ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు కుట్ర
రఘునాథపల్లి: పిడికెడు మంది లేకున్నా రాజ్యమేలుతున్న అగ్రవర్ణాలు.. వెనుకబడిన తరగతుల బిడ్డల నోటికాడి ముద్ద, పల్లెంలో బుక్క ఎత్తుకుపోయేందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసే కుట్ర పన్నుతున్నారు.. దీనిని ఐక్యంగా తిప్పి కొట్టాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు నిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో మండల పరిధిలోని ఖిలాషాపూర్‌లో బీసీల ఆధ్వర్యాన ఆదివారం ‘బీసీ అజాదీ’ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న కోట వద్ద బీసీ అజాది సిద్ధాంతకర్త బత్తుల సిద్ధేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి తీన్మార్ మల్లన్న హాజరై మాట్లాడారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 20శాతం ఇచ్చి, ఏడు శాతం కూడా లేని రెడ్డి, వెలమ, కమ్మ వర్గాలు 70 శాతం దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలుంటే ఆ మూడు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు 60 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఓట్లు కొని రాజ్యాధికారంలో ఉంటున్న అగ్రవర్ణాలు బీసీలకు అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మన బిడ్డలకు 70 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు.. వా ళ్లకు 50 మార్కులు వచ్చినా కొలువు దక్కేలా రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఏవైనా.. మనోడికి మనం ఓటు వేసుకోవాలని ఆయన సూచించారు. తొలిరోజు చేపట్టిన ఈ సైకిల్‌యాత్ర జనగామకు చేరింది. ఈ సైకిల్ యాత్రలో రాష్ట్ర హిందూ బీసీ మహాసభ ప్రధాన కార్యదర్శి పర్వత సతీష్‌కుమార్, ప్రచార కార్యదర్శి పంతుల మల్లయ్య, కార్యనిర్వహక అధ్యక్షుడు కొంగర నరహరి, కుంటి విజయ్‌కుమార్, రామనర్సయ్య, వెంకటస్వామి, మల్లయ్య, కుమార్, వెంకటేశ్వర్లు, అర్జున్, కనకరాజు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Comments
Please login to add a commentAdd a comment