ఉత్సాహంగా సీబీఎస్‌ఈ క్లస్టర్ – 7 పోటీలు
పాయకరావుపేట: పట్టణంలోని శ్రీప్రకాష్ విద్యా సంస్థల ప్రాంగణంలో సీబీఎస్‌ఈ క్లస్టర్ –7 కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అండర్ – 14, 17, 19 బాలికల విభాగాల్లో పోటీలకు వందకి పైగా పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థినులు హాజరయ్యారు. క్రీడా స్ఫూర్తితో నువ్వా నేనా అన్నట్టుగా వీరు తమ ప్రతిభ కనబరుస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ పోటీలు శుక్రవారంతో ముగియనున్నాయి. అదే రోజు ముగింపు కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత విజేతలకు బహుమలు ప్రదానం చేస్తారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment