ఇంటికి చేరే వేళ మృత్యు గంట ’’ తెల్లారిన కూలీల బతుకులు
ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్
రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీల మృతి
ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా దుర్ఘటన
మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదన
న్యాయం చేయాలంటూ రహదారిపై ఆందోళన
ఇంటికి చేరే వేళ మృత్యు గంట ’’ తెల్లారిన కూలీల బతుకులు
ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్
రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీల మృతి
ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా దుర్ఘటన
మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదన
పి.గన్నవరం/అంబాజీపేట: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన కూలీలు. జీవనాధారంలో భాగంగా ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వారిని కాటేసింది. ప్రధాన రహదారి నెత్తురోడింది. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కూలి పనులకు వెళ్లిన వారు తిరిగి మరో 30 నిమిషాల్లో ఇంటికి చేరతారనుకున్న సమయంలో విగత జీవులు అయారనే వార్త తెలియడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.
పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామం వద్ద ఆర్.పి.రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊడిమూడి గ్రామం వద్ద చింతావారిపేట సమీపంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలను పది మంది కూలీలు లోడ్ చేసి పగ్గం కడుతున్నారు. అదే సమయంలో రాజోలు నుంచి రావులపాలెం వెళుతున్న ఆర్టీసీ బస్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్, ట్రాక్టర్‌ల కింద పడి కూలీలు మృత్యువాత పడ్డారు. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (35), వాసంశెట్టి సూర్యనారాయణ (45), ఈరి కట్లయ్య (50), ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిమూలవారిపాలెంకు చెందిన చిలకలపూడి సురే‹Ùకు తీవ్ర గాయాలు కాగా అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. జి.పెదపూడికి చెందిన బొరుసు నానికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. బొరుసు రాంబాబు, బుజ్జి, వాసంశెట్టి సాయికిరణ్, గూనపాటి పెద్దిరాజులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆర్టీసీ బస్‌లో 20 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలు అయ్యాయి. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
రెండు గ్రామాల్లో విషాద ఛాయలు...
మరో 30 నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవల్సిన వారు విగత జీవులుగా మారడంతో జి.పెదపూడి, ఆదిమూలంవారిపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ కొబ్బరి వలుపు కారి్మకుడిగా, కూలీగా పని చేసేవాడు. మృతునికి భార్య బేబి కుమారి, సుశాంత్, జస్వంత్ అనే చిన్న పిల్లలు ఉన్నారు. భర్త శివ మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యిందని బంధువులు, కుటుంబ సభ్యులు రోదించారు. అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ మృతి చెందడంతో భార్య దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇంటిలో శుభకార్యం జరిగి ఏడాది తిరగ కుండానే అందరిని వదలి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరి కట్లయ్యకు భార్య సుబ్బలక్షి్మ, కుమారులు నాగరాజు, సురే‹Ù, కుమార్తెలు వైష్ణవి, హారికలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా జీవనాధారం కోల్పోయామని కుటుంబీకులు విలపిస్తున్నారు. ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు మృతి చెందడం, అతని అన్న సురేష్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారి తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణమ్మ రోదనలు గ్రామస్తులకు కంటతడి పెట్టించాయి. అందరితో కలివిడిగా ఉండే మణిబాబు మృతి చెందడం, సురేష్ తీవ్ర గాయాలు పాలవ్వడంతో బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు.
ఆందోళన చేపట్టిన గ్రామస్తులు
నిర్లక్ష్యంగా, మితి మీరిన వేగంతో బస్సును నడిపి నలుగురు మృతికి కారణమైన బస్ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జి.పెదపూడి, ఊడిమూడికి చెందిన నాయకులు, గ్రామస్తులు ఆర్పీ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఆరీ్టవోలు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్‌కుమార్, ఎస్సై బి.శివకృష్ణ ఆందోళన కారులతో చర్చించారు. ఆర్డీఓ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తం పెంచాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment