బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నయవంచన
వరంగల్ చౌరస్తా: వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నయవంచన చేస్తే, ప్రస్తుత తూర్పు ఎమ్మెల్యే, మంత్రి అసమర్థత కారణంగా వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్ నిర్మాణానికి నోచుకోవట్లేదని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు. సోమవారం వరంగల్ ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా.. ఆర్టీసీ బస్‌స్టేషన్ నిర్మాణ స్థలంలో ఆయన ధర్నా చేశారు. ఈసందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్‌ను తీర్చిదిద్దుతామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సర్కారు.. కనీసం వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనుల్ని చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోట్ల రూపాయలతో కొత్త బస్టాండ్ నిర్మిస్తామంటూ ఉన్నదాన్ని కూల్చాడని మండిపడ్డారు. ఆతర్వాత కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హృదయ్, అమృత్, స్మార్ట్ సిటీ వంటి ఎన్నో పథకాలకు భారీగా నిధులు కేటాయించి వరంగల్‌ను ప్రగతిదారిలో నడిపిస్తుంటే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓరుగల్లు చరిత్రను భ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శించారు. ఈధర్నాలో మాజీ మేయర్ టి.రాజేశ్వరరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాంనాయక్, మాజీ శాసనసభ్యులు అరూరి రమేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీశ్ , రత్నం సతీశ్ షా, గురుమూర్తి శివ, వన్నాల వెంకటరమణ, నాయకులు వంగాల సమ్మిరెడ్డి, బాకం హరిశంకర్, రాణా ప్రతాప్‌రెడ్డి, సముద్రాల పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
వరంగల్‌లో బస్ స్టేషన్ నిర్మించాలని ధర్నా
Comments
Please login to add a commentAdd a comment