నయా సాల్.. ఫుల్‌జోష్
గద్వాలటౌన్/గద్వాల క్రైం: పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరం వచ్చిందంటే.. వాణిజ్య వ్యాపార సంస్థలు కొనుగోళ్లను మెరుగుపర్చుకోవడానికి తమ వినియోగదారులకు ఆశలు, అవకాశాలను కల్పించడం సహజం. విచిత్రంగా ప్రభుత్వ ఎకై ్సజ్‌శాఖ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. తన ఆదాయాన్ని మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఆబ్కారీశాఖ నూతన సంవత్సర ప్రారంభ సమయంలో మద్యం ప్రియులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయ వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నయాసాల్ వేడుకలపై ఆంక్షలుంటాయన్న ప్రచారంతో నిరుత్సాహంగా ఉన్న యువతలో సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సాధారణ రోజుల్లో మద్యం దుకాణాలు రాత్రి 10గంటల వరకు అనుమతి ఇస్తారు. అయితే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం దుకాణాల మూసివేత సమయాన్ని అర్ధరాత్రి వరకు పొడగించంపై ప్రధానంగా మహిళల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
31న అర్ధరాత్రి 12 వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి
బార్ అండ్ రెస్టారెంట్లు,
ఈవెంట్లకు సైతం..
మందుబాబులకు ఆబ్కారీ శాఖ నూతన సంవత్సర ‘కానుక’
Comments
Please login to add a commentAdd a comment