తెలంగాణలో 12 శాతం మందికి మధుమేహ వ్యాధి
సుల్తాన్‌బజార్: తెలంగాణ రాష్ట్రంలో మధుమేహం వ్యాధి ప్రమాదకరంగా పెరుగుతోందని, ప్రజలు వెంటనే అప్రమత్తమై పరీక్షలతో వ్యాధిని గుర్తించడం ఆరోగ్యవంతమైన జీవనశైలితో వ్యాధిని నిత్యం అదుపులో ఉంచడంపై దృష్టి పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరు ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వి.అశోక్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు మధుమేహం వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే గుండె, కిడ్నీ, చర్మ, నరాలు, కంటి జబ్బుల బారిన పడాల్సి వస్తుందని, ఇది ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను తీవ్రంగా నష్టపరుస్తుందన్నారు. కాబట్టి ప్రజ లు షుగర్ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా అదేదో రుగ్మత అని భావించకుండా అది ఒక జీవన శైలిగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, ఫైబర్, ఫ్రూట్స్, విత్తనాలు, వెజిటబుల్స్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం నిత్యం చేయాలని సూచించారు. వ్యాధిలో ఎలాంటి తీవ్రత ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment