ఆలయాలకు పోటెత్తిన భక్తులు
అలంపూర్/మల్దకల్/ఎర్రవల్లి: నూతన సంవత్సరం వేళ జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. మల్దకల్‌లోని ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే, మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలాగే, అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
● బీచుపల్లిలోని అభయాంజనేయస్వామి, కోదండరామస్వామి, సరస్వతిదేవి, శివాలయాలకు భక్తులు క్యూ కట్టారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. ఆలయాల్లో అభిషేకం, ఆకుపూజ, అర్చనలు నిర్వహించారు.
● దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను కర్నూల్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కబర్ది బుధవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కొత్త సంవత్సర వేళ ప్రత్యేక పూజలు
Comments
Please login to add a commentAdd a comment