తెగిపడిన యువకుడి కాలు
ఎటపాక: మండలంలోని రాయనపేట వద్ద జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడి కాలు తెగి రహదారిపై పడిన ఘటన భయాందోళనకు గురిచేసింది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లికి చెందిన కెల్లా సాయిఈశ్వర్ భద్రాచలం పట్టణంలోని శ్రీనివాస నర్సింగ్ హోంలో లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని తన ద్విచక్రవాహనంపై ఏడుగురాళ్లపల్లి బయలుదేరాడు. ఈక్రమంలో ఎటపాక మండల పరిధిలోని రాయనపేట వద్ద చింతూరు నుంచి భద్రాచలం వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు బైక్‌ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో సాయిఈశ్వర్ ఎడమ కాలు తెగి రహదారిపై పడగా తీవ్ర రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment