చెరుకు రైతుల సమస్యలపై నిరంతర పోరాటం
అమరచింత: చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి కృష్ణవేణి చెక్కర ఫ్యాక్టరీ యాజమాన్యంతో నిరంతరం పోరాటం చేస్తామని కృష్ణవేణి చెరుకు రైతుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న తెలిపారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన ఉమ్మడి జిల్లా చెరుకు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయిపై డ్రిప్ పరికరాలు అందించే విషయాన్ని జూలై 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించామని.. వచ్చే పంటకాలం నాటికి రాయితీ లభించడం సంఘం విజయమన్నారు. టన్ను చెరుకు పంట కోతకు రూ.610 అయితే రూ.50 యాజమాన్యం చెల్లించేలా ఒప్పించామని తెలిపారు. పంట ఫ్యాక్టరీకి పంపిన నెల రోజుల్లో డబ్బులు చెల్లించేలా రైతులతో కలిసి ఉద్యమించడంతో సాధ్యమైందన్నారు. కోత కార్మికులు సకాలంలో రావడంతో అనుకున్న సమయానికి చెరుకు కోతలు పూర్తయి ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని చెప్పారు. సంఘటితంగా ఉన్నందునే సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయని తెలిపారు. సమావేశంలో సంఘం ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి జి.రవి, ఉపాధ్యక్షులు వాసారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, తిరుపతయ్య, అరుణ్, సుధాకర్‌రెడ్డి, మహేంద్రాచారి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment