డ్వాక్రా రుణం ఇవ్వకుండా వేధింపులు
రైల్వేకోడూరు అర్బన్: తోటి గ్రూపు సభ్యులు ఒక మహిళకు డ్వాక్రా రుణం ఇవ్వడానికి నిరాకరించి గ్రూపు నుంచి తొలగించే ప్రయత్నం చేయడంతో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు వెలుగు కార్యాలయంలో రాఘవరాజపురం హరిజనవాడకు చెందిన దళిత మహిళ సోమవారం విషద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. వివరాలు..మండలంలోని రాఘవరాజపురం హరిజనవాడకు చెందిన బైరారపుదేవి లక్ష్మినరసింహా గ్రూపులో ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ లోన్లు తీసుకొంటూ తిరిగి చెల్లిస్తూ ఉండేది. అదేవిధంగా రెండు నెలల క్రితం పాత లోనుకు 35 వేలు కట్టాల్సి ఉండగా అప్పు చేసి మరీ రుణం తీర్చింది. అయితే ఇప్పుడు 10 మందికి 20 లక్షలు రుణం వస్తుండడంతో స్థానిక రాజకీయ కారణాలతో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరురాలైన ఆమెకు రుణం ఇవ్వకూడదని నిర్ణయించుకొని వేధించసాగారు...కూలి చేసుకొని బాకీ కట్టుకుంటున్నాని ఆమె చెబుతున్నారు. గ్రుపులో కొందరు తనను గ్రూపు నుంచి తీసి వేయాలని చూస్తున్నట్లు వెలుగు ఏపీఎంకు కూడా తెలియజేశానని, అయినా కేవలం తనపై కక్షతో డబ్బులు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈవిషయమై వెలుగు కార్యాలయంలో ఏపీఎం వసుధర గ్రూపు సభ్యులతో మాట్లాడినా వారు ఆమె మాటలు కూడా ఒప్పుకోకుండా ఉండడంతో అక్కడికక్కడే బైరారపుదేవి విష ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఏపీఎం బాధితురాలిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు విషయం తెలియజేశారు.
● మహిళ ఆత్మ హత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment