World championship
-
64 గళ్లపై చిన్నారి అద్భుతం
రెండేళ్ల క్రితం.. ప్రముఖ చెస్ వెబ్సైట్ చెస్ బేస్ డాట్ ఇన్ హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించింది. అందులో భారత గ్రాండ్మాస్టర్లయిన అర్జున్ ఇరిగేశి, డి.గుకేశ్‌లు ఒకవైపు.. 20 మంది జూనియర్ చెస్ ఆటగాళ్లు మరోవైపు ఆడారు. ఫలితాలను పక్కన పెడితే ఇద్దరు టాప్ గ్రాండ్మాస్టర్లను కొందరు చిన్నారులు తమ ఆటతో ఆకర్షించారు. వారిలో ఆరేళ్ల ఆదుళ్ల దివిత్ రెడ్డి కూడా ఉన్నాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నట్లు గుర్తించిన ఆ ఇద్దరు గ్రాండ్మాస్టర్లూ త్వరలోనే దివిత్ పెద్ద విజయాలు సాధిస్తాడని జోస్యం చెప్పారు. రెండేళ్లు తిరిగేసరికి అది నిజమైంది. దివిత్ రెడ్డి ఇప్పుడు వరల్డ్ క్యాడెట్ అండర్–8 చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. కొన్ని నెలల వ్యవధిలో అతను అటు ర్యాపిడ్, ఇటు క్లాసిక్ రెండు విభాగాల్లోనూ వరల్డ్ చాంపియన్‌గా నిలవడం విశేషం. అల్బేనియా, ఇటలీలలో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ప్రదర్శన చూస్తే భారత చదరంగంలో మరిన్ని సంచలనాలకు కారణం కాగల కొత్త కెరటం వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిభను గుర్తించి..సాధారణంగా ఐదారేళ్ల చిన్నారులు స్కూల్‌తో పాటు తమ వయసుకు తగినట్లుగా తమకు నచ్చిన విధంగా ఏదో ఒక ఆటలో మునిగి తేలుతుంటారు. కానీ క్రీడలకు సంబంధించి వారిలో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు మాత్రమే సరిగ్గా గుర్తించగలరు. దివిత్ తల్లిదండ్రులు మహేశ్ రెడ్డి, సింధుజ సరిగ్గా అదే పని చేశారు. అతడికి చదరంగంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు, ఆ క్రీడలో అతను పూర్తిగా లీనమైపోతున్నట్లు ఆరంభంలోనే గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన వీరిద్దరూ చెస్‌కు సంబంధించిన పజిల్స్‌ను పరిష్కరించడంలో దివిత్కున్న ప్రత్యేక ప్రతిభను పసిగట్టగలిగారు. అందుకే తమ అబ్బాయిని పూర్తిగా చదరంగం వైపు మళ్లిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. దానికి ఎగ్జిబిషన్ టోర్నీ మరింత స్ఫూర్తినిచ్చింది. కోచ్ రామకృష్ణ వద్ద శిక్షణ ఇప్పించారు. రెండేళ్ల పాటు ఆయన శిక్షణలో దివిత్ మరింత రాటుదేలాడు. దాంతో టోర్నీల్లో ఆడించడం మొదలుపెట్టారు. వరుస విజయాలతో..రాష్ట్ర స్థాయి టోర్నీల్లో విజేతగా నిలిచిన తర్వాత దివిత్ జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడి ప్రదర్శన ఆ చిన్నారిలోని అపార ప్రతిభను చాటింది. ఫలితంగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అల్బేనియాలో జరిగిన టోర్నీ ద్వారా దివిత్ టాలెంట్‌కి మరింత గుర్తింపు దక్కింది. అండర్–8 చాంపియన్‌షిప్‌లో అతను ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలిచాడు. రెండు నెలల తర్వాత జార్జియాలో జరిగిన వరల్డ్ కప్‌లో కూడా అతనికి రెండో స్థానం దక్కింది. తాజాగా ఇటలీలో అండర్–8 క్లాసికల్లో వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించడం అతడి ఆటను మరో మెట్టు ఎక్కించింది. తర్వాతి వయో విభాగాలైన అండర్–10, అండర్–12లలో ఇదే తరహా ఆటను కొనసాగిస్తే దివిత్ కెరీర్ మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయం. అన్నింటా అండగా నిలుస్తూ..తన గెలుపు విలువేమిటో ఎనిమిదేళ్ల దివిత్‌కు తెలియకపోవచ్చు. కానీ అతని తల్లిదండ్రులు ఆ గెలుపు స్థాయిని గుర్తించారు. అందుకే కెరీర్లో ముందుకు తీసుకెళ్లేందుకు వారు తమ వైపునుంచి ఎలాంటి లోటు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెరిగే పోటీని దృష్టిలో ఉంచుకొని కొత్త కోచ్‌తో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. చెస్‌లో కోచింగ్ అంటే ఆర్థికపరంగా కూడా అమిత భారమే! దీంతో పాటు వరుస టోర్నీల్లో పాల్గొంటేనే ఫలితాలు రావడంతో పాటు రేటింగ్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా చేయాలంటే పెద్ద సంఖ్యలో వేర్వేరు దేశాల్లో పోటీ పడటం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ తమ చిన్నారి కోసం వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం సొంత డబ్బులతోనే ముందుకు సాగుతున్న వీరు మున్ముందు దివిత్ మంచి ఫలితాలు సాధిస్తే స్పాన్సర్షిప్ చాన్స్ రావచ్చనే విశ్వాసంతో ఉన్నారు. అన్నింటినీ మించి వారు తమ అబ్బాయి ఆటను నమ్ముతున్నారు.గ్రాండ్‌మాస్టర్ లక్ష్యంగా..‘చెస్ అంటే చాలా ఇష్టం. ఎన్ని గంటలైనా ఆడుతూనే ఉంటా..’ ఇదీ చిన్నారి దివిత్ మాట. ప్రస్తుతం అతను రోజుకు 7–8 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మధ్యలో కొద్దిసేపు విరామం మినహా అతనికిప్పుడు చదరంగపు గళ్ళే లోకం. అతని ఫలితాలు చూస్తేనే అతను ఎంతగా కష్టపడుతున్నాడో అర్థమవుతోంది. సిసిలియన్ డిఫెన్స్ తన ఫేవరిట్ అని చెబుతున్న దివిత్.. ప్రస్తుత భారత టాప్ ఆటగాడు అర్జున్ ఇరిగేశి స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు. ఆటలో విజయాలతో పాటు ఓటములు కూడా సహజం. సాధారణంగా వేర్వేరు ఏజ్ గ్రూప్ చెస్ టోర్నీలు జరుగుతున్నప్పుడు పరాజయం ఎదురైతే చిన్నారులు ఏడుస్తూ బయటకు రావడం చాలా చోట్ల కనిపించే దృశ్యం. కానీ దివిత్ ఏరోజూ అలా చేయలేదని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. గేమ్ ఓడిన తర్వాత కూడా ప్రశాంతంగా వచ్చి నేను ఓడిపోయాను, తర్వాతి గేమ్‌కు ప్రిపేర్ అవుతాను అని చెప్పడం ఎనిమిదేళ్ల చిన్నారి స్థితప్రజ్ఞకు నిదర్శనం. చెస్‌కు ఎక్కువ సమయం కేటాయించేందుకు దివిత్ పేరెంట్స్ అతని స్కూల్ చదువును ఆన్లైన్ క్లాస్‌ల ద్వారా కొనసాగిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న దివిత్.. వచ్చే రెండేళ్ల పాటు తనకిష్టమైన చెస్‌లో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తే ఆపై చదువును, ఆటను సమన్వయం చేసుకుంటూ వెళ్లవచ్చనేది వారి ఆలోచన. దివిత్ కూడా దానికి తగినట్లుగా సాధన చేస్తున్నాడు. పిన్న వయసులోనే దివిత్‌ను గ్రాండ్‌మాస్టర్‌గా చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. ప్రస్తుతం 1876 రేటింగ్ ఉన్న అతను జీఎమ్ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
ప్రపంచ రికార్డు కోసం 1,121కిలోల గుమ్మడికాయ (ఫొటోలు)
-
చెలరేగిన ఉతప్ప.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఇండియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. ఇండియా బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప(32 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్క్రీత్ సింగ్(33), నమన్ ఓజా(25) పరుగులతో రాణించారు. కాగా కెప్టెన్ యువరాజ్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు. బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 14 పరుగులిచ్చిన యువీ.. బ్యాటింగ్‌లోనూ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలోక్రిస్ స్కోఫీల్డ్ 4 వికెట్లు పడగొట్టగా.. రవి బపోరా రెండు వికెట్లు సాధించాడు.అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఇయాన్ బెల్(59), సమిత్ పటేల్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హార్భజన్ సింగ్ రెండు, కులకర్ణి, ఆర్పీ సింగ్ తలా వికెట్ పడగొట్టారు. -
నేటి నుంచి (జులై 3) మరో క్రికెట్ పండుగ.. జులై 6న భారత్-పాక్ మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్ ముగిసి వారం రోజులు కూడా గడవక ముందే మరో క్రికెట్ పండుగ మొదలైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 3) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు (ఇండియా ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటున్నాయి. లెజెండ్స్ క్రికెట్‌కు సంబంధించి ఈ టోర్నీని వరల్డ్‌కప్‌గా పరిగణించవచ్చు. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, కెవిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్, హెర్షల్ గిబ్స్, షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్, బ్రెట్ లీ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. సింగిల్ రౌండ్ ఫార్మాట్లో జరిగే (ప్రతి జట్టు మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది) ఈ టోర్నీ జులై 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సింగిల్ రౌండ్ తర్వాత టాప్-4లో ఉండే జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జులై 6న జరుగనుంది.జట్ల వివరాలు..భారత్ ఛాంపియన్స్: యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, పవన్ నేగిఆస్ట్రేలియా ఛాంపియన్స్: బ్రెట్ లీ, టిమ్ పైన్, షాన్ మార్ష్, బెన్ కట్టింగ్, బెన్ డంక్, డిర్క్ నాన్స్, డాన్ క్రిస్టియన్, బెన్ లాఫ్లిన్, ఆరోన్ ఫించ్, బ్రాడ్ హాడిన్, కల్లమ్ ఫెర్గూసన్, పీటర్ సిడిల్, జేవియర్ డోహెర్టీ, నాథన్ కౌల్టర్ నైల్, జాన్ హేస్టింగ్స్ఇంగ్లండ్ ఛాంపియన్స్: కెవిన్ పీటర్సన్, రవి బొపారా, ఇయాన్ బెల్, సమిత్ పటేల్, ఒవైస్ షా, ఫిలిప్ మస్టర్డ్, క్రిస్ స్కోఫీల్డ్, సాజిద్ మహమూద్, అజ్మల్ షాజాద్, ఉస్మాన్ అఫ్జల్, ర్యాన్ సైడ్‌బాటమ్, స్టీఫెన్ ప్యారీ, స్టువర్ట్ మీకర్, కెవిన్ ఓ'బ్రియన్వెస్టిండీస్ ఛాంపియన్స్: డారెన్ సామీ, క్రిస్ గేల్, శామ్యూల్ బద్రీ, రవి రాంపాల్, కేస్రిక్ విలియమ్స్, జాసన్ మహమ్మద్, నవిన్ స్టీవర్ట్, డ్వేన్ స్మిత్, యాష్లే నర్స్, సులీమాన్ బెన్, చాడ్విక్ వాల్టన్, జెరోమ్ టేలర్, ఫిడేల్ ఎడ్వర్డ్స్, కిర్క్ ఎడ్వర్డ్స్, జోనాథన్ కార్టర్దక్షిణాఫ్రికా ఛాంపియన్స్: జాక్వెస్ కల్లిస్, హెర్షెల్ గిబ్స్, ఇమ్రాన్ తాహిర్, మఖాయా ంటిని, డేల్ స్టెయిన్, అష్వెల్ ప్రిన్స్, నీల్ మెక్కెంజీ, ర్యాన్ మెక్లారెన్, జస్టిన్ ఒంటాంగ్, రోరీ క్లీన్‌వెల్ట్, జెపి డుమిని, రిచర్డ్ లెవి, డేన్ విలాస్, వెర్నాన్ ఫిలాండర్,పాకిస్తాన్ ఛాంపియన్స్: యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, అబ్దుల్ రజాక్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సోహైల్ తన్వీర్, సోహైల్ ఖాన్, తన్వీర్ అహ్మద్, ముహమ్మద్ హఫీజ్, అమీర్ యామిన్, షోయబ్ మాలిక్, సోహైబ్ మక్సూద్, ఉమర్జెల్ ఖాన్ అక్మల్,షెడ్యూల్..బుధవారం, జూలై 03ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్గురువారం, జూలై 04సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్శుక్రవారం, జూలై 05ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇండియా వర్సెస్ వెస్టిండీస్శనివారం, జూలై 06ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియాఇండియా వర్సెస్ పాకిస్థాన్ఆదివారం, జూలై 07సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్సోమవారం, జూలై 08ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియామంగళవారం, జూలై 09వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్బుధవారం, జూలై 10వెస్టిండీస్ వర్సెస్ఆస్ట్రేలియా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాబుధవారం, జూలై 12మొదటి సెమీ ఫైనల్- TBA vs TBAరెండవ సెమీ ఫైనల్- TBA vs TBAశనివారం, జూలై 13ఫైనల్ మ్యాచ్ - TBA vs TBA -
సింగపూర్‌లో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్, క్యాండిడేట్స్ టోర్నీ విజేత దొమ్మరాజు గుకేశ్‌కు స్వదేశంలో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా), చాలెంజర్ గుకేశ్ మధ్య ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు లభించాయి. ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కుల కోసం అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు ప్రభుత్వం, సింగపూర్ పోటీపడ్డాయి. బిడ్లను పరిశీలించాక ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు సింగపూర్‌కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య 25 లక్షల డాలర్ల (రూ. 20 కోట్ల 85 లక్షలు) ప్రైజ్‌మనీతో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుంది. ఇద్దరి మధ్య 14 రౌండ్లు నిర్వహిస్తారు. తొలుత 7.5 పాయింట్లు సంపాదించిన ప్లేయర్‌ను విశ్వవిజేతగా ప్రకటిస్తారు. 14 రౌండ్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిస్తే టైబ్రేక్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు క్లాసికల్ ఫార్మాట్లో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆనంద్ ఐదుసార్లు (2000, 2007, 2008, 2010, 2012) విశ్వవిజేతగా నిలిచాడు. -
అల్ట్రా రన్నర్ మీనల్
ఆమె ఖాతాలో అనేక రేస్‌లు పూర్తి చేసిన రికార్డులు ఉన్నాయి. భారతదేశపు అగ్రశ్రేణి అల్ట్రా రన్నర్‌గా పేరొందింది. పేరు మీనల్ కొటక్, గుర్గావ్వాసి.ఇటీవల 680కి పైగా కిలోమీటర్ల పరుగును 6 రోజుల్లో అంటే 144 గంటల్లో కవర్ చేసి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. తనను తాను మెరుగుపరుచుకోవాలనే సంకల్పంతో అల్ట్రారన్లలో పాల్గొంటున్నాను అని చెబుతోంది మీనల్ కొటక్. ‘‘పురుషుల రికార్డ్ ఇప్పటి వరకు 574.5 కిలోమీటర్ల ఉంటే, నా రికార్డ్ 680 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసింది. మిగతావారికంటే ఉన్నతంగా ఉండేలా నన్ను నేను మెరుగుపరుచుకోవాలన్నదే నా సంకల్పం. కిందటేడాది అమెరికాలోని మిల్వాకీలో జరిగిన అల్ట్రామారథాన్‌లో భారతదేశం తరపున పాల్గొన్న మల్టీ డే రికార్డ్ అసాధారణమైంది. ఇటీవల జరిగిన ఆరు రోజుల ఈవెంట్లోనూ నేనే ముందున్నాను.ఈ రేసుతో ఆసియాలో టాప్ 5 యాక్టివ్ రన్నర్‌గా, ప్రపంచంలో టాప్ 12 యాక్టివ్ 6–డే ఉమెన్ అల్ట్రారన్నర్లలో ఒకరిగా ఉన్నాను. నా మనుగడ కోసం మొండిగా పోరాడతాను. సుదీర్ఘమైన చలి, ఒంటరితనం దేనినీ లెక్కచేయను. చాలా కఠినమైన సాధన. నా ఎమోషన్స్ అన్నీ సమం చేసుకుంటూ ప్రయత్నం చేశాను. చివరకు నా సంకల్పం మనసు, శరీరంపై గెలిచింది. మార్చిన పరుగు2014లో ఒక ట్రెడ్మిల్ పరుగు నా రన్నింగ్ సామర్థ్యాన్ని, శక్తిని గ్రహించేలా చేసింది. నా బలాన్ని గుర్తించిన సరైన వ్యక్తుల సహాయంతో ఢిల్లీ హాఫ్ మారథాన్‌లో పరుగెత్తాను. 34 సంవత్సరాల వయసులో వృత్తిపరమైన రన్నింగ్ అనుభవం లేకుండా పాల్గొన్న ఆ మారథాన్ నా జీవిత గమనాన్ని మార్చింది. ఆ సమయంలోనే మహిళా అల్ట్రారన్నర్లు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిసి, ఆసక్తి కలిగింది. మారథాన్లకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించి, చరిత్ర సృష్టించాలనుకున్నాను. 2017లో 24 గంటల పరుగు విభాగంలో భారతదేశం నుంచిప్రాతినిధ్యం వహించాను. అక్కడ నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నా సామర్థ్యాన్ని గుర్తించింది. వారు నాకున్న రికార్డులన్నీ పరిశీలించారు. అలా 2017లో బెల్ఫాస్ట్లో తొలిసారిగా భారతదేశానికిప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత 2018లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. డిప్రెషన్ నుంచి కోలుకొని...2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో దేశానికిప్రాతినిధ్యం వహించడానికి కొంత కాలానికి ముందు కాలికి తీవ్ర గాయమైంది. అనేక కారణాల వల్ల డిప్రెషన్ బారిన పడ్డాను. నా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో బెడ్‌రెస్ట్‌లో ఉండటం వల్ల చాలా బాధపడ్డాను. మొత్తానికి ఆ ఒత్తిడిని జయించి ఇప్పుడు నా 44 ఏళ్ల వయసులో 680 కిలోమీటర్ల పరుగును సాధించేంతగా ఎదిగాను. ఏడాది కిందట అమెరికాలో 72 గంటల్లో 379 కిలోమీటర్లు పరుగును పూర్తి చేశాను. మూడేళ్లుగా ఈ రేసులను ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ ఆటలో మనసు శక్తి ఎంతటిదో తెలుసుకున్నాను.ప్రణాళికతో దినచర్యమల్టీడే రేసులు 24 గంటల రేసుల కంటే భిన్నంగా ఉంటాయి. ఒక క్రీడాకారుడు ఇక్కడ రోజుల తరబడి పరిగెత్తడంలో ఎన్నో ప్రణాళికలను అమలు పరచాల్సి ఉంటుంది. దీంతో గతంలోకంటే ఎక్కువ ప్రేరణ, మద్దతు అవసరం అవుతుంది. ఈ రేసులోకి వెళ్లడానికి మొదటి మూడు రోజులు ఆలోచించాను. ఒకసారి శిక్షణ మొదలుపెట్టాక ఇక ప్రణాళికలను అనుసరించేలా నా దినచర్య మారిపోయింది. రన్నింగ్ కోసం మాత్రమే కాదు ఒక రేసర్‌గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించు కోవాలంటే పోషకాహారం వంటి అనేక ఇతర అంశాలు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఒక గంట లేదా రెండు గంటలు నిద్ర, బట్టలు మార్చుకోవడం, ఆహారం తీసుకోవడం, కాళ్లకు బొబ్బలు రాకుండా చూసుకోవడం... వీటన్నింటిపైనా శిక్షణప్రారంభించనప్పటి నుండే శ్రద్ధ వహించాలి. మల్టీ డే రేసింగ్ ఆరోగ్య పోటీగా కూడా మార్చుకోవచ్చు.ఇప్పటివరకు భారత దేశం నుండి ఏ మహిళ కూడా మల్టీ డే మారథాన్‌లో పాల్గొనలేదు. ఈ విషయం నన్ను ఆలోచించేలా, రికార్డ్‌ను సాధించేలా చేసింది. అల్ట్రారన్ రేస్‌లో మొదటి భారతీయ మహిళను నేనే అవుతానని అనుకోలేదు. మానవ పరిమితులన్నీ అధిగమించడానికి ఒక అడుగు ముందుకు వేసినందుకు సంతోషంగా ఉన్నాను. నా భర్త సచిన్ ఉద్యోగి అయినప్పటికీ నా ముఖ్యమైన రన్నింగ్రేసులన్నింటికీ తప్పక హాజరై, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు’’ తన విజయపరంపరను వెనకాల ఉన్న రహస్యాలను వివరించింది మీనల్ కొటక్. -
సెయిలింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మాన్య
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన యువ సెయిలర్ మాన్య రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఇంటర్నేషనల్ లేజర్ క్లాస్ అసోసియేషన్ 4 (లేజర్ 4.7) యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఆమె ఎంపికైంది. జూన్ 22నుంచి 30 వరకు పోర్చుగల్‌లోని వియానా డి కాస్టెలోలో ఈ టోర్నీ జరుగుతుంది. 15 ఏళ్ల మాన్య గత కొంత కాలంగా సెయిలింగ్ పోటీల్లో నిలకడగా రాణిస్తోంది. హుస్సేన్ సాగర్ జలాల్లో సెయిలింగ్ నేర్చుకున్న ఈ అమ్మాయి తొలి జూనియర్ రెగెట్టాలోనే రజతం సాధించింది. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో వరుస విజయాలు సాధించిన ఆమె ఇటీవల షిల్లాంగ్‌లో జరిగిన ర్యాంకింగ్ టోర్నీలో కాంస్యం గెలుచుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం భారత్‌నుంచి ఎంపికైన ఇద్దరు సెయిలర్లలో ఒకరిగా మాన్యకు అవకాశం దక్కింది. ఈ టోర్నీ కోసం ప్రస్తుతం మాన్య సిద్ధమవుతోంది. అయితే వరల్డ్ చాంపియన్íÙప్ స్థాయి టోర్నీలో పాల్గొనడం, ఇతర సన్నాహకాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే తన ఈవెంట్ కోసం మాన్య స్పాన్సర్ల సహాయాన్ని ఆశిస్తోంది. ప్రయాణ, వసతి, ఎక్విప్మెంట్, శిక్షణ కోసం తనకు అండగా నిలవాలని ఆమె కోరుతోంది. ఈ నేపథ్యంలో మాన్యకు స్పాన్సర్షిప్ అందించాలని భావించేవారు ఝ్చ్చny్చట్ఛఛీఛీy20ఃజఝ్చజీ .ఛిౌఝ ద్వారా సంప్రదించవచ్చు. -
నా లక్ష్యానికి పరిమితి లేదు.. ఒలింపిక్స్ కంటే కూడా: నీరజ్‌చోప్రా
ఒలింపిక్స్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణం, ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ చాంపియన్, ఆసియా క్రీడల స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల స్వర్ణం, జూనియర్ ప్రపంచ చాంపియన్... భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అసాధారణ కెరీర్లో అందుకున్న అద్భుత విజయాలెన్నో. వాస్తవంగా ఈ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటే మేజర్ ఈవెంట్లలో అతను సాధించేందుకు ఇక ఏమీ మిగలనట్లే! కానీ నీరజ్ మాత్రం తాను ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని చెబుతున్నాడు. జావెలిన్‌ను మరింత బలంగా, మరింత దూరం విసరగలనని అతను చెబుతున్నాడు. బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానని వ్యాఖ్యానించాడు. పసిడి పతకం గెలిచినందుకు నీరజ్ చోప్రాకు 70 వేల డాలర్ల (రూ. 57 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ ఈవెంట్లో నీరజ్ పసిడి పతకం గెలిచాక మీడియాతో పంచుకున్న భావాలు అతని మాటల్లోనే... ♦ త్రోయర్లకు ఎప్పటికీ ఫినిషింగ్ లైన్ అనేదే ఉండదు అంటారు. మా చేతుల్లో జావెలిన్ ఉన్నంత వరకు ఎంత దూరమైన విసరగలం. మా లక్ష్యానికి పరిమితి లేదు. నేను ఎన్ని పతకాలు గెలిచినా ఇంకా ఎక్కువ దూరం బల్లెంను విసరాలనే ప్రేరణ అలాగే ఉంటుంది. ఈ పతకాల వల్ల నేను ఇప్పటికే అన్నీ సాధించానని అనుకోను. మరింత కష్టపడి నా దేశానికి మరిన్ని పతకాలు తీసుకొస్తా. పోడియంపై నా పక్కనే ఎవరైనా భారతీయులు నిలబడగలిగితే అది ఇంకా బాగుంటుంది. ♦ 90 మీటర్ల దూరం కూడా సాధ్యమే. అయితే సాధారణంగా దృష్టంతా గెలుపుపైనే ఉంటుంది. గత కొంత కాలంగా 90 మీటర్ల దూరంపై చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సాధించగలననే అనుకున్నా గాయాల వల్ల కొంత ఇబ్బంది పడ్డా. అయితే ఈ విషయంపై ఒత్తిడి పెంచుకోదల్చుకోలేదు. అయితే ఒక ఈవెంట్లో అన్నింటికంటే పతకం గెలవడం ముఖ్యం. ఒక్కసారి 90 మీటర్ల మార్క్ అందుకుంటే అదే నిలకడను కొనసాగించాలని నేను నమ్ముతా. ఒలింపిక్ క్రీడల తర్వాత వరల్డ్ చాంపియన్ ఎలాగైనా గెలవాలని భావించా. ఇప్పుడు ఆ కల నిజమైంది. ♦ భారత ఆల్‌టైమ్ గ్రేట్ అథ్లెట్ అని నా గురించి నేను ఏనాడూ చెప్పుకోలేదు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ చెప్పను. వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం లేదని ఇప్పటి వరకు కొందరు అన్నారు. ఇప్పుడు దానిని సాధించాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దానిపైనే దృష్టి పెడతాను తప్ప ఇలాంటి చర్చలోకి రాను. నిజంగా గ్రేటెస్ట్ ఎలా ఉండాలని అడిగితే మాత్రం నేను ఆరాధించే చెక్ రిపబ్లిక్ త్రోయర్ జాన్ జెలెజ్నీలాగా ఉండాలని చెబుతా. ♦ నా దృష్టిలో ఒలింపిక్స్‌తో పోలిస్తే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే గట్టి పోటీ ఉంటుంది. టాప్ అథ్లెట్లంతా దీని కోసమే సన్నద్ధమై వస్తారు. భవిష్యత్తులో భారత అథ్లెట్లు మరిన్ని విజయాలు సాధిస్తారు. పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్‌తో పోటీని ప్రత్యేకంగా చూడవద్దు. మా ఆటను భారత్, పాకిస్తాన్ మధ్య పోరుగా కొందరు చిత్రీకరిస్తున్నారు. నా ఫోన్లో కూడా అంతా భారత్, పాక్ గురించే మెసేజ్‌లు ఉన్నాయి. మన దేశంలో ఇలాంటి వాతావరణం సహజమే. కానీ దీనిని మా ఇద్దరి మధ్య పోటీగా చూడవద్దు. రెండు దేశాల పేర్లతో ఒత్తిడి పెంచవద్దు. ఈవెంట్లో ఇతర ప్రత్యర్థులందరినీ దృష్టిలో ఉంచుకొని సిద్ధం కావాల్సి ఉంటుంది. సరిగా చూస్తే యూరోపియన్లతో పోటీ పడి రెండు దేశాలు విజయాలు సాధించడం మంచి పరిణామం. రూ. 57 లక్షల 84 వేలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి నీరజ్ 70 వేల డాలర్ల (రూ. 57 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ అందుకున్నాడు. -
ప్రణయ్ ప్రతాపం.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు
దశాబ్దకాలంగా భారత అగ్రశ్రేణి షట్లర్‌గా కొనసాగుతున్న హెచ్ఎస్ ప్రణయ్ ఎట్టకేలకు విశ్వవేదికపై తన సత్తా చాటుకున్నాడు. అత్యంత ప్రతిభావంతుడైనప్పటికీ నిలకడలేమితో ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం తొలిసారి ప్రణయ్ మెడలో పడనుంది. 2021, 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగి పతకానికి చేరువై దూరమైన ఈ కేరళ స్టార్ మూడో ప్రయత్నంలో మాత్రం అసాధారణ ఆటతీరుతో సక్సెస్ సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్, యూరోపియన్ చాంపియన్ అయిన డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్ను అతని సొంతగడ్డపైనే ఓడించి ప్రణయ్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్ చేరిన ప్రణయ్ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మరో అద్భుతం చేశాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–15, 21–16తో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) తో ప్రణయ్ ఆడతాడు. అక్సెల్సన్తో 68 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను చేజార్చుకున్నా నిరాశపడకుండా పట్టుదలతో ఆడి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి ముందంజ వేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న మెగా ఈవెంట్లో ప్రణయ్ ధాటికి అక్సెల్సన్కు అనూహ్య పరాజయం తప్పలేదు. తొలి గేమ్ కోల్పోయిన ప్రణయ్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, మరో కోచ్ గురుసాయిదత్ సూచనలతో తన వ్యూహం మార్చుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ, అడపాదడపా కళ్లు చెదిరే స్మాష్‌లతో ప్రణయ్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనవసర తప్పిదాలు చేసేలా చేశాడు. రెండో గేమ్‌లో స్కోరు 13–10 వద్ద ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. మూడో గేమ్‌లోనూ ప్రణయ్ దూకుడు కొనసాగిస్తూ అక్సెల్సన్పై ఒత్తిడి పెంచాడు. స్కోరు 7–6 వద్ద ప్రణయ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–6తో ముందంజ వేశాడు. ఆ తర్వాత అక్సెల్సన్ తేరుకునే ప్రయత్నం చేసినా ప్రణయ్ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడుతూ విజయం అందుకున్నాడు. సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి పురుషుల డబుల్స్ విభాగం నుంచి ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 18–21, 19–21తో ప్రపంచ 11వ ర్యాంక్ జంట కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్ముసెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. ఇప్పటిదాకా 14 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు గెలిచిన పతకాల సంఖ్య. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు), సైనా నెహ్వాల్ (1 రజతం, 1 కాంస్యం), పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే (1 కాంస్యం), సాయిప్రణీత్ (1 కాంస్యం), కిడాంబి శ్రీకాంత్ (1 రజతం), లక్ష్య సేన్ (1 కాంస్యం), గుత్తా జ్వాల–అశి్వని పొన్నప్ప (1 కాంస్యం), సాత్విక్–చిరాగ్ శెట్టి (1 కాంస్యం) ఈ జాబితాలో ఉన్నారు. ప్రణయ్ సెమీస్‌లో ఓడితే కాంస్య పతకం దక్కుతుంది. ఫైనల్ చేరి గెలిస్తే స్వర్ణ పతకం, ఓడితే రజత పతకం లభిస్తుంది. 2011 నుంచి ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకాలు సాధిస్తుండటం విశేషం. -
పసిడి పోరుకు భారత జట్లు
పారిస్: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కనబరిచిన జోరును భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలోనూ కొనసాగించారు. బుధవారం జరిగిన కాంపౌండ్ విభాగం టీమ్ ఈవెంట్స్‌లో భారత మహిళల, పురుషుల జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 234–233తో ఎల్లా గిబ్సన్, లేలా అనిసన్, ఇసాబెల్ కార్పెంటర్లతో కూడిన బ్రిటన్ జట్టును ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో మెక్సికో జట్టుతో భారత్ బృందం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మెక్సికో 234–233తో దక్షిణ కొరియాపై గెలిచింది. క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి టాప్ సీడ్ హోదాలో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 233–230 ఎస్తోనియా జట్టును ఓడించింది. మరోవైపు ప్రపంచ చాంపియన్ ఓజస్ దేవ్‌తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు కూడా బంగారు పతకంపై గురి పెట్టింది. తొలి రౌండ్లో భారత జట్టు 239–235తో ఇటలీపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 237–235తో మెక్సికో జట్టును ఓడించింది. భారత్, టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో నాలుగు సిరీస్‌ల తర్వాత రెండు జట్లు 235–235తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ అనివార్యమైంది. ‘షూట్ ఆఫ్’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే కొరియా ఆర్చర్లతో పోలిస్తే భారత ఆర్చర్ ఓజస్ దేవ్‌తలే కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండటంతో భారత జట్టును విజేతగా ప్రకటించారు. రెండో సెమీఫైనల్లో అమెరికా 238–234తో డెన్మార్క్‌పై గెలిచి శనివారం జరిగే స్వర్ణ పతక మ్యాచ్‌లో భారత్‌తో పోటీపడేందుకు సిద్ధమైంది. రెండో రౌండ్లో ధీరజ్ బుధవారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో ధీరజ్ 6–2తో ఇమాదిద్దీన్ బాక్రి (అల్జీరియా)పై, అతాను దాస్ 6–0తో ఎలైన్ వాన్ స్టీన్ (బెల్జియం)పై గెలుపొందారు. భారత్‌కే చెందిన మృణాల్ చౌహాన్ 3–7తో ఫ్లోరియన్ ఫాబెర్ (స్విట్జర్లాండ్) చేతిలో, తుషార్ ప్రభాకర్ 2–6తో పీటర్ బుకువాలస్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్ క్వాలిఫయింగ్ టీమ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత జట్టు 2034 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దాంతో భారత జట్టుకు నేరుగా రెండో రౌండ్లోకి ‘బై’ లభించింది. -
డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ల వెనుక మనోడే
విశాఖ స్పోర్ట్స్: ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) టైటిల్ పోరులో భారత్ జట్టు వికెట్ కీపర్‌గా విశాఖకు చెందిన కె.ఎస్.భరత్ ఎంపికయ్యాడు. ప్రస్తుత సీజన్లో తొలిసారిగా టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన ఈ 30 ఏళ్ల కీపర్ బ్యాటర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్‌లు ఆడాడు. ఇవన్నీ భారత్‌లోనే జరిగాయి. కానీ విదేశీ గడ్డపై జరగనున్న ఈ చాంపియన్‌ప్‌లో ఆడేందుకు సెకండ్ ఫ్రంట్‌లైన్ వికెట్‌కీపర్‌గా ఉన్న భరత్‌కు అనూహ్యంగా అవకాశం అందివచ్చింది. పంత్ గాయపడి అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ మంగళవారం ప్రకటించిన భారత్ 15వ మెంబర్ స్క్వాడ్‌లో వికెట్‌కీపర్‌గా అవకాశం దక్కింది. అయితే జట్టులో మరో వికెట్‌కీపర్ బ్యాటర్ కె.ఎల్.రాహుల్ ఉన్నా.. వికెట్ల వెనుక భరతే నిలిచే అవకాశాలు ఉన్నాయి. లండన్‌లో జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే టైటిల్ పోరులో ఆ్రస్టేలియాతో భారత్ తలపడనుంది. భారత్ వేదికగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. మొదటి టెస్ట్‌లో భరత్ తొలి స్టంపౌట్‌గా లబుషేన్‌ను వెనక్కి పంపాడు. సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల్లో తొలి టెస్ట్‌లో ఓ స్టంపౌట్, ఓ క్యాచ్ పట్టిన భరత్.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఆరు క్యాచ్‌లు పట్టాడు. నాలుగో టెస్ట్‌లో 44 పరుగుల కెరీర్ బెస్ట్ స్కోర్‌తో మొత్తంగా 101 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో వచ్చి 67, ఏడో స్థానంలో వచ్చి 26, ఎనిమిదో స్థానంలో వచ్చి 8 పరుగులు చేశాడు. -
Prime Volleyball League 2023: వాలీబాల్ లీగ్‌కు వేళాయె...
బెంగళూరు: గత ఏడాది వాలీబాల్ ప్రియుల్ని అలరించిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఇప్పుడు రెండో సీజన్‌తో మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆశిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సీజన్–2 పోటీల్లో ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు కోల్‌కతా థండర్‌బోల్ట్స్, హైదరాబాద్ బ్లాక్‌హాక్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, కాలికట్ హీరోస్, అహ్మదాబాద్ డిఫెండర్స్, బెంగళూరు టొర్పెడోస్, చెన్నై బ్లిట్జ్, ముంబై మిటియోర్స్ ‘ఢీ’కి రెడీ అయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్ తమ జోరు ఈ సీజన్లోనూ కొనసాగించేందుకు ఉత్సాహంగా ఉంది. ముందుగా శనివారం నుంచి లీగ్ దశలో 28 మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మార్చి 3, 4 తేదీల్లో సెమీఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు. 5న విజేతను తేల్చే ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. బెంగళూరులో నేడు కోల్‌కతా థండర్‌బోల్ట్స్, బెంగళూరు టొర్పెడోస్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతుంది. ఈ నెల 12 నుంచి 21 వరకు హైదరాబాద్ వేదికగా 11 మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మిగిలిన లీగ్ దశ సహా సెమీస్, ఫైనల్ దాకా కొచ్చిలోనే మ్యాచ్‌ల్ని నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు క్లబ్ వాలీబాల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈసారి, వచ్చే ఏడాది క్లబ్ వాలీబాల్ ప్రపంచ చాంపియన్‌షిప్ భారత్‌లోనే జరుగనుండటంతో మరో విశేషం. -
ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ పోటీలకు శ్రీజ అర్హత
World Table Tennis Championships: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది మే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీలకు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా అర్హత పొందారు. దోహాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరి ఈ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్... పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్.. మిక్స్డ్ డబుల్స్‌లో మనిక బత్రా–సత్యన్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందారు. ఇది కూడా చదవండి: బోపన్న, రామ్‌కుమార్ జోడీలు ఓటమి అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 ఏటీపీ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)... రామ్‌కుమార్ (భారత్)–రేయస్ వరేలా (మెక్సికో) జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ బోపన్న–ఎబ్డెన్ 6–7 (4/7), 5–7తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)–టిమ్ ప్యూయెట్జ్ (జర్మనీ) చేతిలో... రామ్–వరేలా 3–6, 4–6తో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–రోజర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని? శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..? -
భారత్‌లో అడుగుపెట్టనున్న మోటో జీపీ.. మెగా ఈవెంట్ ఎప్పుడంటే?
ఫార్ములా రేసింగ్‌ను ఇష్టపడే భారత అభిమానులకు శుభవార్త. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించే మోటో జీపీ బైక్ రేసింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్ తొలిసారి ఇండియాకు రాబోతుంది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్‌ను ''గ్రాండ్ పిక్స్ ఆఫ్ భారత్'' పేరుతో మన దేశంలో నిర్వహించనున్నారు. అందుకోసం గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఫెయిర్స్ట్రీట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్నా స్పోర్ట్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. మోటార్‌సైకిల్ రేసును ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని భారత ప్రేక్షకులకు అందించేందుకు డోర్నా స్పోర్ట్స్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. దీనికోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. అంతేకాదు ఇంటర్నేషనల్ లెవల్ మోటో జీపీ రైడర్లను ఇండియాలో తయారు చేసే దిశగా కృషి చేస్తోంది. మోటో జీపీనే కాదు.. మోటో ఈని కూడా ఇండియాకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకముందు భారత్‌లో తొలిసారి జరిగిన ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రికి కూడా నోయిడాలో ఉన్న ఈ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూటే ఆతిథ్యమిచ్చింది. అయితే ఒక సీజన్‌తోనే ఎఫ్1 ఇండియన్ గ్రాండ్ ప్రిని ముగించింది. ఇప్పుడు మోటో జీపీ రాక రేసింగ్ ప్రియులకు ఆనందాన్నిస్తోంది. చదవండి: తీవ్రంగా గాయపడిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ -
ప్రపంచ చాంపియన్‌షిప్‌పై కసరత్తు
న్యూఢిల్లీ: జపాన్‌లాంటి కోర్టుల్లో ఆడాలంటే చాలా ఓపిక కావాలని భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ అన్నాడు. త్వరలో అక్కడ జరగనున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం కసరత్తు చేస్తున్నానని చెప్పాడు. ‘నేను రెండు వారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పట్లా రొటిన్‌గానే సన్నద్ధమవుతున్నా. నా ప్రాక్టీస్‌లో తేడా ఏమీ లేదు. కానీ టోక్యోలోని బ్యాడ్మింటన్ కోర్టులు మందకొడిగా ఉంటాయి. అక్కడ ఆడాలంటే నేర్పుంటే చాలదు. చాలా ఓర్పు కావాలి. అందుకే నేను ఆటతీరులో సహనం, సంయమనంపై దృష్టిపెట్టాను’ అని అన్నాడు. ఈ నెల 22 నుంచి టోక్యోలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. స్పెయిన్‌లో జరిగిన గత మెగా ఈవెంట్లో ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న అతను ర్యాంకు మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. ‘ర్యాంకుల్లో ఎగబాకడం ఇప్పుడు అంత సులభం కాదు. ఒక్క రేటింగ్ పాయింట్ కూడా కీలకమే. నేను మళ్లీ టాప్–20 ర్యాంకుల్లోకి రావాలంటే ఒక్కో టోర్నీలో నిలకడగా క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ చేరుతుండాలి. అప్పుడు అనుకున్న ర్యాంకుకు చేరుకోగలం’ అని అన్నాడు. ఒకానొక దశలో చక్కని ఆటతీరుతో ప్రపంచ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకిన ప్రణయ్‌ని 2020 నవంబర్‌లో కోవిడ్ దెబ్బతీసింది. మహమ్మారి అతని ప్రదర్శనపై పెను ప్రభావమే చూపింది. ఆ తర్వాత ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ సహకారంతో ఆరోగ్యాన్ని, తర్వాత ఫిట్నెస్ను మెల్లిగా ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. ఈ సీజన్లో ఇండోనేసియా, మలేసియా ఓపెన్లలో సెమీస్ చేరిన ప్రణయ్ స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌తో తృప్తి చెందాడు. థామస్ కప్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. అయితే పెద్ద పెద్ద ఎండార్స్మెంట్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులుంటున్నాయని, మేజర్ టోర్నీల్లో గెలిస్తేనే బ్రాండింగ్ దక్కుతుందని చెప్పాడు. -
WAC 2022: నిరాశ పరిచిన సబ్లే.. 11వ స్థానంతో ముగించి...
World Athletics Championship 2022: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. అమెరికాలోని ఒరెగాన్‌లో జరిగిన ఫైనల్‌ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్‌లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. The pride of Morocco! Olympic champion Soufiane El Bakkali 🇲🇦 runs 8:25.13 to claim world gold and confirms his 3000m steeplechase dominance 💪#WorldAthleticsChamps pic.twitter.com/Ym2CVrdv1B — World Athletics (@WorldAthletics) July 19, 2022 -
'రిటైర్ అయ్యే రోజున కచ్చితంగా పతకం అందుకుంటా'
అమెరికా లెజెండరీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ పతకంతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఓరెగాన్‌లోని హ్యూజిన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఫెలిక్స్ 4X400 మీటర్ల మిక్స్డ్ రిలేలో కాంస్య పతకం సాధించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అలిసన్ ఫెలిక్స్‌కు ఇది 19వ పతకం కావడం విశేషం. 36 ఏళ్ల అలిసన్ ఫెలిక్స్ అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ టీమ్‌లో ఎన్నో ఏళ్లుగా ముఖ్య క్రీడాకారిణిగా ఉంది. తన కెరీర్లో ఫెలిక్స్ 19 వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాలతో పాటు 13 ఒలింపిక్ పతకాలు గెలుచుకుంది. ఏడుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేతగా అలిసన్ ఫెలిక్స్ నిలవడం విశేషం. తాను రిటైర్ అయ్యే రోజున కచ్చితంగా మెడల్ అందుకుంటానని అలిసన్ ఫెలిక్స్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. తాజాగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకంతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అలీసన్ తన మాటను నిలబెట్టుకుంది. What a race 🔥 The Dominican Republic 🇩🇴 overtakes the Netherlands 🇳🇱 and the USA 🇺🇸 in the dying metres to take world mixed 4x400m victory!#WorldAthleticsChamps pic.twitter.com/tJb3EWKpid — World Athletics (@WorldAthletics) July 16, 2022 చదవండి: Kick Boxing: నిర్లక్ష్యం.. రింగ్‌లోనే కుప్పకూలిన కిక్ బాక్సర్ Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో వేర్వేరుగా వసతి! -
కిడాంబి శ్రీకాంత్ రిటర్న్స్..!
సాక్షి క్రీడా విభాగం: నాలుగేళ్ల క్రితం... కిడాంబి శ్రీకాంత్ కొట్టిందే స్మాష్... గెలిచిందే టైటిల్! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌తో 2017లో అతను ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్... ఈ నాలుగు ఫైనల్ మ్యాచ్‌లలో కూడా సంపూర్ణ ఆధిపత్యం... ఏ ప్రత్యర్థి చేతిలోనూ ఒక్క గేమ్ కూడా ఓడకుండా శ్రీకాంత్ ఈ విజయాలు సాధించాడు. ఇలాంటి ప్రదర్శన ఫలితంగానే 2018 ఏప్రిల్‌లో వారం రోజుల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా అతను నిలిచాడు. అయితే ఆ తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఆట లయ తప్పింది... పేలవ ప్రదర్శనతో అన్సీడెడ్లు, అనామకుల చేతిలో వరుస పరాజయాలు, మధ్యలో ఇబ్బంది పెట్టిన మోకాలి గాయం, టైటిల్ సంగతి తర్వాత, ఆరంభ రౌండ్లు దాటితే చాలనే పరిస్థితి ఒకదశలో కనిపించింది. గత నాలుగేళ్లలో ఒకే ఒక టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లగలిగాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అతను అర్హత సాధించలేకపోయాడు. ఒక రకంగా మళ్లీ ‘సున్నా’ నుంచి మొదలు పెట్టాల్సిన స్థితిలో శ్రీకాంత్ నిలిచాడు. అయితే అతను వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో సత్తా చాటి మళ్లీ పైకి లేచాడు. ఒక్కో టోర్నీకి తన ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం సాధించి తానేంటో మళ్లీ నిరూపించుకున్నాడు. నవంబర్‌లో హైలో ఓపెన్ (జర్మనీ)లో శ్రీకాంత్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. గత రెండేళ్లలో అతనికి ఇదే తొలి సూపర్–500 సెమీఫైనల్. మ్యాచ్ గెలిచిన తర్వాత ‘ఎన్నో ఏళ్ల క్రితం నేను తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడినప్పుడు కలిగిన భావనే ఇప్పుడూ వచ్చింది. మళ్లీ కొత్తగా మొదలు పెడుతున్నట్లుంది’ అని వ్యాఖ్యానించడం ఈ ప్రదర్శన విలువేమిటో చెబుతుంది. మోకాలి గాయంతో 2019లో శ్రీకాంత్ ప్రదర్శన ఆశించిన రీతిలో సాగలేదు. అతని బలమైన అటాకింగ్ గేమ్ కూడా బాగా దెబ్బతింది. ఆ ఏడాది ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచినా, ఓవరాల్‌గా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. దాంతో గాయానికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు శ్రీకాంత్ సిద్ధమయ్యాడు. సర్జరీ తర్వాత మళ్లీ ఆటను మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ఉండగానే ప్రపంచాన్ని కరోనా చుట్టేసింది. తాను కోరుకున్నా ఆడలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో రీహాబిలిటేషన్పైనే దృష్టి పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ షట్లర్ 2020 అక్టోబరులో డెన్మార్క్ ఓపెన్‌తో మళ్లీ బరిలోకి దిగి క్వార్టర్ ఫైనల్ చేరగలిగాడు. అయితే మోకాలు మాత్రం భయపెడుతూనే ఉంది. ‘గాయం నుంచి కోలుకున్నా సరే, ‘స్మాష్’కు ప్రయత్నిస్తే మళ్లీ ఏమైనా జరగవచ్చేమో అనే సందేహం శ్రీకాంత్ మనసులో ఏదో ఓ మూల వెంటాడుతూనే ఉంది. అందుకే తన శైలికి భిన్నమైన డిఫెన్స్ తరహా ఆటకు కూడా అతను ప్రయత్నించాడు. అయితే అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2021లో ఆడిన తొలి ఆరు టోర్నీలలోనూ ఇది కనిపించింది’ అని భారత జట్టు కోచ్‌లలో ఒకడైన సియాదతుల్లా చెప్పాడు. స్పెయిన్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్ పతకం ఖరారైనా... ఈ సెప్టెంబర్‌లో మొదలైన యూరోపియన్ సర్క్యూట్‌తోనే శ్రీకాంత్ ఆట ఒక్కసారిగా మారింది. 2021లో అతని ఆటను రెండుగా విభజించి చూస్తే రెండో దశలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు ఆరు నెలల విరామం తర్వాత సాగిన ఈ కొత్త ప్రయాణంలో శ్రీకాంత్ ఆట కూడా కొత్తగా కనిపించింది. ఇన్నాళ్లూ వేధించిన గాయం సమస్యను అతను అధిగమించి పూర్తి ఫిట్‌గా ఒకప్పటి శ్రీకాంత్‌ను గుర్తుకు తెచ్చాడు. డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్లలో వరుసగా రెండుసార్లు వరల్డ్ నంబర్‌వన్ మొమొటా చేతిలో ఓడినా శ్రీకాంత్ ఆట మాత్రం గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా కనిపించింది. ఫ్రెంచ్ ఓపెన్లోనైతే రెండు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని, ఆపై వరుసగా నాలుగు పాయిం ట్లు గెలిచి మ్యాచ్‌ను మూడో గేమ్ వరకు తీసుకెళ్లడంతో అతనిలో ఆత్మవిశ్వాసం కూడా ఎంతో పెరిగింది. హైలో ఓపెన్‌లో లాంగ్ ఆంగస్‌పై గెలిచిన తీరు నిజంగా సూపర్. ఆపై బాలిలో జరిగిన మూడు టోర్నీల్లో మరింత స్వేచ్ఛగా ఆడాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గ్వాంగ్ జుతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లోనే శ్రీకాంత్ దూకుడు కనిపించగా, క్వార్టర్స్‌లో కాల్జూను ఓడించిన తీరును ప్రశంసించకుండా ఉండలేం. శ్రీకాంత్ తాజా ప్రదర్శన భవిష్యత్తులో అతను మరిన్ని ప్రతిష్టాత్మక విజయాలు సాధించగలడనే నమ్మకాన్ని కలిగించడం శుభపరిణామం! -
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు తొలిసారి సైనా దూరం
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు దూరమైంది. 2006 నుంచి క్రమం తప్పకుండా ఈ టోర్నీ ఆడుతున్న ఆమె ఈ ఏడాది మాత్రం తప్పుకుంది. స్పెయిన్‌లో ఈ నెల 12 నుంచి 19 వరకు ఈ టోర్నీ జరగనుంది. ప్రస్తుతం ఆమె మోకాలి గాయం నుంచి కోలుకుంటుంది. గత కొంతకాలంగా సైనా ఏ టోర్నీనీ పూర్తిస్థాయిలో ఆడలేకపోయింది. ఉబెర్ కప్, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేందుకు వచ్చి గాయంతో మధ్యలోనే వైదొలిగింది. -
అంతర్జాతీయ వేదికపై భారత్‌కు పతకాల పంట
వ్రోక్లా (పోలాండ్): ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. శనివారం మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి ఏడు పతకాలు గెలిచారు. కొరియా, చైనా ఆర్చర్ల గైర్హాజరీని భారత ప్లేయర్లు సద్వినియోగం చేసుకున్నారు. క్యాడెట్ మహిళల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో పర్ణీత్ కౌర్, ప్రియా గుర్జర్, రిధి వర్షిణిలతో కూడిన భారత బృందం 228–216తో టర్కీ జట్టును ఓడించింది. క్యాడెట్ పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో కుశాల్ దలాల్, సాహిల్ చౌదరీ, నితిన్‌లతో కూడిన భారత జట్టు 233–231తో అమెరికా జట్టుపై గెలిచింది. కాంపౌండ్ మిక్స్డ్ ఫైనల్లో ప్రియా–కుశాల్ ద్వయం 155–152తో అమెరికా జోడీపై నెగ్గింది. క్యాడెట్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో ప్రియా గుర్జర్ 136–139తో సెలెన్ రోడ్రిగెజ్ (మెక్సికో) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. ఇదే విభాగం కాంస్య పతక పోరులో పర్ణీత్ 140–135తో హేలీ బౌల్టన్ (బ్రిటన్)ను ఓడించి కాంస్య పతకం సాధించింది. కాంపౌండ్ జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో సాక్షి 140–141తో అమందా మ్లినారిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకోగా... కాంపౌండ్ జూనియర్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక పోరులో రిషభ్ యాదవ్ 146–145తో సెబాస్టియన్ గార్సియా (మెక్సికో)పై గెలిచి కాంస్యం సాధించాడు. -
మేరీకోమ్ X నిఖత్
న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పట్టుదల నెగ్గింది. భారత దిగ్గజం మేరీకోమ్‌తో ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ పోరు నిర్వహించాలనే ఆమె మొరను కేంద్ర క్రీడాశాఖ, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆలకించాయి. ఇద్దరి మధ్య ట్రయల్ బౌట్ పెట్టాలని బీఎఫ్ఐని క్రీడాశాఖ ఆదేశించింది. దీంతో బీఎఫ్ఐ డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లందరికీ సెలక్షన్ బౌట్లను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇటీవల బీఎఫ్ఐ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్‌కి అనుకూలంగా వ్యవహరించింది. ట్రయల్స్ లేకుండానే 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ని ఒలింపిక్స్ క్వాలియఫర్స్కు ఎంపిక చేసింది. ఇది వివాదం రేపింది. తన ఒలింపిక్స్ అవకాశాల్ని ఇలా తుంచేయడాన్ని సహించలేకపోయిన నిఖత్ ఏకంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అందులో కోరింది. దీనిపై ఎట్టకేలకు స్పందించిన క్రీడాశాఖ ట్రయల్స్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లకు ట్రయల్స్ పోటీలు జరుగనున్నాయి. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్, నిఖత్ల మధ్య నిర్వహించే ట్రయల్స్ బౌట్లో నెగ్గిన బాక్సర్... ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సంపాదిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో ఈ క్వాలిఫయర్స్ పోటీలు జరుగుతాయి. 51 కేజీల విభాగంతోపాటు 57, 60, 69, 75 కేజీల విభాగాల్లో కూడా సెలెక్షన్ ట్రయల్స్ బౌట్లు ఉంటాయి. ఆ ఇద్దరికి మినహాయింపు... ఇక పురుషుల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన అమిత్ పంఘాల్ (52 కేజీలు), కాంస్యం సాధించిన మనీశ్ కౌశిక్ (63 కేజీలు)లకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా జట్టులోకి ఎంపిక చేయనున్నారు. మిగతా ఆరు కేటగిరీల్లో (57, 69, 75, 81, 91, ప్లస్ 91 కేజీలు) మాత్రం డిసెంబర్ 27, 28 తేదీల్లో ట్రయల్స్ ఉంటాయి. -
షెల్లీ గెలిచింది మళ్లీ...
తల్లి హోదా వచ్చాక తమలో ప్రావీణ్యం మరింత పెరిగిందేకానీ తరగలేదని జమైకా మేటి అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్... అమెరికా స్టార్ అలీసన్ ఫెలిక్స్ నిరూపించారు. మహిళల 100 మీటర్ల విభాగంలో తనకు తిరుగులేదని షెల్లీ మరోసారి లోకానికి చాటి చెప్పగా... ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన అథ్లెట్‌గా అలీసన్ ఫెలిక్స్ గుర్తింపు పొందింది. 11 స్వర్ణాలతో జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ పేరిట ఉన్న రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్ బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో 33 ఏళ్ల ఫెలిక్స్‌కు 17వ పతకం కావడం విశేషం. దోహా (ఖతర్): తక్కువ ఎత్తు ఉన్నా... ట్రాక్‌పై చిరుతలా దూసుకెళ్లే అలవాటుతో... ‘పాకెట్ రాకెట్’గా ముద్దు పేరు సంపాదించిన జమైకా మేటి మహిళా అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్ మళ్లీ విశ్వవేదికపై కాంతులీనింది. తొలి సంతానం కోసం 2017 ప్రపంచ చాంపియన్ షిప్‌కు దూరమైన షెల్లీ... మగశిశువుకు జన్మనిచ్చాక ఈ ఏడాది మళ్లీ ట్రాక్‌పై అడుగు పెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రాణిస్తుందో లేదో అనే అనుమానం ఉన్న వారందరి అంచనాలను తారుమారు చేసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 5 అడుగుల ఎత్తు ఉన్న షెల్లీ 10.71 సెకన్లలో గమ్యానికి చేరి ఏకంగా నాలుగోసారి 100 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. రాకెట్ వేగంతో రేసును ఆరంభించిన షెల్లీ 20 మీటర్లకే తన ప్రత్యర్థులను వెనక్కినెట్టి అందరికంటే ముందుకు వెళ్లిపోయింది. అదే జోరులో రేసును ముగించేసింది. డీనా యాషెర్ స్మిత్ (బ్రిటన్–10.83 సెకన్లు) రజతం... మేరీ జోసీ తా లూ (ఐవరీకోస్ట్–10.90 సెకన్లు) కాంస్యం సాధించారు. గతంలో షెల్లీ 2009, 2013, 2015లలో కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు గెలిచింది. రేసు ముగిసిన వెంటనే షెల్లీ తన రెండేళ్ల కుమారుడు జియోన్‌తో సంబరాలు చేసుకుంది. ‘మళ్లీ స్వర్ణం గెలిచి... నా కుమారుడితో విశ్వవేదికపై సగర్వంగా నిల్చోవడం చూస్తుంటే నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. గత రాత్రంతా నాకు నిద్ర లేదు. 2016 రియో ఒలింపిక్స్ సమయంలోనూ ఇలాగే జరిగింది. శుభారంభం లభిస్తే చాలు రేసులో దూసుకుపోతానని తెలుసు. అదే వ్యూహంతో ఈసారీ బరిలోకి దిగాను. కొన్నాళ్లుగా తీవ్రంగా కష్టపడ్డాను. భర్త జేసన్, కుమారుడు జియోన్ నాలో కొత్త శక్తిని కలిగించారు’ అని షెల్లీ వ్యాఖ్యానించింది. ఫెలిక్స్...12వ స్వర్ణం గత నవంబర్‌లో ఆడ శిశువు కామ్రిన్కు జన్మనిచ్చాక... ఈ ఏడాది జులైలో ట్రాక్‌పైకి అడుగు పెట్టిన అలీసన్ ఫెలిక్స్ 4x400 మిక్స్డ్ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. దాంతో 11 స్వర్ణాలతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన ఉసేన్ బోల్ట్ రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్ బద్దలు కొట్టింది. గతంలో ఫెలిక్స్ 2005 (1), 2007 (3), 2009 (2), 2011 (2), 2015 (1), 2017 (2) ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ పసిడి పతకాలు సాధించింది. జావెలిన్ ఫైనల్లో అన్ను రాణి... సోమవారం భారత అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల జావెలిన్ త్రో విభాగంలో అన్ను రాణి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు 12 మంది పాల్గొనే ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ ‘ఎ’ గ్రూప్‌లో పోటీపడిన అన్ను రాణి ఈటెను 62.43 మీటర్ల దూరం విసిరింది. ఈ క్రమంలో 62.34 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. ఓవరాల్‌గా క్వాలిఫయింగ్‌లో తొమ్మిదో స్థానంతో అన్ను రాణి నేడు జరిగే ఫైనల్‌కు అర్హత పొందింది. మహిళల 200 మీటర్ల హీట్స్‌లో అర్చన 23.65 సెకన్లలో గమ్యానికి చేరి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచింది. మహిళల 400 మీటర్ల హీట్స్‌లో భారత్‌కే చెందిన అంజలీ దేవి 52.33 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచింది. -
టోక్యో ఒలింపిక్స్‌కు వినేశ్ ఫొగాట్
నూర్-సుల్తాన్ (కజకిస్తాన్): భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బుధవారం 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లోని సెకండ్ రేప్‌చేజ్ రౌండ్లో ఆమె సరా అన్ హిల్డర్బ్రాండ్ట్ (అమెరికా)ను సునాయసంగా ఓడించి.. 53కేజీల విభాగంలో ఒలింపిక్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్నారు. 8-2 తేడాతో సరాను ఓడించిన ఫొగాట్.. గ్రీస్‌కు చెందిన టాప్ రెజ్లర్ మరియా ప్రెవోలరాకితో తలపడనున్నారు. మరియాపై గెలుపొందితే ఆమె కాంస్య పతకం సొంతం చేసుకుంటారు. మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మయు ముకయిద (జపాన్) 7-0 తేడాతో ఫొగాట్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ జపాన్ రెజ్లర్ తన జైత్రయాత్ర కొనసాగించి గెలిచి ఫైనల్ చేరింది. దీంతో వినేశ్‌కు ‘రెపిచేజ్’లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలో యులియా బ్లహిన్యా (ఉక్రెయిన్), సరాలను ఓడించిన వినేశ్.. మరియాపై కూడా విజయం సాధిస్తే.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లోని కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంటారు. -
'ఈ సారి ఎలాగైనా సాధిస్తా'
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ చాంపియన్‌షిప్ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టిపెట్టినట్లు చెప్పింది. ఈ మెగా ఈవెంట్లో గతంలో సింధు నాలుగు పతకాలు సాధించింది. రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలు నెగ్గింది. కానీ స్వర్ణం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఫైనల్ చేరిన రెండుసార్లు పరాజయమే చవిచూసింది. అయితే ఈ సారి మాత్రం టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నానని 24 ఏళ్ల సింధు చెప్పు కొచ్చింది. ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ జరుగనుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ప్రాక్టీస్‌లో కఠోరంగా శ్రమించా. ఈ సారి తప్పకుండా స్వర్ణం సాధిస్తానన్న నమ్మకముంది. అలాగని నాపై ఒత్తిడేమీ లేదు. మంచి ప్రదర్శన కనబరుస్తాను. డిఫెన్స్, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. అలాగే ఆటతీరు కూడా మెరుగయ్యేందుకు కష్టపడ్డాను’ అని తెలిపింది. తెలుగుతేజంకు జపాన్ ప్రత్యర్థి యామగుచి కొరకరాని కొయ్య గా మారింది. ఇండోనేసియా, జపాన్ టోర్నీల్లో సింధుకు చుక్కలు చూపించింది. ఆమెను ఎదుర్కోవడంపై ఎలాంటి కసరత్తు చేశారని ప్రశ్నిం చగా.... ‘యామగుచితో పోరు కష్టమేమీ కాదు. ఇండోనేసియా టోర్నీలో ఆమెను దీటుగా నే ఎదుర్కొన్నా. కానీ ఆమె అటాకింగ్ బాగా చేసింది. ర్యాలీల్లోనూ దిట్టే! కాబట్టి ఆమె దూకుడు నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. ఆమెతో నేను తలపడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని సింధు వివరించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. తొలిరౌండ్లో ఆమెకు బై లభించింది. రెండో రౌండ్లో చైనీస్‌తైపీకి చెందిన పాయ్ యు పొ లేదంటే లిండా (బల్గేరియా)తో తలపడే అవకాశముంది. ఇందులో గెలిస్తే... తదుపరి రౌండ్లో బీవెన్ జంగ్ (అమెరికా)ను ఎదుర్కొంటుంది. ఈ అడ్డంకులన్నీ దాటితే క్వార్టర్స్‌లో తైపీ స్టార్ తై జు యింగ్ ఎదురయ్యే అవకాశాలున్నాయి. -
వరల్డ్ చాంపియన్‌షిప్ నుంచి ఔట్
ఇటీవలే థాయిలాండ్ ఓపెన్ గెలిచి ఊపు మీదున్న భారత డబుల్స్ బ్యాడ్మింటన్ జంట సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి అనూహ్యంగా వరల్డ్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్నారు. ‘సాతి్వక్ భుజం గాయంతో బాధపడుతుంటే నా పక్కటెముకల గాయం కూడా తగ్గలేదు. మా ఫామ్, ఫలితాలను బట్టి చూస్తే ఇది కఠిన నిర్ణయమే అయినా మాకు మరో అవకాశం లేదు’ అని చిరాగ్ శెట్టి వెల్లడించాడు.