woman murder
-
Hyderabad: యువతి దారుణ హత్య.. చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్టు ..
మేడ్చల్‌రూరల్: ఓఆర్ఆర్ కల్వర్టు కింద గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి మునీరాబాద్ గ్రామ శివార్లలో చోటుచేసుకుంది. నిందితులు యువతి తలపై బండరాయితో మోది.. హత్య చేసి.. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆనవాళ్లున్నాయి. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మునీరాబాద్ పరిధిలో ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులోని ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో పని చేసే ఓ యువకుడు శుక్రవారం ఉదయం కల్వర్టులో నుంచి ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి వెళ్తుండగా ఓ యువతి మృతదేహం కనిపించింది. భయాందోళనకు గురైన యువకుడు ట్రాన్స్‌పోర్టు యజమానికి విషయం చెప్పగా.. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. 25 ఏళ్ల వయసున్న వివాహిత తలపై బండరాయితో బాది హత్య చేసి.. ఆపై పెట్రోల్ పోసి నిందితులు నిప్పంటించిన ఆనవాళ్లను కనుగొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. తెలిసిన వ్యక్తుల పనేనా? ఓఆర్ఆర్ కల్వర్టు కింద యువతి దారుణ హత్యకు గురైన యువతి పడి ఉన్న తీరును పరిశీలించిన పోలీసులు.. సదరు యువతి తనకు తెలిసిన వ్యక్తి లేదా వ్యక్తులతోనే ఇక్కడికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. యువతిని ఏకాంతంగా కలిసిన అనంతరం విభేదాల కారణంగా పక్కనే ఉన్న బండరాయితో బాది హత్య చేశారా? లేదా పథకం ప్రకారమే ఇక్కడికి తీసుకువచ్చి దారుణానికి ఒడిగట్టారా? లేదంటే యువతి మృతదేహాన్ని తీసుకు వచ్చి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు బండరాయితో బాది.. పెట్రోల్ పోసి నిప్పు అంటించి ఉంటారా? నిందితుడు ఒక్కరా లేక ఇద్దరు.. ముగ్గురు ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019 దిశ కేసు తరహాలో రోడ్డు పక్కన యువతి దారుణ హత్యకు గురి కావడం పోలీసులకు సవాల్‌గా మారింది. మృతురాలి చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్టు .. హత్యకు గురైన యువతి చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్లు ఉన్నాయి. కుడి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో.. రోహిత్ అనే పేరు ఇంగ్లిష్‌లో.. ఎడమ చేతిపై నరేంద్ర అనే పేరు ఇంగ్లిష్ లో పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 25 ఏళ్ల వయసున్న యువతికి కాళ్ల వేళ్లకు ఉన్న మెట్టెల ఆధారంగా వివాహితగా గుర్తించారు. ఇతర పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులు, ఆయా కేసుల్లో చేతిపై పచ్చబొట్లు ఉన్న వివరాల కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మునీరాబాద్‌లో దారుణం.. మహిళ దారుణ హత్య? -
విషాదం నింపిన కోడిగుడ్డు వివాదం
జగిత్యాలరూరల్: కోడిగుట్టు వివాదం విషాదం నింపింది. ఈ గొడవలో కొడవలి వేటుకు గురైన మహిళ తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన మేడిపల్లి సురేశ్–రమ(40)దంపతులకు కొడుకు రిషివర్దన్, కుమార్తె వాణి ఉన్నారు. సురేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. వీరి కుమార్తె వాణిని ఇదే గ్రామానికి చెందిన బోగ ప్రకాశ్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సురేశ్, రమ దంపతులు నిరాకరించారు. కక్ష పెంచుకున్న ప్రకాశ్ సోమవారం జరిగిన హోలీ వేడుకల్లో రమ ఇంట్లోకి కోడిగుడ్డు విసిరాడు. దీంతో రిషివర్దన్ తమ ఇంట్లోకి కోడిగుడ్డు ఎందుకు విసిరావని ప్రకాశ్‌ను నిలదీయగా రిషివర్దన్‌పై దాడిచేశాడు. స్థానికంగా ఉన్న వారు రిషివర్దన్ తల్లి రమకు సమాచారం అందించడంతో అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రకాశ్ కొడవలితో రమ మెడపై దాడిచేశాడు. గొంతుకు తీవ్రగాయాలు కావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి కొడుకు రిషివర్దన్ ఫిర్యాదు మేరకు ప్రకాశ్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐఆరీఫ్ అలీఖాన్, రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. గ్రామంలో విషాదం తిప్పన్నపేట గ్రామంలో మేడిశెట్టి రమ హోలీ సంబరాల్లో కోడిగుడ్డు వివాదంలో హత్యకు గురికాగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అందరు మహిళలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న రమ హత్యకు గురికావడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. దుబాయ్‌లో ఉన్న ఆమెభర్త సురేశ్ మంగళవారం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. -
కాకినాడలో దారుణం: మహిళా చిరు వ్యాపారి హత్య
సాక్షి, కాకినాడ: తుని మండలం ఎర్రకోనేరు వద్ద దారుణం జరిగింది. ఓ మహిళా చిరు వ్యాపారిని నగదు కావాలంటూ బెదిరించి.. కత్తులతో దాడి చేశారు ఇద్దరు దుండగులు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే కన్నుమూసింది. తొలుత.. ఆ దారి వెంట వెళ్తున్న ఓ ఆటోను ఆపి డ్రైవర్‌ను కత్తితో దాడి చేశారు ఇద్దరు దుండగులు. దాడి అనంతరం అతని ఆటో తీసుకుని పరారయ్యారు. ఈ క్రమంలో.. కొద్ది దూరంలో చిన్న కొట్టు నడిపించుకుంటున్న మహిళను గమనించారు. ఆమె దగ్గరకు వెళ్లి కత్తి చూపించి నగదు కావాలంటూ బెదిరించారు. ఆమె భయంతో కేకలు వేయగా.. కత్తితో దాడి చేసి పరారయ్యారు. గాయపడిన మహిళను స్థానికులు తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతి చెందింది. గాయపడిన ఆటో డ్రైవర్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. క్లూస్ టీం ఘటనా స్థలి నుంచి వివరాలు సేకరించింది. మృతి చెందిన మహిళ పేరు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: దిశ పోలీసుల ఎంట్రీతో నర్సింగ్ విద్యార్థినులు సేఫ్ -
వివాహిత హత్యపై ‘ఈనాడు’ తప్పుడు కథనం.. అసలేం జరిగిందంటే..?
సాక్షి, కనిగిరి రూరల్ : ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెల్లపాడుకు చెందిన వివాహిత కోటా రాధ (35) బుధవారం రాత్రి హత్యకు గురైంది. ఈ కేసులో మృతురాలి స్నేహితుడు కేతిరెడ్డి కాశయ్య అలియాస్ కా శీరెడ్డి కీలక నిందితుడిగా పోలీసులు అనుమాని స్తున్నారు. ఆర్థికపరమైన అంశాలే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మృతురాలి తల్లిదండ్రులు కూడా కాశయ్యపైనే ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. రాధ, కాశయ్యలు స్నేహితులు. ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జిల్లెల్లపాడుకు చెందిన కె. రాధకు, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన మోహన్‌రెడ్డితో వివాహమైంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మోహన్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి, రాధ గృహిణి. అప్పటికే హైదరాబాద్‌లోనే నివాసముంటున్న కాశయ్య తాను సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నానని, దానికి నగదు కావాలంటూ వీరి వద్ద నుంచి సుమారు రూ.51 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. కంపెనీలో నష్టంరావడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. అప్పుగా తీసుకున్న నగదు వడ్డీతో కలిపి సుమారు రూ.80 లక్షలు అయింది. అయితే, రెండేళ్ల నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో తరచూ రాధ, మోహన్‌రెడ్డి ఒత్తిడి చేస్తుండటంవల్లే రాధను కాశయ్య హత్యచేశాడనే ప్రచారం సాగుతోంది. అసలేం జరిగిందంటే.. ఈనెల 11న జిల్లెలపాడులోని చౌడేశ్వరమ్మ తిరు నాళ్లకు రాధ కుటుంబీకులు హైదరాబాద్ నుంచి పుట్టింటికి వచ్చారు. అది తెలుసుకున్న కాశయ్య.. తాను ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నానని, తండ్రికి, భర్తకు ఎవరికీ చెప్పకుండా కనిగిరికి వస్తే రూ.2 లక్షలు చెల్లిస్తానని ఐదురోజుల క్రితం మెసేజ్ పెట్టాడు. అయితే, రాధ వెళ్లలేదు. తిరిగి బుధవారం మరో మెసేజ్ పెట్టాడు. దీంతో రాధ అదేరోజు తన చిన్న కుమారుడిని తీసుకుని తండ్రికి చెప్పకుండా, ఇంట్లో అమ్మకు చెప్పి కనిగిరి వెళ్లింది. అక్కడ చిన్నాన్న ఇంట్లో పిల్లవాడ్ని వదిలిపెట్టింది. తర్వాత బాబాయ్‌తో వచ్చి పిల్లవాడికి దుస్తులు షాపింగ్ చేసింది. సా.6.47 గంటల సమయంలో పామూరు బస్టాండ్‌లో గల సీసీ ఫుటేజీల్లో కనిపించింది. రా.8.30 గంటల నుంచి రాధ ఫోన్ పనిచేయలేదు. నాగిరెడ్డి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి అన్నిచోట్ల వెతికారు. ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 12.50 గంటలకు ఫోన్ లొకేషన్ కనిపెట్టారు. అది జిల్లెల్లపాడు వద్ద కన్పించడంతో అక్కడికి వెళ్లి చూడగా రాధ విగతజీవిగా పడి ఉంది. చదవండి: సరదాగా తిరిగొద్దామనుకుంటే.. కబళించిన మృత్యువు రాధను ఒక చోటికి తీసుకెళ్లి హత్యచేసి ఆ తర్వాత మరో ప్రదేశానికి తీసుకెళ్లి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాధను హంతకులు కారులోకి ఎక్కించుకుని మత్తు మందు ఇచ్చి ఎవరూ లేని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి, తలపై బలంగా కొట్టి హత్యచేసి ఉంటారని ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెను జిల్లెల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద పడేసి దాన్ని రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనాడు కథనం అవాస్తం : డీఎస్పీ ఈ హత్యకు సంబంధించి ఈనాడు కథనం పూర్తిగా అవాస్తమని కనిగిరి డీఎస్పీ ఆర్ రామరాజు అన్నారు. పోలీసులు జాప్యం చేశారని, సకాలంలో స్పందించలేదని రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో అత్యాచారం జరిగినట్లు వెల్లడికాలేదన్నారు. మృతురాలి తల్లిదండ్రులు కాశయ్యపై ఫిర్యాదు చేశారని, ఆ కోణంలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. -
అస్సాంలో అమానుషం.. క్షుద్రపూజల నెపంతో.. అందరూ చూస్తుండగా..
గువాహటి/మోరిగావ్: అస్సాంలో క్షుద్రపూజలతో మహిళను హత్యచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గ్రామస్థులు సజీవ దహనంచేశారు. నాగోవ్ జిల్లాలోని సమగురి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం సరస్సులో విగతజీవిగా పడిఉన్న 22 ఏళ్ల మహిళను 35 ఏళ్ల రంజిత్ బొర్డోలోయ్ హతమార్చాడని బోర్లాలుంగో, బర్హామ్‌పూర్ బముని ప్రాంతంలోని గ్రామసభలో ఒక బహిరంగ విచారణ చేపట్టారు. ఆమెను రంజితే హతమార్చాడని తీర్మానించి పట్టపగలే అందరూ చూస్తుండగా సజీవదహనం చేశారు. తర్వాత మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా గ్రామంలోని పురుషులంతా పారిపోయారు. మృతదేహాన్ని పోలీసులు తవ్వి తీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. సజీవదహనం కేసులో ముగ్గురు మహిళలుసహా ఐదుగురిని అరెస్ట్‌చేసినట్లు జిల్లా ఎస్పీ లీనా డోలే చెప్పారు. -
ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి
పెనుబల్లి: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని కుప్పెనకుంట్లకి చెందిన కావటి తేజస్విని (20), సత్తుపల్లికి చెందిన బొల్లెద్దు నితిన్ సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా (ఈసీఈ) చదువుతూ ప్రేమలో పడ్డారు. తేజస్విని ఫైనలియర్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఇంటి వద్దే ఉంటూ చదువుకుంటోంది. నితిన్ ఖమ్మంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. తేజస్విని వారి బంధువుల అబ్బాయితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఫోన్లో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో నితిన్ కుప్పెనకుంట్లకు ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్లాడు. మాట్లాడేందుకు బయటకు రావాలని తేజస్వినికి ఫోన్లో మెసేజ్ పంపించాడు. దీంతో ఆమె అతడి బైక్‌పై వెళ్లింది. కుక్కలగుట్ట వద్దకు చేరుకున్న ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంపై గొడవ జరిగింది. నితిన్ తన వద్ద ఉన్న కర్చీఫ్‌ను తేజస్విని మెడకు బిగించి హత్య చేశాడు. ఆమెను పెట్రోల్ పోసి కాల్చి వేయాలని భావించాడు. అయితే, సంఘటనా స్థలం రాష్ట్రీయ రహదారికి కేవలం 50 మీటర్ల దూరంలో ఉండటం.. లారీలు, బస్సులు తిరుగుతుండటంతో భయపడి తేజస్విని మృతదేహాన్ని అక్కడే వదిలి ఖమ్మం వెళ్లిపోయాడు. కాగా.. తమ కూతురు కనిపించడం లేదని తేజస్విని తండ్రి సత్యనారాయణ వీఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నితిన్‌ను మంగళవారం ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు. -
మూగశిక్ష
చేయని నేరానికి ‘మూగ’జీవాలు శిక్ష అనుభవిస్తూ, తిండిలేక కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వైనమిది. నెల రోజులుగా మూగజీవాలు మేత, నీళ్లు లేక కృశిస్తూ ప్రాణాలు పోయే స్థితికి చేరుకుంటున్నాయి. తల్లి పాలు లేకున్నా తన పాలిచ్చి వారికి ప్రాణదానం చేసే గోవులు ఇప్పుడు తమకు మేత భిక్ష పెట్టేవారి కోసం చావు చూపులతో దీనంగా చూస్తున్నాయి. ఒక మహిళ హత్య ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల పెను విషాదమిది. ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లో వెళ్దాం రండి. చిత్తూరు, పుత్తూరు రూరల్ : మండలంలోని వేపగుంట క్రాస్, ఎన్టీఆర్ కాలనీలో గత నెల 3న దేవకి అనే మహిళ హత్యకు గురవడం విదితమే. పశువుల కొట్టం స్థలంపై ఉన్న వివాదమే హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన నిందితులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. తదనంతరం హతురాలి కుటుంబ సభ్యులు నిందితుల నివాసం వద్దకు వెళ్లి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వారు భీతిల్లారు. తమకేమైనా ముప్పు తప్పదేమోననే భయంతో వారు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మకాం మార్చారు. అయితే వారు పెంచుకుంటున్న సుమారు 40 ఆవులు, లేగ దూడలను అక్కడే వదిలి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి వాటి ఆలనాపాలనా పట్టించుకునే దిక్కు లేక, వాటికి మేత పెట్టేవారు లేకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికి పది రోజులు దాటింది. హత్యతోను, తగాదాలతోను ఏ సంబంధం లేకపోయినా మేత కరువై మూగ శిక్ష అనుభవిస్తున్నాయి. పుష్ఠిగా ఉన్న కొన్ని పశువులకు డొక్కలెగరేస్తున్నాయి. చర్మానికి అంటుకుపోయినట్లు ఎముకలు కనిపిస్తున్నాయి. ఎవరైనా అటు వెళ్లితే..దీనంగా చూస్తూ అంబా..అంబా! అని మేత కోసం అంగలార్చుతున్నాయి. మనసున్న మారాజులు రాకపోతారా? తమకింత గడ్డి పెట్టి ప్రాణాలు రక్షించపోతారా? అని దిక్కులు చూస్తున్నాయి. లేగదూడలైతే నిలబడే శక్తి లేక చతికిలపడిన స్థితిలో ఉండటం చూస్తుంటే మనసు ద్రవించకమానదు. వాటి దీనావస్థను చూసిన సమీపంలోని కొందరు అప్పుడప్పుడూ కొంత మేత వేస్తున్నా అవి వాటికేమాత్రం సరిపోవడం లేదు. బహుశా అడపా దడపా వేసే కొద్దిపాటి మేత వలనే కళ్లల్లో ప్రాణం పెట్టుకుని మనగలుగుతున్నాయోమే అనిపించకమానదు. పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ మూగజీవాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘దృశ్యం’ సినిమా చూపించారు!
ఇండోర్: సినిమాల ప్రభావం జనంపై ఉంటుందా అన్న ప్రశ్నకు ఇదొక ఉదాహరణ. దృశ్యం సినిమాను రియల్ లైఫ్‌లో దించేశారు. ట్వింకిల్ దగ్రే (22) అనే మహిళ రెండేళ్ల కింద కనిపించడం లేదని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కేసు నమోదైంది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు ఇటీవల గుర్తించారు. ఈ కేసులో నిందితులు బీజేపీ మాజీ కార్పొరేటర్ జగదీశ్ కరొటియా (65), అతని ముగ్గురు కుమారులు అజయ్(38), విజయ్ (36), వినయ్ (31)తో పాటు వీరి సహాయకుడు నీలేశ్ కశ్యప్(28)ని అరెస్టు చేసినట్లు ఇండోర్ డీఐజీ హరినారాయణచారి మిశ్రా వెల్లడించారు. దృశ్యం సినిమా ప్రేరణతో వారు ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. వివాహేతర సంబంధమే: కరొటియాకు ట్వింకిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె అతనితోనే ఉంటానని పట్టుబట్టడంతో కరొటియా ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆమె అడ్డు తప్పించాలని భావించిన కరొటియా..తన ముగ్గురు కొడుకులతో కలసి హత్యకు పథకం వేశాడు. దారి మళ్లించారిలా.. ► ఐదుగురు కలసి 2016 అక్టోబర్ 16న ట్వింకిల్ గొంతు నులిమి చంపి..కరొటియా స్థలంలోనే మృతదేహాన్ని కాల్చేశారు. ► ట్వింకిల్‌ను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని నమ్మించడానికి హత్యకు ముందురోజు నిందితుడు అజయ్ ట్వింకిల్ మొబైల్ తీసుకుని ‘నా తల్లిదండ్రుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను కాపాడు’అంటూ వాట్సప్ నుంచి తన తండ్రికి సందేశాలు పంపించుకున్నాడు. ► హత్య చేసిన రోజే ఓ కుక్కను చంపి ఆమెను కాల్చిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో పూడ్చిపెట్టారు. ► అదే రోజు ట్వింకిల్ మొబైల్ లొకేషన్ మార్చి బాదన్వర్ సమీపంలో పూడ్చిపెట్టారు. ► అనంతరం 4 నెలలకు తన భూమిలో ఎవర్నో చంపి పూడ్చి పెట్టారని, కొలతలను బట్టి చూస్తుంటే అది ట్వింకిల్ మృతదేహం లాగే ఉందని స్థానికంగా వదంతులు సృష్టించి చర్చనీయంశం చేశాడు. అనంతరం 2 నెలలకు ఈ విషయాన్ని తన సహాయకుడి ద్వారా పోలీసులకు చేరవేశాడు. ► అక్కడ తవ్వి చూసిన పోలీసులకు దృశ్యం సినిమా మాదిరి కుక్క కళేబరం బయటపడింది. ఇది దర్యాప్తును పక్కదారి పట్టించింది. ► కరొటియా సూచనల మేరకు అంతకు ముందే ట్వింకిల్ తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. ఇది ఆమె తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసుల్ని దారి మళ్లించింది. సాక్షులూ..ఆధారాలతో.. కొన్నాళ్లకు మృతదేహాన్ని కాల్చిన ప్రదేశంలో ట్వింకిల్‌కు సంబంధించిన ఒక జత మెట్టెలు, ఓ బ్రాస్లెట్, అస్థికలు, ఆమెను చంపడానికి ఉపయోగించిన తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరొటియాపై అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 16న కార్లో ఓ మృతదేహం తెచ్చారని, దాని గురించి అడిగితే కార్పొరేటర్ కుక్క చనిపోయిందని, దాన్ని పూడ్చిపెట్డడానికి తీసుకెళ్తున్నట్లు కరొటియా సహాయకుడు సూర్యవంశీ ద్వారా పోలీసులు రాబట్టారు. అంతకు ముందు రోజు ట్వింకిల్ ఆ ఇంటికి వచ్చినట్లు కూడా అతను చెప్పాడు. చనిపోయిన కుక్కకోసం తమను 5 అడుగుల గొయ్యి తవ్వమన్నారని ఐఎంసీ కార్మికులు పోలీసులకు చెప్పడంతో వారి అనుమానం నిజమైంది. బయటపడింది ఇలా.. ఈ కేసుకోసం ఇండోర్‌లోనే తొలిసారి నిందితునికి బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్ సిగ్నేచర్ (బీఈఓఎస్) పద్ధతిలో దర్యాప్తు చేశారు. గుజరాత్ లాబొరేటరీలో కరొటియా, అతని ఇద్దరి కుమారులకు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించారు. న్యూరో సైకలాజికల్ టెక్నిక్ వల్ల దోషులు దొరికిపోవడంతో కథ పూర్తయింది. -
పొదల్లో మహిళ మృతదేహం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: హత్యకు గురైన ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం కనుగొన్నారు. మండలంలోని గుణ్ణంపల్లి శివారులో పోలవరం కాలువ వద్ద పొదల్లో ఈ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించారు. సుమారు 30 సంవత్సరాలు వయసు కలిగిన మహిళ మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి, ఆమె హత్యకు గురై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆమె కాళ్లు తాళ్లతో కట్టేసి ఉండటం, అలాగే మెడ చుట్టూ ఉన్న గాయాలను పరిశీలించిన పోలీసులు ఇది కచ్చితంగా హత్యే అయి ఉంటుందని నిర్ధారించారు. ఆమెను వేరే ప్రాంతంలో మూడు నాలుగు రోజుల క్రితం హత్యచేసి, మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉబ్బిపోయి ఉన్న ఈ మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. భీమడోలు సీఐ బీఎన్.నాయక్ పర్యవేక్షణలో ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వివాహిత దారుణహత్య
ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికని ఇంటి నుంచి బయల్దేరిన వివాహిత దారుణహత్యకు గురైంది. చున్నీతో గొంతుకు బిగించి.. ఆనక బండరాయితో తలపై మోది అంతమొందించారు. కూడేరు మండలం శివరాంపేట సమీపాన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలతో సంఘటన స్థలం మిన్నంటింది. అనంతపురం, కూడేరు: బుక్కపట్నంకు చెందిన విజయలక్ష్మి(22)కి అనంతపురంలోని గణేష్ నగర్‌కు చెందిన బాలాజీతో మూడేళ్ల క్రితం వివాహమైంది. విజయలక్ష్మి అనంతపురంలోని విజయ పబ్లిక్ స్కూల్లో టీటీసీ కోర్సు చేస్తోంది. బాలాజీ ఏటీఎంలకు నగదును సరఫరా చేసే ఏజెన్సీలో పని చేస్తున్నాడు. ఈ నెల ఐదున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్కూల్లో ఫంక్షన్ ఉందని విజయలక్ష్మి ఏడు తులాల బంగారు ఆభరణాలు ధరించి ఉదయం పది గంటలకు ఇంటి నుంచి బయల్దేరింది. 11 గంటలకు కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే తాను స్కూల్ వద్ద లేను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉన్నట్లు తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్ పని చేయకపోవడంతో ఆందోళనకు గురైన భర్త టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి.. కూడేరు మండలం శివరాంపేట వద్ద అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న గుట్టలోకి ఓ వ్యక్తి బహిర్భూమికని వెళ్లాడు. అక్కడ దుర్వాసన వస్తుండటంతో ఏమిటా అని చుట్టుపక్కల వెదికాడు. అక్కడ మహిళ తలపై బండరాయి వేసి ఉండడం గమనించి గ్రామస్తులకు తెలిపి.. పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్, సీఐ ప్రసాద్‌రావు, ఆత్మకూరు ఎస్ఐ సాగర్లు సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలం చేçరుకుని పరిశీలించారు. మెడకు చున్నీ బిగించి ఉండడం, ఒంటిపై బంగారు ఆభరణాలు లేకపోవడం, పరిసరాల్లో ఎలాంటి రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించకపోవడం చూస్తే ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మిన్నంటిన రోదనలు విజయలక్ష్మి మృతదేహాన్ని చూసి భర్త, తల్లిదండ్రు లు, అత్తమామలు బోరున విలపించారు. తన తల్లి ఇక లేదన్న విషయం తెలియని రెండు సంవత్సరాల కుమారుడు అమాయకంగా చూస్తుండిపోవడం అం దరినీ కలచివేసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన కూతురిని చంపి వేసి ఉండవచ్చని మృతురాలి తండ్రి చిన్నకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
హత్య చేసి.. దహనం
హిందూపురం అర్బన్: కర్టాటకలోని పోలేపల్లి సమీపంలో గుర్తు తెలియని 22 ఏళ్ల యువతి శవం లభ్యమైంది. ఈమెను హత్య చేసి గోనె సంచిలో ఇక్కడి తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చిచంపినట్లు కొడిగెనహళ్లి పోలీసులు కేసునమోదు చేశారు. కాగా బుధవారం మృతురాలి తల్లి అపర్ణ తన కుమారై 23వతేది నుంచి కనపించడం లేదని వన్ టౌన్‌పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టన సీఐ చిన్న గోవిందు పోలేపల్లి వద్ద లభ్యమైన శవం దీపికగా గుర్తించారు. అపర్ణ తన కుమారైను అన్న కొడుకు పాండు వినయ్‌తో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. పెళ్లెనా ఏడాదికే కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలతో విడిపోయారు. ఈ నేపథ్యంలో దీపిక మృతి చెందటంతో హత్య కేసుగా కర్ణాటక పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు కర్టాటక పోలీసులు హిందూపురానికి వచ్చి విచారణ చేశారు. -
ఎట్టకేలకు మహిళ మృతదేహం వెలికితీత
అనుమసముద్రంపేట: సంగం మండలంలోని కొరిమెర్ల సమీపంలో ఉన్న పాలడెయిరీ ఆవరణలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని మంగళవారం వెలికితీశారు. ఏఎస్‌పేట మండలం శ్రీకొలను గ్రామానికి చెందిన నంది చెంచుకృష్ణారెడ్డి తన ద్వితీయ భార్య పుష్పను పదిరోజుల క్రితం హత్య చేసి డెయిరీ ఆవరణలో పూడ్చిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. అయితే పోస్ట్‌మార్టం వెంటనే చేయకపోవడంతో స్థానికులు రెండుగంటలకు పైగా రహదారిపై ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సంగం తహసీల్దార్ షఫీమాలిక్, పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. కృష్ణారెడ్డి తన భార్య తప్పిపోయిందని ఈనెల 19వ తేదీ నుంచి గ్రామంలో పలువురికి చెప్పాడు. 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు మృతదేహాన్ని ప్లాస్టిక్ గోతంలో చుట్టి కొబ్బరిచెట్టు మొదట్లో పూడ్చి పెట్టి ప్రతినిత్యం నీళ్లు పట్టాడు. స్థానికుడి చొరవతో వెలుగులోకి.. మూరం శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తితో పుష్ప అదృశ్యమైందని చెంచు కృష్ణారెడ్డి చెప్పాడు. అప్పుడప్పుడు అతనితో ఈ విషయమై మాట్లాడాడు. దీంతో శ్రీనివాసులురెడ్డికి అనుమానం కలిగింది. రెండురోజుల క్రితం అతను విషయాన్ని బయటకు రాబట్టాలని కేరళ మాంత్రికుడు ఒకతను తప్పిపోయిన వ్యక్తుల గురించి చెబుతాడని, ఆయనతో మాట్లాడితే నీ భార్య ఆచూకీ తెలుస్తుందని కృష్ణారెడ్డితో చెప్పాడు. ఈ క్రమంలో కృష్ణారెడ్డి సరే అనడంతో మాంత్రికుడితో మాట్లాడినట్లుగా శ్రీనివాసులురెడ్డి నటించాడు. నీ భార్య మృతిచెందిందని మాంత్రికుడు చెబుతున్నాడని చెప్పగానే కృష్ణారెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అరగంట తర్వాత వచ్చి మాంత్రికుడికి చనిపోయిన వ్యక్తులను ఎక్కడ పూడ్చింది తెలుస్తుందా అని కృష్ణారెడ్డి అడిగాడు. దీంతో శ్రీనివాసులురెడ్డి మరోమారు మాంత్రికుడితో మాట్లాడుతున్నట్లుగా నటించి అతను గ్రామానికి వస్తున్నాడని చెప్పడంతో కృష్ణారెడ్డి అసలు విషయం బయటపెట్టేశాడు. పుష్పను తానే చంపానని, మృతదేహాన్ని నెల్లూరు పెన్నానదిలో పడవేశానని, ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని ప్రాధేయపడ్డాడు. ఈ విషయాన్ని పూర్తిగా నమ్మని శ్రీనివాసులురెడ్డి మాంత్రికుడి ఆదేశాల మేరకు చనిపోయిన మహిళ దెయ్యమై పట్టుకుంటుందని, దీనికి విరుగుడిగా మృతదేహం పూడ్చినచోట నిమ్మకాయలు పెట్టి కర్పూరం వెలిగిస్తే ఆ ప్రమాదం తప్పుతుందని నిందితుడితో చెప్పాడు. దీంతో అతను శ్రీనివాసులురెడ్డిని వెంట తీసుకెళ్లి తోట బయట అతడిని పెట్టి కర్పూరం వెలిగించేందుకు లోపలకు వెళ్లాడు. ఈలోగా శ్రీనివాసులురెడ్డిని గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేయడంతో ఒక్కసారిగా అందరూ ఘటనా స్థలానికి చేరుకుని వెళ్లే క్రమంలో నిందితుడు ఎదురుపడగా గ్రామస్తులు అతడికి దేహశుద్ధి చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అయితే డాక్టర్లు అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. అయితే గ్రామస్తులు ఆందోళన చేస్తుం డటంతో సాయంత్రం నెల్లూరు నుంచి మహిళా డాక్టర్‌ను పిలిపించి సంగం తహసీల్దార్ షఫీమాలిక్ పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ సమయంలో గొడవలు జరగకుండా ఆత్మకూరు ఎస్సై నరేష్‌యాదవ్, సంగం ఎస్సై నాగార్జున, బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై ప్రసాద్‌రెడ్డి, ఏఎస్‌పేట ఏఎస్సై వెంకటసాయిలు బందోబస్తు నిర్వహించారు. గ్రామంలో విషాదం శ్రీకొలను గ్రామానికి చెందిన పుష్ప భర్త, బంధువుల చేతిలో కిరాతకంగా చంపబడి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుష్ప కుమారుడు చంద్రశేఖర్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. -
కిడ్నాప్ చేసి చంపేశారు
వెంకటాచలం: రొయ్యలగుంట వద్ద వంటమనిషిగా ఉన్న మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి చంపిన విషయం బుధవారం వెలుగు చూసింది. పోలీసులు, మృతురాలి బంధువుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిల్లకూరు మండలం మోమిడి గ్రామానికి చెందిన దారా రమణమ్మ (40) భర్త వల్లయ్య చనిపోయాడు. కుటుంబ భారం ఆమెపై పడింది. దీంతో కొన్నేళ్లుగా మండలంలోని పూడిపర్తిలో నెల్లూరు నగరానికి చెందిన కోటారెడ్డి రొయ్యలగుంటల వద్ద వంటమనిషిగా చేరి రాత్రివేళల్లో కూడా అక్కడే ఉండేది. ఈ క్రమంలో ఈనెల 21వ తేదీన రాత్రి రమణమ్మ అదృశ్యమైంది. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌బైక్‌లపై తనను కొట్టి రమణమ్మను తీసుకెళ్లారని గుంటల వద్ద వాచ్‌మన్‌గా ఉన్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ధనుంజయ చెప్పాడు. మంగళవారం ఈ విషయాన్ని యజమాని కోటారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై తన్నీరు నాగరాజు చుట్టుపక్కల గ్రామాల్లో, అడవుల్లో గాలించారు. కండలేరు క్రిక్లో తేలిన శవం పూడిపర్తి రొయ్యలగుంటలకు ఆనుకుని ఉన్న కండలేరు క్రిక్ కాలువలో శవం ఉందనే విషయాన్ని బుధవారం జాలర్లు గుర్తించారు. ఈ విషయాన్ని పూడిపర్తి గ్రామస్తులకు, పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రమణమ్మ బంధువులు పడవలో క్రిక్ వద్దకు చేరుకున్నారు. శవాన్ని గోనెసంచిలో కట్టి వేసిఉండటంతో పడవలో వేసుకుని బయటకు తీసుకువచ్చారు. తర్వాత తొలగించి చూడగా మృతదేహం రమణమ్మదేనని ఆమె కుమారుడు జైపాల్, బంధువులు గుర్తించారు. శరీరంపై ఉన్న రక్తగాయాలను బట్టి ఆమెను తీవ్రంగా కొట్టి చంపేసి కండలేరు క్రిక్లో పడేశారని పోలీసులు భావిస్తున్నారు. అతడిపైనే అనుమానాలు వాచ్‌మన్ ధనుంజయ ఈ ఘాతకానికి పాల్పడి ఉంటాడన్ని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రమణమ్మకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఇతరులు వచ్చి చంపాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. నిత్యం గుంటల వద్దనే ఉండే ధనుంజయ మరో వ్యక్తి సహాయంతో కొట్టి చంపి కట్టుకథలు అల్లుతున్నాడని చెబుతున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సై తన్నీరు నాగరాజులు పూడిపర్తి వెళ్లి పరిశీలించారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు. -
కాకినాడ నడిబొడ్డున మహిళ హత్య
కాకినాడ రూరల్: కాకినాడ బ్యాంక్‌పేటలో ఓ మహిళ హత్యకు గురైంది. పేటలో నివాసం ఉంటున్న పెంకే విజయలక్ష్మి అలియాస్ జయమ్మ (54) గురువారం తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. ఈమెను ముందు పీక నొక్కి, అనంతరం ఇనుప రాడ్డుతో తల పగలగొట్టి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన జయమ్మకు భర్త చనిపోయి ఏడేళ్లయ్యింది. ఏడాదిన్నర క్రితం మండపేటకు చెందిన కట్టా వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కొద్ది రోజుల పాటు సహజీవనం చేసిందని, అనంతరం ఏడాది క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే హత్యకు కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదని చెబుతున్నారు. జయమ్మ ఇంటికి, ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్లింటికి వెళ్లి రావడానికి కేవలం మూడు అడుగుల సందు మాత్రమే ఉంది. వెళ్లిన మార్గం గుండానే రాకపోకలు సాగించాలి. జయమ్మకు రెండు అంతస్తుల డాబా ఇల్లు ఉండగా ఓ పోర్షన్లో ఆమెతో పాటు ఆమె రెండో భర్త కట్టా వెంకటేశ్వర్లు ఉంటూ మిగిలిన పోర్షన్లు అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటితో పాటు జయమ్మకు మండపేటలో రెండు డాబా ఇళ్లు, ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉందని, వ్యవసాయ భూమిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని పోలీసులు చెబుతున్నారు. పదేళ్లుగా జయమ్మ మండపేట నుంచి వచ్చి బ్యాంకుపేటలో ఉన్న ఇంట్లో కొద్ది రోజులు ఉండి వెళుతుంటుందని స్థానికులు చెబుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఏడాదిగా రెండో భర్త వెంకటేశ్వర్లుతో వచ్చి ఇక్కడ ఉంటోందంటున్నారు. నెల రోజుల క్రితం బ్యాంకుపేట వచ్చి తన ఇంట్లోనే రెండో భర్త వెంకటేశ్వర్లుతో ఉంది. ఈమెకు పిల్లలు లేకపోవడంతో అక్క కుమార్తెను పెంచి పెళ్లి చేసిందని, రెండో భర్తగా చేసుకున్న వెంకటేశ్వర్లుకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల ఉన్నారని పోలీసులు వివరించారు. జయమ్మ హత్య జరగడానికి కారణాలు ఏమిటనేది తెలియలేదు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి హత్య జరిగిన ప్రాంతాన్ని తనిఖీ చేశారు. జయమ్మ హత్య జరిగిన మంచం కింద కట్టా వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో ఉండడం గమనించిన పోలీసులు, స్థానికులు అతడిని వైద్య నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. వెంకటేశ్వర్లుకు తగిలిన గాయం పెద్దదేమీ కాదని, అయితే ఇతడిని హత్య ఎలా జరిగిందని పోలీసులు ప్రశ్నిస్తే ఎవరో వచ్చి తమపై దాడి చేశారని, ఎవరనేది తాను చెప్పలేనని, మండపేటలో ఓ షావుకారుకి, జయమ్మకు ఆస్తి గొడవలు ఉన్నాయని, వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులకు వివరించినట్టు సమాచారం. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ హత్య చేశారా? లేక జయమ్మ ఆస్తులు ఎవరికైనా వెళ్లిపోతాయని ఆమెతో ఉంటున్న వ్యక్తులే ఈ హత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య గురువారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని క్రైమ్ డీఎస్పీ పల్లపురాజు, డీఎస్పీ రవివర్మ, త్రీటౌన్ సీఐ దుర్గారావు సందర్శించి సంఘటనకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించారు. జయమ్మ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ దుర్గారావు తెలిపారు. శవపం^నామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. -
మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హత్య
-
ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్య
ఇందిరానగర్ కాలనీని (అర్ధవీడు): మద్యం మత్తులో ఉన్న ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మండలంలోని ఇందిరానగర్ చెంచు కాలనీలో మంగళవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన మండ్లా వెంకటమ్మ (50)తో ఉచ్చులూరికట్ట నాగులు సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. తీవ్ర ఆగ్రహంతో వెంకటమ్మను నాగులు కర్రతో బలంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు పరారాయ్యడు. వెంకటమ్మకు మొదటి భర్త మృతి చెందడంతో ఆరేళ్ల నుంచి నాగులుతో సహజీవనం చేస్తోంది. సోమవారం శ్రీరామనవమి పండగ సందర్భంగా కాలనీలో మద్యం తాగారు. అర్ధరాత్రి వరకూ ఇద్దరూ ఘర్షణ పడ్డాడు. ఆ తర్వాత ఆమె హత్యకు గురైంది. గిద్దలూరు సీఐ శ్రీరామ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
భార్యను చంపి..ఆమె ప్రేమికుడి ఇంట్లో పడేసాడు!
ముజఫర్‌నగర్ : భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న నెపంతో ఆమెను గొంతు నులుమి చంపాడో భర్త. ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని శామ్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శామ్లి జిల్లాలోని ఖేరా కుర్తాన గ్రామానికి చెందిన ఓ మహిళ... వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించి.. భర్త ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని...ఆమె ప్రేమికుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంట్లో పడేశాడు. కాగా ఈ హత్యకు మహిళ సోదరుడు కూడా సహకరించడం గమనార్హం. పోలీసులు... మృతురాలి భర్తను, సోదరుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. -
కొండాపూర్ గర్భిణి హత్య కేసులో నిందితుల గుర్తింపు
-
24 గంటల్లో ఐదు హత్యలు
-
ఆమె హత్య.. మిస్టరీని ఛేదించారు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన సంచలన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. వాయవ్య ఢిల్లీలోని రోహినీ ప్రాంతంలో బుధవారం హత్యకు గురైన మహిళ కేసులో ఆమె భర్తను అరెస్టు చేశారు. 34 ఏళ్ల ప్రియా మెహ్రాను ఆమె భర్త పంకజ్ మెహ్రా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూరితంగా భార్యను చంపి.. అది తనకు అప్పు ఇచ్చిన వ్యక్తి మీద నెట్టేందుకు బూటకపు దాడి జరిగినట్టు నమ్మించేందుకు పంకజ్ ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ప్రియా మెహ్రా వాహనంలో ఉండగానే ఆమెను పంకజ్ కాల్చిచంపాడు. ఆ సమయంలో వారి రెండేళ్ల కొడుకు ప్రియా ఒడిలో ఉన్నాడు. ఆ చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. ముగ్గురు-నలుగురు వ్యక్తులు కారులో వచ్చి తమ వాహనాన్ని అడ్డుకున్నారని, ఆ తర్వాత తన భార్యను కాల్చిచంపి పరారయ్యారని బూటకపు కథనాన్ని పంకజ్ పోలీసులకు చెప్పాడు. అయితే, సంఘటనాస్థలంలో రెండో వాహనం లేకపోవడం.. అతడు చెప్పిన ఆనవాళ్లు ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు అతడు చెప్పేది అనుమానించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో పంకజ్ నిజాన్ని ఒప్పుకున్నాడని, వ్యాపారంలో నష్టాలు రావడంతో రూ. 40 లక్షల వరకు అతను అప్పులు చేశాడని పోలీసులు తెలిపారు. పంకజ్‌కు మరో మహిళతో వివాహం అయిందని, ప్రియాతో అతను కలిసి ఉండటం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. 11 ఏళ్ల కిందట ప్రియా-పంకజ్‌కు పెళ్లయిందని, ఇటీవల తమకు పుట్టిన కొడుకు కారణంగా ఇద్దరూ మళ్లీ కలిసి ఉంటున్నారని ఆ వర్గాలు వివరించాయి. భార్య హత్యను అప్పు ఇచ్చిన వ్యక్తి మీద తోసేస్తే.. రూ. 40 లక్షలు తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదని అతడు భావించినట్టు తెలిపాయి. -
ప్రాణం తీసిన వడ్డీ వ్యాపారం
♦ నగల కోసం మహిళ హత్య ♦ పోలీసుల అదుపులో నిందితుడు చిత్తూరు అర్బన్ : అధిక వడ్డీలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. చిత్తూరు నగరంలోని తోటపాళ్యంలో వివాహిత మంగళవారం హత్యకు గురైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చిత్తూరుకు చెందిన రాజలక్ష్మి (44) నికంగా వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో నగరంలోని శంకరయ్యగుంటకు చెందిన జయకుమార్ అనే వ్యక్తితో రాజలక్ష్మికి పరిచయమైంది. వ్యాపార నిమిత్తం జయకుమార్ ఐదేళ్ల క్రితం రూ.2 లక్షలను రాజలక్ష్మి వద్ద అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు గాను తన ఇల్లు, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాడు. అప్పు సక్రమంగా చెల్లించకపోవడంతో రాజ్యలక్ష్మి చట్ట ప్రకారం జయకుమార్ ఇంటిని, ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. సోమవారం రాత్రి రాజలక్ష్మి ఇంటికి వెళ్లిన జయకుమార్ ‘అధిక వడ్డీకి ఇంటిని స్వాధీనం చేసుకున్నావ్.. కనీసం నా భార్య నగలైనా ఇచ్చేయ్’ అని ప్రాధేయపడ్డాడు. ఆమె ఇవ్వలేదు. భార్యతో కలిసి ఓ వివాహానికి వెళ్లాలని, బంగారు నగలు ఓ సారి ఇస్తే మళ్లీ ఇచ్చేస్తానని చెప్పినా ఆమె అంగీకరించలేదు. మంగళవారం ఉదయం అతను మళ్లీ ఆమె వద్దకు వెళ్లి రాజలక్ష్మితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న లారీ బోల్టులు తీసే రాడ్‌తో రాజలక్ష్మి తలపై కొట్టి చంపేశాడు. అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన జయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు, టూటౌన్ సీఐ వెంకటప్ప వేలిముద్రల సేకరణ విభాగపు సిబ్బంది పలు ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటి కోసం ఇల్లాలి హత్య
నిద్రలో ఉండగా బండరాయితో మోది చంపిన భర్త హత్యానంతరం పోలీసుల ఎదుట లొంగుబాటు ధర్మవరం అర్బన్: ఇంటిని తన పేరిట రాయలేదని ఇల్లాలని కడతేర్చిన భర్త ఉదంతమిది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ హత్యకు సంబంధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో నివాసం ఉంటున్న బలిజ ప్రసాద్, బలిజ వెంకటేశ్వరి (36) దంపతులు. బేల్దారి, గుజిరీ పనులు చేస్తూ జీవనం సాగించే ప్రసాద్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు భార్య పేరుమీద ఆమె పుట్టింటివాళ్లు రాసిచ్చారు. ఈ ఇంటిని తన పేరుమీద రాయాలని భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో వెంకటేశ్వరి శుక్రవారం పుట్టింట్లో వరలక్ష్మీవ్రతం చూసుకుని రాత్రి తిరిగి ఇంటికి వచ్చేసింది. పూటుగా మద్యం తాగి వచ్చిన ప్రసాద్ మరోసారి ఇంటి విషయమై ఒత్తిడి తేగా.. ఆమె అంగీకరించలేదు. శనివారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న వెంకటేశ్వరిని బండరాయితో తలపై మోది హత్య చేశాడు. అనంతరం భర్త ప్రసాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హతురాలి తల్లిదండ్రులు, తమ్ముడి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ వెంకటరమణ, జమేదార్ మునేనాయక్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వివాహిత దారుణ హత్య
శెట్టూరు (కళ్యాణదుర్గం) : భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైంది. మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శెట్టూరు మండలం బుడ్డయ్యదొడ్డిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హతురాలి తల్లిదండ్రులు గొల్ల బసమ్మ, వీరనాగప్ప, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుడ్డయ్యదొడ్డికి చెందిన గొల్ల లక్ష్మీదేవి (32)కి 14 ఏళ్ల కిందట కళ్యాణదుర్గం మండలం ముదిగల్లుకు చెందిన ధనుంజయతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. మూడేళ్ల కిందట వీరు బుడ్డయ్యదొడ్డికి వచ్చి వేరుగా కాపురం ఉంటున్నారు. సమీపంలోని కర్ణాటక ప్రాంతంలో గల ఒక డాబాలో ధనుంజయ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్ని రోజులుగా ఇతను మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బు ఇవ్వాలని భార్యతో తరచూ గొడవపడేవాడు. తాగొచ్చాక వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా డబ్బు విషయంలో గొడవపడ్డాడు. ఆమె డబ్బు ఇవ్వకపోవడంతో బయటకెళ్లిపోయి పూటుగా మద్యం తాగి వచ్చిన ధనుంజయ.. అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న భార్య లక్ష్మీదేవి తలపై బండరాయి వేసి పరారయ్యాడు. తల్లి అరుపులు విన్న కుమారుడు అజయ్ (12), కుమార్తె గాయత్రి (10) ఉలిక్కిపడి లేచారు. రక్తపుమడుగులో పడిఉన్న తల్లిని చూసి ఏడుస్తుండటంతో బంధువులు, ఇరుగుపొరుగువారు వచ్చి హుటాహుటిన కళ్యానదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే లక్ష్మీదేవి మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి వెళ్లిన అమ్మ తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్న పిల్లలు.. ఇక అమ్మ తిరిగిరాదని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. బుధవారం సాయంత్రం సీఐ శివప్రసాద్, ఎస్ఐ శ్రీకాంత్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బంధువులు, స్థానికులను విచారణ చేశారు. -
మహిళ దారుణ హత్య
కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన కురుబ రాజన్న భార్య అనసూయమ్మ(40)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి కథనం మేరకు.. అనసూయమ్మ మంగళవారం ఉదయమే ఇంటి నుంచి కాపరితో కలసి గొర్రెలను తోలుకొని పీఏబీఆర్ డ్యాం ప్రాంతానికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు భార్యను ఇంటికి పంపేందుకు రాజన్న వెళ్లగా ఆమె కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో అతను పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఆ తరువాత అదే ఏటి ప్రాంతంలో గాలించగా..ఆమె హత్యకు గురై ఉండగా కనుగొన్నారు. అయితే ఆమె మెడ, చెవిలోని బంగారు కమ్మలు, గొలుసు కనిపించకపోవడంతో నగల కోసమే చంపేసినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
యువతి హత్య
క్షణికావేశంలో తుపాకీతో కాల్చి చంపిన యువకుడు జయపురం: క్షణికావేశంలో ఓ యువకుడు తన మామ కుమార్తెను నాటు తుపాకీతో కాల్చి చంపాడు. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జయపురం సమితి భరిణిపుట్ గ్రామంలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నిర్మల బాగ్ వదిన చనిపోగా ఆమె మూడురోజుల కర్మకాండ ఆయన ఇంటిలో జరుగుతుండడడం కార్యక్రమంలో పాల్గొనేందుకు బంధువులు వచ్చారు. ఈ కార్యక్రమానికి నిర్మల బాగ్ మేనల్లుడు అజిత్ ఖొర(25)కూడా ఉమ్మిరి గ్రామం నుంచి వచ్చాడు. ఫంక్షన్ లో అందరూ మమేకమై ఉన్న సమయంలో అజిత్ ఖొర తన మామ కూతురు పింకిబాగ్(22)తో మాట్లాడాలని చెప్పి మేడపైకి తీసుకు వెళ్లాడు. నిందితుడిని చితకబాదిన బంధువులు మేడపై ఇద్దరు మాట్లాడుతున్న సమయంలో వారి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దాంతో కోపోద్రిక్తుడైన అజిత్ ఖొర తన వద్ద గల నాటు పిస్టల్‌తో ఆమెకు దగ్గరగా వెళ్లి మూడు రౌండ్లు కాల్చాడు. రెండు బుల్లెట్లు పింకి శరీరంలో దిగగా, మరొకటి ఆమె తలకు తగిలింది. తూటాలు తగలగానే అమె కింద పడిపోయింది. మేడపై పిస్టల్ పేలిన శబ్దం వినిపించగా కిందనున్న వారంతా ఏం జరిగిందా? అని మీదకు వెళ్తున్న సమయంలో నిందితుడు కిందకు పరుగు తీశాడు. మేడపైకి వచ్చిన వారు రక్తపుమడుగులో పడి ఉన్న పింకీబాగ్ను చూసి హాహాకారాలు చేయగా కిందకు పారిపోతున్న అర్జున్ ఖొరను కొంతమంది పట్టుకున్నారు. పింకిని పిస్టల్‌తో కాల్చిచంపాడని తెలుసుకుని చితకబాదారు. వెంటనే బమిణిగాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి దర్యాప్తు ప్రారంభించి నిందితుడు అజయ్ ఖొరను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలంలోనే మరణించిన పింకి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జయపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా చావుదెబ్బలు తిని గాయపడిన నిందితుడు అర్జున్ఖొరను ఆస్పత్రిలో చేర్చారు. ప్రేమ విఫలమే కారణమా? పింకి మరణానికి కారణమైన పిస్టల్, తూటాలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు ప్రధాన కారణం ప్రేమ విఫలమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పింకి బాగ్, అజిత్ ఖొరలు పరస్పరం ప్రేమించుకున్నారని అయితే వారి ఉభయ కుటుంబాలు అంగీకరించక పోవడం వల్ల అజిత్ కోపంతో ఈ హత్యకు పాల్పడి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పింకి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి ఆమె బంధువులకు అప్పగించారు. -
రేప్ చేసి.. ముక్కలుగా నరికి..
హరియాణాలో మరో నిర్భయ ఘటన సోనిపట్: యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ‘నిర్భయ’ను మించిన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ (23)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికివేశారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత 9వ తేదీన సోనిపట్‌లో మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. రోహ్తక్కు కారులో తరలించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు సోనిపట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 11వ తేదీన రోహ్తక్లో మృతదేహాన్ని గుర్తించామని, బాధిత మహిళ ముఖంపైన, పలుచోట్ల కుక్కలు కరిచినట్లు పేర్కొన్నారు. ‘ఆ మహిళపై తొలుత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఇటుకతో తీవ్రంగా కొట్టారు. ఆమె ముఖాన్ని బండరాయికేసి కొట్టారు. తలకు తీవ్రగాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది’ అని ఎస్సై అజయ్ మలిక్ వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు సుమీత్, వికాస్‌లను అరెస్టు చేసినట్లు మలిక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచిన అనంతరం ఇద్దరినీ రెండు రోజుల కస్టడీకి తరలించారు. బాధితురాలికి సుమిత్ పరిచయస్తుడేనని పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బాధిత మహిళను కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ‘హత్యాచార’ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోనిపట్‌లో మహిళను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పదించారు. దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. మరో మూడు నెలల్లో హరియాణ వాసుల డేటాబేస్ పూర్తవుతుందని వెల్లడించారు. -
మహిళపై అత్యాచారం, హత్య
► 70 సవర్ల నగలు చోరీ కేకేనగర్: మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసి ఇంట్లోని 70 సవర్ల నగలు, నగదు దోపిడీ చేసిన సంఘటన తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం, కుట్టుకానల్లూర్ సమీపంలో గల రామచంద్రపురం గ్రామానికి చెందిన శంకర్(45) అస్సాంలో సైనిక అధికారిగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య కాంతరూపి(40), కుమారుడు శక్తివేల్(16) ప్లస్‌వన్ చదువుతున్నాడు. తల్లి, కుమారుడు రామచంద్రాపురం గ్రామంలో నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం శక్తివేల్ ట్యూషన్‌కు వెళ్లి రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో తల్లి కోసం చూసిన అతనికి ఆమె వంట గదిలో రక్తపు మడుగులో మృతి చెంది కనిపించింది. దిగ్భ్రాంతి చెందిన శక్తివేల్ పెద్దగా రోదించాడు. అతని ఏడుపు విని చుట్టుపక్కల వారు వచ్చి అతడిని ఓదార్చారు. దీనిపై సమాచారం అందుకున్న కన్నమంగళం పోలీసులు, ఆరని డీఎస్పీ రెజీనా బేగం, ఇన్స్పెక్టర్ జయప్రకాష్ సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కాంతరూపి ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం గమనించిన అగంతకులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం జరిపి, బీరువాలో ఉన్న 70 సవర్ల నగలు, నగదును చోరి చేసినట్లు తెలిపారు. ఆధారాలు దొరక్కుండా దుండగులు ఇంటి చుట్టూ కారం చల్లి వెళ్లారు. వేలూరు నుంచి వేలిముద్ర నిపుణులను రప్పించి దుండగుల గుర్తులను సేకరించారు. కాంతరూపి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు మంగళాపురం, కల్పట్టు గ్రామాలకు చెందిన ఇద్దరిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో యువతి దారుణహత్య
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గతరాత్రి పోలీస్ స్టేషన్లోనే ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. ఓ భూవివాదం కేసుకు సంబంధించి ప్రత్యర్థులు ఆ యువతిని పోలీసులు, స్థానికుల కళ్ల ఎదుటే పాశవికంగా దాడి చేసి, హతమార్చారు. తను కాపాడాలంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు, అరణ్య రోదనే అయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళ దారుణ హత్య
పుట్లూరు : మండలంలోని బాలాపురం ఎస్సీ కాలనీలో లక్ష్మీదేవి(40) అనే మహిళ(దివ్యాంగురాలు) గురువారం దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికుల కథనం మేరు.. భర్త రంగనాయకులు ఎనిమిదేళ్ల కిందట అనారోగ్యంతో మరణించగా, అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో పాటు అత్తతో కలసి ఉంటోంది. కూలీ పనులకు వెళ్లి కుమారుడు దస్తగిరిని పాలిటెక్నిక్ చదివిస్తుండగా, కుమార్తె కుళ్లాయమ్మకు నెల రోజుల కిందట వివాహం కూడా చేసింది. గురువారం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా గాయపరచి సెల్‌ఫోన్ చార్జింగ్ వైరు, రైస్ కుక్కర్ వైర్లను గొంతుకు బిగించి దారుణంగా హత్య చేశారు. గమనించిన స్థానిక కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. తాడిపత్రి రూరల్ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్ఐ సురేశ్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుమారుడు దస్తగిరి ఫిర్యాదు మేకరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశానికి పోలీసులు జాగిలాన్ని రప్పించారు. అది లక్ష్మీదేవి ఇంటి నుంచి బాలాపురం బస్‌షెల్టర్ వద్దకు వెళ్లి ఆగిపోయింది. క్లూస్ టీం సహాయంతో హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషించారు. కాగా ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పి.చింతలపల్లికి చెందిన ఓ వ్యక్తి తరచూ ఎస్సీ కాలనీకి వచ్చి వెళ్లేవాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కాగా హత్య జరిగిన అనంతరం అతడు గ్రామంలో లేకపోవడంతో పాటు ఫోన్ పని చేయకపోవడంతో అనుమానాలకు బలం చేకూర్చుతోంది. -
గుర్తుతెలియని మహిళ హత్య
నలగాంపల్లె(బంగారుపాళెం): గుర్తుతెలియని మహిళను హత్య చేసి మండలంలో ని నలగాంపల్లె సమీపంలోని జాతీయ రహదారి పక్కన పడేసి వెళ్లి న సంఘటన కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నెట్టికంఠయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మహిళను ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని రహదారి పక్కనున్న నరసింహులు పొలం సమీపంలో పడేసి వెళ్లిపోయారని తెలిపారు. ఉరివేసి హత్య చేసినట్టు మెడ చుట్టూ గుర్తులు ఉన్నాయన్నారు. మృతురాలికి 30 ఏళ్లు ఉంటాయని, 5.50 అడుగుల ఎత్తు, ఎర్రగా ఉందన్నారు. ఎర్ర రంగుపై తెల్లచారలు గల నైటీ ధరించిందని తెలిపారు. మెడలో పసుపుదారం, అందులో తమిళ సంప్రదాయానికి చెందిన తాళిబొట్టు ఉందన్నారు. మృతురాలు గర్భిణిగా ఉన్నట్టు తెలుస్తోందన్నా రు. మృతురాలు తమిళనాడు, కర్ణాటకకు చెందినట్లుగా భావిస్తున్నామన్నారు. సం ఘటనా స్థలాన్ని గంగవరం సీఐ రవికుమార్, బంగారుపాళెం తహసీల్దార్ మురళి, ఎంపీడీవో దయానంద్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మహిళతో సహజీవనం.. ఆపై దారుణహత్య!
న్యూఢిల్లీ: తనతో కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. ఒడిషాలోని ఝరియావాడకు చెందిన బలరామ్(48) కొన్నేళ్లుగా ఢిల్లీలో ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. న్యూఢిల్లీ సమీపంలోని గర్హిలో గత 25 ఏళ్లుగా అనార్కలీ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈమె టీ షాపు నిర్వహిస్తోంది. వీరి పరిచయం వివాహేతర సంబంధాలకు దారితీయడంతో చెన్నైకి చెందిన అనార్కలి(43)తో బలరామ్ సహజీవనం చేస్తున్నాడు. అనార్కలీ ఉంటున్న అద్దె ఇంట్లోనే వీరు సహజీవనం చేశారు. మూడేళ్ల కిందట తన స్వగ్రామానికి వెళ్లిన బలరామ్ ఇటీవల ఢిల్లీకి వచ్చాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 2న సుత్తితో అనార్కలీ మెడ, తలపై విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి రెండు బ్యాగుల్లో సర్ది డ్రైనేజీలో పారవేశాడు. అనార్కలీ కనిపించడం లేదని స్థానికులు అడిగగా ఆమె తన స్వగ్రామానికి వెళ్లిందని చెప్పాడు. అయితే బలరామ్ పొంతన లేని విషయాలు చెబుతున్నాడని, అనార్కలీని హత్యచేసి ఉండొచ్చునని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు బలరామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. తాను ఢిల్లీలో లేని సమయంలో అనార్కలీ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందన్న కారణంగానే తాను ఆమెను హత్యచేశాడని విచారణలో చెప్పాడు. రెండు ఎయిర్ బ్యాగులో ఉన్న మృతదేహం భాగాలు అనార్కలీవేనని పోలీసులు గుర్తించారు. -
గొంతు కోసి వివాహిత దారుణ హత్య
కాజులూరు(తూర్పుగోదావరి): తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం తిప్పరాజుపాలెంలో ఓ వివాహిత దారుణహత్యకు గురైంది. గ్రామ శివారులోని పొలాల్లో ఉన్న కాల్వ ఒడ్డున మహిళను గొంతుకోసి చంపేసిన దుండగులు మృతదేహంపై గడ్డి వేసి నిప్పంటించారు. సగం కాలిన మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడకు తరలించారు. -
జీన్స్ వేసుకుందని భార్యను చంపేశాడు
పుణె: ఆధునికతకు అనుగుణంగా జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరించడమే ఆమె చేసిన నేరమైంది. సంప్రదాయ విరుద్ధంగా దుస్తులు వేసుకుందని ఆమెను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. పుణెలోని గుల్తెకేడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరిస్తున్న విషయమై భార్య పూజ(21)తో రంజీత్ నిషాద్ (24) గొడవ పడేవాడు. ఒక రోజు ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రంజీత్ పూజపై దాడి చేసి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి పరారయ్యాడు. గత శుక్రవారం ఇంటిలోని మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
గొంతు కోసి బంగారు నగల అపహరణ
వరంగల్ అర్బన్: బంగారు నగల కోసం ఇంట్లో ఉన్న ఓ గృహిణిని దుండగులు అమానుషంగా హత్య చేశారు. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటలో బుధవారం ఈ ఘటన జరిగింది. మాసూంఅలీ పాఠశాల వీధిలో ఇమ్మడి శ్యాంసుందర్-జ్ఞానేశ్వరీ (56) దంపతులు నివసిస్తున్నారు. శ్యాంసుందర్ ఉదయం 8 గంటలకు పల్లీ గింజల మిల్లు దగ్గరకు వెళ్లిపోయాడు. సాయంత్రం 4 గంటల సమయంలో వీరింట్లో పనిచేసే వాణి వచ్చి తలుపు తట్టగా... యాజమానురాలు జ్ఞానేశ్వరి తలుపు తీయలేదు. కిటీకీలోంచి చూడగా జ్ఞానేశ్వరి రక్తపు మడుగులో పడి ఉంది. విషయూన్ని గ్రౌండ్ ఫ్లోర్లో కిరాయిదారులకు చెప్పగా, వారు యాజమాని శ్యాంసుందర్‌కు ఫోన్ చేసి చెప్పారు. హూటాహుటిన శ్యాంసుందర్ ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే జ్ఞానేశ్వరి మతి చెందింది. పోలీసులు క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. దుండగుడు జ్ఞానేశ్వరి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రతిఘటించినట్టు సంఘటనా స్థలాన్నిబట్టి అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డొస్తోందని.. అంతమొందించాడు..!
హుజూర్నగర్: భర్తను కోల్పోయి తల్లిగారింటి వద్దే ఆశ్రయం పొందుతున్న మహిళతో పరిచయం పెం చుకున్నాడు.. అదికాస్త ప్రేమకు దారి తీయడం తో రెండున్నరేళ్లు కలిసి తిరిగారు..చివరకు తల్లిదండ్రు లు కుదిర్చిన యువతితో వివాహం చేసుకున్నా డు.. ఇది తెలిసి నా సంగతేంటని నిలదీసిన మహిళను దారుణంగా ఉరివేసి అంతమొందించాడు.. గరిడేపల్లి మండలం గారకుంటతండాలో ఈ నెల 20న వెలుగుచూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదిం చారు. ప్రియుడే ఈ ఘాతునికానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. శనివారం స్థా నిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో సీఐ సురేందర్‌రెడ్డి నిందితుడి వివరాలు, హత్యోదంతానికి గల కారణాలను వివరించారు. నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం గ్రామానికి చెందిన పిల్లుట్ల లక్ష్మికి 8 ఏళ్ల క్రితం త్రిపురారం మండలం బాబుసాయిపేటకు చెందిన ఉల్లెందుల నాగయ్యతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు జన్మించాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో నాగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో లక్ష్మి కు మారుడిని అత్తగారి ఇంటి వద్దే వదిలి తల్లిదండ్రుల స్వగ్రామమైన కందులవారిగూడెంలో ఉంటుంది. పరిచయం ప్రేమగా మారి.. లక్ష్మి మిర్యాలగూడలోని ఒక కళాశాలలో డిగ్రీ విద్యను కొనసాగిస్తూ సెలవు దినాలలో కూలికి వెళుతోంది. ఈ క్రమంలో నేరేడుచర్ల మండలం దిర్శించర్లకు చెందిన అవివాహితుడు షేక్ యాకూబ్‌తో పరిచయం ఏర్పడింది. సుమారు రెండున్నర సంవత్సరాల నుంచి కలిసి తిరిగారు. అయితే ఇటీవల యాకూబ్ తల్లిదండ్రులు కుదిర్చిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. బెదిరిస్తోందని.. యాకూబ్ మరో యువతిని వివాహం చేసుకుంటున్నప్పటి నుంచి లక్ష్మిని దూరంగా పెట్టాడు. ఇది జీర్ణించుకోలేని లక్ష్మి నా సంగతేంటని యాకూబ్‌ను నిలదీసింది. భార్యను వదిలి నాతో ఉండాలని.. లేకుంటూ నీ పేరు మీద ఉత్తరం రాసి చనిపోతానని బెదిరించసాగింది. అడ్డుతొలగించుకోవాలని.. తన జీవితానికి అడ్డుగా నిలిచిన లక్ష్మి అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలని యాకూబ్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 20వ తేదీన లక్ష్మికి ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి బైక్‌పై గారకుంటతండా సమీపంలో గల మామిడి చెట్టు వద్దకు చేరుకున్నారు. అక్కడే మద్యం సేవిస్తూ మాట్లాడుకున్నారు. ఆపై మామిడి చెట్టు ఎక్కి కూర్చున్నారు. కాసేపటికి కిందికి దిగేం దుకు వీలుగా ఉంటుందని లక్ష్మిచున్నీ చెట్టుకొమ్మకు కట్టాడు. అదే సమయంలో చున్నీ మరోవైపున ముడి వేసి లక్ష్మి మెడకు వేసి కిందకు తోసేసాడు. దీంతో ఊపిరి ఆడక లక్ష్మి చనిపోయింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లక్ష్మి ఫోన్‌కాల్స్ లిస్ట్ ఆధారంగా యాకూబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని సీఐ వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ తెలిపారు. సమావేశంలో గరిడేపల్లి ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అనుమానం పెనుభూతం!
విశాఖపట్నం: అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళ ప్రాణాలు తీసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం జి.మాడుగుల మండలం కుమ్మరిపూడిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఓ మహిళను గ్రామస్తులు కిడ్నాపర్ అని అనుమానించారు. అంతే ముందూ వెనుక చూడకుండా పలువురు గ్రామస్తులు ఏకమై ఆ మహిళను చంపి పాతిపెట్టారు. ఈ హత్య ఘటనలో 15 మంది గ్రామస్తులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ హత్య
భూపాలపల్లి (వరంగల్ జిల్లా) : రెండు కుటుంబాల మధ్య ఉన్న తగాదాలు ఒక మహిళ ప్రాణాలు తీశాయి. ఈ సంఘటన ఆదివారం వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... ఆజంనగర్ గ్రామానికి చెందిన గాదం గౌరయ్య, సమ్మక్క(45) భార్యాభర్తలు. కాగా సమ్మక్క కుటుంబానికి, ఆమె మరిది గాదం సతీష్ కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన గొడవ కారణంగా మరిది సతీష్.. సమ్మక్కపై దాడి చేసి ఆమెను హతమార్చాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సమ్మక్క భర్త 20 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లి చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
కల్లు తాగి, మహిళను చంపి.....
నల్గొండ: కొందరు తాగుబోతులు ఓ మహిళ వద్ద కల్లు తాగి, బంగారం కోసం ఆమెను హత్య చేశారు. దేవరకొండ మండలం తూర్పుపాలెంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కొందరు దుండగులు కల్లు అమ్మే మహిళ వద్దకు వచ్చి కల్లు తాగారు. ఆ తరువాత మెడలో బంగారు గొలుచు కోసం ఆమెను హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ మహిళ మృతదేహాన్ని బావిలో పడవేశారు. ఆ తరువాత దుండుగులు పారిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు మొదలు పెట్టారు. -
బెంగళూరులో వరకట్నపు చావు
భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో విషాదం స్వప్నది ఆత్మహత్య కాదు.. హత్యే అంటున్న తల్లిదండ్రులు మామునూరు : అదనపు కట్నం కోసం కట్టుకున్నోడే భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. బెంగళూరులో గత శనివారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూడడంతో వరంగల్‌లోని మామునూరు బెటాలియన్‌లో మంగళవారం విషాదం నెలకొంది. మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న సలేంద్ర సుధాకర్ కూతురు స్వప్న(23)ను నల్లబెల్లి మండలం పంతులుపల్లికి చెందిన ఆసం సుదర్శన్ కొడుకు రాంప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం సందర్భంగా రూ.8లక్షల కట్నం, బంగారు ఆభరణాలు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. రాంప్రసాద్ బెంగళూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వారి కాపురం కొద్ది రోజులుగా సజావుగానే సాగింది. ఈ క్రమంలో అత్తమామలు ఒత్తిడి తేవడంతో అదనపు కట్నం తేవాలని స్వప్నను రాంప్రసాద్ చిత్రహింసలు పెడుతున్నాడు. విషయూన్ని ఆమె తన తల్లిదండ్రులకు చేరవేసింది. దీంతో వారు రాంప్రసాద్ తల్లిదండ్రుల వద్దకు వెృళ్లి మీ కుమారుడిని మందలించాలని కోరారు. ఆయినా రాంప్రసాద్ తీరు మారలేదు. ఈ క్రమంలోనే అతడు పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలోనే మరో అమ్మాయితో రాంప్రసాద్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కొద్ది రోజులుగా భార్య స్వప్నను ఎలాగైన వదిలించుకోవాలని మరో అమ్మాయితో కలిసి రాంప్రసాద్ పథకం పన్ని విఫలమయ్యూడు. చేసేది లేక రాంప్రసాద్ శనివారం మధ్యాహ్నం భార్యను కొట్టి చంపి అదే రాత్రి ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అంతేకాక స్వప్న తల్లిదండ్రులకు ఆదివారం మధ్యాహ్నం మీ కుమార్తె ఉరి వేసుకుని మృతిచెందిందని రాంప్రసాద్ స్వయంగా ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో బెంగళూర్‌కు చేరుకొని మృతిరాలి తండ్రి సలేంద్ర సుధాకర్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారని మృతురాలి తండ్రి చెప్పారు. తమ కూతురుది ఆత్మహత్య కాదు.. హత్యే అని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. బెంగళూర్‌లోని ప్రభుత్వ వైద్యశాలలో ఫోస్ట్‌మార్టం పూర్తి చేసిన స్పప్న మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం మామునూరు క్వార్టర్స్‌కు తరలించారు. కాగా, మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
మర్డర్ చేశా.. వచ్చి ఫొటోలు తీసుకోండి..
- నల్లగొండ జిల్లాలో ఉన్మాది పైశాచికానందం కోదాడ: హలో.. మీరు విలేకరులేనా? బంజారాకాలనీ నుంచి ఫోన్ చేస్తున్నా. నేను ఒకామెను మర్డర్ చేశా.. వెంటనే వచ్చి ఫొటోలు తీసుకోండి..! మీ దగ్గర నంబర్ ఉంటే పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పండి..!! అంటూ ఓ ఉన్మాది గురువారం నల్లగొండ జిల్లా కోదాడలోని పత్రికా విలేకరులకు ఫోన్ చేసి చెప్పడం స్థానికంగా సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్న విలేకరులు, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లేసరికి నిందితుడు రక్తపు మడుగులో ఉన్న శవం పక్కనే తాపీగా కూర్చొని ఉండడాన్ని చూసి వారు కంగుతిన్నారు. పోలీసులను చూసి చేతికి గాయం చేసుకోవడంతో అతడిని చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... కోదాడ పట్టణం బంజారా కాలనీలో నివాసముంటున్న వేముల వెంకటరమణ (35) భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. వెంకటరమణ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది క్రితం సంత ఎదురుగా నివాసముండే అవివాహితుడైన చింతల రమేష్‌కు వెంకటరమణతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర శారీరక సంబంధానికి దారితీసింది. వీరి బంధాన్ని బంధువులు, కుమారులు ఒప్పుకోకపోవడంతో రమేష్‌ను వెంకటరమణ దూరంగా పెట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన రమేష్.. ఉదయం 11 గంటల ప్రాంతంలో మద్యం సేవించి వెంకటరమణ ఇంటికి వచ్చాడు. ఆమెతో గొడవపడి రాడ్‌తో తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో వెంకటరమణ ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఇంటి యజమానిని హత్య చేసి..?
జి.కొండూరు(కృష్ణా): కృష్ణా జిల్లా జి.కొండూరు మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఒక మహిళ హత్యకు గురైంది. పోలీసులు, బాధితురాలి బంధువుల కథనం మేరకు.. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉండే మోపిదేవి గోపీకృష్ణ, సుజాత(27) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. అదే ఇంట్లో మరో పోర్షన్లో హెడ్‌కానిస్టేబుల్ క్రిస్‌మస్‌రావు కుటుంబం అద్దెకు ఉంటోంది. కాగా, ఇంటి ఆవరణను క్రిస్‌మస్‌రావు కుటుంబం శుభ్రంగా ఉంచటం లేదని గోపీకృష్ణ అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య తరచూ వివాదం జరుగుతోంది. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని క్రిస్మస్రావుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదిలా ఉండగా, బుధవారం గోపీకృష్ణ వ్యక్తిగత పనిపై వేరే ఊరు వెళ్లారు. సాయంత్రం గోపీకృష్ణ భార్య సుజాత(27), క్రిస్‌మస్‌రావు భార్య ముంతాజ్‌బేగం మధ్య వివాదం చెలరేగింది. క్రిస్‌మస్‌రావు, అతని కుమారుడు కాంతి కిరణ్, భార్య ముంతాజ్‌బేగం కలసి సుజాతను తీవ్రంగా కొట్టటంతో గాయాలతో మృతి చెందింది. ఆ తర్వాత ఆమెను ఉరి వేసేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు అక్కడికి చేరుకుని, ఇదేంటని ప్రశ్నించారు. దీంతో వారు నిర్లక్ష్యంగా బదులిచ్చి వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులతో కలసి బాధితుల బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదురుగా సుజాత మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, హెడ్‌కానిస్టేబుల్ కుటుంబం కథనం మరోలా ఉంది. సుజాతతో వాగ్వివాదం జరిగిన విషయం వాస్తవమేనని, మనస్తాపం చెందిన ఆమె ఉరివేసుకుని మృతి చెందిందని చెబుతున్నారు. -
మహిళ హత్య
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్) :ఒక మహిళ హత్యకు గురైన దుర్ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బంధువులు, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బ్రహ్మానందరెడ్డి పండ్ల మార్కెట్ వద్ద సులభ్ కాంపెక్స్ పక్కన చాబత్తుల దుర్గమ్మ (50) నివాసం ఉంటోంది. ఏమైందో ఏమో తెలియదుగాని గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో దుర్గమ్మ నివాసం ఉంటున్న ఇల్లు దగ్ధం కావడంతో చుట్టపక్కల ఉన్నవారు మంటలను ఆర్పేందుకు వచ్చారు. పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. అప్పటికే సులభ్ కాంప్లెక్స్ వద్ద దుర్గమ్మ శవమై కన్పించింది. ఒంటి మీద దుస్తులు లేకుండా ఉండటంతో పాటు మడత మంచంపై విగతజీవిగా ఉంది. మండత మంచం గుడ్డ సైతం అంటుకుని ఉందని అంటున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మంటలు అంటుకున్న తరువాతే మంచంతో సహా దుర్గమ్మను బయటకు తీసుకువచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. రూరల్ సీఐ జి.మధుబాబు, ఎస్సైలు ఎస్‌సీహెచ్ కొండలరావు, వి.శ్రీనివాస్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుర్గమ్మను ఎవరో తలపై ఇటుకరాయితో బలంగా మోదడం వల్లే చనిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. తలపై గాయం ఉండటం ఇందుకు కారణంగా చెబుతున్నారు. అనంతరం వారే ఇంటికి కూడా నిప్పు పెట్టి ఉండవచ్చునని అనుకుంటున్నారు. దుర్గమ్మకు భర్త, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. దుర్గమ్మ భర్త కైకరంలో ఉంటుండగా కుమార్తె చేబ్రోలులోను, ఇద్దరు కుమారులు పట్టణంలో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. దుర్గమ్మ తల్లి రెండు సంవత్సరాలు క్రితం చనిపోవడంతో ఆమె ఒకత్తె ఆ ఇంట్లో ఉంటోందని అంటున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ చేరుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టోని నిందితులు... పెనుకొండ జైలుకు తరలింపు
అనంతపురం: పుట్టపర్తిలో విదేశీ మహిళ హత్య కేసులో అపార్ట్మెంట్ వాచ్మెన్ భగవంతప్ప కీలక నిందితుడని అనంతపురం జిల్లా పోలీసులు ఆదివారం వెల్లడించారు. భగవంతప్పతోపాటు అతడి స్నేహితుడు పోతులయ్య నాగరాజును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులను పెనుకొండ జైలుకు తరలించినట్లు చెప్పారు. ఆస్ట్రేలియన్ మహిళ టోని అస్థిపంజరం నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం డీఎన్ఏ, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. పుట్టపర్తిలోని సాయి గౌరి అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆస్ట్రేలియా మహిళ టోని దారుణ హత్యకు గురైంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా అపార్ట్మెంట్ వాచ్మెన్ భగవంతప్పే కీలక నిందితుడిగా పోలీసులు నిర్థారించారు. -
మహిళ దారుణ హత్య, ఇద్దరి అరెస్ట్
అనంతపురం : అనంతపురం రాజీవ్ కాలనీలో దారుణం జరిగింది. ఓ యువతిని (28) హతమార్చిన దుండగులు... మృతదేహాన్ని కాల్చివేసేందుకు తరలిస్తుండగా పోలీసులుకు పట్టుబడ్డారు. బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి వద్ద ఇసుక అక్రమ రవాణా సందర్భంగా పోలీసులు ఈరోజు ఉదయం వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ప్రవర్తించటంతో పోలీసులు సోదాలు చేయగా అసలు విషయం బయటపడింది. పోలీసులు... యువతి మృతదేహంతో పాటు, కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
కృష్ణలంకలో మహిళ దారుణహత్య
విజయవాడ : విజయవాడ కృష్ణలంకలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు మహిళ గొంతుకోసి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుండగులు మృతదేహాన్ని పొట్టిశ్రీరాములు స్కూల్ ఆవరణలో పడవేశారు. శుక్రవారం ఉదయం మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతురాలు స్థానికంగా నివసిస్తున్న మహిళగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి... .అర్థరాత్రి సమయంలో మహిళను స్కూల్ ఆవరణలోకి తీసుకు వచ్చి ఇద్దరు, ముగ్గురు ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులతో మహిళ పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళ హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు
స్థానిక పోలీసులు కచ్చా బనియన్ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పాత ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో గత ఆదివారం ఓ మహిళ హత్యకు గురైన సంగతి విదితమే. నిందితులను మొహబ్బత్, అనిస్ అలియాస్, ఫిర్సత్, మధు, సాగర్, రహీం అలియాస్ రాజుగా గుర్తించారు. వీరిని బుధవారం అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులు హతురాలి ఇంటిలో దొంగతనం కోసం యత్నించారని, అయితే అడ్డుకోవడంతో మహిళపై దాడి చేశారని, దీంతో ఆమె చనిపోయిందని చెప్పారు. అదే రోజు రాత్రి నిందితులు అనేక నేరాలకు పాల్పడ్డారన్నారు. వీరి దాడిలో అనేకమంది స్థానికులు గాయపడ్డారన్నారు. ఈ హత్య వెనుక పెద్ద బృందమే ఉందని తమ ప్రాథమిక విచారణలో తేలిందని, వీరంతా నరేలా రైల్వే క్రాసింగ్ వద్ద ఉంటారని తెలిపారు. గత రెండు నెలలుగా ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో వీరంతా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నట్టు తెలిపారు. దీంతో మెరుపుదాడి జరిపి నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. నిందితులంతా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వాసులని తమ విచారణలో తేలిందన్నారు. వీరు ఏ ప్రాంతంలోనూ ఆరు నెలలకు మించి ఉండరని, తరచూ తమ నివాస స్థలాన్ని మారుస్తుంటారని తెలిపారు. బాగా చీకటిగా ఉన్న సమయంలోనే వీరంతా నేరాలకు పాల్పడతారని, పగటిపూట వీరంతా ఆయా ప్రాంతా ల్లో మ్యాజిక్ ట్రిక్కులను ప్రదర్శిస్తుంటారని తెలిపారు. ఆ సమయంలోనే తాము దాడికి దిగాల్సిన ప్రాంతాలను ఎంచుకుంటారన్నారు. నేరాలకు పాల్పడే సమయంలో కేవలం డ్రాయర్లు మాత్రమే ధరిస్తారని తెలిపారు. -
రాజమండ్రిలో మహిళ సజీవ దహనం
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రాజమండ్రి రాజేంద్రనగర్‌లో ఓ మహిళ సజీవ దహనమైంది. నిత్యం రద్దీగా వుండే నడిరోడ్డుమీద ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. మృతురాలిని... పిఠాపురం మండలం గెద్దనాపల్లికి చెందిన డి.కుమారిగా గుర్తించారు. ఐదేళ్ల క్రితం ఆమె కుటుంబం రాజమండ్రి వలస వచ్చి.. ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా జీవనం సాగిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మహిళను గొడ్డలితో నరికి చంపిన యువకుడు
గుంటూరు : గుంటూరు జిల్లా రెంటచింతలలో దారుణం జరిగింది. స్థల వివాదం కాస్తా ఓ మహిళ ప్రాణాలు తీసింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇరు కుటుంబాల మధ్య స్థల వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు.... మహిళను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్నేహితుడి కిరాతకం...యువతి దారుణ హత్య
బెంగళూరు : దేశ ఐటీ రాజధానిగా పేరు గడించిన ఉద్యాన నగరి నేడు నేర నగరిగా మారిపోయింది. గార్డెన్ సిటీ పేరిట ప్రపంచానికి పరిచయమైన బెంగళూరులో నేడు నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా గురువారం ఉదయం రద్దీ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఇక్కడి హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపింది. మాగడి రోడ్డులోని తావరకెరె సమీపంలోని కెంపేగౌడ నగరలో నివాసం ఉంటున్న సునీత (29) హత్యకు గురైంది. హంతకుడు, సునీత స్నేహితుడిగా భావిస్తున్న ధనరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విచారణ చేస్తున్నారు. వివరాలు... వివాహిత అయిన సునీతకు 8 ఏళ్ల కుమార్తె (మానసిక అస్వస్థత) ఉంది. భర్త ప్రైవేట్ ఉద్యోగి. రేస్‌కోర్సు రోడ్డులో ఓ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సునీత గురువారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో విధులకు వెళ్లడానికి రేస్‌కోర్సు ప్రాంతానికి వచ్చింది. గేట్ నెంబర్ -3 నుంచి ఫుట్‌పాత్‌పై వెళ్తుండగా ధన రాజ్ అడ్డుకున్నాడు. కొద్ది క్షణాల వ్యవధిలోనే కత్తి తీసుకుని విచక్షణారహితంగా పొడిచాడు. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని సునీత గట్టిగా కేకలు వేస్తూ కుప్పకూలిపోయింది. సమీపంలో విధులలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్ల సహ గుర్రపు రేసులు వీక్షించడానికి వస్తున్న వందల మంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతమంది మధ్యలో నుంచి ధనరాజ్ చాకచక్యంగా పారిపోవడానికి యత్నించాడు. దీంతో అప్రమత్తమైన వారు ధనరాజ్‌ను పట్టుకుని చితకబాదడంతో అతను సృహకోల్పోయాడు. సునీతను హుటాహుటిన సమీపంలోని మల్లిగె ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో సునీత మృతి చెందినట్లు డీసీపీ రవికాంత్ గౌడ తెలిపారు. నిందితుడు 17 సార్లు పొడిచినట్లు చెప్పారు. ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సునీత హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే సునీత, ధనరాజ్ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఆరేళ్లుగా పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో ధనరాజ్ ప్రవర్తనతో విసిగిపోయిన సునీత అతని దూరంగా ఉంది. ధనరాజ్ మాట్లాడటానికి ప్రయత్నించిన ఆమె పట్టించుకునేది కాదని సమాచారం. ఈ విషయంపై కక్ష పెంచుకున్న నిందితుడు గురువారం మధ్యాహ్నం సునీతతో మాట్లాడటానికి వచ్చి కత్తితో దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరువైపుల కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నామని హైగ్రౌండ్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ చెప్పారు. మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సహజీవనం చేస్తానని.. మహిళ హత్య
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తానని చెప్పి ఓ వివాహితను తీసుకెళ్లిన ఓ యువకుడు, ఆమెను దారుణంగా హతమార్చాడు. సిద్ధ అనే యువకుడు ఈ ఘెరానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఆ మహిళ మృతదేహం మాత్రం పోలీసులకు లభ్యం కాలేదు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, అతనొక్కడేనా అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
దొంగతనాన్ని ప్రతిఘటించబోయి ప్రాణాలు కోల్పోయింది
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మహిళలకు భద్రత కరవవుతోందనే వాదనలకు బలం చేకూరుతోంది. ఒక దారుణాన్ని మరిచిపోయేలోపే మరో దారుణం చోటు చేసుకుంటోంది. తాజాగా ఢిల్లీలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. పర్సు దొంగతనం చేస్తుంటే ప్రతిఘటించిన ఓ మహిళను దుండగులు దారుణంగా పొడిచి చంపారు. ఢిల్లీ-కరోల్‌బాగ్‌లో ఈ దారుణం జరిగింది. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న బాధితురాలు నోయిడా నుంచి కరోల్‌భాగ్ వెళ్లారు. కరోల్‌భాగ్ స్టేషన్ నుంచే బాధితురాలని వెంబడించిన దుండగులు ఇంటికి సమీపంలోకి వచ్చిన తరువాత ఆమెను అడ్డుకున్నారు. పర్సు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితురాలిపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఆమె అరిచి కేకలు పెట్టడంతో విచక్షణరహితంగా పొడిచి పరారయ్యారు. ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. కేకలు విని భవనం పైనుంచి కిందకు వచ్చే లోపే దుండగులు పొడిచి పరారరయ్యారని మృతురాలి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. -
గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల సమీపంలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యింది. దుండగులు.... మహిళను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కాల్చివేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం బండవెల్కిచర్ల సమీపంలోని మంటలు వస్తుండగా స్థానికులు గమనించారు. ఘటనాప్రాంతానికి వెళ్లి చూడగా అప్పటికే మహిళ మృతదేహం కాలిపోయింది. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి దహనం చేసినట్లు గుర్తులు ఉన్నాయి. కాగా మృతురాలి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. -
స్టోన్ క్రషర్లో మహిళ దారుణ హత్య
విజయనగరం: గరివిడి మండలం దేవాడలోని ఒక స్టోన్ క్రషర్లో మహిళను దారుణంగా హత్య చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తెచ్చింది. 15 రోజుల క్రితం వెంకట నర్సింహం స్టోన్ క్రషర్లో ఒక మహిళను హత్య చేశారు. విషయం తెలిసి బంధువులు ఆందోళనకు దిగారు. -
మహిళ హత్య కేసులో దిగ్విజయ్, సచిన్ అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళను హత్యచేసి, ఆమె మూడేళ్ల కుమారుడిని అపహరించిన నేరానికి గాను ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దిగ్విజయ్ (23), సచిన్ (20) అనే వీరిద్దరూ మోహి (29) అనే మహిళను హత్య చేసి, ఆమె కుమారుడు ఇషును అపమరించడమే కాక, వాళ్ల ఇంటిని దోచుకున్నారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్ పుణ్యమాని హరిద్వార్‌లో ఉన్న బాలుడిని సురక్షితంగా కాపాడినట్లు ఢిల్లీ జాయింట్ పోలీసు కమిషనర్ సంజయ్ బేణీవాల్ తెలిపారు. అయితే, బాలుడిని కాపాడే ప్రయత్నంలో ఉన్నపోలీసులపై నిందితులు కత్తితో దాడి చేయడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. నిందితులిద్దరిలో దిగ్విజయ్ గతంలో పిల్లవాడి తండ్రి ఇనాముల్లా నడిపే మొబైల్ దుకాణంలో పనిచేసేవాడు. బాగా డబ్బు అవసరం కావడంతో సచిన్, కేశవ్ అనే ఇద్దరితో కలిసి ఈ కుట్ర పన్నాడు. శనివారం ఉదయం ఇంట్లో పనిమనిషి బీనా ఉండగానే ఆమెను తుపాకి చూపించి బెదిరించి, మోహిని పొడిచి చంపి, ఆమె కుమారుడిని ఎత్తుకుపోయారు. సంఘటన జరిగిన వెంటనే ఢిల్లీ వదిలిపెట్టి ఉత్తరాఖండ్ పారిపోయారు. బాలుడిని అడ్డం పెట్టుకుని డబ్బు కోసం అతడి తండ్రి ఇనాముల్లాకు పలుమార్లు ఫోన్లు చేశారు. వీళ్ల గురించి విశ్వసనీయంగా సమాచారం అందడంతో పోలీసులు వాళ్లెక్కడున్నదీ కనిపెట్టారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఎస్ఐ అరుణ్, ఉత్తరాఖండ్ పోలీసు కానిస్టేబుల్ వివేక్ బాలుడిని కాపాడుతుండగా వారి చేతులపైన, నడుంపైన కత్తి గాయాలయ్యాయి. వారి పేర్లను రివార్డుల కోసం ప్రతిపాదిస్తామని బేణీవాల్ చెప్పారు. మూడో నిందితుడు కేశవ్ కోసం గాలింపు కొనసాగుతోంది.