పాడి పంటలతో ఆనందంగా జీవించాలి
కై కలూరు: నూతన సంవత్సరం జిల్లా వాసులందరూ పాడిపంటలతో, ఆయురార్యోగాలతో జీవించాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఆకాంక్షించారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ 2005లో ప్రతి ఒక్కరి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలన్నారు. రైతులు ఆనందంగా జీవించాలన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనే నమ్మకం కార్యకర్తలు, నాయకులకు ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముదిరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, చందన ఉమామహేశ్వరరావు, డీఎన్నార్ కుమారులు వినయ్, శ్యామ్, నాయకులు గుమ్మడి వెంకటేశ్వరరావు, సయ్యపురాజు గుర్రాజు, కందుల వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ బిక్షాలు, బలే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment