వరంగల్ క్రైం: నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబులకు పోలీసులు చుక్కలు చూపించారు. ఎకై ్సజ్ శాఖ మద్యం షాపులను రాత్రి 12 గంటల వరకు నిర్వహించడంతో యువత మరింత జోష్‌తో అర్ధరాత్రి తర్వా త కూడా బీర్స్‌తో చీర్స్ చేశారు. అదే సమయంలో పోలీ సులు ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. గత ఏడాది డిసెంబర్ 31న ఒక్కరాత్రే లా అండ్ ఆర్డర్ కమిషనరేట్ పరిధి, ట్రై సిటీలోని ట్రాఫిక్ పోలీసులకు 495మంది మందుబాబులు చిక్కారు. వారి వాహనాలుసీజ్ చేసి జరిమానాలు విధించారు. డిసెంబర్ 31రాత్రి వేడుకల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రైసిటీ పరిధిలోని ప్రధాన జంక్షన్లు, రోడ్లపైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరుగా ఆయనే రంగంలోకి దిగి పలు జంక్షన్లలో బందోబస్తు తీరును పర్యవేక్షించారు. రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు మొదలు పెట్టారు. మద్యం మత్తులో రోడ్లపై దూసుకొచ్చిన వాహనదారులను పరీక్షించి మద్యం సేవించినట్లు రుజువు కాగానే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. పోలీస్ అధికారులంతా రోడ్లపై ప్రత్యక్షం కావడంతో మందు బాబులు గల్లీల్లోనుంచి తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
సర్కారుకు డబుల్ ధమాకా..
ఒక పక్క మద్యం షాపులను రాత్రి 12గంటల వరకు కొనసాగించి, మరో పక్క పెద్ద సంఖ్యలో రోడ్లపై పోలీసులను పెట్టి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో ప్రభుత్వానికి రెండింతల ఆదాయం సమకూరింది. గత ఏడాదంతా 20,338 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా.. సరాసరి లెక్క తీస్తే రోజుకు 55 కేసులు అవుతాయి. కానీ, డిసెంబర్ 31న ఒకే రాత్రి పది రెట్లు అధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం.
కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా పరీక్షలు
భారీగా మోహరించిన పోలీసులు
మందుబాబుల వాహనాలు స్వాధీనం.. ఫైన్
Comments
Please login to add a commentAdd a comment