సత్తెనపల్లి: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సత్తెనపల్లిలో లక్కీ డిప్ నిర్వహించిన విషయం తెలిసిందే. లక్కీ డిప్‌లో మొదటి బహుమతి రూ. 16 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ విజయవాడకు చెందిన మోలగోళ్ల సుబ్బారెడ్డికి దక్కింది. ఆయనకు శనివారం వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతాహసంతి, మున్సిపల్ చైర్‌పర్సన్ చల్లంచర్ల లక్ష్మీ తులసి అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, షేక్ మౌలాలి, కొణతం స్వాతి, దేవతి సుబ్బారావు, శిరిగిరి వెంకట్రావు, హైదరాబాద్ సుభాని పాల్గొన్నారు.
వైద్య కళాశాల రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా టీటీకే రెడ్డి
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ తేలుకుట్ల త్రిపురాంతకేశ్వరరెడ్డిని (టీటీకే రెడ్డి ) నియమిస్తూ శనివారం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్‌ఏసీ) కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ టీటీకే రెడ్డికి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా ప్రమోషన్ ఇచ్చి రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా ఉత్తర్వులు అందుకున్న డాక్టర్ టీటీకే రెడ్డికి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్, వైద్య కళాశాల వైస్‌ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్‌ప్రభాకర్, పలువురు కార్యాలయ ఉద్యోగులు, వైద్యులు అభినందనలు తెలిపారు.
బాలోత్సవం బ్రోచర్ ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు నగరంలోని హిందూ కళాశాలలో ఫిబ్రవరి 17,18వ తేదీల్లో నిర్వహిస్తున్న గుంటూరు జిల్లా బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని బాలోత్సవం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. శనివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో బాలోత్సవం బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యతో పాటు అభిరుచి, ఆసక్తి, సృజన, జ్ఞానతృష్టను ప్రోత్సహించేందుకు తలపెట్టిన బాలోత్సవంలో పాల్గొనే విధంగా పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలను పంపాలని సూచించారు. బాల్సోతవం కన్వీనర్లు డాక్టర్ ఎం. బోసుబాబు, కేవీఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 25 రకాల అంశాల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు. బాల్సోతం ప్రధాన కార్యదర్శి బి. ప్రసాద్ మాట్లాడుతూ బాలోత్సవ పూర్తి వివరాలను పాఠశాలలకు పంపుతామని, పోటీల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, పాఠశాలలకు ఓవరాల్ ఛాంపియన్ షిప్ బహుమతులు అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో చావా శ్రీనివాస్, టి. జాన్‌బాబు జి. వెంకట్రావు, పీవీ మల్లేశ్వర్, వెంకటరెడ్డి, కె. శ్రీదేవి, ఎస్‌ఎం సుభానీ, ఎం. ఉదయ్‌భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment