కిక్‌రిసిన వైన్ షాపులు
చీరాల: కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను బార్లా తెరవడంతో మందుబాబులు తాగి ఊగారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు మద్యం అమ్మకాలను సులువు చేసింది. ఏకంగా అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతులు ఇవ్వడంతో మందుబాబులు కిక్కుతో చిందేశారు. పట్టణాలలో, తీర ప్రాంతాలలో, రిసార్టులు, రెస్టారెంట్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నిండిపోయాయి. జిల్లాలో డిసెంబర్ 31న మద్యం ద్వారా రూ.3.24 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.
ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మద్యం షాపులను ఏర్పాటును ప్రైవేటు వ్యక్తులకు కేటాయించింది. పట్టణ, రూరల్ ప్రాంతాలలో టెండర్లు ద్వారా మద్యం షాపులను అప్పగించింది. పైగా నూతన సంవత్సరం సందర్భంగా మద్యం షాపుల సమయాన్ని రాత్రి ఒంటి గంట వరకు పొడిగించింది. దీంతో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. షాపులన్నీ మద్యం ప్రియులతో కిక్కిరిపోయాయి. నూతన సంవత్సర ఆరంభానికి మద్యం అమ్మకాలు వ్యాపారులకు మంచి ‘కిక్కు’ ఇచ్చాయి. మద్యం షాపులు, రిసార్ట్స్, బార్ అండ్ రెస్టారెంట్లు మద్యం ప్రియులతో కిక్కిరిసిపోయాయి.
జిల్లాలో 3948 కేసుల మద్యం అమ్మకాలు
డిసెంబర్ 31వ తేదీ సందర్భంగా షాపులకు ముందుగానే వ్యాపారులు మద్యం లోడ్‌లను తెప్పించుకున్నారు. జిల్లాలో బాపట్ల, రేపల్లె, నగరం, వేమూరు, చీరాల, పర్చూరు, అద్దంకి ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మద్యం అమ్మకాలు జోరుగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం రూ.3.24 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.
న్యూ ఇయర్ వేడుకల్లో జోరుగా మద్యం అమ్మకాలు జిల్లాలో రూ.3.24 కోట్ల మేర తాగేశారు
అమ్మకాలు ఇలా..
ఏరియా మద్యం కేస్‌లు బీరు కేస్‌లు
బాపట్ల 903 613
రేపల్లె 468 203
నగరం 342 179
వేమూరు 482 164
చీరాల 762 626
పర్చూరు 264 210
అద్దంకి 727 278
మొత్తం 3,948 2,273
Comments
Please login to add a commentAdd a comment