నూతనోత్సాహం..
అలంపూర్‌లో నూతన సంవత్సర వేడుకలు
క్యాలెండర్‌లో మరో సంవత్సరం కరిగిపోయింది. నూతన సంవత్సరం వచ్చి చేరింది. పాత ఏడాది 2024కి వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరం 2025కి స్వాగతం పలుకుతూ ప్రజలు సంబరాలు జరుపుకొన్నారు. జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందడి మంగళవారం రాత్రి నుంచే కనిపించింది. పట్టణాల్లోని బేకరీలు, మిఠాయి దుకాణాలతో పాటు మద్యం, మాంసం దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా కేక్‌లు కొనుగోలు చేశారు. అర్ధరాత్రి 12 గంటలు కాగానే పెద్దఎత్తున రోడ్లపైకి చేరుకొని కేక్ కట్ చేశారు. యువత నృత్యాలతో హోరెత్తించారు. తమ స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో యాజమాన్యం విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు
నిర్వహించారు.
– సాక్షి నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment