దేశాభివృద్ధిలో కాస్ట్ మేనేజ్‌మెంట్, అకౌంటెంట్స్ పాత్
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
పంజగుట్ట: దేశాభివృద్ధిలో కాస్ట్ మేనేజ్‌మెంట్, అకౌంటెంట్స్ పాత్ర కీలకమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆదివారం సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో ది ఇనిస్టిట్యూట్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించడం కేవలం కార్పొరేట్ విజయానికి పునాది కాదని, భారత ఆర్థిక స్థిరత్వం, గ్లోబల్ పోటీకి మూలస్తంభం అని పేర్కొన్నారు. ప్రొఫెషనల్, ప్రామాణికత, సామాజిక సేవ, దేశాభివృద్ధి పట్ల చేసిన దీర్ఘకృషికి నిదర్శనమన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఆకాంక్ష, సవాళ్లతో కూడిన లక్ష్యమన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వినూత్న వ్యూహాలు, సామర్థ్యాలు అవసరమన్నారు. దేశ లక్ష్యాలను సాధించడంలో ఇనిస్టిట్యూట్ చేసిన ప్రయత్నాలు సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఐసీఎంఏ హైదరాబాద్ చైర్‌పర్సన్ డాక్టర్ లావణ్య కందురి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస ప్రసాద్, మూర్తి, దల్వాడి అశ్విన్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment