లక్డీకాపూల్: హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (టీడబ్ల్యూజేఎఫ్ అనుబంధం) సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెచ్‌యూజే అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు హెచ్‌యూజే సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు చంద్రశేఖర్, రాధిక, నాయకులు రాజశేఖర్. నవీన్, పద్మరాజు, నాగవాణి, ప్రశాంత్, విజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment