చౌడేశ్వరీ పాహిమాం...
ఉరవకొండ: స్థానిక 4వ వార్డులో వెలసిన పెద్ద చౌడేశ్వరీ ఆలయ జ్యోతుల ఉత్సవం బుధవారం నేత్రపర్వంగా సాగింది. ఈ నెల 14న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా బుధవారం వేకువజామున అమ్మవారికి ప్రీతికరమైన ఖడ్గ పద్యాలతో స్తుతిస్తూ, మేళా తాళలతో ఊరేగుతూ జ్యోతుల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూడేళ్లకోసారి సంక్రాంతి రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 104 కలశాలలో తొగట వీర క్షత్రియ మహిళలు పవిత్ర గంగజలాన్ని భారీ ఊరేగింపుగా ఆలయానికి చేర్చి అమ్మవారిని అభిషేకించారు. బుధవారం వేకువజామున కులగురువు దివ్యజ్ఞాననందగిరి స్వామి ఆధ్వర్యంలో చౌడేశ్వరీ కాలనీ నుంచి జ్యోతులను తల మీద పెట్టుకుని నృత్యాలు చేస్తూ ఊరేగించారు. కార్యక్రమంలో తొగట వీర క్షత్రియ సంఘం సభ్యులు, పెద్ద సంఖ్యలో స్థానికులు, కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment