అమలాపురం టౌన్: ఈనెల 2న స్థానికంగా జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరానికి చెందిన నలబ శ్రీదేవి (20) చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపిన వివరాల మేరకు పదో తరగతి వరకూ చదివి ఇంటి వద్దే ఉంటున్న శ్రీదేవి అమలాపురం మార్కెట్ వీధిలోని బంధువులు ఇంటికి వచ్చి ఆటోలో ఓడలరేవు బీచ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయమై విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం ఆమెకు అంత్యక్రియల సందర్భంగా ఆమె జ్ఞాపకాలను తలచుకుని కుటుంబీకులు రోదించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన ఏడుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment