కరెంట్ షాక్
● ఇదేం బాదుడు బాబూ!
కూటమి
ఎఫ్‌పీపీసీసీ పేరిట కూటమి సర్కారు దొంగ దెబ్బ
ఉమ్మడి విశాఖ ప్రజలపై రూ.293 కోట్ల అదనపు భారం
ఉమ్మడి విశాఖ ప్రజలపై రూ.293 కోట్లు అదనపు భారం
బిల్లు కంటే అదనపు చార్జీల భారమే ఎక్కువ
5 యూనిట్ల వినియోగానికీ రూ.258 బిల్లు
విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసన
విశాఖ హెచ్‌బీ కాలనీలో ఓ వినియోగదారుడు బిల్లులో విద్యుత్ వినియోగం ఖర్చు రూ.27.72 అయితే ఫిక్స్‌డ్ చార్జీ రూ.30, కస్టమర్ చార్జీ రూ.25, ఇంధనం సర్దుబాటు చార్జీ–1 రూ.267.36, ఇంధనం సర్దుబాటు చార్జీ–2 రూ.102 కలిపి మొత్తం రూ.447.33 బిల్లు వచ్చింది. అంటే విద్యుత్ వినియోగం బిల్లు 6 శాతం అయితే 94 శాతం అదనపు భారం.
చీడికాడ మండలంలోని అర్జునగిరి గ్రామానికి చెందిన సాలాపు వెంకట నర్సింహమూర్తికి ఎస్సీ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ కనెక్షన్ ఉంది. 12 ఏళ్ల నుంచి నెలకు రూ.100 నుంచి రూ.170 మధ్య కరెంటు బిల్లు వచ్చేది. ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని ప్రకటించడంతో ఏనాడూ విద్యుత్ బిల్లు చెల్లించలేదు. 15 రోజుల క్రితం అందిన విద్యుత్ బిల్లు చూసి ఆయన కళ్లు బైర్లు కమ్మాయి. బిల్లులో రూ.4,652.95 చెల్లించమని ఉండడంతో కంగుతిన్నాడు.
ఈ మూడే కాదు ఏ ఇంటి తలుపు తట్టినా కరెంట్ షాక్ కొడుతోంది. కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా.. ప్రజలందరికీ కరెంటు బిల్లుల బోనస్ అందించింది. ట్రూఅప్, సర్దుబాటు చార్జీల పేరుతో జనంపై పెనుభారం మోపింది. సీఎం చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి అంటే ఇదేనేమా మరి.
Comments
Please login to add a commentAdd a comment