మీదికుంట వాకింగ్ బ్రిడ్జి ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్ పరిధిలోని మీదికుంట సరస్సు వద్ద నూతనంగా నిర్మించిన వాకింగ్ బ్రిడ్జ్‌ను బాలల దినోత్సవం నేపథ్యంలో ఫౌంటెన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు ప్రారంభించారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చేపట్టిన నిధుల సమీకరణతో పాటు స్కూల్ విద్యార్థులు, సేవ్ వాటర్ అండ్ సేవ్ నేచర్ ఎన్‌జీఓ సహకారంతో నిర్మించిన ఈ వంతెనను ప్రారంభించి సమాజానికి అంకితం చేశారు. 2020లో సరస్సు పునరుజ్జీవనం చేసినప్పటి నుంచి సరస్సు పరిరక్షణకు విద్యార్థులు చూపుతున్న అంకితభావాన్ని సరస్సు చుట్టుపక్కల కమ్యూనిటీలు అభినందించాయి. ఇందులో భాగంగా క్రమం తప్పకుండా సరస్సును శుభ్రం చేయడం, దీని పైన ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వంతెన ప్రారంభోత్సవంలో ఫౌంటెన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ వ్యవస్థాపకులు మేఘనా ముసునూరి, డైరెక్టర్ శ్రీధర్ వున్నం పాల్గొన్నారు.
బాలల దినోత్సవం నేపథ్యంలో ప్రారంభించిన విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment