విశాఖలో ఇన్ఫోసిస్‌ 28న ప్రారంభం | IT giant Infosys starting operations in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ఇన్ఫోసిస్‌ 28న ప్రారంభం

Published Sun, Jun 25 2023 5:01 AM | Last Updated on Sun, Jun 25 2023 10:26 AM

IT giant Infosys starting operations in Visakhapatnam - Sakshi

సిద్ధమైన ఇన్ఫోసిస్‌ కార్యాలయం

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ కార్యకలాపాల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రుషికొండ ఐటీ పార్క్‌ హిల్‌ నం.2లో భారీ భవన నిర్మాణం పూర్తయింది. దీంతో ఈ నెల 28 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్‌ సన్నద్ధమవుతోంది. గతంలో శాటిలైట్‌ ఆఫీస్‌ పెడతామని ప్రకటించిన ఇన్ఫోసిస్‌.. ఇప్పుడు డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా అభివృద్ధి చేసింది.

తొలివిడతలో 650 మంది సామర్థ్యంతో సేవలకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే 1000 మందితో సెంటర్‌ నడిపేందుకు సిద్ధమవుతోంది. తమ క్యాంపస్‌కు ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఐటీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌లో పనిచేస్తున్న అభ్యర్థుల్ని ఇప్పటికే ఇన్ఫోసిస్‌ ఆహ్వానించినట్లు సంస్థ అధికారులు ఇటీవల జరిగిన సీఐఐ సదస్సులో తెలిపారు. (ఆదిపురుష్‌ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్‌ వాచ్‌ గిఫ్ట్‌: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?)

రాష్ట్ర ప్రభుత్వం బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌ని ప్రమోట్‌ చేస్తుండటంతో దిగ్గజ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయి. దీంతో సాగరనగరం విశాఖపట్నం సరికొత్త కళ సంతరించుకుంటోంది. రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన సాగించనున్నట్లు ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మే 3వ తేదీన విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ భూమిపూజ చేశారు. రూ.14,634 కోట్లతో ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల దాదాపు 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. (వైట్‌హౌస్‌ స్టేట్ డిన్నర్‌: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?)

ఇది దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా మారనుంది. విప్రో, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్‌ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు ఐటీ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అతి త్వరలోనే విశాఖపట్నం ఐటీ హబ్‌గా అవతరించనుందని ఐటీ అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.  (అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్‌ టైకూన్‌ విషాద గాథ )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement