20 లక్షల దోపిడీపై దర్యాప్తు ముమ్మరం | Gold Fraud In Vishakapatnam | Sakshi
Sakshi News home page

20 లక్షల దోపిడీపై దర్యాప్తు ముమ్మరం

Published Thu, Aug 20 2020 10:22 PM | Last Updated on Thu, Aug 20 2020 10:30 PM

Gold Fraud In Vishakapatnam - Sakshi

విశాఖ: మధురవాడలో 20 లక్షల దోపిడీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వివరాల్లోకి వెళ్తె, తక్కువ రేటుకి బంగారం‌ ఇస్తామని ముగ్గురు వ్యక్తులు మోసం చేయగా, మోసం చేసిన ముగ్గురు అనుమానితుల‌ ఫొటోలు పిఎం పాలెం క్రైం పోలీసులు గురువారం మీడియాకి విడుదల చేసారు. మధురవాడ స్టేడియం వద్ద రెండు రోజుల‌ క్రితం అరకేజీకి పైగా బంగారం 20 లక్షలకే దొరుకుతుందనే అత్యాశతో మధ్యవర్తి దగ్గరకి బాధితుడు వెళ్లాడు. 

అదే సమయంలో ఇన్నోవా వాహనంలో ఇద్దరు నకిలీలు..  పోలీసులుగా రంగంలోకి దిగి బెదిరించారు. ఈ క్రమంలో 20 లక్షలతో ముగ్గురు దుండగులు పారిపోయారు. రిజిస్ట్రేషన్ కోసం వెళ్తుండగా 20 లక్షలు దొంగతనం జరిగినట్లుగా బాధితుడు తప్పుడు ఫిర్యాదు చేశారు. తప్పడు ఫిర్యాదుతో నిందితుల ఆచూకీ లభ్యం కాలేదు. కాగా సీసీ  కెమెరా ఆధారంగా ముగ్గురు దుండగుల‌ ఫొటోలను పోలీసులను విడుదల చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement