విద్యుత్‌శాఖ ఏపీ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్
నగరంపాలెం: విద్యుత్ శాఖ ఏపీ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం లాలుపురం సర్వీస్ రోడ్డులోని ఏఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు వీవీ.మహేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నికగా, ఎన్నికల అధికారిగా టి.సాయిసుధాకర్ వ్యవహరించారు. చీఫ్ అడ్వయిజర్‌గా ఎ.సుబ్బారావు, అధ్యక్షునిగా కె.వి.శేషారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పి.హుస్సేన్‌ఖాన్, సెక్రటరీ జనరల్‌గా పి.సన్యాసిరావు, ఉపాధ్యక్షులుగా ఆర్.సాంబశివరావు, పి.నరేంద్ర, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా బి.శ్రీనివాసరావు, బి.కె.మిశ్రా, ఫైనాన్స్ కార్యదర్శిగా కేవీ కోటేశ్వరరావు, ఆఫీస్ కార్యదర్శిగా కె.ప్రసాద్‌బాబు, పలువురు జాయింట్ కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు కేవీ.శేషారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఏపీ విద్యుత్‌సంస్థల్లోని నెట్ వర్క్‌ను బలోపేతం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment