గుర్తు తెలియని యువకుడి మృతి
కుప్పం: బెంగళూరు–చైన్నె రైల్వే మార్గమధ్యంలోని కుప్పం రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. గుల్లేపల్లె వద్ద రైల్వే పట్టాలపై పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి రైల్వే పోలీసు అధికారులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు పంచనామా నిమిత్తం కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. మృతుడు 35 ఏళ్ల వయసు ఉండి చామనచాయ రంగుతో గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment