అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. ఇంటర్నేష‌న‌ల్‌ సెల‌బ్రిటీలు ఇండియాకు.. | Anant Ambani Radhika Merchant Wedding: Bill Gates Zuckerberg And More Foreign Guests Likely To Attend - Sakshi
Sakshi News home page

Anant Ambani Radhika Merchant Marriage: అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. ఇంటర్నేష‌న‌ల్‌ సెల‌బ్రిటీలు ఇండియాకు..

Published Thu, Feb 22 2024 1:46 PM | Last Updated on Thu, Feb 22 2024 2:36 PM

Anant Ambani Radhika Merchant Wedding Bill Gates Zuckerberg And More Foreign Guests Likely To Attend - Sakshi

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ & రాధిక మర్చంట్‌ల పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరగనున్నాయి. ఈ వేడుకలకు అంతర్జాతీయ అతిథులు కూడా హాజరవుతారని భావిస్తున్నారు.

అనంత్ అంబానీ & రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యే అతిథులలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్, ఈఎల్ రోత్‌స్‌చైల్డ్ చైర్ లిన్ ఫారెస్టర్ డి రోత్‌స్‌చైల్డ్ ఉన్నారు.

వీరు మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ అమెరికా చైర్మన్ బ్రియాన్ థామస్ మొయినిహాన్, బ్లాక్‌స్టోన్ చైర్మన్ స్టీఫెన్ స్క్వార్జ్‌మన్, ఇవాంకా ట్రంప్, ఖతార్ ప్రీమియర్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, టెక్ ఇన్వెస్టర్ యూరి మిల్నర్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, లూపా సిస్టమ్స్ సీఈఓ జేమ్స్ మర్డోచ్, హిల్‌హౌస్ క్యాపిటల్ వ్యవస్థాపకులు ఉన్నారు.

బీపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముర్రే ఆచిన్‌క్లోస్, ఎక్సోర్ సీఈఓ జాన్ ఎల్కాన్, సిస్కో మాజీ ఛైర్మన్ జాన్ ఛాంబర్స్, బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ సీఈఓ బ్రూస్ ఫ్లాట్, మెక్సికన్ బిజినెస్ మాగ్నెట్ కార్లోస్ స్లిమ్, బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ ఫౌండర్ రే డాలియో కూడా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: లాట‌రీలో ఏకంగా రూ.795 కోట్లు గెలిచాడు.. సుడి మామూలుగా లేదు!

అనంత్, రాధికల నిశ్చితార్థం ఇప్పటికే ముంబైలోని తమ నివాసం యాంటిలియాలో జరిగింది. ఇక జులై 12న వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement