ఆలయాలు.. పూజలు
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం నగరంలోని వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, అర్చకుడు.. ఉత్తిష్ట గణపతికి ఆరాధన, రుద్రేశ్వరస్వామికి 51 కిలోల పెరుగుతో అభిషేకం, రుద్రాభిషేకాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి లైన్లలో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీభద్రకాళి ఆలయంలో అమ్మవారికి తెల్లవారుజామున నిర్మాల్యసేవలు, నిత్యవిధులు ఆరగింపు, విశేషాలంకరణ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పోటెత్తడంతో ధర్మదర్శనం, అతిశీఘ్రదర్శనం, విశిష్టదర్శనం ఏర్పాట్లు చేశారు. హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు, ‘కుడా’ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓలు వెంకటయ్య, శేషు భారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. – హన్మకొండ కల్చరల్
న్యూ ఇయర్ రోజున
భక్తుల రద్దీ
రుద్రేశ్వరుడికి, భద్రకాళికి ప్రత్యేక పూజలు
ఉదయం నుంచే
దర్శనానికి బారులు
Comments
Please login to add a commentAdd a comment