Updates: ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద | AP Telangana Heavy Rains Flood Updates Sep 7 2024 Latest News Telugu | Sakshi
Sakshi News home page

Updates: బెజవాడలో మళ్లీ వాన.. ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. భయం గుప్పిట కొల్లేరు వాసులు

Published Sat, Sep 7 2024 1:07 PM | Last Updated on Sat, Sep 7 2024 7:55 PM

AP Telangana Heavy Rains Flood Updates Sep 7 2024 Latest News Telugu

AP And Telangana Floods News Latest Updates In Telugu

విజయవాడలో మళ్లీ వర్షం

  • నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
  • ఇప్పటికే వారం రోజులుగా వరద ముంపులో పలు కాలనీలు
  • మళ్లీ వర్షం కురుస్తుండడంతో బెజవాడ ప్రజల ఆందోళన
  • జలదిగ్బంధంలోనే పలు కాలనీలు
  • మంచి నీళ్లు, ఆహారం లేక అవస్థలు
  • విమర్శల నేపథ్యంలో.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం
     

కోస్తా వెంట అల్పపీడన ప్రభావం

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
  • ఎల్లుండి ఒడిశా, బెంగాల్‌ తీరంలో వాయుగుండంగా మారే ఛాన్స్‌
  • తీవ్ర అల్పపీడనంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
  • కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
  • శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌
  • అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
 
విజయవాడ
  • ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద 
  • క్రమంగా పెరుగుతున్న వరద ఇన్ ఫ్లో 
  • ఇన్‌ఫ్లో 3,06 ,377 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 3,06,175 క్యూసెక్కులు 
  • 40 గేట్లు పూర్తిగా.. 8 అడుగుల మేర 25 గేట్లు ఎత్తివేత
 
విజయనగరం
  • జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు. 
  • సముద్ర తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తం గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయం.
19:

ఎన్టీఆర్ జిల్లా

  • ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
  • ఈరోజు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ భారీ వర్షపాతం నమోదు
  • అత్యధికంగా నందిగామ, వీరులపాడు మండలంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • జగ్గయ్యపేట,గంపలగూడెం, తిరువూరు,కంచికచర్ల మండలాల్లో 7 సెంటీమీటర్లు,చందర్లపాడులో 5,  వత్సవాయి,పెనుగంచిప్రోలు,ఏ.కొండూరు,జి.కొండూరు,విస్సన్నపేట, విజయవాడ ఈస్ట్ , విజయవాడ సెంట్రల్ ,విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు

 

విజయవాడలో హైఅలర్ట్‌

  • భారీ వర్షంతో విజయవాడలో హైఅలర్ట్‌
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదేశాలు
  • అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్
  • బుడమేరు గండ్లను  పూడ్చివేసినందున వరద ప్రభావిత ప్రాంతాల్లోకి కొత్తగా అక్కడి నుంచి వరదనీరు రావడం లేదు: అధికారులతో కలెక్టర్‌
  • అయితే వర్షం బాగా కురుస్తున్నందువల్ల అధికారులు క్షేత్రస్థాయిలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి: అధికారులతో కలెక్టర్‌
  • తాజా వర్షంతో పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరే పరిస్థితి ఉంది: అధికారులతో కలెక్టర్‌
  • లోతట్టు ప్రాంత ప్రజలను తక్షణమే సురక్షిత తరలించాలి: అధికారులతో కలెక్టర్‌
  • ఆహారంతో పాటు ఇతర సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించాలి: అధికారులతో కలెక్టర్‌
  • చీకటిపడేలోపే తరలింపు ప్రక్రియ పూర్తికావాలి: అధికారులతో కలెక్టర్‌
  • ఇంకా వరద నీటిలోనే ఉన్న బాధితుల్లో.. తాజా వర్షంతో ఆందోళన

 

విజయవాడ 

  • ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ తాజా అప్డేట్ 
  • ప్రకాశం బ్యారేజ్ కు మళ్లీ పెరుగుతున్న వరద 
  • ఇన్ ఫ్లో 2,84,252 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 2,84,050 క్యూసెక్కులు 
  • 8 అడుగుల మేర 65 గేట్లు ఎత్తివేత

 

ఎన్టీఆర్ జిల్లా 

  • తిరువూరులో భారీ వర్షం 
  • లోతట్టు ప్రాంతాలు జలమయం, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు


ఎన్టీఆర్ జిల్లా  

  • బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత 
  • ఆర్మీ సహకారంతో శాంతినగర్ వద్ద మూడవ గండి పూడ్చివేత 
  • గాబియన్ బాస్కెట్ పద్ధతిని ఉపయోగించి గండిని పూడ్చివేసిన ఆర్మీ

 

విజయవాడ

  • నగరంలో మరోసారి భారీవర్షం
  • విజయవాడలో కురుస్తున్న వర్షానికి మళ్ళీ జలమయమవుతున్న రోడ్లు
  • మళ్లీ కాలనీల్లోకి చేరుతున్న వరద నీరు
  • అరకోరగా అందుతున్న సహాయ కార్యక్రమాలకు అంతరాయం
  • ఇంకా నిత్యావసరాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్న ముంపు ప్రాంతాల ప్రజలు

 


 

 

ప్రభుత్వానికి పట్టింపు లేదా?

  • వరద బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలు, విద్యార్ధి సంఘాలు
  • సహకారం అందించడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతో రంగంలోకి దిగిన సంస్థలు
  • ఎస్ఎఫ్ఐ,డీవైఎఫ్‌వై, సీపీఎం ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం అందజేత
  • సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన SDRF ,పోలీస్ సిబ్పందికి కూడా  ఆహారం అందజేస్తున్న ఎస్ఎఫ్ఐ
  • ప్రభుత్వం పై సీపీఎం రాష్ట్ర కార్యవర్శి వర్గ సభ్యులు బాబురావు,ఎస్.ఎఫ్.ఐ నాయకులు ఫైర్
  • వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది: సీపీఎం రాష్ట్ర కార్యవర్శి వర్గ సభ్యులు బాబురావు
  • ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టే మేం బాధితులకు అండగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది: బాబురావు
  • వారం రోజుల నుంచి నీటిలో నానిపోతున్న వారిని పట్టించుకోవడం లేదు: బాబురావు
  • ప్రభుత్వ సాయమంతా గట్టున ఉన్నవారికే: బాబురావు
  • లోపల కాలనీల్లోని ప్రజలు పీకల్లోతు నీటిలో ఉన్నారు: బాబురావు
  • వారి గురించి ప్రభుత్వానికి పట్టదా?: బాబురావు
  • ఆఖరికి సహాయక కార్యకామాలకు వచ్చిన ప్రభుత్వ సిబ్బందికి కూడా మేమే ఆహారం అందిస్తున్నాం: బాబురావు
  • బియ్యం పంపిణీ కోసం వాహనాలు బారులు తీరి ఉన్నాయ్: బాబురావు
  • ఏం లాభం.. ఎవరికైనా పంపిణీ చేస్తున్నారా: బాబురావు
  • అకలితో అలమటిస్తున్న వారికి పాచిపోయిన భోజనం ప్యాకెట్లు అందించడం దారుణం: బాబురావు
  • సిపిఎం,విద్యార్ధి సంఘాల తరపున వరద బాధితులకు మేం ఆహారం అందిస్తున్నాం: బాబురావు
  • మూడు పూటలా వేడి వేడిగా ఆహారం అందిస్తాం: బాబురావు
  • వరద నుంచి ముంపు ప్రాంత ప్రజలు బయటపడే వరకూ మేం అండగా నిలుస్తాం: బాబురావు
  • ప్రభుత్వం ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు మానుకోవాలి: బాబురావు
  • వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి: బాబురావు
  • కాలనీల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి:  ఎస్.ఎఫ్.ఐ,రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ ,
  • అక్కడి ప్రజలకు సాయమందించే వారే లేదు: ప్రసన్న కుమార్
  • మేం పీకల్లోతు నీటిలో నడిచి వెళ్లి బాధితులకు ఆహారం అందిస్తున్నాం: ప్రసన్న కుమార్
  • చిన్నారులు...అనారోగ్యంతో వృద్ధులు అల్లాడిపోతున్నారు: ప్రసన్న కుమార్
  • కనీసం మంచినీరు కూడా వారికి ప్రభుత్వం నుంచి చేరడం లేదు: ప్రసన్న కుమార్
     
  • విజయవాడ రూరల్‌

    ఇంకా ఆరడుగల నీళ్లలోనే అంబాపురం
  • 1వ తేదీ నుంచి వదర నీటితో అంబాపురం కాలనీలు
  • 10 అడుగుల నుండి 6 అడుగుల ఎత్తులో నీళ్ళు వచ్చాయి.. ఇప్పటికీ వరదలోనే కాలనీ
  • ఆస్తి నష్టం.. నీళ్ళను బయటకు పంపే పనులు చేపట్ట లేదని వాపోతున్న కాలనీవాసులు
  • నిన్నటి నుంచే కాస్త ఆహారం నీళ్ళు అందుతున్నాయని స్పష్టీకరణ
  • అంటురోగాలు వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలో కాలనీవాసులు
  • మరోవైపు దొంగల భయం.. 100 ఫీట్‌ రోడ్డు, సుందరయ్య కట్ట పైన పోలీస్‌ బీట్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి  
  • నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజ్ఞప్తి

డ్వాక్రా మహిళల నుండి విరాళాల వసూళ్లు

  • సీఎం ఆదేశించారంటూ విరాళాల వసూళ్లు
  • వరద బాధితుల సహాయం పేరుతో అధికారుల వసూళ్లు
  • డ్వాక్రా సంఘాలన్నీ విరాళాలు ఇవ్వాలని ఆదేశాలు
  • అర్జంట్ గా విరాళాలు ఇవ్వాలని అధికారుల ఆదేశాలు
  • డ్వాక్రా మహిళల నుండి వసూలు చేస్తున్న యానిమేటర్లు, కో ఆర్డినేటర్లు
  • విరాళాలు ఇవ్వని సంఘాలకు రిమార్క్ రాస్తామంటూ ఆదేశాలు
  • రూ.500 కి తగ్గకుండా ప్రతీ సంఘం విరాళాలు ఇవ్వాలని ఆదేశాలు
  • అర్జంట్ గా విరాళాలను ఫోన్ పే చేయాలని ఆదేశాలు
  • ఇటీవలే అమరావతి కోసం డ్వాక్రా మహిళల నుండి విరాళాల వసూళ్లు

కొల్లేరుకు బుడమేరు ఎఫెక్ట్‌

  • కొల్లేరుకు భారీగా చేరుతున్న వరద
  • పల్లెలోకి చేరిన వరద నీరు
  • స్తంభించిన రాకపోకలు
  • లంక గ్రామాలకు ముంపు భయం
  • మండవల్లి, ఏలూరు, కైకలూరు మండలాల్లో వరద ప్రభావం
  • కోమటిలంక సమీపంలో ఉధృతంగా కొల్లేరు ప్రవాహం
  • చిన్నఎడ్లగాడి వద్ద హైవేపై కొల్లేరు వరద ప్రభావం
  • భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్న కొల్లేరు వాసులు


వారం రోజులైనా ఇంకా వరద నీటిలోనే పలు కాలనీలు 

  • ప్రభుత్వ సాయం అంతంత మాత్రంగానే 

  • సహాయక చర్యలపై వరద బాధితులు పెదవి విరుపు 

  • తమ కాలనీల్లోకి ఏ ఒక్కరూ వచ్చి సాయం అందించడం లేదని బాధితులు ఆవేదన 

  • కనీసం మంచినీళ్లైనా ఇవ్వాలని కోరుతున్న బాధితులు

 

సాయం కావాలంటే చేయి తడపాల్సిందే

  • వరదలో ఉన్న ఇళ్ల నుంచి బోట్లలో బాధితుల తరలింపు

  • మొన్న.. భారీగా డబ్బు డిమాండ్‌ చేస్తున్న బోటు నిర్వాహకులు

  • మరోవైపు.. బాధితులకు సాయం చేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు

  • ఇంకోవైపు.. సహాయక చర్యలపైనా ఇంటి దొంగల కన్ను 

  • బాధితుల కోసం  దాతలు ఇస్తున్న కిట్లను దొంగతనం చేస్తున్న అధికారులు

  • మొన్న రెవెన్యూ సిబ్బందే దొంగతనం చేస్తూ పట్టుబడ్డ వైనం

  • మరోవైపు పాచిపోయిన ఆహారం పంపిణీ చేస్తున్నారంటూ బాధితుల ఆగ్రహం 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement