చింతపల్లి: కేంద్ర కాఫీ బోర్డులో కాఫీ ఎస్టేట్ సూపర్‌వైజర్, ఎస్టేట్ మేనేజ్‌మెంట్ డిప్లమో కోర్సులకు యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర కాఫీ బోర్డు ఎస్‌ఎల్‌వో రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటకలోని చికమంగుళూరు కేంద్ర కాఫీ పరిశోధన సంస్థ సర్టిఫికెట్,డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించిందని తెలిపారు. ఏడాది పాటు కాలపరిమితి గల సర్టిఫికెట్ కోర్సులకు 8 తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులన్నారు. రెండేళ్ల కాలపరిమితి గల డిప్లమో కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణులైన యవతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తారన్నారు. ఆసక్తి గల వారు ప్రవేశ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈనెల 31లోగా పంపించాలని సూచించారు. పూర్తి వివరాలకు కేంద్ర కాఫీ బోర్డు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. స్థానికంగా ఉన్న కేంద్ర కాఫీ బోర్టు కార్యాలయాల్లో వివరాలు తెలుసుకోవచ్చునని ఎస్‌ఎల్‌వో సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment