మొయినాబాద్: మండల పరిధిలోని చిలుకూరు గురుకులంలో జరుగుతున్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాల జోనల్ స్థాయి క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం మూడో రోజు జరిగిన హ్యాండ్ బాల్‌లో చిలుకూరు జట్టు, ఫుట్‌బాల్‌లో గౌలిదొడ్డి జట్టు, బాల్ బ్యాడ్మింటన్‌లో పరిగి జట్టు, కబడ్డీలో శంషాబాద్ జట్టు విజయం సాధించాయి. అథ్లెటిక్స్, క్యారమ్స్, చదరంగం పోటాపోటీగా సాగుతున్నాయి. గురుకుల విద్యాలయాల సంస్థ స్పోర్ట్స్ ఆఫీసర్ రామలక్ష్మణ్ క్రీడా పోటీలను వీక్షించి విజయం సాధించినవారిని అభినందించారు. కార్యక్రమంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రాంతీయ సమన్వయాధికారి శారద, ప్రాంతీయ క్రీడాధికారి ఉదయభాస్కర్, ప్రిన్సిపాల్ సత్యనారాయణ, పీడీ ఆదిబాబు, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment