ప్రస్తుతం చాలావరకు పొగాకు పంట చేతికి అందే దశలో ఉంది. చాలామంది ఆకులను సైతం రాల్పుతున్నారు. సరిగ్గా వాటిని ఆరబెట్టే క్రమంలో వర్షం పడుతుండడంతో ఆకుకు ఉన్న జిగురు కారిపోయి తూకం రాని పరిస్థితి నెలకొంది. ఆకులు సైతం నల్లగా మారుతున్నాయి. దీంతో ప్రైవేటు కంపెనీలు రైతుల పంటలను ఎంత ధరకు కొనుగోలు చేస్తారోనని సతమతమవుతున్నారు. వర్షాలు పడుతున్న సందర్భంలో కనీసం వ్యవసాయ శాఖ అధికారులు పంటను పరిశీలించి సలహాలు సూచనలు చేయలేదని, పంట నాణ్యత తగ్గుతుండడంతో ఏం చేయాలో తోచడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment