yatra
-
విజ్ఞాన యాత్రలో విషాదం
విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు చేపట్టిన విజ్ఞాన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు కావడంతో ఈ నెల 2న 80 మంది న్యాయవాదులు విజయవాడ నుంచి 2 బస్సుల్లో యాత్రకు బయలుదేరారు. ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు న్యాయస్థానాలు, విజ్ఞాన ప్రాంతాలను చూసుకుంటూ ఈ నెల 6న రాజస్థాన్ చేరుకున్నారు. 7న రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి జైపూర్ వస్తుండగా మార్గ మధ్యలోని జో«ధ్‌పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు బీబీఏ కార్యదర్శి అరిగల శివరామప్రసాద్ (రాజా), న్యాయవాదులు పద్మజ, అరుణదేవి, నాగరాజు, గంగాభవాని, జయలక్ష్మీ, సత్యవాణి, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు జ్యోత్స్న విద్యార్ధి ఉద్యమ కార్యకర్తగా పనిచేశారు. నేటి తరుణీతరంగాలు, సేఫ్ లను స్థాపించడంతో కీలకభూమిక పోషించారు. జ్యోత్స్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని విమానంలో బుధవారం విజయవాడ తీసుకువచ్చేందుకు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. క్షతగాత్రులైన వారు సైతం విమానంలో విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానం టికెట్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీబీఏ కార్యదర్శి రాజా తెలిపారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు. రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మతో ఫోన్లో మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. -
భారత్-నేపాల్ మైత్రి యాత్ర రైలు ప్రారంభం.. టిక్కెట్ ఎంతంటే..
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన భారత్ గౌరవ్ రైలు సిరీస్‌లో మరో రైలు ప్రారంభమైంది. భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలు నేపాల్ పర్యటన కోసం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి పరుగులందుకుంది.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రయాణంతో పర్యాటకులు భారత్ - నేపాల్ భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వాన్ని చవిచూడగలుగుతారు. ఈ యాత్రకు ‘ఇండియా- నేపాల్ మైత్రి యాత్ర’ అని పేరు పెట్టారు. రైల్వేల ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ సందర్శించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా భారత్ గౌరవ్ యాత్ర పేరుతో ఈ నూతన సేవను ప్రారంభించామని, ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త భారత్ గౌరవ్ యాత్రలు ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఈ భారత్ గౌరవ్ రైలులో ప్రయాణికులు భారతదేశం- నేపాల్‌ల సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ఒకే ప్యాకేజీలో పర్యటించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 'ఇండియా నేపాల్ మైత్రి యాత్ర' ప్రయాణం 9 రాత్రులు, 10 పగళ్లు ఉండనుంది. ఈ రైలు ప్యాకేజీలో అయోధ్య, కాశీ, సీతామర్హి, జనక్‌పూర్, పశుపతినాథ్, బిండియా బస్ని టెంపుల్లను దర్శించవచ్చు. ప్రయాణికుల బస, ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారతీయ రైల్వే కల్పిస్తుంది.ఈ రైలులో మొదటి ఏసీ క్యాబిన్ ఛార్జీ ఒక్క వ్యక్తికి రూ.1,05,500, ఇద్దరికి రూ.89,885, ముగ్గురికి రూ.87,655లు ఉంటుంది. ఇందులో బెడ్ విత్ చైల్డ్ ఛార్జీ రూ.82,295. సెకండ్ ఏసీలో ఒక్క వ్యక్తి టిక్కెట్ ధర రూ.94,735. ఇద్దరు వ్యక్తులకు రూ.79,120 కాగా, ముగ్గురికి రూ.76,890. ఇందులో బెడ్‌తో కూడిన పిల్లల ఛార్జీ రూ.71,535గా ఉంది. థర్డ్ ఏసీలో ఒక్క వ్యక్తికి రూ.81,530, ఇద్దరికి రూ.66,650, ముగ్గురికి రూ.64,525. ఇందులో బెడ్‌తో కూడిన పిల్లల ఛార్జీ రూ.60,900గా ఉంటుంది. ఈ రైలులో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన సీట్లతో పాటు పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. రైలులో ప్రయాణికుల కోసం రెండు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో 370 రోజులకు పైగా! -
Kedarnath: మట్టిపెళ్లల్లో కూరుకుపోయి నలుగురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్రా మార్గంలో పెద్ద ప్రమాదం జరిగింది. సోన్‌ప్రయాగ్ -గౌరీకుండ్ మధ్య మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద పలువురు కూరుకుపోయారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. మట్టిపెళ్లల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. పలు విపత్తుల కారణంగా యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా పరిస్థితులు కాస్త అనుకూలించడంతో యాత్ర మళ్లీ వేగం పుంజుకుంది. అయితే తాజా ఘటన తర్వాత అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తమైంది. స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలంలో ఉంటూ, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. -
మణిమహేష్ యాత్ర ప్రారంభం
హిమాచల్ ప్రదేశ్‌లో జన్మాష్టమికి మొదలై రాధాష్టమికి ముగిసే యాత్రను మణిమహేష్ యాత్ర అని అంటారు. ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అటు ప్రకృతి ప్రేమికులకు, ఇటు సాహస ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రాంతం ఇది. అలాగే విహారయాత్రలు చేసేవారికి, ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టేవారికి హిమాచల్‌ప్రదేశ్ గమ్యస్థానంగా నిలిచింది.వర్షాకాలం మినహా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించవచ్చు. ముఖ్యంగా జన్మాష్టమి నుండి రాధాష్టమి వరకు మణిమహేష్ సరస్సును సందర్శించేందుకు ఉత్తమమైన సమయం. దాల్ సరస్సునే మణిమహేష్ సరస్సును అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి అనంతరం మణిమహేష్ సరస్సును చూసేందుకు యాత్రికులు తరలివస్తుంటారు.ఆగస్టు 26 నుండి మణిమహేష్ యాత్ర ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మణిమహేష్ సరస్సును సందర్శించవచ్చు. కైలాస శిఖరంపై నివసిస్తున్న మణిమహేషుడు(మహాశివుడు)ఈ సమయంలో దాల్ సరస్సునుంచి అద్భుతంగా కనిపిస్తాడని చెబుతారు. మణిమహేష్ యాత్ర ప్రతియేటా సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే జన్మాష్టమి నుంచి మొదలువుతుంది. తొమ్మదివ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చెందిన రాజు సాహిల్ వర్మన్ ఇక్కడే శివుణ్ణి దర్శనం చేసుకున్నాడని చెబుతారు. సెప్టెంబర్ 11 రాధాష్టమితో మణిమహేష్ యాత్ర పరిసమాప్తమవుతుంది. -
విశాఖపట్నం : భక్తిశ్రద్ధలతో మార్వాడిల కావడి యాత్ర (ఫొటోలు)
-
Madhya Pradesh: కావడియాత్రలో విషాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావడియాత్రికులతో కూడిన ట్రాక్టర్‌ను ఒక ట్రక్కు బలంగా డీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు కావడి యాత్రికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మొరెనా జిల్లాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు కావడియాత్రికులు ఖాదియాహర్ గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఘాట్‌కు ట్రాక్టర్లో తరలివెళ్తున్నారు.డియోరీ గ్రామ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వీరి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కావడియాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన 12 మందికి పైగా క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్వర్ యాత్ర: సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి షాక్
కన్వర్ యాత్రా మార్గంలో తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించింది. జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లను రాయాలని తొలుత ఆదేశించింది. తరువాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశాయి. వీటిపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. విచారణలో ఈ మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలిపాలని కోరింది. దుకాణదారులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. తమ వద్ద ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.దీనికిముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో మాట్లాడుతూ ఇది ఆందోళనకరమైన పరిస్థితి అని, మైనారిటీలను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నదని పేర్కొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సియు సింగ్ మాట్లాడుతూ పలువురు పేదలు, కూరగాయలు, టీ దుకాణాలు నడుపుతున్నారని, ఇటువంటి చర్యల వలన వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని అన్నారు.విచారణ అనంతరం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లో జారీ చేసిన నేమ్ ప్లేట్లకు సంబంధించిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్టే విధించింది. మూడు రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. నేమ్ ప్లేట్ వివాదంపై తదుపరి విచారణ జూలై 26న జరగనుంది. అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. -
యూపీలో కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర
లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అధికారం ఇవ్వకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని యూపీలో బరిలోకి దిగిన హస్తం పార్టీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరించింది. సమాజ్‌వాదీ పార్టీతో కలిసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని దెబ్బ తీసింది. దీంతో యూపీలో ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమి తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయోత్సాహంతో యూపీలో జూన్11నుంచి15 దాకా ధన్యవాద్ యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర జరగనున్నట్లు తెలిపింది. పార్టీ సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా సమాజాంలోని పలు వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగం కాపీలను బహుకరించనున్నారు. -
జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునే యాత్రికుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ “జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజు ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 22న సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ పర్యాటక రైలు అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచి్చ, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించి జూన్ 30న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి.సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలుకు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో యాత్రికులు ఎక్కిదిగేందుకు అవకాశం కలి్పంచారు. ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ రూ.14,250, 3 ఏసీ రూ.21,900, 2 ఏసీ రూ.28,450గా ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన యాత్రికులు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయం గాని సెల్ : 9281495848, 8287932312 నంబర్ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. -
ఇన్నోవేషన్ యాత్ర 2024: ఆలోచనకు పునాది వేయనున్న ముగింపు!
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC), నవమ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యంత విజయవంతమైన 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' ముగింపు వేడుకలకు ఆహ్వానించడానికి 'అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్బాక్స్' ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. నెట్వర్క్ ఆఫ్ ఎకోసిస్టమ్ పాట్నర్స్, ఈవెంట్ స్పాన్సర్‌గా నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్), అసోసియేట్ పార్టనర్‌గా లాజులిన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. 2024 మార్చి 12 నుంచి ప్రారంభమైన ఐదు రోజుల బస్సు యాత్ర 16వ తేదీ ముగుస్తుంది. ఈ ప్రయాణం నిజామాబాద్ నుంచి ప్రారంభమై పర్యావరణ వ్యవస్థలను అన్వేషిస్తూ.. సాగుతుంది. ఈ ప్రయాణం నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట ప్రాంతాలలో పర్యటించి హైదరాబాద్‌లోని ఏసీఐసీ-సీబీఐటీలో ముగుస్తుంది. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు ఇలా.. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు (మార్చి 16) యాత్రలో పాల్గొన్నవారు వారి విజయాలను జరుపుకుంటారు, వారి సృజనాత్మకను కూడా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 6 గంటలకు ACIC-CBIT, గండిపేటలో జరుగుతుంది. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ కింది విషయాలను తెలుసుకోవచ్చు. విజయవంతమైన వ్యవస్థాపకులు, స్థానిక ఆవిష్కర్తల నెట్వర్క్ అనుభవాల ద్వారా సమాజ అవసరాల గురించి లోతైన అవగాహన సమస్యకు పరిష్కారం తెలుసుకునే నైపుణ్యం ఆలోచనను ఉపయోగించి వాస్తవ-ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం భావసారూప్యత గల వ్యక్తుల సహాయక సంఘాన్ని నిర్మించడం గ్రామీణ ఆవిష్కర్తల కథల నుంచి ప్రేరణ -
కొంగొత్త ఆలోచనలకు అంకురం... ఇన్నొవేషన్ యాత్ర 2024!
అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్బాక్స్ నేతృత్వంలో.. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ (TSIC) భాగస్వామ్యంతో 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' (Innovation Yatra - 2024) పేరుతో ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇందులో ఎలా పాల్గొనాలి, ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు జరుగుతుందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ఇన్నోవేషన్ యాత్ర - 2024 రేపటితో ప్రారంభమై శనివారం వరకు (మార్చి 12 నుంచి 16) జరగనుంది. ఇందులో నవమ్ ఫౌండేషన్, ఎకో సిస్టం భాగస్వాములుగా Ag-Hub, అడ్వెంచర్ పార్క్, AIC-GNITS, కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పల్లె సృజన మొదలైనవి భాగస్వాములుగా పాల్గొంటాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇన్నోవేషన్ యాత్ర 5 రోజులు, 60 మంది యాత్రికులు, 6 గమ్యస్థానాలు, 800 కి.మీ సాగుతుంది. ఇది ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎవరైనా ఈ యాత్రలో పాల్గొనటానికి అప్లై చేసుకోవచ్చు. ఐదు రోజులు జరిగే ఈ బస్సు యాత్రలో పాల్గొనేవారు విజవయంతమైన వ్యవస్థాపకులు, లోకల్ ఇన్నోవేటర్స్తో సమయాన్ని గడపవచ్చు. ఈ ప్రయాణంలో మంచి అనుభవాలు పొందటమే కాకుండా.. విలువైన విషయాలను తెలుసుకోగలుగుతారు. ఈ యాత్రలో పాల్గొనేవారు తెలంగాణలోని విభిన్న కమ్యూనిటీలను కలుసుకోవడం, వారి ప్రత్యేకమైన అవసరాలు.. వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి లోతైన అవహగాన పొందటమే కాకుండా, వారి అనుభవాల పట్ల సానుభూతిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. నిజ జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి కావలసిన మనస్తత్వం మీలో పెంపొందించుకోవడంలో ఈ యాత్ర తప్పకుండా తోడ్పడుతుంది. ఇన్నోవేషన్ యాత్రలో వ్యక్తిగత అభివృద్ధికి అతీతంగా.. విభిన్న నేపథ్యాలకు చెందిన 59 యాత్రికులతో కనెక్ట్ అవుతారు. దీని ద్వారా మీకు కావలసిన జ్ఞానాన్ని పొందుతారు. సవాళ్లను సృజనాత్మకంగా ఎదుర్కోవడానికి, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఈ యాత్ర ద్వారా సంపాదించవచ్చు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ఆవిష్కర్తల స్ఫూర్తిదాయకమైన కథలను ప్రదర్శించడం కూడా ఇందులో ఒక భాగం. వారు సాధించిన విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనేది యాత్ర లక్ష్యం. -
బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో కోడిగుడ్ల దాడి
-
నీటి పోరు యాత్రకు సిద్ధమైన బీఆర్ఎస్
-
జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు
రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. -
Yatra 2 @ London : లండన్‌లో యాత్ర 2 సక్సెస్ మీట్
యాత్ర 2 సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తోంది. విదేశాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులను, ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. యూకే & యూరప్ YSRCP వింగ్ ఆధ్వర్యంలో లండన్ మహానగరంలోని హౌన్సలో ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. మనం చూసే ప్రతి సినిమా మనలో ఒకరి జీవన ప్రతిబింబం. కొందరి జీవితాలు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని అటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని వినోదాత్మకంగా మరియు సందేశాత్మకంగా సినిమాని మలచడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు లండన్‌లోని YSRCP వింగ్ నాయకులు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. యాత్ర2 సినిమా చూసిన తరువాత ఇది అద్భుతం అని అనకుండా వుండలేమన్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని హృద్యంగా చిత్రీకరించిన సన్నివేశాలతో మహీ రాఘవ ప్రేక్షకులను కట్టిపడేశాడని కొనియాడారు. అలాగే నిజజీవితంతో పెనవేసుకున్న ఎమోషనల్ డ్రామాను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆఖర్లో రియల్ సీన్లను కలిపి చేసిన జగన్ గారి ప్రమాణస్వీకార సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా తీశారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని పేజీగా యాత్ర 2 నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తులో యాత్ర 3 సినిమా కూడా వస్తే మరింత బాగుంటుందన్నారు. నటులు మమ్ముట్టి, జీవా పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. -
వారి నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర..
కరీంనగర్: ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రతీ నిమిషం ప్రజల్లోనే ఉన్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యరద్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం మేడిపల్లిలో ప్రజాహిత యాత్ర ప్రారంభం సందర్భంగా అంబేడ్కర్, శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. కుటుంబానికి సైతం సమయం ఇవ్వకుండా తన నియోజవర్గ ప్రజలతో మమేకమై ప్రతీ సందర్భంలోనూ వెన్నంటి ఉన్నానని గుర్తు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలానికి ఎంపీగా ఏమీ చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మేడిపల్లి–గోవిందారం రోడ్డుకు రూ.22కోట్లు, గోవిందారం బస్టాండ్‌కు రూ.15 లక్షలు, వెంకట్రావ్‌పేటకు రూ.20 లక్షలు, దేశాయిపేటకు రూ.20లక్షలు, తొంబర్రావుపేట, పోరుమల్ల, కొండాపూర్, మేడిపల్లి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మేడిపల్లి మండలానికి చేసిందేమీ లేదన్నారు. ‘బండి సంజయ్ ఏం చేశాడు’ అని మాట్లాడుతున్న నేతల నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర అని చెప్పారు. అనంతరం ప్రజాహితయాత్ర మండలంలోని కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడెం నుంచి రాత్రి 10 గంటల వరకు కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చేరింది. కాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పరిసర ప్రాంతాల్లో బైపాస్ రోడ్డు నిర్మాణంతో తాము నష్టపోతున్నామని, అలైన్మెంట్ మార్పించాలని పలు వురు రైతులు సంజయ్‌కు వినతిపత్రం ఇచ్చారు. యాత్రలో నారాయణఖేడ్, హుస్నాబాద్ బీజేపీ నాయకులు సంగప్ప, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు మొరపల్లి సత్యనారాయణ, ప్రతాప రామకృష్ణ, మండల అధ్యక్షుడు ముంజ శ్రీనివాస్ పాల్గొన్నారు. కథలాపూర్‌లో ఘనస్వాగతం కథలాపూర్ మండలం బొమ్మెన, తక్కళ్లపెల్లి గ్రామాల్లో శనివారం రాత్రి ప్రజలను పలకరిస్తూ.. నమస్కరిస్తూ ఎంపీ సంజయ్ యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు ఎంపీకీ ఘన స్వాగతం పలికారు. మండలంలోని గంభీర్పూర్ గ్రామంలో బ్యాంక్ ఏర్పాటు చేయించాలని గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ నియోజకవర్గ నాయకుడు చెన్నమనేని వికాస్‌రావు, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: పూట గడవడమూ కష్టమే! -
బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం
కరీంనగర్: ప్రజాహిత యాత్రకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం ఇంటి వద్ద తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశానో వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నానని వివరించారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లకు ఇప్పటికే సమాధానం చాలాసార్లు చెప్పా.. వాళ్లేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఈ యాత్రలో చర్చ పెడతా.. తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానని బండి సంజయ్ తెలిపారు. ఇదీ చదవండి: ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం -
రాహుల్ యాత్రకు ఆహ్వానం లేదు: అఖిలేశ్ యాదవ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే యాత్రకు రావాల్సిందిగా తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ఎన్నో పెద్ద ఈవెంట్లు జరుగుతుంటాయని, అన్నిటికి తమను పిలవరని అన్నారు. వెంటనే దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాంరమేష్ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ న్యాయ యాత్ర షెడ్యూల్ ఇంకా ఖరారవలేదు. ఒకట్రెండు రోజుల్లో టూర్ షెడ్యూల్ ఫైనల్ అవుతుంది. న్యాయ యాత్రకు అఖిలేశ్ హాజరైతే ఇండియా కూటమి ఇంకా బలోపేతం అవుతుంది’ జైరాం రమేష్ అన్నారు. రెండవ విడత మణిపూర్ నుంచి వరకు ప్రారంభమైన రాహుల్‌గాంధీ న్యాయ యాత్ర ఐదు రాష్ట్రాల్లో టూర్ పూర్తి చేసుకుంది. యాత్రలో ఈసారి ఎక్కువ భాగం రాహుల్‌గాంధీ బస్సులోనే పర్యటించారు. ఈ నెల 16న న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘పెళ్లెప్పుడు?’ పిల్లాడి ప్రశ్నకు రాహుల్ ఏమన్నారు?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో కొనసాగింది. ఈ సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీని ఆరేళ్ల బుడ్డోడు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగాడు. దీనికి రాహుల్ గాంధీ సరదా సమాధానం ఇచ్చారు. అదేమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే! ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఉన్న రాహుల్‌ను ఆ కుర్రాడు ఈ ప్రశ్న అడగగానే రాహుల్ గాంధీ కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అర్ష్ అనే ఆరేళ్ల బాలుడు రాహుల్ గాంధీకి సంబంధించి ఓ బ్లాగ్ క్రియేట్ చేశాడు. దానిలో ఆ కుర్రాడు రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా అభివర్ణించాడు. ఆ కుర్రాడు రాహుల్ గాంధీని ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని అడిగాడు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను. తర్వాత ఆలోచిస్తాను’ అని అన్నారు. తరువాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కాగా బీహార్ వచ్చిన రాహుల్‌ను చూసేందుకు జనం తరలివచ్చారు. ఈ యాత్ర మణిపూర్‌లో ప్రారంభమై పశ్చిమ బెంగాల్ మీదుగా బీహార్‌కు చేరుకుంది. -
14 నుంచి రాహుల్ గాంధీ ‘న్యాయ్ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ప్రారంభిస్తారని ఏఐసీసీ జాతీ య అధికార ప్రతినిధి షమా అహ్మద్ తెలిపారు. గురువారం ఆమె గాం«దీభవన్‌లో మాట్లాడుతూ మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర ఉంటుందని, మొత్తం 6,700 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వివరించారు. దేశంలో యువత ఉద్యోగాలు, ఉపాధిలేక అల్లాడుతోందని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ సర్కార్ మోసం చేసిందని, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరి గిపోయాయని విమర్శించారు. దీంతో సామా న్య ప్రజల జీవనం కష్టంగా మారిందని అన్నా రు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై ఈడీ, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారన్నా రు. మరోవైపు కిసాన్, దళిత, ఆదివాసీలు, మ ణిపూర్‌లో చర్చిలు, ముస్లిం మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. -
పేదల ప్రగతితో బలమైన భారత్
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత సాధిస్తే దేశం శక్తివంతంగా మారుతుందని, బలమైన భారత్ ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కేవలం ప్రభుత్వ యాత్రగానే కాదు, దేశ యాత్రగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలు నిర్లక్ష్యానికి గురయ్యారని, అప్పట్లో ప్రభుత్వ వ్యవసాయ విధానాలు కేవలం ఉత్పత్తి, అమ్మకానికే పరిమితం అయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నదాతల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఇప్పటిదాకా రూ.30,000 బదిలీ చేశామని తెలిపారు. వ్యవసాయ సహకార సంఘాలను, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేశామని అన్నారు. గోదాములు నిర్మించామని, పంటల నిల్వ సామర్థ్యాలను పెంచామని, ఆహార శుద్ధి పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించామని గుర్తుచేశారు. ‘‘కంది పప్పును ఆన్లైన్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి విక్రయించే సదుపాయాన్ని కలి్పంచాం. వారికి మార్కెట్ రేటు కంటే మెరుగైన ధర చెల్లిస్తున్నాం. పప్పుల కొనుగోలు కోసం విదేశాలకు చెల్లించే సొమ్ము మన రైతుల చేతికే అందాలన్నది మా ఉద్దేశం’’ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రతి మూలకూ ‘మోదీ గ్యారంటీ’ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నారు. అర్హులకు సక్రమంగా, సంతృప్త స్థాయిలో పథకాలు అందితేనే ‘అభివృద్ధి చెందిన భారత్’ సాధ్యమని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబి్ధదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్ర ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుందని, దేశమంతటా 11 కోట్ల మంది ప్రజలతో నేరుగా అనుసంధానమైందని హర్షం వ్యక్తం చేశారు. ‘మోదీ కీ గ్యారంటీవాలీ గాడీ’ దేశంలో ప్రతి మూలకూ వెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూసే పేదలు ఇప్పుడు ఒక అర్థవంతమైన మార్పును చూస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు అర్హుల గడప వద్దకే వెళ్తున్నాయన్నారు. ప్రస్తుత, భావి తరాల యువత గత తరాల కంటే మెరుగైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. -
Yatra- 2 Teaser.. తూటాల్లా పేలుతున్న డైలాగ్స్
యాత్ర- 2 టీజర్ విడుదలైంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్-1కు చేరిపోయింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎలాంటి స్టార్ హీరోలు లేరు.. కానీ టీజర్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని లక్షల మంది వైఎస్సార్ అభిమానులు తమ మొబైల్స్‌లలో వాట్సప్ స్టేటస్‌లుగా యాత్ర-2 టీజర్ డైలాగ్స్‌ను పెట్టుకుంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర-2 సినిమా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇంతలా ఈ సినిమాకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో వైఎస్ఆర్, ఆయన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారందరూ యాత్ర-2 టీజర్‌తో పండుగ చేసుకుంటున్నారు. టీజర్లో చూపించిన ప్రతి అంశం గడిచిన రోజుల్లో మన కళ్ల ముందు జరిగినవే.. కానీ డైరెక్టర్ మహి వి రాఘవ అద్భుతంగా తెరకెక్కించారు. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్‌ను అంతే స్థాయిలో పొయెటిక్‌గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అసలు టీజర్ స్టార్ట్ కావడమే ఎమోషనల్ నోట్‌తో ప్రారంభమైంది. ఆ షాట్ కూడా పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్దే జరిగింది. ఈ టీజర్లో సీఎం జగన్ గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలనే తెరపైకి తీసుకొచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్ గారిని బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు. వైఎస్ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అవుతుంది. అనుకున్నట్లే వైఎస్ జగన్ గారు పాదయాత్ర ప్రారంభించారు.. రోజురోజుకూ ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన కొందరు తండ్రి పోయాడనుకుంటే వారసుడొచ్చాడని.. దీనిని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్‌తో జత కట్టి దొంగదెబ్బ తీసేందుకు వార్నింగ్‌లు జారీచేశారు. అప్పుడు టీజర్లో వినిపించిన డైలాగ్ ఇదే... 'ఉన్నది అంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటి వాడితో యుద్ధం చేయడం మనకే నష్టం' ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇదే. ఎవరికీ తలవంచని ధైర్యం.. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. పెద్ద దిక్కు తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్ జగన్ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలో వచ్చిందే ఈ డైలాగ్ 'నాకు భయపడడం తెలియదు.. నేను వైఎస్సార్ కొడుకుని' అని చెప్పడం. వైఎస్ జగన్ గారిపై అన్యాయంగా సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయించి, టీడీపీతో కుమ్మక్కై రాజకీయంగా మొగ్గదశలోనే వైఎస్సార్ వారసుడిని అంతమొందించేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టిన తీరును యాత్ర- 2లో చూపించనున్నాడు డైరెక్టర్ మహీ. జగన్ గారి ఓదార్పు యాత్రకు ముందు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు.. ఎప్పుడైతే ఓదార్పు యాత్ర ప్రకటన వచ్చిందో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ వచ్చాయి. రాజకీయంగా వైఎస్సార్ వారసుడిని లేకుండా చేయాలని కుట్ర పన్నిన వారందరికీ వైఎస్ జగన్ అభిమానులు తగిన బుద్ధి చెప్పారు. ఆయన వెంట ఒక సైన్యంలా జనం కదిలారు. తండ్రి మాదిరే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా.. పోరాడి నిలబడిన యోధుడిలా జగన్ జీవితం ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. అందుకే రాజన్నతో పాటు ఆయన బిడ్డ వైఎస్ జగన్ జీవితం గురించి సినిమాలు వస్తున్నాయి. వారి అసలైన జీవితాన్ని నేటి తరం యువకులకు తెలిసేలే కొందరు దర్శకనిర్మాతలు పూనుకున్నారు. ఈ క్రమంలోనే యాత్ర సినిమా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది.. ఫిబ్రవరి 8న యాత్ర- 2 విడుదల కానుంది. -
రాహుల్ గాంధీ యాత్ర: లోగో, స్లోగన్ ఆవిష్కరణ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలో మారో యాత్ర చేపడతారని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసందే. అయితే శనివారం రాహుల్ గాంధీ చేపట్టే యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేస్తూ కాంగ్రెస్ చీఫ్ మళ్లికార్జున ఖర్గే ప్రకటించారు. భారత్ జోడో యాత్ర లోగో, స్లోగన్‌ను ఖర్గే ఆవిష్కరించారు. ఈ యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేసి.. ‘న్యాయం అందేవరకు’ అనే స్లోగన్‌ను పెట్టినట్లు తెలిపారు. ఇక.. ఈ జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ చేపట్టే.. ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు బస్సు యాత్రగా కొనసాగనుంది. ये है 14 जनवरी, 2024 को मणिपुर से मुंबई तक शुरू होने जा रही भारतीय राष्ट्रीय कांग्रेस की भारत जोड़ो न्याय यात्रा का रूट मैप। @RahulGandhi 66 दिनों में 110 ज़िलों से गुज़रते हुए 6700 किलोमीटर से ज़्यादा की दूरी कवर करेंगे। यह पिछली भारत जोड़ो यात्रा की तरह ही प्रभावशाली और… pic.twitter.com/m3JeA3Nw4O — Jairam Ramesh (@Jairam_Ramesh) January 4, 2024 చదవండి: Ayodhya: 22న అయోధ్యలో హైసెక్యూరిటీ.. భద్రతా బలగాలివే.. -
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది
-
రాహుల్ యాత్ర...కాంగ్రెస్ కి మాత్ర అవుతుందా ?