రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన
కుందుర్పి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పాలన సాగిస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. కుందుర్పి మండలం బెస్తరపల్లిలో సీపీఐ శతవసంతోత్సవ వేడుకల అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సినీ నిర్మాతలు, హీరోలకు రూ.వందల కోట్లు దోచిబెట్టేలా సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌కళ్యాణ్ చర్యలు తీసుకోవడం సిగ్గు చేటన్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీనిచ్చి అధికారం చేపట్టిన తర్వాత ట్రూఅప్ చార్జీల పేరుతో పెనుభారం మోపారని మండి పడ్డారు. నానా కష్టాలు పడి అరకొర దిగుబడి సాధించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. అనంతరం బెస్తరపల్లిలో సీపీఐ అమరుల స్థూపం, సీపీఐ కార్యాలయం, గ్రంథాలయ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. 1950 నాటి చారిత్రిక ఘట్టాన్ని పురస్కరించుకుని విప్లవయోధులను స్మరిస్తూ బెస్తరపల్లిలో 130 మంది అమరుల పేర్లను లిఖిస్తూ స్థూపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీ,జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఎండీ సంజీవప్ప, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, నారాయణస్వామి స్థానిక నాయకులు బీకే గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment