కోర్టు భవనాలకు ‘పీజేపీ’లో స్థలం కేటాయించాలి
గద్వాల: కోర్టు భవన సముదాయ నిర్మాణం కోసం పీజేపీ క్యాంపు కాలనీలో స్థలాన్ని కేటాయించాలని గద్వాల బార్‌అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కోర్టు సముదాయం నిర్మాణానికి గతంలో హ్యాండ్‌లూమ్ పార్కు వెనక స్థలం కేటాయించారని, ఆ స్థలం ఎంతమాత్రం అనుకూలంగా లేదని వివరించారు. ఆ స్థలం కాకుండా పీజేపీ కాలనీలోనే స్థలాన్ని కేటాయించాలన్నారు. దీనిపై అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందించినట్లు బార్ అసోసియేషన్‌ఽ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రఘురామ్‌రెడ్డి, షఫిఉల్లా తెలిపారు. అనంతరం వారు పీజేపీ క్యాంపులోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మనోహర్, సుధాకర్, యుగేందర్, కృష్ణారెడ్డి, ఆనంద్, వెంకటేశ్వర్‌రెడ్డి, జయసింహారెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, సురేష్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment