బత్తలపల్లి: పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం అనంతసాగరం గ్రామానికి చెందిన చెరుకూరి ఈశ్వరమ్మ, చెరుకూరి ఈశ్వరయ్య వర్గాల మధ్య కొంత కాలంగా ఓ బంగారు గొలుసు విషయంగా వివాదం నెలకొంది. ఈ విషయంగా ఈశ్వరయ్య మేనల్లుడు ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారు. తన మేనల్లుడిపై అక్రమంగా కేసు నమోదు చేయించారంటూ తరచూ ఈశ్వరమ్మ వర్గంతో ఈశ్వరయ్య వర్గీయులు గొడవ పడేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకోవడంతో ఈశ్వరమ్మ, హేమంత్, రామాంజనేయులు, ఈశ్వరయ్య, ప్రవీణ్, గవ్వల శివయ్య, గవ్వల ఈశ్వరమ్మ గాయపడ్డారు. ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు చియ్యేడుకు చెందిన హేమంత్, నాగార్జున, రామాంజనేయులు, అనంతసాగరానికి చెందిన శివయ్య, ఆదెప్పతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు గవ్వల ప్రవీణ్, శివయ్య, ఈశ్వర్యతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment