జీడిపిక్కల ఫ్యాక్టరీని తక్షణం తెరిపించాలి
● కార్మికుల డిమాండ్
● జ్యోతుల కార్యాలయం వద్ద ధర్నా
జగ్గంపేట: ప్రత్తిపాడు మండలం చిన్నింపేటలో మూసివేసిన జీడిపిక్కల ఫ్యాక్టరీని తక్షణం తెరిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగ్గంపేటలోని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. పరిశ్రమలో పని చేస్తున్న 150 మంది కార్మికులు సీఐటీయూ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు రొంగల ఈశ్వరరావు ఆధ్వర్యాన ఈ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే తనయుడు నవీన్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ, చిన్నింపేటలో జీడిపిక్కల ఫ్యాక్టరీని మూసివేయడం వల్ల 409 కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఫ్యాక్టరీని తెరిపించారని 43 రోజులుగా ఆ గ్రామంలో ధర్నాలు చేస్తున్నా అటు యాజమాన్యం కానీ, ఇటు అధికారులు, ప్రభుత్వం కానీ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని, ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment