చిన్నబోతున్న పెద్ద పండగ
సామర్లకోట ఏడీబీ రోడ్డులో.. కాకినాడకు ఏడెనిమిది కిలోమీటర్ల దూరాన.. పచ్చని పంట పొలాల మధ్య ఉన్న వెంకట కృష్ణరాయపురం (వీకే రాయపురం) ఓ చిన్న పల్లెటూరు. జనాభా 3 వేలు. గ్రామంలో 90 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. ఊరంతా రైతులు, వ్యవసాయ కూలీలే. ఏటా ఈ సమయానికి ఈ గ్రామం సంక్రాంతి సందడితో తుళ్లిపడుతూ ఉండేది. నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలితంగా జనం చేతుల్లో పుష్కలంగా డబ్బులుండేవి. దీంతో సంక్రాంతి పండగను సంబరంగా నిర్వహించుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం ఊసే లేకపోవడంతో ఈసారి ఈ మూడు రోజుల పెద్ద పండగ కాస్తా చిన్నబోతోంది. ఒక్క వీకే రాయపురమే కాదు.. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఏలేరు కాలువ వంతెన దాటి వీకే రాయపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యవరపుపేటకు వెళ్లేసరికి మామిడి అప్పలకొండ ఎదురు పడ్డారు. ‘ఇంటి పన్ను నా పేరిట మార్చాలని మూడు నెలలుగా తిరుగుతున్నా పని కావడం లేదు. వారడిగిన అన్ని సర్టిఫికెట్లు ఇచ్చినా తిప్పుకుంటున్నారే తప్ప పేరు మార్చడం లేదు. అదే జగన్ ప్రభుత్వంలో ఇటువంటి పనులన్నీ వలంటీర్లు చూసుకునే వారు. వారు లేని లోటు ఇప్పుడు కనపడుతోంది. వీకే రాయపురం సొసైటీకి ఎరువులు, పిండి (యూరియా) వచ్చాయంటే తెలియకుండానే అయిపోతున్నాయి, ఇదివరకు వలంటీర్ వచ్చి చెప్పేవాడు’ అని ఆవేదనగా అన్నారు.
ఫ గ్రామాల్లో కానరాని సంక్రాంతి సందడి
ఫ గత వైఎస్సార్ సీపీ పాలనలో విస్తృతంగా సంక్షేమం
ఫ జనం చేతిలో పుష్కలంగా డబ్బు
ఫ ఉత్సాహంగా షాపింగులు.. జోరుగా వ్యాపారాలు
ఫ నేడు కూటమి పాలనలో అందని పథకాలు
ఫ ఆర్థిక ఇబ్బందులతో పండగ ఖర్చుకు వెనకాడుతున్న జనం
ఫ సాక్షి విలేజ్ విజిట్‌లో వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment