
భార్యను బలవంతంగా పారాగ్లైడింగ్ చేయిస్తే ఇలానే ఉంటుంది: ఫన్నీ వైరల్ వీడియో
Blaming her husband for taking on such adventures for fun: ఇటీవల కాలంలో భారతదేశంలో పారాగ్లైడింగ్ బాగా జనాదరణ పోందుతోంది. అంతేకాదు సాహస ప్రియులందరికీ ఇదే తొలి ఎంపికలో ఒకటిగా ఉంది. అయితే మనం ఇష్టపూర్వకంగా సాహసం చేయడం వేరు వేరేవాళ్ల బలవంతం మీద సాహాసయాత్ర చేస్తే వాళ్ల పరిస్థితి ఎంతలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అచ్చం అలానే ఇక్కడొక భర్త తన భార్యకు ఇష్టం లేకపోయిన బలవంతంగా పారాగ్లైడింగ్ చేయిస్తే ఆమె చేసిన హడావిడి అంత ఇంత కాదు. అసలు విషయంలోకెళ్తే...ఒక మహిళ తన భర్త బలవంతంపై పారాగ్లైడింగ్‌కి వెళ్లింది. అయితే ఆమె సాహాసయాత్ర ప్రారంభంలోనే తనకు చాలా భయంగా ఉంది.. తాను వెళ్లను అని చెబుతూనే ఉంది. ఈ మేరకు యాత్ర ప్రారంభంకాగానే ఒకటే భయంగా అరుస్తూ చేతులతో కళ్లు మూసేసుకుని కేకలు వేస్తోంది. పాపం పారాగ్లైడింగ్ గైడ్ ధైర్యం చెప్పటానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పారాగ్లైడింగ్ పైకి వెళ్తున్నంత సేపు సదరు మహిళ భయంతో తన చేతులు మొద్దు బారిపోతున్నాయంటూ ఏడుస్తుంది. అయితే గైడ్ ఆమెను నవ్వించేందుకు జోక్‌లు వేస్తున్నప్పటికీ ఆమె తన భర్తను తిడుతూ..."దేవుడు నేను ఎందుకు పెళ్లి చేసుకున్న అతన్ని అంటూ భర్తను నిందించింది. అంతేకాదు నిన్ను చంపేస్తా అంటూ భర్తపై కోపంతో అరుస్తూ ఉంటుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కుడా ఓ లుక్కేయండి. (చదవండి: దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్! త్వరలో క్లినికల్ ట్రయల్స్) May be his frustrated husband sole intention to send his irritate wife over paragliding. 😁😃 https://t.co/Rwj1NRAO5e — Apeda Rondo (@rondo_apeda) January 17, 2022 -
పుట్టింటికి వెళ్లిన భార్య.. అత్త చెవి కోసిన అల్లుడు..
సాక్షి, ఆదోని(కర్నూలు): తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్తపై కత్తితో దాడి చేసి చెవి కోశాడు. అడ్డు వచ్చిన భార్యనూ గాయపర్చాడు. ఈ ఘటన మంగళవారం ఆదోనిలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ వివరాల మేరకు.. పట్టణంలోని మరాఠగేరికి చెందిన మాధవి.. నిజాముద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాగుడుకు బానిస అయిన భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. భరించలేక ఇటీవలే మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని నరేష్కుమార్ అత్త ఇంటికెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమ చెవి సగం తెగిపోయింది. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఏడుపు విని ఇరుగుపొరుగు వారు రావడంతో నరేష్కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన ఘటనపై మాధవి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తనను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడమే కాక వివాహ సమయంలో తీసుకెళ్లిన రూ.8 లక్షలు, 20 తులాల బంగారం తాగుడుకు ఖర్చు చేసి మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం వేధిస్తున్నాడని మాధవి విలపించారు. చదవండి: భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఇల్లాలు -
అమానుషం: భర్త కంట్లో కారం చల్లి.. కుమారుడితో కలిసి..
సాక్షి, మరిపెడ(వరంగల్): ఆస్తికోసం దారుణం చోటు చేసుకుంది. కుమారుడితో కలిసి భర్తపై భార్య దాడిచేసింది. చితకబాది ఎడమచెవిని కోశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రూప్‌సింగ్‌తండాలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. రూప్‌సింగ్‌తండాకు చెందిన గుగులోతు కోట్యా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని పేరుమీద ఉన్న మూడెకరాల భూమిని తమ పేరున చేయాలని భార్య విజయ, కుమారుడు పవన్ కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నారు. వీరిమధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. శనివారం కుమారుడి సహాయంతో భర్త కంట్లో కారం కొట్టి కత్తి, కర్రలతో దాడి చేసింది. ఎడమ చెవును కోశారు. కోట్యా భయంతో బయటకు పరుగుతీసి ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఈ విషయంపై మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో భార్య, కుమారుడిపై ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: కారాగారంలో కర్మాగారం -
ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన భార్యపై భర్త దాడి
సాక్షి, హోసూరు(కర్ణాటక): దొంగచాటున ప్రియున్ని కలిసేందుకెళ్లిన భార్యపై దాడి చేసిన భర్తను సిప్కాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసోం లక్కిపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన భర్యతో కలిసి హోసూరు పారిశ్రామికవాడ బ్యాడరపల్లిలో నివాసముంటున్నారు. ఆ మహిళకు ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. మంగళవారం ఉదయం ప్రియున్ని వెతుక్కొంటూ వెళ్లిన భార్యను భర్త వెంబడించి ఆమెను తీవ్రంగా కొట్టడంతో గాయపడింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. చదవండి: శివసేనపై హోంమంత్రి ఆగ్రహం -
సంసార విషయంలో గొడవ .. భర్త ఆత్మహత్య
సాక్షి, పటాన్చెరు(మెదక్): సంసార విషయంలో జరిగిన గొడవ భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూక అంబాజీ పేటకు చెందిన శ్రీనివాస్(46) భార్య వరలక్ష్మి పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం 18 ఏళ్ల క్రితం పటాన్చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో సరుకులు లేవని భార్య వరలక్ష్మి భర్తతో గొడవపడి ఇద్దరు కూతుర్లు సాయిప్రసన్న, శ్రీదేవిలను తీసుకొని మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. వెంటనే కిందకు దించి ఆటోలో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కట్టుకున్న భార్యను .. తల్లి, ప్రియురాలితో కలిసి..
సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా): భార్యకి విషమిచ్చి చంపేశాడో కసాయి భర్త. ఈ విషాద ఘటన జిల్లాలోని కలిమెల సమితి, ఎంవీ–40 గ్రామంలో శనివారం వెలుగుచూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, విచారణ సాగిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఎంవీ–40 గ్రామస్తుడైన సమీర్‌కు సరిగ్గా పదేళ్ల క్రితం ఎంవీ–57 గ్రామానికి చెందిన ఆశతో వివాహం జరిగింది. అయితే 4 సంవత్సరాలుగా ఎంవీ–40 గ్రామానికి చెందిన ఓ మహిళతో సమీర్ అక్రమ సంబంధం కొనసాగిస్తుండడంతో ఆశ తన భర్తని రోజూ నిలదీసేది. ఇదే విషయమై వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చిన సమీర్ తన భార్యతో తొలుత గొడవకు దిగి, ఆమెతో బలవంతంగా విషం తాగించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన అత్తమామలకు ఫోన్ చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని సమాచారమిచ్చాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాధిత తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో పడి ఉన్న తమ కూతురిని వైద్యసేవల నిమిత్తం మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఆమె శనివారం ఉదయం కన్నుమూసింది. కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు. ఆశను హతమార్చేందుకు సమీర్కి తన తల్లి, ప్రియురాలు కూడా సహాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కలిమెల సమితి, ఎంవీ–66 గ్రామంలో కజాల్ అనే మరో మహిళ ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన కలిమెల పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
భార్యపై కోపంతో మ్యాట్రిమెునిలో వివరాలు
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ సాగుతున్న క్రమంలో భార్యకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో పెట్టి వక్రబుద్ధి చాటుకున్నాడు. మామ ఫిర్యాదుతో చివరికి అరెస్టయ్యాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన యువతి(32)కి వెళ్లియూర్ పంచాయతీ అధ్యక్షుడు సురేష్‌బాబు కుమారుడు ఓంకుమార్(34)తో 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. విడాకులు కావాలని పూందమల్లి కోర్టులో ఓంకుమార్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ సాగుతోంది. రెండు వారాల క్రితం ప్రముఖ మ్యాట్రిమొనిలో వరుడు కావాలని భార్య వివరాలను ఉంచాడు. ఆసక్తి ఉన్న వారు యువతి తండ్రిని సంప్రదించాలని పేర్కొన్నాడు. యువతి తండ్రికి ఫోన్‌కాల్స్ రావడంతో ఆయన తిరువళ్లూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఓంకుమార్ విషయం తెలిసింది. పోలీసులు బుధవారం ఓంకుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: 'లవ్‌స్టోరి'ని తలపిస్తున్న తమిళనాడు జంట కథ -
భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి
సాక్షి, చెన్నై: నెర్కుండ్రంలో భార్యపై కోపంతో నాలుగు బైకులకు, ఓ కారుకు నిప్పు పెట్టి దగ్ధం చేసిన ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై నెర్కుండ్రం షణ్ముఖనగర్ సత్యం వీధిలో గత నెల 25న ఒక కారు, నాలుగు బైకులు నిప్పు అంటుకుని దగ్ధమయ్యాయి. దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉండే సతీష్ (26)ను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: (ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య) పోలీసులు వివరణలో చెన్నై అంబత్తూరు ఐటీ కంపెనీలో పని చేస్తున్న సతీష్ 2019 నుంచి భార్య వెండామనితో విడిపోయాడు. అప్పటి నుంచి తల్లి ఇంటిలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య అతనికి తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో విరక్తి చెంది.. భార్య వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ మంటలు విస్తరించి సమీపంలోని కారు, నాలుగు బైకులు దగ్ధం చేశాయి. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ విష యం స్థానికంగా సంచలనం కలిగించింది. చదవండి: (లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..) -
పెళ్లైన నెలకే మెడ కోసి..
నిజాంపేట్(హైదరాబాద్)/కామారెడ్డి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే సైకోగా మారాడు. పెళ్లి తర్వాత భార్యపై అనుమానం పెంచు కున్నాడు. మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. ఆపై తానూ మెడ, చేతులపై కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీ స్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన సుధారాణి.. అదే జిల్లా శివయ్యపల్లి గ్రామానికి చెందిన ఎర్రోల కిరణ్‌కుమార్ ఏడెనిమిది నెలలుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గత నెల 27న వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అత్తారింటికి వస్తే భర్త అనుమానాలతో ఆమె ఆందోళనకు గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బంధువులతో కలసి మాట్లాడి సర్దిచెప్పి పంపించారు. కిరణ్‌కుమార్ సాప్ట్వేర్ ఉద్యోగి కావడంతో ప్రగతినగర్‌లోని శ్రీసాయిద్వారకా అపార్ట్మెంట్లో ఫ్లా ట్ తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం హై దరాబాద్ రావాలని కిరణ్ కుటుంబం నుంచి సుధారాణి తల్లిదండ్రులకు సమాచారం వెళ్లింది. రక్తం మడుగులో సుధారాణి... సుధారాణి తల్లిదండ్రులు శనివారం మధ్యా హ్నం 3:30 గంటల సమయంలో ప్రగతినగర్ కు వచ్చారు. కాలింగ్ బెల్ కొట్టినా, ఇద్దరికీ ఫోన్లు చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బెడ్రూమ్ తలుపు పగులగొట్టారు. సుధారాణి రక్తం మడుగులో చనిపోయి ఉండగా, కిరణ్‌కుమార్ కొన ఊపిరితో ఉన్నాడు. పోలీసులు వెంటనే కిరణ్‌ను ఆసుపత్రికి తరలించారు. కూరగాయలు కోసే కత్తితో సుధారాణి గొంతు, కాళ్లు, చేతులను కోశాడు. అపార్ట్మెంట్లోకి 2 వారాల క్రితమే వచ్చారని, అప్పటి నుంచీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదని చుట్టుపక్కల వారు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో సుధారాణిని హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిరణ్‌కుమార్ మెడ, చేతులపై కత్తితో కోసుకోవడంతో అధిక రక్తస్త్రావం అయ్యిం దని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అతను స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముందన్నారు. బంధువుల ఆందోళన భర్త, అత్తమామలే సుధారాణిని హతమార్చారని ఆగ్రహంతో ఆమె బంధువులు కామారెడ్డి శ్రీరాంనగర్ కాలనీలోని కిరణ్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. -
భర్తకు నిప్పంటించి.. బండతో బాదిన భార్య.. కారణం ఏంటంటే..
సాక్షి, తుమకూరు(కర్ణాటక): భార్యభర్తల మధ్య జరిగిన గొడవ భర్త హత్యకు దారితీసింది. తుమకూరు నగరం జయనగరలో ఆదివారం మధ్యాహ్నం నారాయణ (45), భార్య అన్నపూర్ణమ్మ కొట్లాటకు దిగారు. నారాయణ నెలమంగల దగ్గరున్న మద్యం ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్‌గా పని చేసేవాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని నారాయణ అనుమానించేవాడని సమాచారం. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకొని భర్త పైన పోసి నిప్పు అంటించింది. మంటలో కాలిపోతున్న భర్త కిందపడిపోగా అతని తల పైన బండరాయితో కొట్టడంతో తల ఛిద్రమైంది. చుట్టుపక్కలవారు జయనగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య -
తల్లి తప్పటడుగు.. తండ్రీబిడ్డలు బలి
నిర్మల్/సారంగపూర్: భార్య వేసిన తప్పటడుగుకు భర్త, బిడ్డ బలయ్యారు. మరో ఇద్దరు .చిన్నారులు అమ్మ ఉన్నా.. అనాథల్లా మారారు. తల్లి వివాహేతర బంధం.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన కుదురు పోతన్న (34)కు 11ఏళ్ల క్రితం భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన దగ్గరి బంధువు పూజిత (30)తో వివాహమైంది. వీరికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పోతన్న గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పూజిత కొంతకాలంగా బోరిగాం గ్రామానికే చెందిన శ్రీకాంత్‌రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై గతంలోనే పంచాయితీ నిర్వహించి ఇద్దరూ దూరంగా ఉండాలని పెద్దలు సూచించినట్లు తెలిసింది. మళ్లీ ఇటీవల వారిద్దరూ తమ పాతబంధాన్నే కొనసాగిస్తుండడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న పూజిత తన చిన్నకూతురు క్యూటీ(3)ని తీసుకుని శ్రీకాంత్‌రెడ్డితో వెళ్లిపోయింది. మూడు రోజులపాటు వారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గడిపారు. ఈ నెల 25న శ్రీకాంత్‌రెడ్డి ఆమెను, చిన్నారిని నిర్మల్ బస్టాండ్‌లో వదిలి బోరిగాం వెళ్లిపోయాడు. తమను కూడా తీసుకెళ్లాలని పూజిత కోరగా అతడు నిరాకరించాడు. ఇంటికి ఫోన్ చేయగా, ఆమె వెళ్లిన రోజు సాయంత్రమే పోతన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, ఎటు వెళ్లాడో సమాచారం లేదని తెలిసింది. దీంతో దిక్కుతోచక బుధవారం రాత్రి నిర్మల్ బస్టాండ్ సమీపంలో ఓ లాడ్జి వద్ద తన కూతురికి క్రిమి సంహారక మందు తాగించి తానూ తాగింది. అపస్మారక స్థితికి చేరిన వారిని స్థానికుల సమాచారం మేరకు పట్టణ పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు చిన్నారి క్యూటీ మృతిచెందిందని చెప్పారు. పూజితకు ఐసీయూలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. పెళ్లి చేసుకుంటానని.. శ్రీకాంత్‌రెడ్డి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, రెండు రోజులు తన వెంట ఉంచుకొని నిర్మల్ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయాడని పూజిత తెలిపింది. ఇంట్లో పరిస్థితికి భయపడి పురుగల మందును తన బిడ్డకు తాగించి, తాను తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది. పోతన్న బలవన్మరణం.. భార్య వేరే వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో అటు పోతన్న జీర్ణించుకోలేకపోయాడు. అవమానభారంతో ఈ నెల 22న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గురువారం పూజిత ఘటన బయటపడగానే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, చుట్టుపక్కల గాలించారు. సారంగపూర్ మండలం ఆలూరు చెరువు వద్ద పోతన్న బైక్, సెల్‌ఫోన్, దుస్తులు కనిపించాయి. గజ ఈతగాళ్లను రప్పించి చెరువంతా గాలించారు. గురువారం సాయంత్రం పోతన్న మృతదేహం చెరువులో లభ్యమైంది. శ్రీకాంత్‌రెడ్డి, పూజితలపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం శ్రీకాంత్‌రెడ్డి పరారీలో ఉన్నాడని నిర్మల్ పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాగా, పూజిత ప్రాణాలతో బయటపడ్డా.. అటు తల్లిదండ్రులు, ఇటు అత్తగారింట్లో ఆమెను దగ్గరకు తీసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో పిల్లలు అభినయ్ (10), నిత్య (7) అమ్మ ఉన్నా.. అనాథల్లా మారారు. -
నా చావుకు భార్య, అత్తింటివారే కారణం..
సాక్షి, దుగ్గొండి(వరంగల్): నన్ను నిత్యం అత్తింటివారు వేధిస్తున్నారు.. భార్య సహా ఆమె కుటుంబ సభ్యులంతా మానసికంగా హింసిస్తున్నారు. వారి హింస భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా చావుకు నా భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ ఓ యువకుడు వాయిస్ రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లిలో శనివారం జరిగింది. దేశాయిపల్లికి చెందిన తుత్తూరు ప్రదీప్(25)కు భార్యతో, ఆమె కుటుంబ సభ్యులతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. వారి వేధింపులు భరించలేక ఈ నెల 19న బంధంపల్లికి చేరుకున్న ప్రదీప్.. తన చావుకు భార్యతో పాటు ఆమె తరుఫు బంధువులే కారణమని వాయిస్ రికార్డు చేసి తండ్రి నగేష్‌కు పంపి గడ్డిమందు తాగాడు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రదీప్ శనివారం మృతి చెందాడు. మృతుని తండ్రి నగేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రెయినీ ఎస్సై మహేందర్ తెలిపారు. చదవండి: ఏడేళ్ల విడాకుల కొట్లాట: ఇగోతో బిలియన్ల కోసం..! ఇది వీళ్ల కథ.. -
భార్యపై కోపంతో 418 కి.మీ నడక
ద రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ లైక్ ఎ ఫిష్ అండ్ ద వాటర్.. బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ద ఫిషర్ మ్యాన్..ఇంగ్లిష్‌లో అంత క్లియర్‌గా చెప్పినా సరే.. తెలుగు సినిమాలోని ఈ డైలాగును ఇటలీకి చెందిన దంపతులు పెద్దగా విన్నట్లు లేరు.. విన్నా.. అస్సలు పట్టించుకున్నట్లే లేరు. తెల్లారి లెగిస్తే చాలు.. మిగతా పనులన్నీ వదిలేసి.. గొడవ పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు వాళ్లు.. ఇలాగే ఈ మధ్య ఓ రోజు మళ్లా కస్సుబుస్సుమన్నారు.. మాటామాటా పెరిగింది.. మొగుడు అని కూడా చూడకుండా కొంచెం గట్టిగానే వాయించేసింది.. అంతే.. ఆ ఒక్క మాటతో లేచి.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని.. అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.. వెళ్లిపోవడం అంటే.. మీరు నేను మారి్నంగ్ వాక్కు వెళ్లినట్లు వెళ్లిపోవడం కాదు.. ఏదో ఊరెళ్లినట్లు వెళ్లిపోయాడు.. కోపం తగ్గేదాకా.. చివరికి పోలీసులు ఆపేదాకా.. నడుచుకుంటూ వెళ్లిపోయాడు.. ఎంత దూరమో తెలుసా? 418 కిలోమీటర్లు!! వినడానికి నమ్మదగ్గ విషయంలా లేకున్నా.. ఇది నిజమేనట. ఇటలీ పోలీసులే చెప్పారు. గిమర్రా పట్టణంలో లాక్డౌన్ కర్ఫ్యూను ఉల్లంఘించి.. ఓ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడనే సమాచారం రావడంతో ఓ పోలీసు పెట్రోల్ కార్ అతనిని అడ్డగించింది.. ఆరా తీస్తే.. మొత్తం విషయం చెప్పాడు.. పైగా... ఇతను తప్పిపోయినట్లు భార్య ఇచి్చన ఫిర్యాదు కూడా ఉండటంతో పోలీసులు అతనిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.. ‘నా భార్యపై కోపంతో అలా నడుస్తూ వెళ్లిపోయాను.. వారం రోజులుగా నడుస్తూనే ఉన్నాను. దారిలో కొందరు దయతో ఇచ్చిన ఆహారం, నీరు తాగి.. ఇన్ని రోజులు ఉన్నా.. నేను బాగానే ఉన్నా.. కాకపోతే.. కొంచెం ఆలసిపోయా అంతే’ అని కోమోకు చెందిన ఈ 48 ఏళ్ల వ్యక్తి చెప్పాడు. మొత్తం విషయం విని.. నోరెళ్లబెట్టిన ఇటలీ పోలీసులు.. మళ్లీ ఎక్కడికి వెళ్లిపోతాడో అన్న భయంతో ఇతని భార్య వచ్చేంతవరకూ జాగ్రత్తగా చూసుకుని.. ఆమె రాగానే దగ్గరుండి అప్పగించారట.. ఇంతకీ ఈ మొత్తం స్టోరీలో నీతి ఏమిటి? మీరు విజు్ఞలు.. గ్రహించే ఉంటారు.. మేం మళ్లీ చెప్పాలా ఏమిటి?? – సాక్షి సెంట్రల్ డెస్క్