ప్రభుత్వ భూమి కబ్జాపై చర్య తీసుకోవాలి
గద్వాల: గద్వాల పట్టణంలో విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న మాజీ మున్సిపల్ చైర్మన్ వేణుగోపాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న రాజుల కాలం నాటి బావిని కబ్జాచేసి దానిని మట్టితో పూడ్చివేశాడు. అదేవిధంగా పాఠశాలకు చెందిన ఆటస్థలాన్ని కూడా కబ్జా చేశారన్నారు. గతంలో పాతబ స్టాండులో సైతం మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి ఇతరులకు విక్రయించారని, ఇలా చాలా చోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జాపెడుతూ దర్జాగా దోపిడీకి పాల్పడుతున్నా పాలకులు, అధికారులు కాని పట్టించుకోవడం లేదని, ఇప్పటికై న అధికారులు స్పందించి రాజుల కాలం నాటి పురాతన బావిని స్వాధీనం చేసుకుని కాపాడాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆట స్థలానికి ఆనుకుని నిర్మాణం చేసిన ఫంక్షన్ హాలు నుంచి వ్యర్థపదార్థాలు, వాయుకాలుష్యం వలన క్రీడాకారులు, పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బస్సుమోహన్‌రావు, ప్రభాకర్, ఇక్బాల్‌పాషా, సుభాన్, నాగన్న, క్రీడాకారులు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment